Tata Motors Ltd
-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్‌లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్‌లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
దిగ్గజ కంపెనీల మధ్య అమ్మకాల పోటీ, భారీగా తగ్గిన టాటా ఎలక్ట్రిక్ కారు ధర
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో దిగ్గజ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో ఒక సంస్థతో మరో సంస్థ పోటీపడుతున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్ర ఈవీ ఎస్యూవీ 400ను విడుదల చేసింది. ఆ కారు విడుదలైన మరుసటి రోజే ఈవీ మార్కెట్లో కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న నెక్సాన్ ఈవీ కారు ధరల్ని తగ్గిస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్ వేరియంట్‌కు పోటీగా ఎక్స్‌యూవీ 400 మార్కెట్లో విడుదలైంది. దాని ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఇప్పుడు దానికి గట్టిపోటీ ఇచ్చేలా నెక్సా ఈవీ ధరల్ని తగ్గించడం గమనార్హం. నెక్సాన్ ఈవీ కారు ఇంతకుముందు రూ.14.99 లక్షలు ఉండగా.. ధర తగ్గించడంతో ఇప్పుడు అదే కారును రూ.14.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. నెక్సాన్ వేరియంట్లో లేటెస్ట్గా విడుదలైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49లక్షలుగా ఉంది. వ్యూహాత్మకంగా ఈ సందర్భంగా టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..మేం పక్కా స్ట్రాటజీతో టియాగో నుంచి నెక్సాన్ ఈవీ కార్ల వరకు కస్టమర్లను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నాం. స్మార్ట్ ఇంజనీరింగ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మా లక్ష్యాలను చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కొనుగోలు దారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందియ్యగలుగుతున్నామని అన్నారు. టాటా మోటార్స్ ఫోర్ట్ పోలియోలో మూడు ఈవీ కార్లు టాటా మోటార్స్ ఫోర్ట్ ఫోలియోలో టియాగో, టైగోర్,నెక్సాన్ ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.18.99లక్షల మధ్యలో ఉన్నాయి. ఇక ఎంట్రీ లెవల్ టిగాయో యూవీ మార్కెట్ ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79లక్ష మధ్యలో ఉండగా టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.12.49లక్షల నుంచి రూ.13.75లక్షల మధ్య ధరతో సొంతం చేసుకోవచ్చు. -
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ముంబైకి చెందిన ఎవరెస్ట్ ఫ్లీట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 5,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరెస్ట్‌కు సరఫరా చేయనుంది. తొలి విడతగా 100 కార్లను అందించినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. దేశంలో ఈవీల వాడకం పెరిగేందుకు ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ తెలిపింది. ఎక్స్‌ప్రెస్–టి సెడాన్ శ్రేణిలో 213 కిలోమీటర్లు, 165 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్లు ఉన్నాయి. చదవండి: Flipkart Big Saving Days Sale: ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది. చదవండి: మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..! ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?
సాక్షి ముంబై: దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నానో కారును మళ్లీ తీసుకొస్తోందా? ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కలల కారు, ప్రపంచంలోనే అత్యంత చౌక కారు నానో ఈవీని టాటా గ్రూప్ లాంచ్ చేయనుందని అంచనాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్‌ను తిరిగి పునరుజ్జీవింపజేస్తోందని తాజా మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. నానో ఈవీని తీరిగి తీసుకురావాలనే ప్రణాళికలు ఫలవంతమైతే, ఫోర్డ్ మరైమలైనగర్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి టాటా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలను పునః ప్రారంభించవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అమ్మకాలు లేక 2019 నుంచి నానో కారు తయారీని నిలిపి వేసింది. దేశంలో అందరికీ కారు అనే నినాదంతో 2008లో కేవలం లక్ష రూపాయలకే అందుబాటులోకితీసుకొచ్చిన నానోను ఎలక్ట్రిక్ మోడల్ లాంచింగ్‌కు ప్లాన్ చేస్తోందట టాటా. అయితే ఈవార్తలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా టాటా మోటార్స్ 80శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం టాటా నెక్సాన్, టిగోర్, టియాగో లాంటి ఈవీలను అందిస్తోంది. ఈవీ సెగ్మెంట్లో ఆధిక్యాన్ని కొనసాగించడానికి, సమీప భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని ప్లాన్. ఇప్పటికే కర్వ్, అవిన్యా లాంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు
ముంబై: ప్యాసింజర్ వాహనాలు ఈ నెలలో జోరుగా విక్రయాలను నమోదు చేస్తాయని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. క్రితం ఏడాది నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధిక నమ్మకాలు నమోదవుతాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ బలంగా ఉండడం, పెరిగిన తయారీని ప్రస్తావించింది. వాణిజ్య వాహనాలు రెండంకెల వృద్ధిని చూపిస్తాయని పేర్కొంది. డీలర్ల స్థాయిలో నిల్వలు ఉన్నందున ట్రాక్టర్ల విక్రయాలు వృద్ధిని చూపించకపోవచ్చని అంచనా వేసింది. అక్టోబర్‌తో పోలిస్తే (పండుగల సీజన్) నంబర్లో వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్లు తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎంకే గ్లోబల్ వివరించింది. ఈ నెల గణాంకాలను వాహన తయారీ సంస్థలు డిసెంబర్ 1న ప్రకటించనుండడం గమనార్హం. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ టాప్ ప్యాసింజర్ వాహనాల ఆర్డర్లు బలంగా ఉన్నాయని, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాల పరంగా సానుకూల గణాంకాలు నమోదవుతాయని ఎంకే గ్లోబల్ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ విక్రయాల పరంగా 64 శాతం వరకు వృద్ధిని చూపించొచ్చని, టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 51 శాతం పెరగొచ్చని పేర్కొంది. మారుతి సుజుకీ 18 శాతం అధిక అమ్మకాలు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్యాసింజర్, కార్గో విభాగాల నుంచి డిమాండ్ బలంగా ఉండడంతో వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. అశోక్ లేలాండ్ సంస్థ వాణిజ్య వాహన అమ్మకాలు 41 శాతం పెరగొచ్చని.. ఐచర్ మోటార్-వోల్వో ఐచర్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 36 శాతం మేర వృద్ధి ఉంటుందని పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 10 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. -
టాటా మోటార్స్ నష్టాలు, షేర్లు ఢమాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా, దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ పేర్కొన్నారు. ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్,టైగోర్ సీఎన్జీ, హారియర్, సఫారీ కార్లపై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్‌పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా సఫారీ వేరియంట్లపై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టైగోర్పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది. -
సేల్స్‌లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్‌గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్‌యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్‌ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్‌లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కమర్షియల్ వాహనాలు జోరుగా.. హుషారుగా! తగ్గేదెలే!!
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం ప్రతికూలమే అయినప్పటికీ ఈ ఏడాది వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వంటి ప్రతికూలతలను అధిగమించేలా మౌలికసదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుండటం, దేశీయంగా వినియోగం క్రమంగా పెరుగుతుండటం తదితర సానుకూలాంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రవాణా రేట్లు, వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండటమనేది రవాణాదారుల విశ్వాస సూచీ మెరుగుదలకు తోడ్పడుతున్నాయని వాఘ్ వివరించారు. తమ కంపెనీ విషయానికొస్తే లాభదాయకత వృద్ధిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ఎప్పట్లాగే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం పండుగ సీజన్ నుండి డిమాండ్ పుంజుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) గణాంకాల ప్రకారం 2022-23 తొలి త్రైమాసికంలో దేశీయంగా సీవీల విక్రయాలు 112 శాతం పెరిగి 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. 2021-22లో అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 5,68,559 యూనిట్ల నుంచి 7,16,566 యూనిట్లకు పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని, అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకుండా చూసేలా తగు ఫైనాన్సింగ్ స్కీమ్‌లు లభించే విధంగా ఆర్థిక సంస్థలతో కలిసి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోందని వాఘ్ చెప్పారు. -
భారీ డీల్: ఫోర్డ్‌ను కొనేసిన టాటా! ఎన్ని వందల కోట్లంటే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..ఫోర్డ్ మోటార్ మ్యాని ఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి అగ్రిమెంట్ నిన్ననే పూర్తయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సమస్యలు, మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ కంపెనీల సత్తా చాటడంతో అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. 2021 సెప్టెంబర్‌లో ఫోర్డ్ ఆ ప్రకటన చేసే సమాయానికి ఆ సంస్థకు గుజరాత్, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ యూనిట్లను ఫోర్డ్ అమ్మకానికి పెట్టగా..వాటిని కొనుగోలు చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది. ఈ తరుణంలో గుజరాత్‌లోని ఫోర్డ్‌కు చెందిన సనంద్ వెహికల్ ప్లాంట్ స్థలాలు,ఇతర ఆస్తులు,అలాగే అర్హులైన ఉద్యోగుల్ని కొనసాగించేలా ఒప్పందం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం..గుజరాత్ ఫోర్డ్ కార్ల తయారీ ఫ్యాక్టరీని 91.5 మిలియన్ డాలర్లకు (రూ.726 కోట్లు) టాటా సంస్థ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మా మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యం సంతృప్తి పరిచే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లు సమయానుకూలమైనది. ఇది వాటాదారుల విజయం అంటూ' టాటా మోటార్స్ తెలిపింది. కాగా, సనంద్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం వల్ల టాటా మోటార్స్ ఏడాదికి 300,000 యూనిట్ల కార్ల తయారీ సామర్థ్యం 420,000కి పెరగవచ్చని భావిస్తుంది. గత ఏడాది ఫోర్డ్ భారత్‌లో తమ కార్ల తయారీ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అప్పటి వరకు దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫోర్డ్ మార్కెట్ షేర్ 2శాతం మాత్రమే ఉంది. లాభాల్ని ఆర్జించడానికి రెండు దశాబ్దాలకు పైగా కష్టపడింది. చదవండి👉: భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా! -
టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...
సాక్షి, ముంబై: టాటామోటార్స్ టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్ చేసింది. ఎన్ఆర్జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది. ఇంజీన్, ఫీచర్లు టాటా కొత్త ఎంట్రీ-లెవల్ కారు టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ 2 ట్రిమ్‌లలో లభిస్తుంది. మాన్యుల్ గేర్ బాక్స్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్‌ను పొందుపర్చింది. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్, హర్మాన్ 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రిథమ్ ప్యాక్ కావాలంటే అదనంగా 30వేలు చెల్లించాలి. మిడ్నైట్ ప్లమ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో ఇది లభ్యం. The wait is finally over! Introducing the all-new Tiago XT NRG, built for the ones who dare to #LiveDifferent. Get, Set, and #DoMoreWithXTraNRG in your all-new #TiagoXTNRG. Visit https://t.co/Hq2GY0aoPI to book your #Tiago.#TiagoNRG #UrbanToughroader #SeriouslyFun pic.twitter.com/8CNPaaGOV1 — Tata Motors Cars (@TataMotors_Cars) August 3, 2022 -
టాటా టియోగో కొత్త వెర్షన్ కమింగ్ సూన్, అందుబాటు ధరలో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్ఆర్జీ మోడల్లో త్వరలోనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టి ట్రిమ్’’ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్‌లతో డిస్ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు. అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్జెడ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. Do you chase the XTraordinary? Get ready for a dose of XTra eNeRGy coming your way! Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf — Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022 -
కొనుగోలు దారులకు టాటా మోటార్స్ షాక్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు దారులకు షాకిచ్చింది. వేరియంట్‌ను బట్టి టాటా కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్యాసింజర్ వాహనాల కొనుగోలు దారులపై పెరిగిన 0.55 శాతం ధర ప్రభావం పడనుంది. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యంగా మారిందని టాటా ప్రకటించింది. కాగా, ఇప్పటికే పలు మార్లు కార్ల ధరల్ని పెంచిన టాటా..మరోసారి ధరల పెంపుపై కొనుగోలు దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు పెంచిందంటే! టాటా మోటార్స్ గతేడాది ఆగస్ట్‌లో వేరియంట్‌ను బట్టి పీవీ(పాసింగ్ వెహికల్స్)ధరల్ని యావరేజ్‌గా 0.8శాతం పెంచింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 19న మరో సారి పీవీ రేంజ్ వెహికల్స్ ధరల్ని 0.9శాతం పెంచింది. తాజాగా ఏప్రిల్ 9న(శనివారం) మరోసారి వెహికల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
మళ్లీ షాకిచ్చిన టాటా మోటార్స్.. ఈసారి కమర్షియల్ సెగ్మెంట్లో..
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్ష్ మరోసారి షాకిచ్చింది. కమర్షియల్ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడల్స్ అందులోని వేరియంట్లను బట్టి ఈ పెంపు 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యంగా మారిందని టాటా ప్రకటించింది. గత ఫిబ్రవరిలో ప్యాసింజర్ వెహికల్ ధరలు టాటా పెంచింది. ఆ సమయంలో లారీలు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వంటి కమర్షియల్ వాహనాలకు ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఇది రెండు నెలలకు మించి కొనసాగలేదు. పెరిగిన ఇన్పుట్ కాస్ట్ కారణంగా కమర్షియల్ సెగ్మెంట్లోనూ ధరలు పెంచుతూ టాటా నిర్ణయం తీసుకుంది. గతేడాది అమ్మకాలతో పోల్చితే కమర్షియల్ సెగ్మెంట్లో వాహనాల అమ్మకాల్లో టాటా పురోగతి సాధించింది. 2021లో మే వరకు 26,661 వాహనాల అమ్మకాలు జరగగా 2022 మే వరకు ఏకంగా మూడు రెట్లు పెరిగి 76,210 కమర్షియల్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. కానీ తాజ పెంపు ఈ సానుకూల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. చదవండి: వారెవ్వా ! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కార్పియో ఎన్ -
జిగేల్మనే అవిన్యా...ఈవీ!
ఆ కారును చూస్తే కళ్లు జిగేల్మంటాయి. కారు పైభాగమే కాదు.. లోపలి భాగం కూడా అదిరిపోయేలా ఉంది. దీన్ని చూస్తే ఏ విదేశీ కారో అయిఉంటుందని భావిస్తారు. అయితే, దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ వాహన కాన్సెప్ట్ అవిన్యాను ఆవిష్కరించి అబ్బురపరిచింది. స్పోర్టీ లుక్‌తో కట్టిపడేసేలా ఉన్న ఈ జెన్–3 కారు విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.. రెండో తరం ‘కర్వ్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్’ తర్వాత టాటా కంపెనీ తాజాగా ‘అవిన్యా ఈవీ కాన్సెప్ట్’ కారును ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరానికిపైగా ప్రయాణిం చవచ్చు. విద్యుత్ వాహనాల్లో మూడో తరం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించారు. సంస్కృత పదమైన అవిన్యా అంటే వినూత్నత అని అర్థం. ఈ కారే ఒక విశేషమనుకుంటే అందులోని అన్ని ఫీచర్స్ కూడావేటికవే ప్రత్యేకతను సంతరించు కున్నాయి. అయితే, దీన్ని సొంతం చేసుకోవాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే. 2025 నాటికల్లా మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్‌పైనే దృష్టిపెట్టినప్పటికీ.. విదేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేస్తామని చెప్పింది. ఫీచర్లు - ముందు సీట్లు 360 డిగ్రీలు తిరిగేలా అమర్చారు. కేబిన్ నుంచి ముందు సీటుతోపాటు వెనుక సీట్లను కూడా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. - పెద్ద టచ్‌స్క్రీన్‌తో యూనిక్ డిజైన్‌తో ఉన్న స్టీరింగ్. డ్రైవర్ డిస్‌ప్లేతోపాటు మరో రెండు చిన్నపాటి స్క్రీన్లు కూడా ఉన్నాయి. - విండ్‌షీల్డ్ కింద బ్యాటరీ చార్జింగ్‌లాంటి ఫీచర్లు కనిపించేలా మరో డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇది డ్రైవర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. - ఇంటీరియర్ అధునాతన శైలిలో ఉంది. లోపల ఎక్కువ స్పేస్ ఉండటంపై దృష్టిపెట్టి సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. - కారు ముందు, వెనుకవైపున్న ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. కంపెనీ లోగో ‘టీ’ ఆకారంలో ఈ లైట్ స్ట్రిప్ ఉంది. - చేతులు పెట్టుకునే చోట వివిధ రకాల కంట్రో ల్ బటన్స్ ఉన్నాయి. లోపల కూర్చున్న వారికిది చాలా సౌలభ్యంగా ఉంటుంది. - అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది - వాటర్‌ప్రూఫ్, దుమ్ము నుంచి రక్షణతో పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ దీని సొంతం - కర్బన ఉద్గారాలను తగ్గించేలా అధునాతన మెటీరియల్‌తో చక్రాలు రూపొందించారు - కారుపైభాగం అద్దంతో రూపొందించడం వల్ల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణాన్ని మరింత ఆస్వాదించవచ్చని అంటున్నారు. టార్గెట్ 2030 2030 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయాలన్న ప్రభుత్వ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ఫస్ట్ జనరేషన్ విద్యుత్ వాహనాలు ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కి.మీ వరకు వెళ్లగా, రెండో తరానికి చెందినవి 400–500 కి.మీ వరకు వెళ్తాయని, జెన్–3 కార్లయితే 500 కి.మీ.కుపైగా వెళ్తాయని ఆయన తెలిపారు. చదవండి: హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ కారు.. మైలేజ్, మ్యాగ్జిమమ్ స్పీడ్ ఎంతంటే? -
ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా
ఆటోమొబైల్ సెక్టార్లో ధరల పెంపు సీజన్ నడుస్తోంది. వరుసగా ఒక్కో కంపెనీ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ కూడా ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ తాజా పెంపు కూడా తక్షణమే (2022 ఏప్రిల్ 23) అమల్లోకి వస్తుందని తెలిపింది. కార్ల తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా వెల్లడించింది. టాటాలో అనేక మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. వివిధ మోడళ్లు, వేరియంట్లు అన్నింటి మీద సగటున 1.1 శాతం ధర పెరిగింది. టాటా నుంచి నెక్సాన్, హారియర్, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మోడళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇవి కావాలనుకునే వారు ఇకపై పెరిగిన ధర చెల్లించకతప్పదు. కాగా కమర్షియల్ వెహికల్స్‌కి ధరల పెంపు నుంచి టాటా మినహాయింపు ఇచ్చింది. చదవండి: Maruti Car Prices Hike: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు (కర్వ్) సూపర్ లుక్...(ఫొటోలు)
-
టాటా సరికొత్త సంచలనం..కొత్త ఎలక్ట్రిక్ కారుతో ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలే!
TATA Concept Curvv Electric Suv: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రత్యర్ధి ఆటోమొబైల్ సంస్థలకు భారీ షాక్ ఇస్తూ అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ (Tata Concept Curvv electric suv) పేరుతో మార్కెట్‌కు పరిచయమైన కార్ డిజైన్, ఫీచర్లు ఇటు కొనుగోలు దారుల్ని,అటూ మార్కెట్ నిపుణుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుండగా..ఈ కారును అమ్మకాలు జరిపేందుకు మరింత సమయం పట్టనుంది. ఇప్పటికే టాటా సంస్థ నుంచి రెండు నెక్సాన్ ఈవీ, టైగర్ ఈవీతో పాటు 2020లో ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన నెక్ట్స్ జనరేషన్ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయగా.. తాజాగా బుధవారం టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజిండ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర ఎలక్ట్రిక్ కర్వ్ ఎస్యూవీ కారును విడుదల చేశారు. ఇప్పుడు మనం ఈ కారు గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. కార్ రేంజ్ కారు విడుదలైన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ కారు రేంజ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 400కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫ్రేమ్ లెస్ విండో టాటా కర్వ్ పై మరో ఫ్యాన్సీ టచ్ ఏంటంటే అన్ని డోర్లపై ఫ్రేమ్‌లెస్ విండోస్ రూపంలో వీక్షించవచ్చు. సన్ రూఫ్‌తో వస్తుంది ఈ రోజుల్లో చాలా వాహనాల మాదిరిగానే టాటా కర్వ్ కూడా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఈ సన్ రూఫ్ వల్ల లోపల మిరిమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతుంది. క్యాబిన్ సైతం విశాల అనుభూతిని ఇస్తుంది. మినిమలిస్టిక్ ఇంటీరియర్ టాటా కార్ మినిమలిస్టిక్ ఇంటీరియర్‌తో రానుంది. డ్యాష్‌బోర్డ్ పైన రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (ఎంఐడీ) మరో డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ యూనిట్‌గా పని చేస్తుంది. స్టీరింగ్ వీల్ ఇరువైపులా బ్యాక్లిట్ కంట్రోల్‌తో ఫ్లాట్ బాటమ్ డిజైన్‌తో వస్తుంది. ఛార్జింగ్ ఫీచర్ సూపర్ టాటా మోటార్స్ కర్వ్ కాన్సెప్ట్ కారులో వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై కంపెనీ ప్రతినిధులు స్పందించాల్సి ఉండగా.. ఈ కొత్త కాన్సెప్ట్‌తో ఇతర వాహనాలు లేదా చిన్న విద్యుత్ ఉపకరణాలను ఛార్జ్ చేయగలదని దీని అర్థం. అడ్జెస్టబుల్ రెజెనేరేటీవ్ బ్రేకింగ్ టాటా మోటార్ జనరేషన్ 2 పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్ పెద్ద వెహికల్స్ అన్నీ రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వస్తాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2025 నాటికి 10కార్లు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్ కార్లను 2025 నాటికి మరో 10 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మూడు వేరియంట్ కార్లను విడుదల చేయాలని చూస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా ఎలక్ట్రిక్ కార్లు! వెహికల్స్ డెలివరీలో రికార్డ్‌లు! -
TATA Altroz: అప్డేట్ అయ్యింది.. అదిరిపోయే ఫీచర్లు తెచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆ్రల్టోజ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.09 లక్షల నుంచి రూ.9.89 లక్షల వరకు ఉంది. యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీతో వెట్ క్లచ్, మెషీన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం, ఆటో పార్క్ లాక్, ఆటో హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుకవైపు ఏసీ వెంట్స్ వంటి హంగులు ఉన్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది తయారైంది. ‘సెగ్మెంట్–ఫస్ట్ ఫీచర్లతో ఆల్ట్రోజ్ డీసీఏ కచ్చితంగా కాబోయే కొనుగోలుదార్ల మనసును దోచుకుంటుంది. అడ్డంకులు లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ తెలిపారు. కంపెనీ మార్కెట్ వాటాను విస్తరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే 1.25 లక్షల మందికిపైగా కస్టమర్లు ఆ్రల్టోజ్ వినియోగిస్తున్నారు. -
'ఫోర్డ్' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్ టాటా!
రతన్ టాటా..వెటరన్ పారిశ్రామికవేత్త..పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగంలో సంచలన, వినూత్న నిర్ణయాలకు పెట్టింది ఆయన పేరు. ఇటీవల అప్పుల భారంతో కూరుకుపోయిన ఎయిరిండియాను రతన్ టాటాకు చెందిన టాటా గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా కోవిడ్‌తో దెబ్బకు దివాళా తీసే స్థితిలో ఉన్న అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ 'ఫోర్డ్' యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కరోనా క్రైసిస్‌లో సైతం టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ మనదేశంలో 85 శాతం వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తుండగా..అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ చేతులెత్తేసింది. ఈ మేరకు భారత్‌లోని ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, సంసద్(గుజరాత్), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను అమ్మకానికి పెట్టింది. అందులో సంసద్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. కొనుగోళ్లలో భాగంగా సంసద్ యూనిట్ ప్రతినిధుల్ని టాటా గ్రూప్ సంప్రదించినట్లు తెలుస్తోంది. వచ్చేవారం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టాటా గ్రూప్.., ఫోర్డ్ యూనిట్లను కొనుగోలు ప్రతిపాదనలపై స్పష్టత రానుంది. ఒకవేళ అదే జరిగితే మరికొద్ది రోజుల్లో ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ హస్తగతం చేసుకోనుంది. ఇక గుజరాత్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటాకు అమ్మిన తర్వాత.. పీఎల్ఐ స్కీమ్‌లో ఫోర్డ్ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
టాటా మోటార్స్ వినూత్న ఆఫర్! ఇంటి వద్దకే కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మార్కెట్‌పై టాటా మోటార్స్ దృష్టిసారించింది. వినియోగదార్ల ఇంటి వద్దకే కార్లను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అనుభవ్ పేరుతో మొబైల్ షోరూంలను (షోరూం ఆన్ వీల్స్) ఆవిష్కరించింది. వీటి ద్వారా వినియోగదార్ల ఇంటి వద్దనే కార్ల విక్రయం, నూతన మోడళ్ల సమాచారం, ఉపకరణాలు, రుణ పథకాలు, టెస్ట్ డ్రైవ్, పాత కార్ల మార్పిడి వంటి సేవలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూంలను కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. సమీపంలోని టాటా మోటార్స్ డీలర్షిప్ వీటిని నిర్వహిస్తుంది. జనాభా, ఆర్థిక పరంగా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ పరిధిని పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం కార్ల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40 శాతం దాకా ఉంది. -
మారుతికి షాకిచ్చిన మహీంద్రా, టాటాలు
Auto Sales In January 2022: దేశీయ ఆటో తయారీ కంపెనీల జనవరి వాహన విక్రయ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ 2022 ఏడాది తొలి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే జనవరిలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ అమ్మకాల్లో రెండెంకల క్షీణత నమోదైంది. మూడోదశ లాక్డౌన్ ప్రభావంతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతో వాహన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. - మారుతీ సుజుకి ఇండియా జనవరిలో మొత్తం అమ్మకాలు 3.96 శాతం పడిపోయి 1,54,379 యూనిట్లకు చేరింది. గతేడాది 2021 జనవరిలో కంపెనీ 1,60,752 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. - ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో ఈ సంస్థ 59,866 కార్లను అమ్మగా.. ఈ 2022 జనవరిలో 76,210 యూనిట్లను అమ్మింది. - ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. గతేడాది జనవరిలో 4.25 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ ఏడాది తొలి నెలలో 3.63 లక్షల యూనిట్లకు పరిమితమైంది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
టాటా మోటార్స్ ఢమాల్! కారణం ఇదే ?
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాలబాట పట్టింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,941 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రధానంగా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 75,654 కోట్ల నుంచి రూ. 72,229 కోట్లకు క్షీణించింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన టర్న్అరౌండ్ పనితీరు చూపింది. రూ. 176 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ. 638 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 9,636 కోట్ల నుంచి రూ. 12,353 కోట్లకు ఎగసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన అమ్మకాలు 30 శాతం పెరిగి 2,00,212 యూనిట్లకు చేరాయి. సరఫరా సమస్యలున్నపటికీ వాణిజ్య, ప్యాసింజర్ వాహన విక్రయాలు పుంజుకున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. రేంజ్ రోవర్ భళా.. తాజా క్వార్టర్లో జేఎల్ఆర్ 9 మిలియన్ పౌండ్ల పన్నుకు ముందు నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతానికిపైగా నీరసించి 4.7 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. చిప్‌ల కొరత నేపథ్యంలో వాహనాల రిటైల్ అమ్మకాలు 38 శాతం క్షీణించి 80,126 యూనిట్లకు చేరాయి. సెమీకండక్టర్ సరఫరాలతో అమ్మకాలు తగ్గినప్పటికీ తమ ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్నట్లు జేఎల్ఆర్ సీఈవో థియరీ బొలోర్ పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కొత్త రేంజ్ రోవర్ వాహనాల గ్లోబల్ ఆర్డర్‌బుక్ 30,000 యూనిట్లను తాకినట్లు వెల్లడించారు. ఇది సరికొత్త రికార్డుకాగా.. 2022లోనూ చిప్‌ల కొరత సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 10,000 ఈవీ అమ్మకాలు సాధించినట్లు గిరీష్ వెల్లడించారు. -
టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్ కారును రూపొందిస్తుంది. రేంజ్ వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్ చేపట్టిన ఇంటర్నల్ టెస్ట్‌లో కారు సింగిల్ రేంజ్ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సేల్స్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది. రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
ఎలక్ట్రిక్ కారు అవతారంలో పాత టాటా కారు.. రేంజ్ @500 కిమీ!
ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. ఇప్పటికే నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన టాటా మోటార్స్ తాజాగా మరో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొనివచ్చేందుకు సిద్ద పడుతుంది. గతంలో తమ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన కారును ఈ సారి ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతోంది. భారతదేశంలో తయారైన మొట్టమొదటి స్వదేశీ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతుంది. టాటా మోటార్స్ 1991లో ప్రారంభించిన సియెర్రా కారు మంచి సేల్స్ సాధించింది. ఇప్పుడు అదే మోడల్ కారును ఎలక్ట్రిక్ వాహనం రూపంలో మార్కెట్లోకి తిరిగి ప్రవేశ పెట్టాలని చూస్తుంది. టాటా మోటార్స్ టాటా సియెర్రాను స్టాండ్ ఎలోన్ ఎలక్ట్రిక్ కారుగా తిరిగి తీసుకువస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎస్యూవీ కారును ఆధునిక టెక్నాలజీతో తిరిగి తీసుకురావడమే కాకుండా టాటా మోటార్స్ ఐకానిక్ నేమ్ ప్లేట్ కాన్సెప్ట్ ను తిరిగి తెస్తుంది. ఈ ఎస్‌యూవీని మొదట ఆటో ఎక్స్ పో 2020లో ఆవిష్కరించారు. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 500 కిమీ వరకు దూసుకెళ్లనుంది. అయితే, ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే విషయంలో స్పష్టత లేదు. దీని ధర రూ.15-25 లక్షల వరకు ఉండవచ్చు. (చదవండి: వెంకీ మామా.. కొత్త బిజినెస్ అదిరిపోయిందిగా!) -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!
దేశంలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాల పరంగా టాటా మోటార్స్ రికార్డు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు అమ్మకాల పెంచుకుంటూ పోతూ దేశీయ ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ 2021 డిసెంబర్ నెలలో 2,000 యూనిట్లకు పైగా నెక్సాన్, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నట్లు మరోసారి రుజువైంది. మరోవైపు, టాటా నెక్సన్ డిసెంబర్ 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యువిగా నిలిచింది. దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గత ఏడాదిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా 439 శాతం వృద్ధిని సాధించింది. 2020 డిసెంబరులో నెలలో విక్రయించిన 418 యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. 2,000 యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించడం టాటాకు కీలక మైలురాయి. టాటా నవంబర్ 2021లో 1,751 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అంటే, నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ కార్ల(నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ)ను మాత్రమే టాటా విడుదల చేసింది. భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నెక్సన్ ఈవీ నిలిచింది. టాటా త్వరలో ఆల్ట్రోజ్ ఈవీని ప్రారంభించాలని యోచిస్తోంది. భవిష్యత్తులో ప్రముఖ మైక్రో-ఎస్యువి పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తీసుకొనిరావలని చూస్తుంది. "ఎలక్ట్రిక్ వాహనల అమ్మకాలు ఎఫ్ వై22లో 10,000 యూనిట్లను తాకాయి. డిసెంబర్ 2021లో మొదటిసారిగా 2,000 నెలవారీ అమ్మకాల మైలురాయిని అధిగమించింది" అని పివిబియు అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. (చదవండి: పైసల్లేవ్.. ఏం చేస్తారు? తిండి తగ్గించారు!) -
హ్యుందాయ్‌కు గట్టి షాకిచ్చిన టాటా మోటార్స్..!
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్‌కు భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గట్టి షాక్‌ను ఇచ్చింది. వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ దుమ్మురేపింది. రెండో స్థానం టాటా కైవసం..! 2021 డిసెంబర్ నెలలో వాహనాల విక్రయాల్లో హ్యుందాయ్ మోటార్స్‌ను వెనక్కి నెట్టి టాటామోటార్స్ రెండో సానంలో నిలిచింది. టాటా మోటార్స్ డిసెంబర్ 2021లో ఏడాది ప్రాతిపదికన భారత్‌లో అమ్మకాలు 24 శాతం పెరిగాయని నివేదించింది. డిసెంబర్ 2020లో విక్రయించబడిన 53,430 యూనిట్ల కంటే అధికంగా ఈ నెలలో సుమారు 66,307 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. గడిచిన డిసెంబర్ నెలలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 31,008 యూనిట్లను సేల్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. గత ఏడాది 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు గణనీయంగా 50 శాతం మేర పెరిగాయి. 2021 డిసెంబర్గాను 35,299 యూనిట్ల అమ్మకాలను టాటామోటార్స్ జరిపింది. నెక్సాన్, టాటా పంచ్ అదుర్స్..! గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించిన టాటా పంచ్‌కు మార్కెట్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఎస్‌యూవీల్లో టాటా పంచ్‌ను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ గణనీయమైన డిమాండ్‌ను కల్గి ఉంది. దీంతో గత ఏడాది డిసెంబర్ నెలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. చదవండి: చైనా కంపెనీ కొంపముంచిన ట్రంప్ సంతకం..! -
2022లో కొత్త కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్!
మీరు రాబోయే కొత్త సంవత్సరం 2022లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచాలని చూస్తున్నాయి. ఇప్పటికే కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి, ఆడీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. జనవరి 2022లో ధరల పెరుగుదల అనేది మోడల్స్ బట్టి ఉంటుందని మారుతి చెప్పగా, మెర్సిడెస్ బెంజ్ పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా ఎంపిక చేసిన మోడల్స్ కార్లపై ధరల పెంపు అనేది 2 శాతం వరకు ఉంటుందని తెలిపింది. మరోవైపు, ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చుల కారణంగా జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెరుగుదల అనేది మొత్తం మోడల్ శ్రేణిలో 3 శాతం వరకు ఉంటుందని ఆడీ తెలిపింది. ఈ ధరల పెంపు విషయంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "సరుకులు, ముడిపదార్థాలు, ఇతర ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుల పెరుగుదలను కనీసం పాక్షికంగా తగ్గించడానికి ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది" అని అన్నారు. ఈ సంస్థ దేశీయ మార్కెట్లో పంచ్, నెక్సన్, హారియర్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది."కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ఇన్ పుట్ ఖర్చుపై తీవ్రమైన ప్రభావం ఉంది. ఎంత వరకు ధరల పెంచాలో అనే దానిపై అధ్యయనం చేస్తున్నాము" అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. (చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!) సిటీ, అమేజ్ వంటి బ్రాండ్ల తయారీదారు చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో వాహన ధరలను పెంచింది. ధరల పెరుగుదలను తాము కూడా పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్ పేర్కొంది. ఫ్రెంచ్ కంపెనీ క్విడ్, ట్రైబ్ర్, కిగర్ వంటి మోడల్ కార్లను భారతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. గత ఏడాది కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలు ధరల పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో రవాణా ఖర్చు పెరిగింది, ఇది ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల(ఓఈఎమ్) మొత్తం వ్యయ నిర్మాణాలను ప్రభావితం చేస్తుంది. (చదవండి: Ola Electric Car: ఓలా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే!) -
మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!
కరోనా మహమ్మారి తర్వాత తిరిగి వేగంగా పుంజుకుంది ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోక తప్పదు. రోజు రోజుకి రాకెట్ వేగంతో షేర్ మార్కెట్ దూసుకెళ్తుంది. ఈ మధ్య యువతరం మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో మార్కెట్ జీవనకాల గరిష్టాలకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. వారి బందువులు గుర్తించలేని స్థితిలో సంపాదిస్తున్నారు. మరికొందరికీ మార్కెట్ పై ఎటువంటి జ్ఞానం లేకపోవడంతో చేతులు కాల్చుకుంటున్నారు. సాదారణంగా ఒక కంపెనీకి చెందిన ఒకటి లేదా రెండు షేర్లు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయి. కానీ, టాటా గ్రూప్‌కు చెందిన ఏకంగా 8 కంపెనీల షేర్లు మదుపరుల పాలిట కల్పవృక్షం లాగా మారాయి. మన దేశంలో టాటా గ్రూప్‌కు ఉన్న విలువ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్ అంటే "ఒక నమ్మకం". మన దేశంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే ఏకైక సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వంటి 8 కంపెనీల షేర్లు మదుపరులకు గత 20 నెలలుగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 10 రేట్లకు పైగా పెరిగాయి. 2020 మార్చి నుంచి డిసెంబర్ 3 వరకు టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్ ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు: టాటా మోటార్స్ షేర్ ధర - ఏప్రిల్ 3 రూ.65.30 - రూ. 480.30 (డిసెంబర్ 3వ తేదీ) టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.550.20 - రూ.5,890 (డిసెంబర్ 3వ తేదీ) టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర - మే 11 - రూ.27.30 -రూ.225.60(డిసెంబర్ 3వ తేదీ) టాటా మోటార్స్ లిమిటెడ్ - డీవీఆర్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 30 - రూ.30 - రూ.258.30(డిసెంబర్ 3వ తేదీ) టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.59.45 - రూ.280.20(డిసెంబర్ 3వ తేదీ) ఎన్ఈఎల్ సీఓ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.121.30 - రూ.738.05(డిసెంబర్ 3వ తేదీ) టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 19 - రూ.216.05 - రూ.1303.25(డిసెంబర్ 3వ తేదీ) టాటా స్టీల్ బీఎస్ఎల్ లిమిటెడ్ షేర్ ధర - ఏప్రిల్ 3 - రూ.15.55 - రూ.85.35(డిసెంబర్ 3వ తేదీ) (చదవండి: దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!) -
తుక్కు వ్యాపారంలోకి టాటా గ్రూప్
న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ విధానంలో వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి కేంద్రం అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఈడీ గిరీష్ వాఘ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా 25,000 ట్రక్కులు తుక్కుగా మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయని, కానీ సరైన స్క్రాపేజీ కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్‌కు చెందిన నిపుణులతో కలిసి మోడల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని రూపొందించామని వాఘ్ పేర్కొన్నారు. ఫ్రాంచైజీ విధానంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గిరీష్ వాఘ్ తెలిపారు. ఇప్పటికే భాగస్వాములకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) పంపించడం మొదలు పెట్టామని వివరించారు. స్క్రాపేజీ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు రాగలవనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతోందని వాఘ్ వివరించారు. అహ్మదాబాద్‌లో వాహనాల స్క్రాపేజీ సెంటర్ నెలకొల్పడానికి గుజరాత్ ప్రభుత్వంతో టాటా మోటార్స్ ఇటీవలే చేతులు కలిపింది. -
దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!
దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ధరలో మంచి కార్లు అందుబాటులో ఉండటం, మధ్యతరగతి ఆదాయం పెరగడం చేత కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది వినియోగదారులు కారు కొనేముందు ఆ ఫీచర్ ఉందా? ఈ ఫీచర్ ఉందా? అని అడుగుతున్నారే కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఫీచర్ భద్రత పరంగా ఈ కారు ఎంత రేటింగ్ పొందింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. ఇంకొంత మంది రూ.2 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొంటున్నారు. కానీ, అన్నింటికంటే సేఫ్టీ రెంటింగ్ చాలా ముఖ్యం. గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ గత కొన్ని ఏళ్లుగా భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా పంచ్ ఎస్యువి కారుకు భద్రతా పరీక్ష నిర్వహించిన తర్వాత భద్రతా సంస్థ భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్ పొందిన కార్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక) 1. టాటా పంచ్ యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ)ను నిర్వహిస్తుంది. మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్((16.453), పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్((40.891) రేటింగ్ సాధించింది. 2. మహీంద్రా ఎక్స్యువి300 గ్లోబల్ ఎన్సీఏపీ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని నిలుపుకున్న మహీంద్రా ఎక్స్యువి300, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించినందుకు సేఫ్టీ ఏజెన్సీ మొట్టమొదటి 'సేఫర్ ఛాయిస్' అవార్డును కూడా అందుకుంది. ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ భద్రతా రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్ పొందింది. 3. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ సమయంలో గ్లోబల్ ఎన్సీఏపీ ద్వారా వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. (చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 4. టాటా నెక్సన్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. నెక్సన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంటల్ డబుల్ ప్రెటెన్షన్ లు, ఏబిఎస్ బ్రేకులు వంటివి ఉన్నాయి. 5. మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్ ఎస్యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్యువి జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.(చదవండి: క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) 6. టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్సీఏపీ మొట్టమొదటిసారి పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ లో అన్ని సీటింగ్ పొజిషన్లలో త్రీ పాయింట్ బెల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7. టాటా టిగోర్ టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్ వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. 8. టాటా టియాగో మరో ప్రముఖ హ్యాచ్ బ్యాక్ టియాగో భద్రతా ప్రమాణాల పరంగా టాటా టిగోర్ తో సమానంగా ఉంది. టియాగో కూడా వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 9. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ ఇండియాకు చెందిన హ్యాచ్ బ్యాక్ 2014లో గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇది వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. డ్యాష్ బోర్డ్ లోని ప్రమాదకరమైన నిర్మాణాల కారణంగా ముందు ప్రయాణీకుల మోకాళ్లు ప్రమాదానికి గురవుతాయని భద్రతా నివేదిక పేర్కొంది. (చదవండి: ఆపిల్..గూగుల్..శాంసంగ్..! ఎవరు తగ్గేదెలే...!) 10. రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్ షిప్ ట్రైబర్ ఎమ్‌పివి వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది. -
ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు గత 10 ఏళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే!. వీటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన చరిత్ర గురుంచి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర మొదటి సారిగా 1830లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వాహనంలో గ్యాసోలిన్-శక్తితో పనిచేసే మోటారు కాకుండా ప్రొపల్షన్ కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కారుతో పాటు, బైక్‌లు, మోటారు సైకిళ్ళు, పడవలు, విమానాలు, రైళ్లు అన్నీ విద్యుత్తుతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నాయి కూడా... ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభం 1828లో హంగేరియన్ అన్యోస్ జెడ్లిక్ అతను ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే చిన్న తరహా మోడల్ కారును కనుగొన్నాడు. సుమారు 1832లో రాబర్ట్ ఆండర్సన్ మొదటి క్రూడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తాడు. 1835లో మరొక చిన్న-తరహా ఎలక్ట్రిక్ కారును హాలండ్‌లోని గ్రోనింగెన్‌కు చెందిన ప్రొఫెసర్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బెకర్ కలిసి రూపొందించారు. 1835లో వెర్మోంట్లోని బ్రాండన్ కు చెందిన కమ్మరి థామస్ డావెన్‌పోర్ట్ ఒక చిన్న తరహా ఎలక్ట్రిక్ కారును నిర్మించాడు.(చదవండి: Starlink: శాటిలైట్ ఇంటర్నెట్పై అసహనం) 1842లో థామస్ డేవెన్పోర్ట్, స్కాట్స్ మాన్ రాబర్ట్ డేవిడ్సన్ ఇద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశారు. కానీ, దీనిని చార్జ్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేది. ఫ్రెంచ్ వ్యక్తి గాస్టన్ ప్లాంటే 1865లో ఒక మంచి బ్యాటరీని కనుగొన్నాడు. దానిలో సమస్యలు రావడంతో అతని తోటి దేశస్థులు కామిల్లె ఫౌర్ 1881లో ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ ఉంచుకునే బ్యాటరీని మరింత మెరుగుపరిచారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ముఖ్యంగా బ్యాటరీ అవసరం. 1899లో బెల్జియంలో నిర్మించిన ఎలక్ట్రిక్ రేసింగ్ కారు 68 మైలు వేగంతో వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని కామిల్లె జెనాట్జీ రూపొందించారు. 1900-1920 ఎలక్ట్రిక్ కార్లను ఉదయం ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. తర్వాత ఫోర్డ్ ఒక చౌకగ్యాస్ కారుని తయారు చేసింది. ఫోర్డ్ మోటార్ కంపెనీ మోడల్ టి పేరుతో పరిచయం చేసింది. అప్పట్లో ఇది చాలా ఉపయోగపడినప్పటికి అనుకున్నంత రాణించలేక పోయింది.జనరల్ మోటార్స్ కాడిలాక్ టూరింగ్ ఎడిషన్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత దశాబ్దాలలో గ్యాసోలిన్, డీజిల్ కార్ల జోరు పెరడంతో ఎలక్ట్రిక్ కార్లు కొద్ది కాలం పాటు కనుమరుగు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల పరిమిత డ్రైవింగ్ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం, భారీ బ్యాటరీల వల్ల నిలదొక్కుకోలేక పోయింది.(చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు) 1961-1970 ప్రధాన ఆటోమేకర్లు ఎలక్ట్రిక్ కార్ల తయారిని అపలేదు. బ్యాటరీలతో రన్ చేయడానికి జనరల్ మోటార్స్ ప్రయోగాలు చేసింది. అమెరికన్ మోటార్స్ కార్పొరేషన్ అమిట్రాన్ అనే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కేవలం కొన్ని సంవత్సరాలలో అమిత్రాన్ ను అమ్మకానికి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ అలా, జరగలేదు.(చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!) 1971 -1980 ఆ తర్వాత ఫ్లోరిడాలోని సెబ్రింగ్-వాన్ గార్డ్ కంపెనీ సిటీకార్ పరిచయం చేసింది. ఇది కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. చివరికి 4,400 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. సిటీకార్ టాప్ స్పీడ్ గంటకు 38 మైళ్లు. కానీ, ఆ తర్వాత ఈవీ కూడా కనుమరుగు అయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీ గుండె అయిన కోబాల్ట్-ఆక్సైడ్ క్యాథోడ్ ను జాన్ గుడ్ ఎనౌన్, అతని సహచరులు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో కనుగొన్నారు. రాబోయే దశాబ్దాల్లో, ఈ ఆవిష్కరణ ద్వారా సాధ్యమైన బ్యాటరీల వస్తాయి అని పేర్కొన్నారు. 2019లో గుడ్ ఎనౌన్, మరో ఇద్దరు పరిశోధకులకు లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2000-2010 2003లో స్థాపించబడిన టెస్లా మోటార్స్ కంపెనీ మొదటి కారు టెస్లా రోడ్ స్టర్ రహదారి మీదకు రావడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. దీని ధర $80,000 కంటే ఎక్కువ. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 200 మైళ్ల కంటే ఎక్కువ వెళ్ళగలదు. దీనిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇక ఆ తర్వాత నుంచి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్, హ్యూందాయి, టెస్లా, ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొనివస్తున్నాయి. -
9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!
గత కొద్ది రోజుల నుంచి ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్మార్కెట్లో భారీ లాభాలను గడిస్తున్నారు. స్టాక్‌మార్కెట్ల నుంచి రాకేష్ 9 రోజుల్లో 16 వందల కోట్లను సంపాదించారు. నజారా టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు భారీగా లాభాలను గడించాయి. గత కొన్ని సెషన్లలో టాటా గ్రూప్ షేర్ల భారీ ర్యాలీ నేపథ్యంలో షేర్ హోల్డర్స్‌కు అద్భుతమైన ప్రతిఫలాన్ని అందిచాయి. చదవండి: ఇక ఫేస్బుక్లో గోలగోలే...! యూజర్లకు గుడ్‌న్యూస్...! టాటా మోటార్స్ షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరుకుంది. దాంతో పాటుగా టైటాన్ కంపెనీ షేర్లు జీవితకాల గరిష్ట స్థాయిని అధిగమించింది. వాస్తవానికి, టైటాన్ కంపెనీ షేర్లు 2021 ప్రారంభం నుండి ఆకాశాన్నంటుతున్నాయి.ఈ నెల నుంచి టైటాన్ కంపెనీ షేర్లు మరింత వేగం పుంజుకుంది. 9 ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర దాదాపు 17.50 శాతం పెరగడంతో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దాదాపు 1600 కోట్లు సంపాదించడంలో సహాయపడింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా టాటాగ్రూప్‌లో భారీగా పెట్టుబడులను పెట్టారు. రాకేష్ టాటా గ్రూప్‌లో 3 కోట్లకుపైగా షేర్లను కల్గి ఉన్నారు. అతని సతీమణి 96 లక్షలకు పైగా షేర్లను కల్గి ఉన్నారు. టైటాన్ షేర్లు రయ్ రయ్...! టైటాన్ షేర్లు కొన్ని రోజుల నుంచి భారీ లాభాలను గడిస్తున్నాయి. ఈ నెలలో గత తొమ్మిది ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర రూ. 2161.85 నుంచి రూ. 2540 పెరిగింది. తొమ్మిది రోజుల్లో టైటాన్ షేర్ ధర సుమారు రూ.378.15 మేర పెరిగాయి. ప్రస్తుతం టైటాన్ షేర్లు 2547.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చదవండి: ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్ -
చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్
న్యూఢిల్లీ: గత కొద్ది నెలల నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని అమెరికాకు చెందిన టెస్లాను అనేకసార్లు కోరినట్లు, అదే సమయంలో సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 'ఇండియా టుడే కాన్ క్లేవ్ 2021'ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ఏమి కాదని అన్నారు. చైనా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించొద్దు.. "చైనాలో తయారు చేసిన మీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి. ఇంకా అవసరం అయితే టెస్లా కార్లను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. పన్ను రాయితీల విషయంలో సంస్థ డిమాండ్ చేసిన వాటి గురుంచి టెస్లా అధికారులతో తాను ఇంకా చర్చలు జరుపుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. గత నెలలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను మొదట భారతదేశంలో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరిన విషయం మనకు తెలిసిందే. (చదవండి: టెస్లా ఎలన్ మస్క్.. బెంజ్‌ని చూసి నేర్చుకో..!) ఇప్పటికే జర్మనికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్ చేసిన ఎస్ సిరీస్ కార్లు ఇండియాలో బాగానే క్లిక్ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని రూ. 2,200 కోట్ల వ్యయంతో మెర్సిడెజ్ బెంజ్ ఏర్పాటు చేసింది. ఇండియాలో కార్ల తయారీ యూనిట్ నెలకొల్పి కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, టెస్లా గనుక ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్ నిర్మిస్తే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు తెలుపుతున్నారు. -
ఫీచర్స్ అదిరే, టాటా మోటార్స్ నుంచి న్యూ మోడల్ కార్
ముంబై: టాటా మోటార్స్ తన టియాగో శ్రేణిలో ‘‘టియాగో ఎన్ఆర్జీ’’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎస్యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద టైర్లు, విశాలమైన, ధృడమైన బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్మిషన్ వెర్షన్లలో లభిస్తుంది. పుష్ బటన్ స్టార్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోఫోల్డ్ ఓఆర్వీఎం, బ్లాక్ ఇంటీరియన్స్, ఏబీఎస్ ఈబీడీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ వైపర్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అత్యుత్తమ భద్రత ప్రమాణాలను కలిగి ఉంది. టియాగోలానే కొత్త కారు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా ఆశాభావం వ్యక్తంచేశారు. -
దేశంలో సంక్షోభం, టాటా మోటార్స్ మరో మైలురాయి
ప్రముఖ ఆటోమోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తినా దిగ్గజ ఆటోమోబైల్ సంస్థ వాహనాల్ని రికార్డ్ స్థాయిలో మార్కెట్లో విడుదల చేసింది. పూణే కేంద్రంగా కేవలం నాలుగు నెలల్లో భారీ ఎత్తున వాహనాల్ని మార్కెట్లోకి విడుదల చేసినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. శైలిష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలకు ఎస్యూవీ సఫారీ వాహనాల్ని 100వాహనాల్ని విడుదల చేసినట్లు, నాలుగు నెలలో 9,900వాహనాల్ని పూణే ప్లాంట్ నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. దేశంలో గడ్డు పరిస్థితులు తలెత్తినప్పటికీ వాహనాల తయారీలో రికార్డ్ క్రియేట్ చేశామని అన్నారు. టాటా మోటార్స్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ లో సఫారి తన కొత్త మోడల్ ఒమేగార్క్ ప్లాట్‌ఫామ్ వినియోగదారుల్ని ఆకట్టుకుందని, డి 8 ప్లాట్‌ఫామ్ నుండి పొందిన ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ విభాగంలో ముందజలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టాటామోటార్స్ డిజైన్లను మారుస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. -
ట్యాక్సీ వాహనాల కోసం సరికొత్త టాటా ఎలక్ట్రిక్ కారు విడుదల
ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టిగోర్ ఫేస్ లిఫ్ట్ ఆధారంగా ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన ఎక్స్‌ప్రెస్-టీ ఎలక్ట్రిక్ వాహన ధరలను టాటా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఇది పాత టిగోర్ ఈవీని రీప్లేస్ చేస్తుంది. ఎక్స్ ఎమ్+ ధర రూ. 9.75 లక్షలు, ఎక్స్ టీ+ ధర రూ.9.9 లక్షలుగా ఉంది. ఎంపిక చేసిన టాటా డీలర్ షిప్‌ల వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్ వివరించింది. ఎక్స్‌ప్రెస్-టీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లతో వస్తుంది. 165 కి.మీ క్లెయిం రేంజ్ తో 16.5కెడబ్ల్యుహెచ్, 213 కిలోమీటర్ల క్లెయిం రేంజ్ తో 21.5కెడబ్ల్యుహెచ్. దీనిలోని బ్యాటరీ ప్యాక్ 70వీ, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో జత చేశారు. ఇది 40హెచ్ పీ, 105 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 2021 టాటా ఎక్స్‌ప్రెస్-టీని ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. వీటిని చార్జ్ చేయడానికి కనీసం పది గంటలు పడుతుంది. లుక్స్ పరంగా చూస్తే ఎక్స్‌ప్రెస్-టీ కొత్త బాడింగ్ కొన్ని నీలం ఇన్సర్ట్ లు, గ్లోస్-బ్లాక్ ఫ్లాట్ గ్రిల్, 14 అంగుళాల అలాయ్ వీల్స్ కలిగి ఉంది. దీనిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఎల్ఈడి హెడ్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. -
ట్యాక్సీ సెగ్మెంట్ కోసం టాటా మోటార్స్ కొత్త బ్రాండ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసులకు ఉపయోగించే వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్' పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను అందించనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వివరించారు. ఎక్స్ఫైస్ బ్రాండ్ మొదటి వాహనాన్ని ఎక్స్ట్రెస్-టి పేరిట ఎలక్టిక్ సెడాన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. ఎక్స్ ఫ్రెస్-టి ఎలక్టిక్ సెడాన్ కార్లు 218 కిమీ.. 165 కి.మీ. మైలేజీ వేరియేషన్లలో అందుబాటులోకి తెస్తామని వివరించింది. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్ఇండ్ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్‌టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్టివి) రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్ ఇండ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు. అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా కస్టమర్‌పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పథకాల నిమిత్తం టాటా మోటార్స్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టీఏ రాజగోప్పలన్ తెలిపారు. -
మనసు దోచే ‘టాటా’ డార్క్ ఎడిషన్స్
న్యూఢిల్లీ : డార్క్ ఎడిషన్ పేరుతో సక్సెస్ఫుల్ మోడల్ కార్లకు టాటా మోటార్స్ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్, అల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్ వెహికల్స్ అందుబాటులోకి తేనుంది. ధర ఎంతంటే ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం డార్క్ ఎడిషన్లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డార్క్ స్పెషల్స్ ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్ కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ డిజైన్ చేశారు. ఎల్లాయ్ వీల్స్, క్రోమ, బ్యానెట్, ముందు భాగంలో డార్క్ ఎంబ్లమ్ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి గ్రాఫైట్ బ్లాక్ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్ ఉన్న డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్స్ విత్ డార్క్ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్ చేశారు. నెక్సాన్ ఇలా ఇక నెక్సాన్‌లో చార్కోల్ ఎల్లాయ్ వీల్స్, సోనిక్ సిల్వర్ బెల్ట్‌లైన్, ట్రై యారో డ్యాష్‌బోర్డ్ , లెదర్ సీట్లు, డోర్ ట్రిమ్స్ అండ్ ట్రై యారో థీమ్‌తో డిజైన్ చేశారు. నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్నైట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. సాటిన్బ్లాక బెల్ట్‌లైన్, చార్కోల్ వీల్ ఎల్లాయిస్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్ థీమ్ ఫాలో అయ్యారు. హ్యారియర్‌తో మొదలు డార్క్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్యారియర్ అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్ ఎడిషన్స్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. -
సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టియాగో కొత్త వర్షన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ హ్యచ్‌బ్యాక్ కార్లలో భాగంగా కొత్త టియాగో ఎక్స్‌టీ(ఓ) వేరియంట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5. 48 లక్షలుగా నిర్ణయించారు. కొత్త ఎక్స్‌టీ(ఓ), ట్రిమ్ బేస్ ఎక్స్ ఈ, మిడ్ ఎక్స్‌టీ టియాగో కార్ల శ్రేణిలో నిలవనుంది. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ ధర టియాగో ఎక్స్‌టి ట్రిమ్ కంటే కేవలం రూ .15,000 తక్కువ. ఎక్స్ఇ ట్రిమ్ కంటే రూ .47,900 ఎక్కువ. ఎక్స్ఇ ట్రిమ్‌తో పోల్చినప్పుడు, ఎక్స్‌టీ(ఓ) 14-అంగుళాల స్టీల్ రిమ్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్‌తో పాటు(ఓఆర్వీఎమ్)తో పాటు వీల్ క్యాప్స్‌ను అందిస్తోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ... స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఐఆర్విఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికలి అడ్జస్ట్ చేయగల ఓఆర్వీఎమ్లు, నాలుగు స్పీకర్లు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇంజన్ 84 బిహెచ్పి సామర్ధ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బ్యాక్స్ సిస్టమ్‌ను కారులో అమర్చారు. చదవండి: కరోనా కట్టడిలో టాటా గ్రూపు -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,585 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2019–20) ఇదే కాలంలో రూ. 9,864 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 63,057 కోట్ల నుంచి రూ. 89,319 కోట్లకు ఎగసింది. ఇదే కాలంలో యూకే అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) 95.2 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు నష్టం(రూ. 9,600 కోట్లు) ప్రకటించింది. ఇందుకు 1.5 బిలియన్ పౌండ్ల(రూ. 14,994 కోట్లు) అనూహ్య చార్జీలు కారణమయ్యాయి. వీటిలో పెట్టుబడులపై నగదేతర రైటాఫ్‌లు, పునర్వ్యవస్థీకరణ చార్జీలు కలసి ఉన్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. తద్వారా జేఎల్ఆర్కు సంబంధించి కొత్త గ్లోబల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఆధునిక లగ్జరీ డిజైన్లు, డెలివరీ తదితరాల రీఇమేజిన్కు తెరతీసినట్లు తెలియజేసింది. దీంతో 2025–26కల్లా రెండంకెల ఇబిట్ మార్జిన్లు సాధించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. స్టాండెలోన్ ఇలా క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 20 శాతంపైగా ఎగసి 6.5 బిలియన్ పౌండ్లను తాకింది. రిటైల్ అమ్మకాలు 12 శాతం పుంజుకుని 1,23,483 యూనిట్లకు చేరాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ క్యూ4లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. దాదాపు రూ. 1,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో రూ. 4,871 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 10,002 కోట్ల నుంచి రూ. 20,306 కోట్లకు జంప్‌చేసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన విక్రయాలు 90 శాతం దూసుకెళ్లి 1,95,859 యూనిట్లకు చేరాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జేఎల్ఆర్ మొత్తం ఆదాయం 19.7 బిలియన్ పౌండ్లను తాకింది. వాహన అమ్మకాలు దాదాపు 14 శాతం క్షీణించి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక గతేడాదిలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,395 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో రూ. 11,975 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,64,041 కోట్ల నుంచి రూ. 2,52,438 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ1 వీక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో పటిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల సమస్యకానున్నాయి. కోవిడ్–19 సెకండ్‌వేవ్ లాక్డౌన్, కమోడిటీల పెరుగుదలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను దెబ్బతీసే వీలున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే 2021–22 రెండో త్రైమాసికం నుంచీ పటిష్ట రికవరీ కనిపించగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో జేఎల్ఆర్ బిజినెస్‌పై 2.53 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలియజేశారు. దేశీయంగా రూ. 3,000–3,500 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.4% జంప్‌చేసి రూ. 332 వద్ద ముగిసింది.ఇంట్రాడేలో రూ. 337 వరకూ బలపడింది. సవాళ్లు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నాం.. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గతేడాది కంపెనీ నిలదొక్కుకోవడంతోపాటు పటిష్ట రికవరీని సాధించింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్లతో కూడిన భవిష్యత్ లగ్జరీ డిజైన్ల ద్వారా అమలు చేస్తున్న రీఇమేజిన్ వ్యూహాలు ఇందుకు దోహదపడుతున్నాయి. – థియరీ బోలోర్, జేఎల్ఆర్ సీఈవో సరఫరాల సమస్యను అధిగమిస్తున్నాం.. కోవిడ్–19 కారణంగా గతేడాది ఆటో పరిశ్రమ భారీగా ప్రభావితమైంది. అయినప్పటికీ వాహనాలకు నిలకడైన వృద్ధి కనిపించింది. లాక్డౌన్లు తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక రికవరీ వంటి అంశాలు ఇందుకు సహకరించాయి. సరఫరా సమస్యలను అధిగమిస్తూ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇదే సమయంలో ఉద్యోగులు, సహచర సిబ్బంది ఆరోగ్యం, రక్షణ తదితరాలకు ప్రాధాన్యమిచ్చాం. – గాంటర్ బుషక్, టాటా మోటార్స్ సీఈవో -
Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అత్యధిక వాణిజ్య వాహనాల అమ్మకందారు టాటా మోటార్స్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డీలర్షిప్ ఒప్పందాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 4న 45 పేజీల విచారణ పత్రాల టాటా మోటార్స్‌కు పంపింది.నిబంధనలకు విరుద్ధంగా తన డామినెంట్ పొజిషన్‌ను ఉపయోగించుకొని టాటామోటార్స్ వాణిజ్య వాహనాల డీలర్షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తోందన్న ఫిర్యాదుదారులను సీసీఐ ప్రాథమికంగా విశ్వసిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది. టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రెండు ఫిర్యాదులు రావడంతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 4 లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కోసం డీలర్ షిప్ ఒప్పందాలు చేసుకుంటుందన్న ఆరోపణలను ప్రాధమిక విచారణలో నిజమేనని సీసీఐ తేల్చింది ఈనేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సెక్షన్ 3 (4), కాంపటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయనేది సీసీఐ వాదన. సీసీఐ ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆర్డర్ కాపీని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన చర్యల నిమిత్తం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని చెప్పారు. చదవండి: పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే! కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
టియాగో.. కొత్త వేరియంట్
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ లెవల్ టియాగో లైన్–అప్‌లో ‘‘టాటా టియాగో ఎక్స్‌టీఏ’’ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలుగా ఉంది. కొత్త వేరియంట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్(ఏఎంటీ)లో వస్తుంది. ‘‘భారత్‌లో ఆటోమేటిక్ టాన్స్‌మిషన్(ఏటీ) సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది, అందుకే ఏటీఎస్ ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీ టియాగో ఎక్స్‌టీఏ వెర్షన్ శ్రేణిని మార్కెట్‌కు పరిచయం చేసింది’’ అని టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త వేరియంట్ మిడ్–హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీనివ్వడమే కాకుండా, కస్టమర్లు చెల్లించే ధరకు తగిన సదుపాయాల్ని ఇస్తుందని శ్రీవాస్తవ విశ్వాసం వ్యక్తం చేశారు. -
2021 టాటా సఫారీ: బుకింగ్స్ ప్రారంభం
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సఫారీ కారును భారత మార్కెట్లో టాటా మోటార్స్ సోమవారం ఆవిష్కరించింది. ఐకానిక్ సఫారీ కొత్త వాహన శ్రేణిని తీసుకొచ్చింది. మొత్తం ఆరు వేరియంట్లలో టాటా సఫారీ 2021 యూఎస్వీ కార్లను లాంచ్ చేసింది. పరిచయ ధరగా బేసిక్ మోడల్ ధరను 14.69 లక్షలుగా నిర్ణియించింది కంపెనీ. టాప్ ఎండ్ మోడల్ ఖరీదు 21.45 లక్షలుగా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను మొదలుపెట్టింది. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద రూ. 30 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ఈ, ఎఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ప్లస్, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్ ప్లస్ అనే మోడళ్లలో టాటా సఫారీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అడ్వెంచర్ పర్సోనా పేరుతో కొత్త వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది .దీని విలువ 20.20 లక్షలు (ఎక్స్-షోరూమ్‌న్యూఢిల్లీ) గా ఉండనుంది. కాగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 2021 టాటా సఫారీని టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీగా ఇది నిలిచింది. -
టాటా మోటార్స్ కొత్త బాస్ ఎవరంటే?
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ కొత్త బాస్‌ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో 2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్ బషెక్ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది. బషెక్ వ్యక్తిగత కారణాలతో జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే. మార్క్ నియామకంపై టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణ వాణిజ్య వాహనాల్లో అపార అనుభవం, నైపుణ్యంతో మార్క్ ఆటోమోటివ్ బిజినెస్ లీడర్‌గా ఉన్నారన్నారు. మార్క్ సారధ్యంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తన నూతన బాధ్యతలపై మార్క్ స్పందిస్తూ భారత్‌తో తనకున్న అనుబంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమంటూ ఆనందాన్ని ప్రకటించారు. సంస్థ సామర్థ్యాన్ని సంయుక్తంగా మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. గతంలో మార్క్ ఫ్యుజో ట్రక్, బస్ కార్పొరేషన్ సీఈవోగా, డెమ్లర్ ట్రక్స్ ఆసియా హెడ్‌గా ఉన్నారు. 2016లో సీఎండీగా ఎంపికైన గుంటర్ బషెక్ నేతృత్వంలో టాటా మోటార్స్ దూసుకెళ్లింది.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ చివరిలో జర్మనీకి మకాం మార్చాలని గుంటెర్ నిర్ణయించున్నారు. అయితే 2021, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాలని టాటా బోర్డు చేసిన అభ్యర్థనను మన్నించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా కరోనా, లాక్డౌన్ సంక్షోభాలనుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో గత 33 త్రైమాసికాలలో లేని అత్యధిక లాభాలను గడించింది. వార్షిక ప్రాతిపదికన 67.2 శాతం పెరిగి 2,906 కోట్ల లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 5.5 శాతం పుజుకుని 75,654 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 71,676 కోట్ల రూపాయలు. -
ఇక మన రోడ్లపైనా ఎలక్ట్రిక్ కార్ల హవా
ముంబై, సాక్షి: ఇటీవల ప్రపంచ మార్కెట్లను వేడెక్కిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దేశీయంగానూ ఊపందుకోనుంది. 2021లో పలు దిగ్గజ కంపెనీలు దేశీ మార్కెట్లో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల పోటీకి ఆడి, జాగ్వార్, టెస్లా తదితరాలు సై అంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి గతంలో ఎన్నడూలేని విధంగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2,500 వాహనాల వరకూ దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం మద్దతిస్తున్నట్లు చెప్పారు. దీంతో అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక వాహనాలు దేశీ రహదారులపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. ఆటో రంగ నిపుణులు వెల్లడించిన వివరాలు చూద్దాం.. ఆడి ఈ-ట్రాన్ ఆడి సంస్థ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ-ట్రాన్ కీలక మోడల్. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ దిశలో ఆడి తీసుకువస్తున్న ఈ-ట్రాన్ బ్రాండ్ దేశీయంగా విడుదలకానున్న తొలి విలాసవంత(హైఎండ్) కారుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 17,641 వాహనాలు విక్రయమయ్యాయి. దేశీ మార్కెట్లో తొలిగా విడుదలైన మోడల్‌గా ప్రయోజనాలు పొందే వీలుంది. తొలి దశలో పూర్తిగా నిర్మితమైన వాహనం(సీబీయూ)గా తక్కువ సంఖ్యలోనే దిగుమతికానున్నాయి. అయితే రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా విడివిడిగా యాక్సిల్స్‌ను నడిపించే శక్తితో వాహనం, అమ్మకాలు వేగాన్ని అందిపుచ్చుకోనున్నాయి. జనవరి చివర్లో విడుదలకానున్న ఈ-ట్రాన్ గరిష్టంగా 357 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. జాగ్వార్ 1-పేస్ 2019 వరల్డ్ కార్గా ఎంపికైన జాగ్వార్ 1-పేస్ వాహనాలు ఇటీవల పరిశీలనాత్మకంగా ముంబైలో సందడి చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ సైతం రేసులోకి రానుండటంతో అతిత్వరలోనే కారు విడుదల తేదీ ఖరారయ్యే వీలుంది. 90 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో, 394 బీహెచ్పీ గరిష్ట శక్తిని అందుకోనుంది. టాప్ఎండ్ హెచ్ఎస్ఈ మోడల్ ద్వారా దేశీయంగా తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ లగ్జరీ కారుగా నిలవనుంది. గరిష్టంగా 470 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. అంచనా ధర రూ. 1.5-2 కోట్లు. (జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై) టెస్లా మోడల్-3 యూఎస్ కంపెనీ టెస్లా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు మోడల్-3 దేశీయంగా విడుదలకానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశాక ఆసక్తి బాగా పెరిగింది. గ్లోబల్ ఆటో రంగంలో సంచలనాలకు నెలవుగా నిలుస్తున్న మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగవంత విక్రయాలను సాధిస్తోంది. టెస్లా ఇంక్ తయారీలో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న ఈ వాహనం ఎంట్రీలెవల్ విభాగంలో పోటీకి దిగనుంది. 5 సెకన్లలోపే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్-3 గరిష్టంగా 420 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. డాష్‌బోర్డుకు అనుసంధానించిన ల్యాప్‌టాప్ మోడల్ 15 అంగుళాల టచ్ స్క్రీన్‌తో రానుంది. ఏప్రిల్ తదుపరి మార్కెట్లో విడుదలకావచ్చు. అంచనా ధర: రూ. 60 లక్షలు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) పోర్ష్ టేకెన్ కంపెనీకున్న దశాబ్దాల ఇంజినీరింగ్ సామర్థ్యాలతో నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారును టేకెన్ బ్రాండుతో పోర్ష్ రూపొందించింది. కోవిడ్-19 కారణంగా విడుదల ఆలస్యమైన టేకెన్ ఫిబ్రవరిలో దేశీ మార్కెట్లలో ప్రవేశించే వీలుంది. పోర్ష్ నుంచి వస్తున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో అత్యంత శక్తికలిగిన కారు కూడా. 79.2 కిలోవాట్స్ బ్యాటరీ, 600 బీహెచ్పీ శక్తితో రూపొందింది. గరిష్టంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 800 వోల్డ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిముషాల్లోనే 80 శాతం చార్జింగ్కు వీలున్నట్లు కంపెనీ చెబుతోంది. అంచనా ధర: రూ. 2.2-2.5 కోట్లు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ 40 రీచార్జ్. వోల్వో తయారీ ఎస్60 మోడల్ విడుదల తదుపరి మార్కెట్లో ప్రవేశించనుంది. ట్విన్ మోటార్లు కలిగిన రీచార్జ్ 408 బీహెచ్పీ పవర్‌ను కలిగి ఉంది. 78 కిలోవాట్ల బ్యాటరీతో వెలువడనుంది. ఏసీ లేదా 150 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. తొలిసారి ఆండ్రాయిడ్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను వోల్వో ఏర్పాటు చేసింది. గరిష్టంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. అంచనా ధర: రూ. 50 లక్షలు. టాటా ఆల్ట్రోజ్ఈవీ ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విలాసవంత మోడళ్ల హవా ప్రారంభంకానున్నప్పటికీ మరోపక్క దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టి సాగుతోంది. దేశంలోనే చౌక ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీను తీసుకువచ్చిన కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ ఈవీని రూపొందించింది. అందుబాటు ధరల ఈ కార్ల వినియోగదారులు టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ నెట్వర్క్ ద్వారా లబ్ది పొందేందుకూ వీలుంటుంది. గరిష్టంగా 300 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఫిబ్రవరిలో మార్కెట్లో ప్రవేశించవచ్చు. అంచనా ధర: రూ. 14 లక్షలు. -
సఫారీ సరికొత్తగా.. కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. ఆటో ఎక్స్పో 2020లో గ్రావిటాస్ కోడ్‌నేమ్‌తో ప్రదర్శించిన ఎస్యూవీనే సఫారీ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కంపెనీ తెస్తోంది. కొత్త తరం ఎస్యూవీ వినియోగదారుల కోసం ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీని రూపొందించామని, త్వరలోనే బుకింగ్స్ మొదలు పెడతామని, ఈ నెలలోనే షోరూమ్స్‌కు అందుబాటులోకి తెస్తున్నామని టాటా మోటార్స్ వెల్లడించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా...! ల్యాండ్ రోవర్‌కు చెందిన డీ8 ప్లాట్ఫార్మ్పై క్రయోటెక్ టర్బో–డీజిల్ ఇంజిన్‌తో ఈ కొత్త సఫారీని రూపొందించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం) శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆల్–వీల్ డ్రైవ్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, 8.8 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, జేబీఎల్ స్పీకర్లు....తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రూ.14-20 లక్షల రేంజ్లో ఉన్న ఐదు సీట్ల హారియర్ మోడల్ కన్నా ఈ సఫారీ ఎస్యూవీ ధర ఒకింత ఎక్కువ ఉండొచ్చు. ఎమ్జీ హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, హ్యుందాయ్ క్రెటా ఆధారిత ఎస్‌యూవీలకు కొత్త సఫారీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సఫారీతో కొనసాగింపు..... భారత్‌లో ఎస్యూవీ లైఫ్‌స్టైల్ టాటా సఫారీతోనే మొదలైందని, ఇతర కంపెనీలు అనుసరించాయని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. గత ఇరవైయేళ్లుగా హోదాకు, పనితీరుకు ప్రతీకగా టాటా సఫారీ నిలిచిందని, ఈ వైభవాన్ని కొత్త సఫారీతో కొనసాగిస్తామని వివరించారు. -
హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌లో టాప్-3 కార్లు
ముంబై, సాక్షి: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్‌కు చెందిన కార్లు టాప్-3 జాబితాలో చేరాయి. గత నెలలో అమ్మకాల రీత్యా మారుతీ తయారీ బాలెనో అగ్రస్థానంలో నిలవగా.. హ్యుండాయ్ ఐ 20 రెండో ర్యాంకును పొందింది. ఇక ఇటీవలే మార్కెట్లో విడుదలైన టాటా మోటార్స్ ప్రీమియం కారు ఆల్ట్రోజ్ మూడో ర్యాంకును దక్కించుకుంది. కాగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టయోటా గ్లాంజా, హోండా తయారీ జాజ్, ఫోక్స్‌వేగన్ పోలో సైతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర వివరాలు ఇలా.. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) బాలెనో భళా నవంబర్‌లో మారుతీ తయారీ బాలెనో 17,872 యూనిట్లు విక్రయమయ్యాయి. బాలెనో కారు రూ. 5.64 లక్షలు- 8.96 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో కూడిన 1.2 లీటర్ వీవీటి పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) హ్యుండాయ్ ఐ20 గత నెలలో హ్యుండాయ్ తయారీ ఐ20 మోడల్ 9,096 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐ20 మోడల్ కారు రూ. 6.8 లక్షలు- 11.33 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. మూడు రకాల ఇంజిన్లతో వెలువడుతోంది. 5 స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమ్యాటిక్తో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 6 స్పీడ్ ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ఆటోమ్యాటిక్ ఆప్సన్స్‌తో కూడిన 1 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వెర్షన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా 6 స్పీడ్ ఎంటీతో 1.5 లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ మోడల్ సైతం లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ తయారీ ఆల్ట్రోజ్ కార్లు నవంబర్ నెలలో 6,260 యూనిట్లు విక్రమయ్యాయి. ఆల్ట్రోజ్ మోడల్ కార్లు రూ. 5.44 లక్షలు- 9.09 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తున్నాయి. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 5 స్పీడ్ ఎంటీతో కూడిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోటార్క్ డీజిల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. -
టాటా మోటార్స్ ఉద్యోగులకు షాక్!
సాక్షి, ముంబై: అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. సంస్థ మొత్తం ఉద్యోగులలో సగం మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులని తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. నాలుగేళ్లలో మూడోసారి వీఆర్ఎస్ పథకాన్ని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం. తాజాప్రకటన ప్రకారం ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పనిచేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి వయసు, సంస్థలో వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించునున్నారు. అర్హతగల ఉద్యోగులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (చైనాకు షాక్ : వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు) కాగా గత కొన్ని సంవత్సరాలుగా తన ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడానికి టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. 2017లో మొదట వీఆర్ఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఆ రువాత 2019 నవంబర్‌లో 1,600 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అందించింది. 2019 నుండి ఆటో పరిశ్రమ మందగమనం మధ్య, ఇతర ఆటో మేజర్లైన హీరో మోటోకార్ప్ లిమిటెడ్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఇలాంటి పథకాలను అమలు చేశాయి. 2020, సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 314.5 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ నివేదించింది. అంతకు ముందు ఏడాది కాలంలో కంపెనీ రూ .216.56 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8,437.99 కోట్లు రూపాయలను నష్టపోయింది. ఆటో సంక్షోభానికి తోడు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ పడిపోవడంతో ఆటో సంస్థలు మరింత కుదేలైన సంగతి తెలిసిందే. -
కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా
ముంబై, సాక్షి: దేశీయంగా కార్ల విక్రయాలలో మెజారిటీ వాటాను 5 కంపెనీలు ఆక్రమిస్తున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సమాఖ్య(ఎఫ్ఏడీఏ) తాజాగా పేర్కొంది. దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో 85 శాతం వాటా వీటి సొంతంకాగా.. మరో 22 బ్రాండ్లు మిగిలిన 15 శాతం మార్కెట్లను పంచుకుంటున్నట్లు తెలియజేసింది. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన వాటాను గెలుచుకున్నట్లు పేర్కొంది. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) పెద్ద మార్కెట్ గత నవంబర్ నుంచి చూస్తే ఈ నవంబర్ వరకూ టాప్-5 కంపెనీలు తమ మార్కెట్ వాటాను 4.5 శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం నుంచి 85 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. సుప్రసిద్ధ గ్లోబల్ బ్రాండ్లు రేనాల్ట్, ఫోర్డ్, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ తదితరాలు పోటీ పడుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు వేరని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్.. ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆటోమోటివ్ మార్కెట్ కాగా.. చైనా తొలి స్థానాన్ని ఆక్రమిస్తోంది. చైనాలో టాప్-5 కార్ల కంపెనీల వాటా 40 శాతమే. జర్మనీలో సైతం 50 శాతమేకాగా.. యూఎస్‌లో టాప్-5 కంపెనీలు 68 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే జపాన్‌లో కూడా టాప్-5 కంపెనీల వాటా అత్యధికంగా 81 శాతంగా నమోదవుతుండటం గమనార్హం! జపాన్‌లో మార్కెట్ లీటర్లు జపనీస్ కంపెనీలేకావడం విశేషం! పలు దేశాలలో ప్రాధాన్యత కలిగిన టయోటా వాటా దేశీయంగా 3 శాతానికి పరిమితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.(డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) మారుతీ జోరు చౌక ధరల మోడళ్లు, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు, భారీ నెట్వర్క్ వంటి అంశాల కారణంగా మారుతీ సుజుకీ కార్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు ఆటో నిపుణులు చెబుతున్నారు. దీంతో మారుతీ 50 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో హ్యుండాయ్ మార్కెట్ వాటా స్వల్ప క్షీణతతో 17.74 శాతం నుంచి 16.21 శాతానికి చేరింది. ఇదే కాలంలో టాటా మోటార్స్ వాటా 4.84 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఇక కియా మోటార్స్ వాటా 3.78 శాతం నుంచి 6.28 శాతానికి జంప్‌చేసింది. ఆల్ట్రోజ్.. థార్.. పండుగల సీజన్, కొత్త మోడళ్ల విడుదల, లాయల్టీ బెనిఫిట్స్, చౌక వడ్డీ రేట్లు తదితర పలు అంశాలు కార్ల విక్రయాలపై ప్రభావాన్ని చూపుతుంటాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. టాటా మోటార్స్‌కు ఆల్ట్రోజ్, ఎస్యూవీ నెక్సాన్ మోడళ్లు మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఎంఅండ్ఎం వాటా 6.78 శాతం నుంచి 5.48 శాతానికి నీరసించింది. కంపెనీ విడుదల చేసిన థార్ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ నెలకొన్నప్పటికీ తగిన స్థాయిలో వాహనాల తయారీ, సరఫరా చేయలేకపోవడం ప్రభావం చూపినట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. -
పండుగ ఆఫర్, టాటా మోటర్స్‌పై భారీ తగ్గింపు
దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటర్స్ తన బీఎస్6 పాపులర్ మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 2020 లో కొన్ని సెలక్ట్ మోడళ్లపై రూ.65,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు టాటామోటర్స్ అధికారికంగా ప్రకటించింది. ఆఫర్లు ప్రకటించిన కార్లలో టియాగో హ్యాచ్‌బ్యాక్, టైగర్ సెడాన్, నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, హారియర్ ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఈ కార్లపై నవంబర్ 1, 2020 నుంచి డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ఈ ఆఫర్లు 2020 నవంబర్ 30 వరకు చెల్లుతాయి. ఈ ప్రయోజనాలు వినియోగదారుల పథకం, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ ఆఫర్లను కలిగి ఉంటాయి, ఇవి అక్టోబర్ 2020 వరకు చెల్లుతాయి. హారియర్ ఎస్యూవీ వాహనంపై గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును అందించనున్నారు. అదేవిధంగా ఈ నెలలో టాటా ఆల్ట్రోజ్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ నెల . ఈ నెల ఆఫర్లలో కన్స్యూమర్ స్కీమ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ , కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో తెలిపిన ప్రకారం టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ పై మొత్తం రూ. 25,000వరకు ప్రయోజనం పొందవచ్చు. అదేవిధంగా టైగర్ సెడాన్‌పై గరిష్టంగా రూ. 30,000 వరకు లాభం చేకూరనుంది. ఇందులో రూ. 15,000 వరకు కన్స్యూమర్ స్కీం ద్వారా, మిగిలిన రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పొందవచ్చు. చదవండి: ఈ చిన్న షేర్లు మార్కెట్లనే మించాయ్ -
టాటా మోటార్స్- హెచ్డీఎఫ్సీ జూమ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 321 పాయింట్లు ఎగసి 39,295కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 11,587 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలు అటు ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఇటు ఆటో రంగ బ్లూచిప్ కంపెనీ టాటా మోటార్స్ కౌంటర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా మోటార్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్రిటిష్ అనుబంధ విభాగం జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆశావహ పనితీరు చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 53 శాతం ఎగసి 1,13,569 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది. అంతకుముందు క్వార్టర్లో 74,067 యూనిట్లు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా మాత్రమే రిటైల్ స్టోర్లు తెరచినట్లు తెలియజేసింది. పలు ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 144 వద్ద ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో వ్యక్తిగత బిజినెస్‌లో పటిష్ట రికవరీని సాధించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా పేర్కొంది. వ్యక్తిగత రుణాల జారీ 95 శాతం రికవరీని సాధించినట్లు తెలియజేసింది. ఈ కాలంలో రుణ దరఖాస్తులు 21 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. వీటిలో వ్యక్తిగత రుణ దరఖాస్తులు 31 శాతం పెరిగినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది. -
టాటా కార్లపై పండుగ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్ తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రానున్న ఫెస్టివ్ సీజన్ కారణంగా కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా బీఎస్-6 ఇంజీన్ఎస్యూవీ టాటా హ్యారియర్ కారుపై 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. బీఎస్6 కార్లకు మాత్రమే అందుబాటులోఉంచిన సంస్థ నెక్సాన్, టైగోర్, టియాగో, హారియర్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో డిస్కౌంట్లను ప్రకటించలేదు. టాటా హ్యారియర్ :80 వేల దాకా తగ్గింపు 25 వేల క్యాష్ డిస్కౌంట్, 15 వేల రూపాయల అదనపు కార్పోరేట్ ఆఫర్, 40 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది. టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మినహా అన్నిమోడళ్లకు తగ్గింపు ధరలను అందిస్తోంది. హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -స్పీడ్ ఆటోమేటిక్ , మాన్యువల్ ట్రాన్మిషన్లలో లభ్యం. ఎస్యూవీ ధర 13.84 లక్షలు బీఎస్-6 టాటా టియాగో 32,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. కన్స్యూమర్ స్కీమ్ 15వేలు, 7 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, 10 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి మొత్తం ప్రయోజనం 32 వేలు. అయితే కార్పొరేట్ ఆఫర్ టాటా గ్రూప్ , టీఎంఎల్ ఉద్యోగులు, టాటా ట్రస్ట్ ఇండియా, టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రెఫరల్, టాప్ 10 , టాప్ 20 కార్పొరేట్స్ తోపాటు, కోవిడ్-19 యోధులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది. బీఎస్- 6 టాటా నెక్సాన్ టాటా మోటార్స్ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అయితే డీజిల్ వేరియంట్లో మాత్రమే, డీజిల్ డెరివేటివ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఆఫర్లు ఉన్నప్పటికీ చాలా స్వల్పం. -
టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ ప్రీమియం ఫీచర్లు,ఆధునిక సాంకేతికలతో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లు, సరసమైన ధరలతో నెక్సాన్ ను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో విడుదల చేశామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇది నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజీన్ ఆప్షన్లలో, ఎంటీ, ఎఎంటీ వేరియంట్లలో లభ్యం. టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) 8.36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరకు అందిస్తోంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హర్మన్ అండ్ మల్టీ డ్రైవ్ మోడ్ల కనెక్ట్నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (ఎకో, సిటీ) లాంటి అత్యాధునిక స్పెసిషికేషన్స్ జోడించింది. నెక్సాన్ మోడల్ కారు టాటా మోటార్స్‌కు గర్వకారణమనీ, మారుతున్న కస్టమర్ల డిమాండ్లకనుగుణంగా ఉత్పత్తులను మరింత తాజాగా ఉంచుతామన్న హామీని కొనసాగిస్తూ, నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) ప్రారంభిండం సంతోషంగా ఉందని టాటా మోటార్స్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్, వివేక్ శ్రీవత్స తెలిపారు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యుత్తమ లక్షణాలతో, ఆకర్షణీయమైన ధరలకు ప్రీమియం డ్రైవింగ్ ఆనందాన్నిచ్చేలా అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇంజీన్లు: పెట్రోల్ వెర్షన్లు 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి,. ఇది 118 బిహెచ్పి, 17.33టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజీన్ 108 బిహెచ్పీ పవర్ ను అందిస్తుంది. ధరలు నెక్సాన్ ఎక్స్ఎం (ఎస్) పెట్రోల్ ధర రూ .8.36 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎం (ఎస్) డీజిల్ ధర రూ .9.70 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎంఎ (ఎస్) ఏఎంటీ పెట్రోల్ ధర రూ .8.96 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎంఎ (ఎస్) ఏఎంటి డీజిల్ ధర రూ .10.30 లక్షలు -
Q4 ఎఫెక్ట్- కేన్ ఫిన్ జూమ్- టామో డౌన్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల ఆధారంగా గృహ రుణ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో భారీ నష్టాలు ప్రకటించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్ లాభాలతో సందడి చేస్తుంటే.. టాటా మోటార్స్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. కేన్ ఫిన్ హోమ్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కేన్ ఫిన్ హోమ్స్ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 91 కోట్లకు చేరింది. ఇందుకు వడ్డీ ఆదాయం సహకరించగా.. నికర వడ్డీ ఆదాయం 35 శాతం ఎగసి రూ. 186 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.29 శాతం నుంచి 3.52 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు 0.8 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గినట్లు కేన్ ఫిన్ హోమ్స్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో కేన్ ఫిన్ హోమ్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం దూసుకెళ్లి రూ. 327 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 339 వరకూ ఎగసింది. టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ రూ. 9,894 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ.1,117 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్లో నికర అమ్మకాలు 28 శాతం క్షీణించి రూ. 61,949 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 9313 కోట్లమేర పన్నుకు ముందు నష్టం నమోదైంది. అంతక్రితం క్యూ4లో రూ. 1265 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.25 శాతం పతనమై రూ. 96 వద్ద ట్రేడవుతోంది. -
10శాతం లాభపడ్డ టాటామోటర్స్ షేరు
టాటామోటర్స్ కంపెనీ షేరు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి 10శాతానికి పైగా లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో రూ.100.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా ఈ షేరుకు డిమాండ్ నెలకొంది. ఒక దశలో షేరు 10.50 పైగా లాభపడి రూ.108.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1గంటకు షేరు మునుపటి ముగింపు(రూ.98.50)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.108.35 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.63.60, రూ.201.80గా ఉన్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల పెరిగి 34180 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10112.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్
సాక్షి,ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించి విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. రూ. 850 కోట్లుగా వుంటుందని ఎనలిస్టులు అంచనా చేశారు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 26,992 కోట్ల రికార్డు నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం 6.82 శాతం క్షీణించి రూ. 71,676.07 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 76,916 కోట్లు. గురువారం టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. స్వతంత్ర ప్రాతిపదికన కంపెనీ 1,039.51 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో 617.62 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. స్వతంత్ర మొత్తం ఆదాయం, 10,842.91 కోట్లుగా ఉంది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో, 6,207.67 కోట్లు. మూడవ త్రైమాసికంలో, ఎగుమతులతో సహా కంపెనీ స్వతంత్ర హోల్‌సేల్స్ 24.6 శాతం క్షీణించి 1,29,185 యూనిట్లకు చేరుకున్నాయి. చైనాలో అమ్మకాలు బాగా పుంజుకోవడంతో బ్రిటీష్ ఆధారిత సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాభాలు 372 మిలియన్ల పౌండ్లకు, ఆదాయం 6.4 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎవోక్ భారీ డిమాండ్ కూడా లాభాలను ప్రభావితం చేసింది. అలాగే గ్లోబల్‌గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన హవా కొనసాగిస్తుండగా, మార్కెట్ క్షీణత, దేశీయ మార్కెట్లోబీఎస్- 6 నిబంధనలు, కంపెనీ పనితీరును ప్రభావితం చేసిందని టాటా మోటార్స్ తెలిపింది. భారతదేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఆటో పరిశ్రమ ప్రభావం కొనసాగుతోంది.మార్కెట్ షేర్లు పెరుగుతున్నప్పటికీ, లాభదాయకత ప్రభావితమైందని కంపెనీ తెలిపింది. -
టాటా ‘నెక్సాన్ ఈవీ’ లాంచ్
-
టాటా ‘నెక్సాన్ ఈవీ’ లాంచ్
సాక్షి,ముంబై: విద్యుత్ వాహనాలకు పెరగనున్న ఆదరణ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ తన పాపులర్ మోడల్ నెక్సాన్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఈ వాహనాల ఉత్పత్తి విషయంలో మరో అడుగు ముందుకేసిన టాటామోటార్స్ నెక్సాన్ ఈవీ పేరుతో మంగళవారం లాంచ్ చేసింది. టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ జిప్ట్రాన్‌తో దీన్ని రూపొందించింది. ఎక్స్జెడ్ ప్లస్, లగ్జరీ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ ఎం అనే మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రోజు నుండి 22 నగరాల్లోని 60 డీలర్ అవుట్లెట్లలో నెక్సాన్ ఈవీ కార్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ బుకింగ్ గత ఏడాది డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.13,99,000 గా ఉండగా, హైఎండ్ మోడల్ ధర రూ .15,99,000 వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఫాస్ట్ డిసి ఛార్జర్లో ప్లగ్ చేసినప్పుడు, నెక్సాన్ ఈవీ 60 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని 60 నిమిషాల్లో భర్తీ చేస్తుంది. అలాగే 35 మొబైల్ యాప్ బేస్డ్ కనెక్ట్ ఫీచర్లను కూడా నెక్సాన ఈవీ అందిస్తుంది. ఎనిమిది సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీతో లభించనుంది. మరో నాలుగు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను, రెండు ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ సెడాన్లను వచ్చే 24 నెలల్లో విడుదల చేయబోతున్నట్లు టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం అత్యవసరమని అన్నారు. దేశంలో త్వరలోనే విద్యుత్ వాహనానలకు ఆదరణ పెరగనుందని టాటా మోటార్స్ సీఎండీ గుంటెర్ బుట్షేక్ వ్యాఖ్యానించారు. -
ధంతేరస్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: ధంతేరస్ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఇది మంచి సమయం త్వరపడండి. ధనత్రయోదశి సందర్భంగా ప్రముఖకార్ల కంపెనీలుపండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవటానికి, అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. హోండా, మారుతి సుజికి, టాటా మోటార్స్ తమ టాప్ మోడల్ కార్లపై వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్జేంజ్ బోనస్‌తో పాటు భారీ ఆఫర్లను అందిస్తోంది. హోండా ఆఫర్లు హోండా అమేజ్, జాజ్, సిటీ ఇలా ఏడు మోడల్స్కార్లపై ధరలను తగ్గించింది. రూ.9.78 లక్షల కారుపై 42వేల దాకా డిస్కౌంట్.రూ. 12వేల రూపాయల విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ (4 వ & 5 వ సంవత్సరం). రూ .30,000 విలువైన కార్ల మార్పిడిపై అదనపు తగ్గింపు. రూ .16 వేల విలువైన హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (మూడేళ్లు) ఉచితం. హోండా జాజ్‌లో రూ .25 వేల వరకు డిస్కౌంట్ రూ .25 వేల విలువైన కార్ ఎక్స్ఛేంజ్లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. హోండా జాజ్ అసలు ధర రూ .9.41 లక్షలు. హోండా సిటీ: రూ. 32,000 ఆఫర్, కార్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ .30,000 అదనపు తగ్గింపు. అసలు ధరరూ .14.16 లక్షలు హోండా బిఆర్-విలో, కంపెనీ మొత్తం 1,10,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది, ఇందులో నగదు తగ్గింపు (రూ .33,500), కార్ ఎక్స్ఛేంజ్ (రూ .50,000) ఇతరాలు (రూ .26,500) ఉన్నాయి. హోండా సివిక్ 250,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత, కారు కొత్త ధర 17.94 లక్షలు. ఈ కారు అసలు ధర. రూ .22.35 లక్షల కారు. హోండా సివిక్ విత్ పెట్రోల్ ఇంజన్ (విసివిటి) రూ .200,000 వరకు నగదు తగ్గింపుతో లభిస్తుంది. హోండా సివిక్ (విఎక్స్ సివిటి, జెడ్ఎక్స్ సివిటి) మోడళ్లలో రూ .75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి : మారుతి సుజుకి తన కార్లపై అధిక డిస్కౌంట్లను అందిస్తోంది. విటారా బ్రెజ్జా (డీజిల్) రూ .45,000 నగదు తగ్గింపు, 5 సంవత్సరాల వారంటీ రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .10వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. మొత్తం రూ .96,100 వరకు తగ్గింపు. మారుతి సుజుకి డిజైర్ (డీజిల్) : రూ .83,900 వరకు ఆఫర్ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్ వెర్షన్ అన్ని వేరియంట్లలో) 55,000 రూపాయల వరకు ఆఫర్. దీంతోపాటు చాలా సంవత్సరాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్, పెట్రోల్ వేరియంట్‌కు రూ .50 వేలు, డీజిల్ వేరియంట్‌కు రూ .77,600 వరకు, డీజిల్ వెర్షన్ కోసం కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, ఆల్టో కె 10, సెలెరియోలపై వరుసగా రూ .60 వేలు రూ. 55వేలు, రూ .60వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో ఎక్స్ఛేంజ్ , కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. టాటా మోటార్స్ కొత్త టాటా కారు కోసం తమ పాత కార్లను మార్పిడి చేసుకోవాలనుకునే వారికి డిస్కౌంట్లను అందిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం కంపెనీ నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. టాటా హెక్సా కొనుగోలుపై రూ .1.65 లక్షల వరకు ఆఫర్. టాటా నెక్సాన్ రూ .87,000 వరకు తగ్గింపు టాటా టియాగో , టాటా టియాగో ఎన్ఆర్జి రెండూ రూ .70 వేలదాకా ఆఫర్స్ . టాటా టైగర్‌పై 1.17 లక్షల రూపాయల తగ్గింపు టాటా హారియర్ 65,000 రూపాయల వరకు ఆఫర్ -
కొత్త ‘టిగోర్ ఈవీ’ వచ్చింది...
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)లో అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ నూతన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ కారులో 21.5 కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీని అమర్చింది. దీంతో ఒక్కసారి చార్జింగ్‌తో 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎం ప్లస్, ఎక్స్‌టీ ప్లస్ పేర్లతో మొత్తం మూడు వేరియంట్లలో ఈ నూతన కారు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రాయితీల అనంతరం ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలని కంపెనీ ప్రకటించింది. -
కార్లపై భారీ ఆఫర్లు, రూ. 1.5 లక్షల డిస్కౌంట్
సాక్షి, ముంబై: దేశీ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహన ప్రియులకు మంచి వార్త అందించింది. అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. టాటా మోటార్స్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు హారియర్‌తో పాటు వివిధ కార్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. నెక్సన్, హెక్సా, టియాగో, టియాగో ఎన్ఆర్జీ, టిగోర్, హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5 లక్షల భారీ తగ్గింపు అందిస్తోంది. కార్ల పండుగ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో పాత, కొత్త వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు అందివ్వనుంది. ఎక్స్చేంజ్ ద్వారా తమ కార్లు కొనుగోలు చేసేవారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కస్టమర్లకు ఆర్థిక మద్దతు అందించేందుకు 100శాతం ఆన్ రోడ్ ఫైనాన్స్, లోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్నికూడా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. టాటా మోటార్స్ ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్ వివిధ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు టాటా హెక్సా మోడల్‌పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు టాటా నెక్సన్ కారుపై రూ.85,000 వరకు డిస్కౌంట్ టాటా టియాగో మోడల్‌పై రూ.70,000 తగ్గింపు ఆఫర్ టాటా టియాగో ఎన్ఆర్జీ కారుపై రూ.70,000 వరకు డిస్కౌంట్ టాటా టిగోర్ మోడల్‌పై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం హారియర్ కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు ఓనం , గణేష్ చతుర్థి సందర్భంగా కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించిందనీ టాటా మోటార్స్ సేల్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ బార్మాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఉత్సాహం నింపేందుకు, 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ప్రచారం చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో భారీ ప్రోత్సాహం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కస్టమర్లు, భాగస్వాములందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. -
మారుతికి షాక్ : టాటా ఓకే
మార్చి మాసంలో దేశీయ కార్ల దిగ్గజాలకు మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చి నెల విక్రయాలు షాకివ్వగా, ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ వార్షిక విక్రయాల్లో వృద్ధిని సాధించింది. మార్చి నెల విక్రయాలు ఎనలిస్టుల అంచనాలనుతాకడంతో పాటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 16శాతం పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. అయితే మార్చి నెలలో వాహన విక్రయాలు నామమాత్ర వెనకడుగుతో 68,709 యూనిట్లుగా నమోదయ్యాయి. గత మాసంతో పోలిస్తే 1శాతం తక్కువజ విదేశీ రీసెర్చ్ సంస్థ నోమురా అంచనాలను కంపెనీ అందుకుంది. దీంతో ఇవాల్టి మార్కెట్లో టాటా మోటార్స్ షేరు 8శాతం లాభపడి టాప్ విన్నర్‌గా నిలిచింది. మరోవైపు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చినెల విక్రయాలు షాకిచ్చాయి. ఈ నెలలో విక్రయాలు1,47,613గా నమోదయ్యాయి. గతేడాది ఇదే మాసంలో1,48582 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. విదేశీ విక్రయాల్లో దాదాపు 13శాతం తగ్గి 10,463 యూనిట్లుగా మారింది. గత ఏడాది మార్చిలో 12,016 యూనిట్లను విక్రయించింది అలాగే 2018-19 సంవత్సరానికిగాను మారుతీ విక్రయాలు వరుసగా ఏడవసారి పుంజుకుని 4.7శాతం పెరిగి 18,62,449కు చేరాయి. అంతకు ముందు సంవత్సరం 17,79,574గా నమోదైయ్యాయి. -
టాటా మోటార్స్‌కు ఫలితాల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయి నష్టాలను నమోదు చేయడంతో టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం కావడంతో దాదాపు 30శాతం కుప్పకూలింది. 1993 తరువాత ఒక రోజులో ఇంత భారీ అమ్మకాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో శుక్రవారం ఈ స్థాయిలో పతనంకావండం ఇదే తొలిసారి. అయితే అనంతరం 52 వారాల కనిష్టంనుంచి తేరుకుంది. ఇదే బాటలో టాటా మోటార్స్ డీవీఆర్ సైతం ఏడాది కనిష్టానికి చేరింది. క్యూ3 ఫలితాలు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టాటా మోటార్స్ రూ. 26,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 1077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్ తెలిపింది . నిర్వహణ లాభం 20 శాతం క్షీణించి రూ. 6381 కోట్లను తాకింది. జేఎల్ఆర్ మార్జిన్లు 2.6 శాతం బలహీనపడి 8.3 శాతంగా నమోదయ్యాయి. లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్కు సంబంధించి రూ. 27,838 కోట్లను రైటాఫ్ చేయడంతో భారీ నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. చైనా తదితర దేశాలలో జాగ్వార్, ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) వాహన అమ్మకాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు తెలిపింది. -
#మీటూ: టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పైత్యం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మీడియా రంగంలో మొదలైన మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్నిరంగాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. మీటూ ఉద్యమానికి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమ అనుభవాలను, క్షోభను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైంగిక వేధింపుల వేటగాళ్ల బారిన పడి విలవిల్లాడిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. వారు ధైర్యంగా ముందుకు వస్తున్న తీరు ప్రశంసనీయం. తాజాగా టాటా మోటార్స్‌లో వెలుగు చూసిన వేధింపుల పర్వంతో కార్పొరేట్ రంగాన్ని కూడా మీటూ సెగ తాకినట్టయింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఉదంతాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు సంధ్యామీనన్ మరో బాధితురాలి గోడును ట్విటర్ వేదికగా బయటపెట్టారు. టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేష్ రంగరాజన్ వక్రబుద్ధిని బాధితురాలు అందించిన ట్విటర్ సమాచారం ఆధారంగా బహిర్గతం చేశారు. ఆ స్క్రీన్ల షాట్లను ట్విటర్లో షేర్ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్ అతగాడిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్ కింద ఇంటికి పంపింది. ప్రతీ ఒక్కరికీ గౌరవనీయమైన సురక్షితమైన పనిపరిస్థితులను కల్పించేందుకు తామెపుడూ కృషి చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్‌పై తగిన చర్య తీసుకుంటామని వెల్లడించింది. I'm just so sad that young women still go through this every day. pic.twitter.com/rlTIt9VlP5 — Sandhya Menon (@TheRestlessQuil) October 11, 2018 In light of the enquiry by ICC, Suresh Rangarajan, has been asked to proceed on leave in order to allow for an objective enquiry to be completed as swiftly as possible. — Tata Motors (@TataMotors) October 11, 2018 -
స్టయిలిష్‌గా టాటా కొత్త టైగోర్
సాక్షి,న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా సరికొత్త కాంపాక్ట్ సెడాన్ న్యూలుక్‌తో రీలాంచ్ చేసింది. దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని టైగోర్ ఫేస్‌లిప్ట్‌ను లాంచ్ చేసింది. లుక్స్, ఫీచర్స్, డిజైన్‌లో మార్పులు చేసి స్టయిలిష్లుక్లో కొత్త టైగోర్ను విడుదల చేసింది. 15 అంగుళాల డ్యుయల్ టోన్ అల్లోయ్ వీల్స్, క్రిస్టల్ ఎ ల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు, ఇంటీరియర్ లుక్స్‌లో కూడా అప్డేట్ చేసింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల ఇన్పోటేన్మెంట్ టచ్ స్క్రీన్ విత్, 4 స్పీకర్లు, 4 ట్వీటర్స్ను జోడించింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఆరు రంగుల్లో ఇది లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కార్ల ధరను 5.20-6.65 లక్షల రూపాయిలు మధ్య నిర్ణయించింది. అలాగే డీజిల్ వెర్షన్ కార్ల ధరలను రూ.6.09 -7.38లక్షలుగా ఉంచింది. -
జెఎల్ఆర్ దెబ్బ: టాటా మోటార్స్‌కు భారీ నష్టాలు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ క్యూ1 ఫలితాల్లో నిరాశపర్చింది. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అనూహ్య నష్టాలను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలకు ఎక్కడా అందకుండా తీవ్ర నష్టాలను ప్రకటించింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇది అత్యంత ఘోరమైనదని ఎనలిస్టులు చెప్పారు . దాని లగ్జరీ కారు యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ నష్టాలు సంస్థ ఫలితాలను దెబ్బతీసినట్టు పేర్కొన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం 1,902.4 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,199 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. డిసెంబరు 2009 నాటి 2,599 కోట్ల రూపాయల నష్టం తరువాత ఇదే అతి పెద్ద నష్టంగి నిలిచింది. క్యూ1లో రూ. 920 కోట్ల లాభాలను విశ్లేషకులు అంచనా వేశారు. రెవెన్యూ 14.7 శాతం పెరిగి రూ .67,081 కోట్లకు చేరుకుంది. కాగా టాటా మోటార్స్ ఆదాయంలో దాదాపు 90శాతం వాటా ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ 210 మిలియన్ల పౌండ్ల నష్టాన్ని చవిచూసింది. ఐరోపా యూరోప్‌లో చైనా దిగుమతి సుంకంతోపాటు,డీజిల్ ఇంజీన్ తదితర సవాళ్లు జెఎల్ ఆర్ లాభాలను ప్రభావితం చేశాయని టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనల ముందు ఆదాయాలు 9 శాతం పెరిగి రూ .5,430 కోట్లకు చేరగా .. మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 40 బేసిస్ పాయింట్లు క్షీణించి 8.1 శాతానికి చేరింది. ఈ ఫలితాలు బుధవారం నాటి మార్కెట్లో టాటా మోటార్స్ షేర్ ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయి. -
టాటా మోటార్స్ వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన వాహనాల తాలూకు అన్ని మోడళ్ల ధరలనూ వచ్చేనెల నుంచి పెంచుతోంది. ఈ పెంపు 2 నుంచి 2.2 శాతం మధ్య ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ వెల్లడించారు. వ్యయ నియంత్రణపై కసరత్తు చేస్తున్నప్పటికీ ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు. రూ.2.36 లక్షల నానో నుంచి రూ.17.89 లక్షల ఎస్యూవీ హెక్సా వరకు వివిధ సెగ్మెంట్లలో టాటా మోటార్స్ కార్లను విక్రయిస్తోంది. గడిచిన 28 నెలలుగా తాము ఇండస్ట్రీని మించి వృద్ధి సాధించామని చెప్పారు. -
కార్లపై ధరలు పెంచిన టాటా మోటార్స్
న్యూఢిల్లీ : దేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్, తన ప్యాసెంజర్ వాహనాల ధరలు పెంచింది. తన అన్ని మోడల్స్‌పై 2.2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆగస్టు నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏప్రిల్‌లో కూడా కంపెనీ 3 శాతం మేర కార్ల ధరలు పెంచింది. ‘ వ్యయాల కోతకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్పుట్ ఖర్చులు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో ఆగస్టు నుంచి మా ప్యాసెంజర్ వాహనాలపై ధరలు పెంచాలని నిర్ణయించాం’ అని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. సుమారు 2 శాతం నుంచి 2.2 శాతం మధ్యలో కంపెనీ ధరలను పెంచుతున్నట్టు పరీక్ తెలిపారు. ఏప్రిల్‌లో కూడా ఇన్పుట్ ఖర్చులు పెరగడంతోనే ధరలను పెంచింది. ఏప్రిల్‌లో ధరలు పెంపు 3 శాతంగా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ చిన్న కారు నానో నుంచి ప్రీమియం ఎస్యూవీ హెక్సా వరకు మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.2.36 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్యలో ఉన్నాయి. అయితే ధరల పెంపు, విక్రయాలపై పడుతుందా? అనే ప్రశ్నను పరీక్ కొట్టిపారేశారు. ఏప్రిల్‌లో ధరలు పెంచినప్పటికీ తమ మోడల్స్‌ను బాగానే విక్రయించామని, ఇదే మాదిరి విక్రయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. గత 28 నెలల నుంచి తాము విక్రయాల్లో మంచి ప్రదర్శనను కనబరుస్తున్నామని, ఈ క్వార్టర్లో ఇండస్ట్రీ 13.1 శాతం వృద్ధి చెందితే, తాము 52 శాతం వృద్ధి సాధించినట్టు పరీక్ పేర్కొన్నారు. -
టిగోర్ తొలి వార్షికోత్సవం, కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తన కొత్త తరం కాంపాక్ట్ సెడాన్ టిగోర్ తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా టాటా మోటార్స్ బుధవారం లాంచ్ చేసింది. టిగోర్ బుజ్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఇది మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్ ఎడిషన్ ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.5.68 లక్షలు కాగ, డీజిల్ వెర్షన్ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎక్స్‌టీ ట్రిమ్ ఆధారితంగా ఈ వార్షికోత్సవ మోడల్ రూపొందింది. ఫైవ్-స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ను ఇది కలిగి ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో కొన్ని అదనపు ఫీచర్లున్నాయి. గ్లాసీ బ్లాక్ పేయింటెడ్ రూఫ్, పియానో బ్లాక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, డ్యూయల్-టోన్ వీల్ కవర్, ఫ్రంట్ గ్రిల్ విత్ కలర్డ్ ఇన్సర్ట్, లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్, ప్రీమియం ఫుల్ ఫ్యాబ్రిక్ సీట్స్ దీనిలో అదనపు ఫీచర్లు. స్టాండర్డ్ టిగోర్ ఎక్స్‌టీ వేరియంట్ కంటే ఇది 12 వేల రూపాయలు అధికం. నేటి నుంచి కంపెనీకి చెందిన అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ టాటా టిగోర్ బుజ్ ఎడిషన్ లభ్యం కానుంది. గతేడాది కంపెనీ లాంచ్ చేసిన టాటా టిగోర్ కంపెనీ కొత్త జనరేషన్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో మార్కెట్లోకి వచ్చింది. 1.2 లీటరు పెట్రోల్, 1.0 లీటరు డీజిల్ ఆప్షన్లను అది కలిగి ఉంది. మల్టి డ్రైవ్ మోడ్స్(ఎకో, సిటీ) రెండింటిన్నీ ఆఫర్ చేస్తుంది. ఆ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్క్ అసిస్ట్ విత్ కెమెరా ఉన్నాయి. టాటా టిగోర్, మారుతీ సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్స్‌సెంట్, ఫోర్డ్ ఆస్పైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వాగన్ అమియోలకు గట్టి పోటీగా ఉంది. -
టాటా మెటార్స్, జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ
సాక్షి, ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కు ఫలితాల షాక్ తగిలింది. ఈక్విటీ మార్కెట్లు సెంచరీ లాభాలతో ఊత్సాహకరంగా సాగుతుండగా, టాటా మోటార్స్ భారీగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది క్యూ4లో నికర లాభాలు 50శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. భారీ అమ్మకాల ఒత్తిడితో టాటా మోటార్స్ కౌంటర్ 7శాతానికి పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది. 52 వారాల కనిష్టం వద్ద ఉంది. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ తాకింది. 6 శాతానికి పైగా పతనమైన జెట్‌ఎయిర్‌వేస్ షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. అటు జెట్ ఎయిర్‌వేస స్టాండ్‌లోన్ ప్రాతిపదికన 1030కోట్ల రూపాయల నష్టాన్నిప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితమైంది. -
మారుతీ, టాటా మోటార్స్ జోరు
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో వాహన సంస్థలు మంచి విక్రయాలను నమోదు చేశాయి. కార్ల మార్కెట్లో లీడర్‌గా ఉన్న మారుతీ ఏకంగా 1,60,598 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 15% వృద్ధి సాధించింది. 2017 ఏడాది మార్చిలో మారుతీ అమ్మకాలు 1,39,763 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయంగా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 1,48,582 గా నమోదయ్యాయి. ఎగుమతుల్లో వృద్ధి 2.1 శాతంగా ఉంది. టాటా మోటార్స్ 35 శాతం వృద్ధి టాటా మోటార్స్ సైతం మార్చి నెలలో విక్రయాల పరంగా 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 69,440 వాహనాలను విక్రయించింది. దేశీయంగా మొత్తం వాహనాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 23 శాతం వృద్ధితో 5,86,639గా నమోదయ్యాయి. మార్చి నెలలో వాణిజ్య వాహనాలు 37 శాతం వృద్ధితో 49,174 యూనిట్లుగా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాలు 31 శాతం పెరిగి 20,266 యూనిట్లు అమ్ముడయ్యాయి. అమ్మకాల్లో ‘హీరో’ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటో అమ్మకాల్లోనూ హీరో అనిపించుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 75 లక్షల వాహనాలను విక్రయించి ఈ మైలురాయిని చేరిన తొలి కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కంపెనీ తమదేనని హీరో మోటో కార్ప్ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016–17)లో అమ్మకాలు 66.6 లక్షలుగా ఉన్నాయి. 2020 నాటికి కోటి వాహనాల విక్రయ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని.. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో 4 కొత్త మోడళ్లు ఎక్స్ట్రీమ్ 200ఆర్, ఎక్స్‌పల్స్, డ్యుయెట్ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్లను ఆవిష్కరించనున్నట్టు పేర్కొంది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల్లో 27 శాతం వృద్ధి ఐచర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ సైతం మార్చి మాసంలో అమ్మకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 76,087 వాహనాలు అమ్ముడుపోయాయి. 2017 మార్చిలో అమ్మకాలు 60,113 యూనిట్లు కావడం గమనార్హం. -
టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు సహా ఇతర వివిధ ఆర్థిక కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన ఈ ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వివ ిధ బాహ్య ఆర్థిక కారకాలు ధరల పెంపునకు ఒత్తిడి చేశాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ చెప్పారు.రూ.2.28లక్షల మొదలయ్యే ప్యాసింజర్ కారు జెన్ ఎక్స్ నానో నుంచి రూ.1742 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రీమియం ఎస్యూవీ హెక్సా వాహనాలను విక్రయిస్తుంది. గత వారం జర్మనీ కార్ మేకర్ ఆడి కార్ల ధరల పెంపును ప్రకటించింది. -
వాణిజ్య రాజధానికి టాటా స్టార్‌బస్సులు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం టాటామోటార్స్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముంబై నగరానికి అందించింది. ఈ బస్సు సర్వీసులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ప్రారంభించారు. ముంబై మెట్రోపాలిటిన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) స్థానిక రవాణాశాఖకు 25 హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను టాటా మోటార్స్ అందజేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీత్ సమక్షంలో వీటిని ఎంఎంఆర్‌డీఏకు అప్పగించింది. దేశీయంగా అభివృద్ధి చెందిన ఈ టాటా-స్టార్‌బస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సులు , గ్లోబల్ డిజైన్ స్టాండర్డ్స్ తో రూపొందించామని టాటా మోటార్స్ వెల్లడించింది. పట్టణ రవాణా కోసం గణనీయమైన సహకారం అందించే దిశగా తక్కువ-ఉద్గార బస్సులను అభివృద్ధి చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని టాటా మోటార్స్ వాణిజ్య వాణిజ్య వాహనాల అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. డ్యూయల్ పవర్ (డీజిల్ మరియు ఎలక్ట్రిక్), లిథియం అయాన్ బ్యాటరీలతో ఇవి పనిచేస్తాయన్నారు. విద్యుదీకరణ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలపై తమకృషి కొనసాగుతుందని, వీటి ప్రోత్సాహానికిగాను ప్రభుత్వం,ఇతర రెగ్యులేటరీ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020లో భాగంగా ఈ హైటెక్ బస్సుల తయారీని చేపట్టారు. కాగా ఈ బస్సు ప్రొడక్షన్ కాస్ట్ 1.7 కోట్లుగా ఉంది. -
ఆ వాహనాల ధరలు ఇక మోతే
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. తన ప్యాసింజర్ వాహనాలను ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది.ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన ఎస్యూవీ నెక్సాన్ సహా పలు వాహనాల ధరలు డిసెంబర్ 31తరువాత పెరగనున్నాయని సంస్థ తెలిపింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఇతరత్రా ఆర్థిక కారణాల వల్ల మేం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2018 జనవరి నుంచి పలు మోడళ్లపై రూ. 25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు చెప్పారు. కాగా ఇటీవల ఇయర్ ఎండింగ్, ఖర్చులు, తదితర కారణాల రీత్యా టాటామోటార్స్, మారుతితో పాటు మరిన్ని ఆటోమొబైల్ సంస్థలు ధరల పెంపునకు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఇప్పటికే టొయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా, స్కోడా, ఇసుజు లాంటివి జనవరి నుంచి తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.