
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు దారులకు షాకిచ్చింది. వేరియంట్‌ను బట్టి టాటా కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్యాసింజర్ వాహనాల కొనుగోలు దారులపై పెరిగిన 0.55 శాతం ధర ప్రభావం పడనుంది.
వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యంగా మారిందని టాటా ప్రకటించింది. కాగా, ఇప్పటికే పలు మార్లు కార్ల ధరల్ని పెంచిన టాటా..మరోసారి ధరల పెంపుపై కొనుగోలు దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని సార్లు పెంచిందంటే!
టాటా మోటార్స్ గతేడాది ఆగస్ట్‌లో వేరియంట్‌ను బట్టి పీవీ(పాసింగ్ వెహికల్స్)ధరల్ని యావరేజ్‌గా 0.8శాతం పెంచింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 19న మరో సారి పీవీ రేంజ్ వెహికల్స్ ధరల్ని 0.9శాతం పెంచింది. తాజాగా ఏప్రిల్ 9న(శనివారం) మరోసారి వెహికల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.