
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)లో అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ నూతన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ కారులో 21.5 కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీని అమర్చింది. దీంతో ఒక్కసారి చార్జింగ్‌తో 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఎక్స్‌ఈ ప్లస్, ఎక్స్‌ఎం ప్లస్, ఎక్స్‌టీ ప్లస్ పేర్లతో మొత్తం మూడు వేరియంట్లలో ఈ నూతన కారు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రాయితీల అనంతరం ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలని కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment