ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. ఇప్పటికే నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన టాటా మోటార్స్ తాజాగా మరో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొనివచ్చేందుకు సిద్ద పడుతుంది. గతంలో తమ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన కారును ఈ సారి ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతోంది. భారతదేశంలో తయారైన మొట్టమొదటి స్వదేశీ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతుంది.
టాటా మోటార్స్ 1991లో ప్రారంభించిన సియెర్రా కారు మంచి సేల్స్ సాధించింది. ఇప్పుడు అదే మోడల్ కారును ఎలక్ట్రిక్ వాహనం రూపంలో మార్కెట్లోకి తిరిగి ప్రవేశ పెట్టాలని చూస్తుంది. టాటా మోటార్స్ టాటా సియెర్రాను స్టాండ్ ఎలోన్ ఎలక్ట్రిక్ కారుగా తిరిగి తీసుకువస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎస్‌యూవీ కారును ఆధునిక టెక్నాలజీతో తిరిగి తీసుకురావడమే కాకుండా టాటా మోటార్స్ ఐకానిక్ నేమ్ ప్లేట్ కాన్సెప్ట్ ను తిరిగి తెస్తుంది. ఈ ఎస్‌యూవీని మొదట ఆటో ఎక్స్ పో 2020లో ఆవిష్కరించారు. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 500 కిమీ వరకు దూసుకెళ్లనుంది. అయితే, ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే విషయంలో స్పష్టత లేదు. దీని ధర రూ.15-25 లక్షల వరకు ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment