దేశంలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాల పరంగా టాటా మోటార్స్ రికార్డు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు అమ్మకాల పెంచుకుంటూ పోతూ దేశీయ ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ 2021 డిసెంబర్ నెలలో 2,000 యూనిట్లకు పైగా నెక్సాన్, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నట్లు మరోసారి రుజువైంది. మరోవైపు, టాటా నెక్సన్ డిసెంబర్ 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యువిగా నిలిచింది.
దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గత ఏడాదిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా 439 శాతం వృద్ధిని సాధించింది. 2020 డిసెంబరులో నెలలో విక్రయించిన 418 యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. 2,000 యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించడం టాటాకు కీలక మైలురాయి. టాటా నవంబర్ 2021లో 1,751 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అంటే, నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ కార్ల(నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ)ను మాత్రమే టాటా విడుదల చేసింది.
భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నెక్సన్ ఈవీ నిలిచింది. టాటా త్వరలో ఆల్ట్రోజ్ ఈవీని ప్రారంభించాలని యోచిస్తోంది. భవిష్యత్తులో ప్రముఖ మైక్రో-ఎస్‌యువి పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తీసుకొనిరావలని చూస్తుంది. "ఎలక్ట్రిక్ వాహనల అమ్మకాలు ఎఫ్ వై22లో 10,000 యూనిట్లను తాకాయి. డిసెంబర్ 2021లో మొదటిసారిగా 2,000 నెలవారీ అమ్మకాల మైలురాయిని అధిగమించింది" అని పివిబియు అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment