
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ముంబైకి చెందిన ఎవరెస్ట్ ఫ్లీట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 5,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరెస్ట్‌కు సరఫరా చేయనుంది.
తొలి విడతగా 100 కార్లను అందించినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. దేశంలో ఈవీల వాడకం పెరిగేందుకు ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ తెలిపింది. ఎక్స్‌ప్రెస్–టి సెడాన్ శ్రేణిలో 213 కిలోమీటర్లు, 165 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్లు ఉన్నాయి.
చదవండి: Flipkart Big Saving Days Sale: ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!