ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టియాగో కొత్త వర్షన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ హ్యచ్‌బ్యాక్ కార్లలో భాగంగా కొత్త టియాగో ఎక్స్‌టీ(ఓ) వేరియంట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5. 48 లక్షలుగా నిర్ణయించారు. కొత్త ఎక్స్‌టీ(ఓ), ట్రిమ్ బేస్ ఎక్స్ ఈ, మిడ్ ఎక్స్‌టీ టియాగో కార్ల శ్రేణిలో నిలవనుంది.
కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ ధర టియాగో ఎక్స్‌టి ట్రిమ్ కంటే కేవలం రూ .15,000 తక్కువ. ఎక్స్‌ఇ ట్రిమ్ కంటే రూ .47,900 ఎక్కువ. ఎక్స్‌ఇ ట్రిమ్‌తో పోల్చినప్పుడు, ఎక్స్‌టీ(ఓ) 14-అంగుళాల స్టీల్ రిమ్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లతో ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్‌తో పాటు(ఓఆర్‌వీఎమ్)తో పాటు వీల్ క్యాప్స్‌ను అందిస్తోంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే ... స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఐఆర్‌విఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికలి అడ్జస్ట్ చేయగల ఓఆర్‌వీఎమ్‌లు, నాలుగు స్పీకర్లు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇంజన్ 84 బిహెచ్‌పి సామర్ధ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బ్యాక్స్ సిస్టమ్‌ను కారులో అమర్చారు.
చదవండి: కరోనా కట్టడిలో టాటా గ్రూపు
Comments
Please login to add a commentAdd a comment