Tata Nexon Crosses 4 Lakh Sales Milestone, New XZ+ (L) Variant Launched - Sakshi
Sakshi News home page

Tata Nexon:సేల్స్‌లో అదరహో! కొత్త వేరియంట్‌ కూడా వచ్చేసింది

Published Wed, Sep 21 2022 2:51 PM | Last Updated on Wed, Sep 21 2022 4:26 PM

Tata Nexon Crosses 4 Lakh Sales Milestone new Variant Launched - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్‌ టాటా నెక్సాన్‌ కొత్త వేరియంట్‌నులాంచ్‌ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్‌+(ఎల్‌) వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్‌ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది.

ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్‌ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్‌

టాటా మోటార్స్ పూణేలోని రంజన్‌గావ్  ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది.  దీనికి గుర్తుగా  దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్‌+(ఎల్‌) వేరియంట్‌ను విడుదల చేసింది. పెట్రోల్,  డీజిల్  వెర్షన్‌లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). 

ఇది చదవండి: Axis Bank: యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌

టాటా మోటార్స్  3 లక్షల ఎస్‌యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్‌ను టచ్‌ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్‌. (యూట్యూబ్‌ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం)

ఇంజన్‌, ఫీచర్లు
1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక  ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి  ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్‌లో కూడా  లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్  సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement