Nexon
-
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజంపోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఏడేళ్లలో 7 లక్షలు.. ఇండియన్ కార్ ఘనత!
టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2017లో భారత్‌లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అమ్మకాల మార్కును అధిగమించడానికి కేవలం ఏడేళ్లు పట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని టాటా మోటార్స్ నెక్సాన్‌పై రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో వంటి వాటిని అధిగమించి, టాటా నెక్సాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1,71,697 యూనిట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,72,139 యూనిట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో 1,24,130 యూనిట్లతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. అయితే టాటా నెక్సాన్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ రెండు నెలల్లో 11వ స్థానానికే పరిమితమైంది.నెక్సాన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో రెవోట్రాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్, 170 ఎన్ఎమ్), రెవోటార్క్ 1.5-లీటర్ డీజిల్ (115 పీఎస్, 260 ఎన్ఎమ్) రెండు ఐసీఈ ఎంపికలు ఉన్నాయి. ఇక ఈవీ వెర్షన్లో 129 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో మీడియం రేంజ్ (ఎంఆర్), 145 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంఆర్ వెర్షన్ రేంజ్ 325 కిలోమీటర్లు, ఎల్ఆర్ వెర్షన్ రేంజ్ 465 కిలోమీటర్లు.నెక్సాన్ ఐసీఈ, ఈవీ వర్షన్లు రెండూ సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. నెక్సాన్ ఐసీఈకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండగా, నెక్సాన్ ఈవీకి భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇక ధర విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఐసీఈ రూ .8 లక్షల నుంచి రూ .15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, ఈవీ రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. -
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్‌ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్
Tata Nexon EV and Tigor EV: మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా వివిధ కార్ల తయారీదారుల నుండి కార్లపై ప్రయోజనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీలపై 80వేల దాకా తగ్గింపు లభిస్తోంది. టిగోర్ ఈవీ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టిగోర్ ఈవీ. టాటా మోటార్స్ దీని మీద రూ. 80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు,ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉండవచ్చు. దీని ధర రూ. 12.49-13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. నెక్సాన్ ఈవీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ. టాటా మోటార్స్ దీనిని వివిధ బ్యాటరీ పరిమాణాలతో ప్రైమ్ , మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. మాక్స్ , ప్రైమ్ వేరియంట్లపై రూ. 61,000 56,000 తగ్గించింది. వీటి ధర రూ. 14.49-17.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. -
అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!
Tata Nexon EV Sales: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో 'నెక్సాన్ ఈవీ' (Nexon EV) లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలను పొందుతూ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా అరుదైన ఒక కొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి మూడు సంవత్సరాల సమయంలో ఏకంగా 50,000 యూనిట్ల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మార్కెట్లో నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 14.49 లక్షలు, రూ. 19.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ , ఇండియా) ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ అనేది 30.2 కిలోవాట్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 312 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. కాగా ఈవీ మ్యాక్ 40.5kWh బ్యాటరీని కలిగి 453 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి రెండూ ఐపి67 రేటింగ్ పొందుతాయి. అదే సమయంలో ఇవి 3.3kW లేదా 7.2kW ఛార్జర్‌తో లభిస్తాయి. (ఇదీ చదవండి: స్విట్జర్లాండ్‌లో ఖరీదైన విల్లా కొన్న ఇండియన్ ఫ్యామిలీ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!) ఈవీ ప్రైమ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 10-80 శాతం, ఈవీ మ్యాక్స్ 50 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 56 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్యువి400 ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. Together, #NexonEV50kCommunity is forging a new path, one that's powered by electric dreams and a passion for change. Join us as we continue to drive towards a greener, cleaner, and more exhilarating future. Cheers to 50,000 and beyond!#50kCommunity #TATAMotors #TATA #NexonEV pic.twitter.com/KHZIKB8J9F — Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) June 27, 2023 -
10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ దేశంలోని మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన సరికొత్త అప్‌గ్రేడ్ చేసిన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సన్ ఈవీ మ్యాక్స్ శ్రేణిలో ఎక్స్‌జడ్ ప్లస్ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో ఎక్స్‌జడ్ ప్లస్ 3.3 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్, ఎక్స్‌జడ్ ప్లస్ లక్స్ 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్ వర్షన్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.18.79 లక్షల నుంచి ప్రారంభం. హెచ్డీ డిస్ప్లేతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెచ్డీ రేర్ వ్యూ కెమెరా, ఆరు భాషల్లో వాయిస్ అసిస్ట్, మెరుగైన వాయిస్ కమాండ్ వంటి హంగులు ఉన్నాయి. జిప్ట్రాన్ టెక్నాలజీతో 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. (ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!) 141.04 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 453 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. నెక్సన్ ఈవీ శ్రేణిలో ఇప్పటి వరకు 45,000 పైచిలుకు కార్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ తెలిపింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే..అందులోనూ ఎండాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే భయం ఈ మధ్య కాలంలో కస్టమర్లను పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ కు చెందిన పాపులర్ కారు,అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టా టా నెక్సాన్‌లో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగుతున్న వీడియో వైరల్ కావడం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో కలవరం రేపింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలి పోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. దీనిపై టాటా మోటార్స అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాటా మోటార్స్ అధికారిక ప్రకటన టాటా నెక్సాన్ ఈవీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్లో లెప్ట్ హెడ్‌ల్యాంప్‌ను సరిగ్గా మార్చకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సంబంధిత వర్క్‌షాప్‌లో ఫిట్మెంట్, రిపేర్‌లో లోపాలున్నాయని, హెడ్‌ల్యాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా థర్మల్ సంఘటనకు దారితీసిందని వివరించింది. బాధిత కస్టమర్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్టు తెలిపింది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ, ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతోంది, ICE కార్లు, EVలలో శిక్షణ పొందిన నైపుణ్యం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా, అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్‌షాప్‌లలో మాత్రమే తమవాహనాలకు ఆన్-స్పెక్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్‌లను అమర్చుకోవాలని కస్టమర్లను కోరుతున్నామని విజ్ఞప్తి చేసింది. ఇదే మొదటిసారి కాదు 2022 జూన్‌లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. -
దుమ్మురేపిన నెక్సాన్.. ఉత్పత్తిలో రికార్డు బద్దలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా కార్లలో ఒకటి నెక్సాన్. దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు దీని కున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు. కంపెనీ ఇటీవల నెక్సాన్ ఉత్పత్తిలో ఐదు లక్షల మైలురాయిని చేరుకుంది. 2017 నుంచి సబ్-4-మీటర్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే విజయకేతనం ఎగురవేసింది. నిజానికి 2014 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టాటా నెక్సాన్ 2017లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది మొదట్లో ఏడు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లతో మొదలైంది. 'నెక్సాన్'లో మొదటి ఇంజిన్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ (109 హెచ్‌పి & 170 ఎన్ఎమ్ టార్క్) కాగా, రెండవది 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ రెవోటార్క్ (109 హెచ్‌పి & 260 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభించాయి. 2020లో నెక్సాన్ మార్కెట్లో రీడిజైన్ మోడల్ విడుదలైంది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు జరిగాయి. ఆ తరువాత నెక్సాన్ ఈవీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2020లోనే కంపెనీ రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నెక్సాన్ ఈవీ లాంచ్ చేసింది. ఇది 30.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ సృష్టించింది. ఇక టాటా మోటార్స్ 2022లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విడుదల చేసింది. ఇది దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ అయింది.ఈ అప్డేట్ మోడల్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 453 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధ్రువీకరించారు. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంది. మొత్తానికి టాటా నెక్సాన్ తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను కంపెనీకి తీసుకురావడంలో సహాయపడింది. ఈ మధ్య కాలంలోనే కంపెనీ కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్ వంటి అనేక స్పెషల్ అవతార్లలో కూడా విడుదల చేసి ఉత్పత్తిలో 5 లక్షల మైలురాయిని చేరుకుంది. -
అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2023 మార్చి నెల అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో ఏకంగా 44,044 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ గొప్ప రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నాటికి కంపెనీ 5,38,640 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 45.43 శాతం పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా టాటా మోటార్స్ 3,70,372 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ అతి పెద్ద సంస్థ. గత నెలలో కంపెనీ ఎక్కువగా నెక్సాన్, పంచ్, హారియార్, సఫారీ వంటి కార్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఈ ఎస్‌యూవీల వాటా 66శాతం. మొత్తం అమ్మకాల్లో (44,044 యూనిట్లు) ఎలక్ట్రిక్ వెహికల్స్ (6,509 యూనిట్లు) కూడా ఉన్నాయి. 2022 మార్చితో పోలిస్తే ఈ అమ్మకాలు నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే 2022 మార్చిలో కంపెనీ అమ్మకాలు 42,293 యూనిట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో కంపెనీ వృద్ధి 89 శాతం ఉండటం గమనార్హం. 2022లో ఈవీల అమ్మకాలు 19,668 యూనిట్లు. (ఇదీ చదవండి: మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..) ఇక కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,93,317 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2022లో ఈ అమ్మకాలు 3,22,182 యూనిట్లు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో కూడా 22 శాతం పెరుగుదల ఉంది. ఎగుమతుల విషయంలో కంపెనీ భారీ తగ్గుదలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
టాటా రెడ్ డార్క్ ఎడిషన్స్.. అద్భుతమైన డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్లను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్స్ ఎక్కువ కాస్మెటిక్ అప్డేట్స్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, సేఫ్టీ అప్‌గ్రేడ్స్ పొందుతాయి. నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్: దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్‌లో కూడా లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి.. నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ మాన్యువల్: రూ. 12.35 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్: రూ. 13.70 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ ఆటోమాటిక్: రూ. 13.00 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్: రూ. 14.35 లక్షలు నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్: టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ (ఓ) రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 21.77 లక్షలు, రూ. 24.07 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ లో ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్: ఈ ఎడిషన్ ఆరు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉన్నాయి. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ADAS ఫీచర్స్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ పొందుతుంది. టాటా రెడ్ డార్క్ ఎడిషన్లలో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు, కావున పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండదు. 2023 ఆటో ఎక్స్పో వేదిక మీద సఫారి మరియు హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్లు మాత్రమే కనిపించాయి, అయితే కంపెనీ ఇప్పుడు నెక్సాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చింది. రెడ్ డార్క్ ఎడిషన్ కొనుగోలుపైన 3 సంవత్సరాల/1,00,000కిమీ వారంటీ పొందవచ్చు. -
సేల్స్‌లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్‌గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్‌యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్‌ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్‌లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
టాటా నెక్సాన్‌కు పోటీ:మహీంద్ర ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 లాంచింగ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచింగ్డేట్ రివీల్అయింది. ఇండిపెండెన్స్ డే నాటి స్పెషల్ ఈవెంట్లో ఎక్స్‌యూవీతోపాటు 5 ఎలక్ట్రిక్ కార్ల (E8, XUV.E9, BE.05, BE.07 BE.09)ను పరిచయం చేసిన మహీంద్రా తాజాగా ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 సెప్టెంబర్ 6న విడుదల చేయాలని యోచిస్తోందట. టాటా నెక్సాన్ EVకి ప్రత్యర్థిగా మార్కెట్లోకి అడుగుపెట్టపోతున్న ఈ కారు డెలివరీలు అక్టోబరు నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఆకట్టుకోని REVAi, e2o ,eVerito తరువాత మహీంద్రా తీసుకొస్తున్న తొలి ఈవీ ఇది. ఈ వెహికల్లో 150హెచ్‌పీ శక్తిని అందించే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 700 మాదిరిగా క్యాబిన్ లోపల, Adreno X ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ADAS, తదితర ఫీచర్లతో రాబోతుందని అంచనా. -
షాకింగ్ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా ఏమందంటే?
సాక్షి,ముంబై: కాలుష్య భూతాన్ని నిలువరించే లక్ష్యంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బైక్స్ మంటల్లో చిక్కుకోవడంతో ఈ వాహనాల భద్రతపై అనుమానాలు వెల్లువెత్తాయి. తాజాగా ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురి కావడం టాటా నెక్సాన్ లవర్స్‌ని షాక్‌కు గురిచేసింది. ఇపుడిక ఫోర్ వీలర్ల (ఈవీ) భద్రతపై చర్చకు తెర లేచింది. ఇప్పటివరకు ఈవాహనాల అగ్నిప్రమాదాలు టూవీలర్లకే పరిమితమైనా, టాప్ సెల్లర్ కారు టాటా నెక్సాన్‌కు సంబంధిం తొలి సంఘటన నమోదు కావడంతో మరింత ఆందోళన నెలకొంది. టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్ ప్రజాదరణ పొందిన కారు నెక్సాన్ ఈవీ ప్రమాదానికి గురైంది. ఈ కారులో ఉన్నట్టుండి మంటలంటు కున్నాయి. ఒక్కసారిగా ఎగిసిన మంటలతో కారు దాదాపు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు మంటలు చెలరేగిన నెక్సాన్ఈవీ యజమాని ఇప్పటికే టాటా మోటార్స్‌తో సహకరించడానికి అంగీకరించారు. కారును ఇప్పటికే కంపెనీకి అప్పగించగా, దీన్ని పూణేలోని టాటా ఆర్ అండ్ డీ కేంద్రానికి తరలించనున్నారు. మరోవైపు దీనిపై టాటా గ్రూపు స్పందించింది. నెక్సాన్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించింది టాటా మోటార్స్. ప్రస్తుతం వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందనీ ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించిన తర్వాత పూర్తి ప్రకటన చేస్తామని టాటా ప్రతినిధి తెలిపారు. 2020లో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ఈవీ విక్రయాలు 30 వేలకు పైగా నమోదయ్యాయి. కాగా ఓలా, ప్యూర్ఈవీ తదితర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. Tata Nexon EV catches massive fire in Vasai West (near Panchvati hotel), a Mumbai Suburb, Maharashtra. @TataMotors pic.twitter.com/KuWhUCWJbB — Kamal Joshi (@KamalJoshi108) June 22, 2022 -
టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. సింగిల్ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. 40.5 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. నెక్సాన్ ఈవీతో పోలిస్తే కొత్త మోడల్ బ్యాటరీ సామర్థ్యం 33 శాతం అధికం అని కంపెనీ వెల్లడించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. 9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో సౌకర్యం, భద్రతకు సంబంధించి నూతనంగా 30 ఫీచర్లను జోడించారు. క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ముందువైపు సీట్ వెంటిలేషన్ వంటి హంగులు ఉన్నాయి. ప్రయాణికుల విభాగంలో ఇప్పటి వరకు టాటా మోటార్స్ 25,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇందులో 19,000లకుపైగా నెక్సాన్ ఈవీ లు ఉన్నాయి. 2021–22లో ఈవీ విక్రయాల్లో 353% వృద్ధి సాధించింది. వచ్చే అయిదేళ్లలో ఈ విభాగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. చదవండి: మెర్సిడెస్ నుంచి కొత్త కారు.. ప్రారంభానికి ముందే అదిరిపోయే బుకింగ్స్! -
టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదరగొడుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కారు..!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంది. మహీంద్రా కంపెనీ నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్యువి కారును రోడ్ మీద టెస్టింగ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎస్యువి కారు పెట్రోల్, డీజిల్ కారు ప్రస్తుత ఎక్స్యువి 300 మోడల్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు ఎక్స్యువి 400 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు గనుక మార్కెట్లోకి వస్తే టాటా మోటార్స్ నెక్సన్ ఈవీతో పోటీ పడనుంది. ఈ మహీంద్రా ఈ- ఎక్స్యువి400 కారు 350 నుంచి 380 వోల్ట్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ సహాయంతో రానుంది. ఒకవేళ మహీంద్రా ఈ సైజు బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే, అదే విధమైన బ్యాటరీ ప్యాక్ ఉన్న నెక్సన్ ఈవికి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఉంటుంది. ముంబైకి చెందిన ఈ సంస్థ 2027 నాటికి ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు, మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కారు బయటకు రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్యువి400 కారు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కారుకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు. (చదవండి: పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం అమెరికా..!) -
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..!
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా టాటా మోటార్స్ రికార్డు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు అమ్మకాల పెంచుకుంటూ పోతూ దేశీయ ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రెండేళ్ల క్రితం నెక్సన్ ఈవీ కారును ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 13,500 యూనిట్లను కంపెనీ సేల్ చేసింది. నెక్సన్ ఈవీ ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ వేహికల్ కార్లలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ 30.2 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 9.14 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 127 బిహెచ్పి, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 127 బిహెచ్పీ, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును జిప్ట్రాన్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ది చేసింది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్, ఎక్స్జెడ్ ప్లస్ మోడళ్లలో విక్రయించబడుతోంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం సుమారు రూ.13.99 లక్షలు. Thanks to our 13,500+ customers for being a part of this electrifying journey and joining in the EVolution to #EvolveToElectric! Join the EV family: https://t.co/9nDfIW9J0z . . .#EvolveToElectric #TataMotors #NexonEV #Ziptron #ElectricVehicle pic.twitter.com/1KXEVfBqWK — Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) January 29, 2022 గత ఏడాది అక్టోబర్ నెలలో టాటా భారతదేశంలో 10,000కు పైగా ఎలక్ట్రిక్ అమ్మకాలను నమోదు చేసినట్లు సంస్థ గతంలో ప్రకటించింది. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో టాటా 70 శాతం వాటాను కలిగి ఉంది. టాటా మోటార్స్ ఇటీవల నెక్సాన్ డార్క్ అనే సరికొత్త నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ప్రారంభించింది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో టాటా నెక్సాన్ ఈవీని గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే, రెగ్యులర్ హోమ్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేసేటప్పుడు 10 శాతం నుంచి 90 శాతం వరకు చేరుకోవడానికి 8.30 గంటల సమయం పడుతుంది. వచ్చే ఏడాదిలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలని చూస్తుంది. (చదవండి: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. కొత్త ఒరవడికి శ్రీకారం!) -
టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్ కారును రూపొందిస్తుంది. రేంజ్ వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్ చేపట్టిన ఇంటర్నల్ టెస్ట్‌లో కారు సింగిల్ రేంజ్ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సేల్స్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది. రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
ఈ టాటా గ్రూప్ లింకుపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు
గత కొద్ది రోజుల నుంచి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఆ పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి అని ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆన్ లైన్ స్కామ్ లు చాలా సాధారణం అయ్యాయి. అందుకే, ఇటువంటి విషయాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేల మీరు గనుక ఇటువంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ ఆర్థిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. హ్యాకర్లు నిరంతరం మీ డబ్బును దోచుకోవడానికి ఇలాంటి స్కామ్ లింక్స్ పంపిస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు గనుక టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, మిమ్మల్ని సరళమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత చివర్లో బహుమతిని తెరవమని అడుగుతారు. మీరు మూడుసార్లు ప్రయత్నించడానికి ఛాన్స్ ఇస్తారు. ప్రజలు సాధారణంగా ఈ ఉచ్చులో పడతారు. బహుమతుల కోసం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే, మీ వ్యక్తిగత వివరాలను పొందే సామర్ధ్యం ఉన్న వైరస్ లింక్ మీ పరికరంలో హ్యాకర్లు ఇన్ స్టాల్ చేస్తారు. అందుకే ఇటువంటి లింక్స్, పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!) #FakeNotSafe Tata Group or its companies are not responsible for this promotional activity. Please do not click on the link and/or forward it to others. Know more here: https://t.co/jJNfybI9ww pic.twitter.com/AA38T0oqHn — Tata Group (@TataCompanies) October 1, 2021 అదేవిధంగా, మీరు ఆన్లైన్లో మీ సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయవద్దు అని పేర్కొంటున్నారు. ఈ టాటా గ్రూప్ నకిలీ లింక్ విషయంలో ఆ సంస్థ స్పందించింది. టాటా గ్రూప్, మా సంస్థలకు ఈ నకిలీ ప్రచార లింకుకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీనికి బాధ్యులం కాదు. ఈ లింకు మీద అసలు క్లిక్ చేయకండి, ఎవరికి ఫార్వార్డ్ చేయకండి అని ట్విటర్ ద్వారా తెలిపింది. -
టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ
ఆటోమొబైల్ రంగంలో నంబర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్‌యూవీకి డిమాండ్ ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్‌గా ఉండటమే ఇందుకు కారణం. పోటీలో టాటా టాటా నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా నెక్సాన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బీఎక్స్ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఎంట్రీ లెవల్లో పోటీ టాటాలో టాప్ ఎండ్ ఎస్‌యూవీగా ఉన్న హారియర్, సఫారీ తరహా ఎక్స్టీరియర్, ఆల్ట్రోజ్ తరహా ఇంటీరియర్‌తో హెచ్బీఎక్స్ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హ్యుందాయ్ క్యాస్పర్లకు టాటా హెచ్బీఎక్స్ పోటీ విసరనుంది. It's Showtime! The most awaited SUV now has a name. Stay tuned.#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/tI0bZL5ngI — Tata Motors Cars (@TataMotors_Cars) August 21, 2021 చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..! -
కొత్త టిగోర్ ఈవీని టీజ్ చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన కొత్త టిగోర్ ఈవీని లాంచ్ చేయడానికి ఒక రోజు(ఆగస్టు 18) ముందు దానికి సంబందించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ లో పోస్ట్ చేసిన వీడియోలో కొండ పైకి ఎక్కుతున్న నెక్సన్ ఈవీ కారుతో పాటు మరో ఎలక్ట్రిక్ కారు వెళుతునట్లు చూపించారు. అందులో చూపించిన మరో కారు కొత్త టిగోర్ ఈవీ జిప్ట్రాన్. ఈ జిప్ట్రాన్ టెక్నాలజీ టాటా నెక్సన్ ఈవితో ప్రారంభం అయ్యింది. టాటా మోటార్స్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టిగోర్ ఈవీ సెడాన్ ను ప్రవేశపెట్టింది. జిప్ట్రాన్ టెక్నాలజీతో కొత్త టిగోర్ ఈవీ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆటోమేకర్ నమ్ముతోంది. జిప్ ట్రాన్ టెక్నాలజీ అధిక ఓల్టేజి 300+ ఓల్ట్ గల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ప్రస్తుత టిగోర్ ఈవిలో ఉండే 72వీ ఎసీ ఇండక్షన్ టైప్ మోటార్ కంటే ఈ మోటార్ మరింత శక్తివంతమైనదని పేర్కొన్నారు. రాబోయే ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని భావిస్తున్నారు. జిప్ట్రాన్ ఈవీలు ఒకే ఛార్జ్ తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని టాటా మోటార్స్ గతంలో పేర్కొంది. డిజైన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బంపర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. రాబోయే టిగోర్ ఈవి వైవిధ్యమైన రంగులలో లభించవచ్చు. క్యాబిన్ లోపల కూడా అవుట్ గోయింగ్ ఫ్లీట్-స్పెక్ టిగోర్ ఈవితో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. Fasten your seatbelts. The all-new EV from Tata Motors is here! #Ziptron #ZiptronElectricAscent #TataMotors #ElectricVehicle #TataMotorsEV pic.twitter.com/OKMuKrK4BD — Tata Motors Electric Mobility (@TatamotorsEV) August 11, 2021 -
నెక్సాన్ డీజిల్ వేరియంట్లకు పోటీగా ఈవీ కార్లకు డిమాండ్
ముంబై: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లకు చాలా మంచి స్పందన వస్తుంది. నెక్సన్ ఈవీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ కాంపాక్ట్ ఎస్ యువీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. టాటా నెక్సన్ ఈవీ కారు ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం. ఆటోమేకర్ పేర్కొన్నట్లుగా నెక్సన్ డీజిల్ వేరియంట్లకు పోటీగా ఈవీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. ఆటోమేకర్ టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 2021లో నెక్సాన్ ఈవీ కార్ల కోసం ఆర్డర్లు అనేవి డీజిల్ వేరియంట్లకు పోటాపోటీగా వచ్చినట్లు చెప్పారు. "కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత ఆకర్షణీయంగా మారాయి". మొత్తం అమ్మకాల పరిమాణంలో నెక్సాన్ ఈవీ త్వరలో 5% చేరుకుంటుందని టాటా మోటార్స్ ఆశాభావంతో ఉన్నట్లు బాలాజీ తెలిపారు. టాటా మోటార్స్ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్ యువీ వాటా రెండు సంవత్సరాల క్రితం కేవలం 0.2% మాత్రమే అని అన్నారు. టాటా మోటార్స్ 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. అలాగే, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి గణనీయంగా పెట్టుబడులు పెట్టుబడి పెడుతుంది. ఎఫ్ వై22 మొదటి(ఏప్రిల్-జూన్ మధ్య) త్రైమాసికంలో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి చెందిన 1,716 యూనిట్లను విక్రయించింది. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇటీవల ఈవీ విధానాలను ప్రకటించాయి. ఈ ఈవీ పాలసీలు వినియోగదారులకు సబ్సిడీలు అందించడం వల్ల ఈవీ తయారీదారులు మౌలిక సదుపాయాల కల్పనలో దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నెక్సన్ ఈవీకి డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం వల్ల నెక్సన్ ఈవీ, నెక్సన్ డీజిల్ మధ్య ధరల అంతరం తగ్గింది. దీంతో వాహన కొనుగోలుదారులు డీజిల్ వేరియంట్లతో పోలిస్తే ఈవీ కార్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. -
మనసు దోచే ‘టాటా’ డార్క్ ఎడిషన్స్
న్యూఢిల్లీ : డార్క్ ఎడిషన్ పేరుతో సక్సెస్ఫుల్ మోడల్ కార్లకు టాటా మోటార్స్ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్, అల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్ వెహికల్స్ అందుబాటులోకి తేనుంది. ధర ఎంతంటే ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం డార్క్ ఎడిషన్లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డార్క్ స్పెషల్స్ ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్ కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ డిజైన్ చేశారు. ఎల్లాయ్ వీల్స్, క్రోమ, బ్యానెట్, ముందు భాగంలో డార్క్ ఎంబ్లమ్ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి గ్రాఫైట్ బ్లాక్ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్ ఉన్న డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్స్ విత్ డార్క్ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్ చేశారు. నెక్సాన్ ఇలా ఇక నెక్సాన్‌లో చార్కోల్ ఎల్లాయ్ వీల్స్, సోనిక్ సిల్వర్ బెల్ట్‌లైన్, ట్రై యారో డ్యాష్‌బోర్డ్ , లెదర్ సీట్లు, డోర్ ట్రిమ్స్ అండ్ ట్రై యారో థీమ్‌తో డిజైన్ చేశారు. నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్నైట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. సాటిన్బ్లాక బెల్ట్‌లైన్, చార్కోల్ వీల్ ఎల్లాయిస్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్ థీమ్ ఫాలో అయ్యారు. హ్యారియర్‌తో మొదలు డార్క్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్యారియర్ అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్ ఎడిషన్స్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. -
Tata Motors: టాటా మోటార్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల తన ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. ఎప్పటి నుంచి పెరగనున్నయో స్పష్టంగా చెప్పకున్నప్పటికి "త్వరలో" పెరగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాహన తయారీలో ఉపయోగించే ఉక్కు, విలువైన లోహాలతో సహా ఆవశ్యక ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల వాహన ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ధరల పెరుగుదల ఎంత అనేది రాబోయే రోజులు, వారాల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్ వంటి మోడల్స్ ను విక్రయిస్తుంది. ఆదివారం, హోండా కార్స్ ఆగస్టు నుంచి తన అన్నీ వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఉక్కు ధరలు గణనీయంగా పెరిగాయి. జూన్ ల, ప్రముఖ దేశీయ ఉక్కు తయారీదారులు హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్ సీ), కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్ సీ) ధరలను వరుసగా టన్నుకు రూ.4,000, రూ.4,900 వరకు పెంచారు. హెచ్ఆర్ సీ, సీఆర్ సీ అనేవి ఆటో, ఉపకరణాలు, నిర్మాణం వంటి పరిశ్రమల్లో ఉపయోగించే ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు. అందువల్ల, ఉక్కు ధరల పెరుగుదల వాహనాలు, వినియోగదారు వస్తువుల, నిర్మాణ ఖర్చుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా, రోడియం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి, ఇది ఉత్పత్తి ఖర్చును ప్రభావితం చేసింది. రోడియం, పల్లాడియంలను ఉత్ప్రేరకాలలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల వాటికి డిమాండ్ అనేక రెట్లు పెరిగింది.