టాటా మోటార్స్ కొత్త ఎస్‌యూవీ నెక్సాన్ త్వరలో...
న్యూఢిల్లీ: ఒకవైపు లగ్జరీ కార్లపై అదనపు సెస్ భారం వేసేందుకు రంగం సిద్ధమైంది. మరో వైపు టాటామెటార్స్ తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. రూ. 5వేల నుంచి రూ.11 వేల తమ నెక్సాన్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
1.2 పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజీన్ రెండు వేరియంట్లలో లభించనుంది. దీని ధర రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..1.2 లీటర్ టర్బోచార్జెడ్ రివెట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 110 బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ , 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మెయిన్ ఫీచర్స్. అలాగే అన్నిస్టాండర్డ్ మోడల్స్‌లాగే డ్యూయల్ ఫ్రాంటల్ ఎయిర్ బ్యాగ్స్‌ను పొందుపర్చినట్టు కంపెనీ పేర్కొంది. అలాగే వీటికి అదనంగా అధునాతన డ్యుయల్ పాత్ సస్పెన్షన్, కార‍్నర్ స్టెబిలిటీ, రియర్ వ్యూ పార్కింగ్ సెన్సర్, కెమెరాను అమర్చినట్టు చెప్పింది.
కాగా ఏడాదిలో టాటా మోటార్స్ లాంచ్ చేసిన వాహనాల్లో ఇది మూడవది. టిగోర్, టాటా హెక్సా అనంతరం తాజాగా నెక్సాన్ విడుదలవుతోంది. అలాగే ఈ కొత్త నెక్సాన్ మారుతి సుజుకి కి చెందిన విటారా, బ్రెజ్జా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, హోండా WR-V , మహీంద్రా టీయూవీ 300 లాంటి కార్లు గట్టి పోటీ ఇవ్వనుంది.