confirm
-
టాటా మోటార్స్ కొత్త ఎస్యూవీ నెక్సాన్ త్వరలో...
న్యూఢిల్లీ: ఒకవైపు లగ్జరీ కార్లపై అదనపు సెస్ భారం వేసేందుకు రంగం సిద్ధమైంది. మరో వైపు టాటామెటార్స్ తన కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్‌ను సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. రూ. 5వేల నుంచి రూ.11 వేల తమ నెక్సాన్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 1.2 పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజీన్ రెండు వేరియంట్లలో లభించనుంది. దీని ధర రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..1.2 లీటర్ టర్బోచార్జెడ్ రివెట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 110 బిహెచ్పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్పి పవర్ , 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ మెయిన్ ఫీచర్స్. అలాగే అన్నిస్టాండర్డ్ మోడల్స్‌లాగే డ్యూయల్ ఫ్రాంటల్ ఎయిర్ బ్యాగ్స్‌ను పొందుపర్చినట్టు కంపెనీ పేర్కొంది. అలాగే వీటికి అదనంగా అధునాతన డ్యుయల్ పాత్ సస్పెన్షన్, కార్నర్ స్టెబిలిటీ, రియర్ వ్యూ పార్కింగ్ సెన్సర్, కెమెరాను అమర్చినట్టు చెప్పింది. కాగా ఏడాదిలో టాటా మోటార్స్ లాంచ్ చేసిన వాహనాల్లో ఇది మూడవది. టిగోర్, టాటా హెక్సా అనంతరం తాజాగా నెక్సాన్ విడుదలవుతోంది. అలాగే ఈ కొత్త నెక్సాన్ మారుతి సుజుకి కి చెందిన విటారా, బ్రెజ్జా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, హోండా WR-V , మహీంద్రా టీయూవీ 300 లాంటి కార్లు గట్టి పోటీ ఇవ్వనుంది. -
అంజలి- జై రియల్ జర్నీ కన్ఫాం?
జర్నీ సినిమాతో ఆకట్టుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ మధ్య కుటుంబ కలహాలు, వివాదాలతో హాట్ టాపిక్‌గా మారి ఫామ్ కోల్పోయింది.. ఇండస్ట్రీలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయి...కరియర్ లో కష్టాలను ఎదుర్కొంంటూ మెల్లిగా కరియర్‌ను నెట్టుకొస్తోంది ఈ గీతాంజలి భామ. అయితే ఆ తరువాత అంజలి లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ అయ్యింది 'జర్నీ' హీరో జై తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇపుడిదే వార్త మరోసారి తెరపైకి వచ్చింది. జ్యోతిక నటించిన ‘మగలిర్ ముట్టుమ్' అనే చిత్రం టీజర్ రిలీజ్ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ , జ్యోతిక భర్త విసిరిన దోశ ఛాలెంజ్ వీరిద్దరి సన్నిహిత స్నేహాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇంట్లో అందరి కోసం దోశెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అన్న సూర్య ఛాలెంజ్ ను ఈ రీల్ జంట స్వీకరించడం.. ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. వీరిద్దరి లవ్ రిలేషన్ షిప్ అనుమానానికి మరింత బలాన్నిచ్చింది. ఎంగెయుం ఎప్పొత్తుం సినిమాలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించిన ఈ జంట ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోనున్నారని కోలివుడ్ టాక్. తమిళ నటుడు జై అంజలి కోసం దోశె వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి ప్రతిగా అంజలి యమ్మీ దోశె అంటూ స్పందించింది. ‘రుచికరమైన దోశె జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బావుంటుందో' అని అంజలి ట్వీట్ చేశారు. అదీ సంగతి. వీరిద్దరి ఈ ఆసక్తికర ట్వీట్స్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రీల్ జంట మధ్య సాన్నిహిత్యం మరింత ముదిరిందనీ, కలిసే వుంటున్నారని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి బాజాలు మోగనున్నాయంటూ కోలివుడ్ కోడై కూస్తోంది. అయితే గతంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో తమ ప్రేమ పుకార్లను ఖండించిన అంజలి, జై ..తాజా రూమర్లపై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం ఇంట్లో దోశె వేసి ‘దోశె ఛాలెంజ్' అంటూ పలువురు సినీ ప్రముఖులను ట్యాగ్ చేశారు. దీనికి ట్విట్టర్ లో స్పందన భారీగానే వచ్చిన సంగతి తెలిసిందే. అటు లేటెస్ట్ మూవీ ఎనక్కు ఎంగుయుమ్ ఎప్పొత్తుం సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జై, ప్రస్తుతం బెలూన్ అనే తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. Here we go na! #MMDosaChallenge completed succefully @vp_offl @Suriya_offl @yoursanjali Yummm ,, Tasty dosa J ,, lovely to see your dearest one cooking fr you ☺️☺️#MMDosaChallenge #MagalirMattum https://t.co/E9C6sVcad9 — Anjali (@yoursanjali) February 7, 2017 #MMDosaWithLove #MagalirMattum #DosaChallenge -
భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ
వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది. ఈ విషయంపై అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదలచేశాయి. వందల మిలియన్ యాహూ యూజర్ అకౌంట్లు ఈ చోరీ బారిన పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూజర్ అకౌంట్ల హ్యాకింగ్ విషయం ఆగస్టులోనే బయటికి వచ్చింది. దాదాపు 200 మిలియ్ యాహూ యూజర్ అకౌంట్ ఆధారాలను పీస్ అనే హ్యకర్ అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు వచ్చాయి. సుమారు 1,07,000కు ఈ అకౌంట్లను రియల్డీల్ మార్కెట్ ప్లేస్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని, చోరీపై యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని యాహూ భరోసా ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఈ అకౌంట్ల చోరిని యాహూ సైతం ధ్రువీకరించేందుకు సిద్దమైంది. ఈ డేటాలో యూజర్ల పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, ఇతర ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నాయి. ఇటీవలే యాహూ కోర్ వ్యాపారాలైన ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ సుమారు రూ.32,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్‌ను యాహూ ధృవీకరిస్తున్నట్టు వెల్లడవడం, ఆ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపనుందోనని మార్కెట్ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందం ముగిసే వరకు సీఈవో మారిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. -
చివరి రోజుల్లో ఒబామా సంచలన నిర్ణయం
న్యూయార్క్: పదవి ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన విభాగం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఓ స్వలింగ సంర్కుడిని ఆర్మీ కార్యదర్శిగా నియమిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా పూర్తయ్యాయి. గత కొద్ది కాలంగా ఈ పోస్ట్ కోసం పెండింగ్ లో ఉంచిన ఎరిక్ ఫానింగ్ అనే స్వలింగ సంపర్క అధికారి నామినేషన్‌కు ఎట్టకేలకు మోక్షాన్ని ఇచ్చి తాము గేలకు వ్యతిరేకం కాదు అని గట్టి సంకేతాలు ఇచ్చింది. ఒబామా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫానింగ్ అమెరికా సైనిక సేవల విభాగానికి తొలి గే నాయకుడిగా అవతరించినట్లయింది. గతంలో గేలకు, లెస్బియన్లకు ఈ పోస్ట్ ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం వ్యతిరేకించేది. 'అమెరికా ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫానింగ్ నియామకాన్ని ఖరారుచేయడం ద్వారా తమ దేశంలో ఎప్పుడూ సమానత్వపాలన ఉంటుందని అది ఆర్మీలోనైనా మరింకెక్కడైనా' అంటూ మానవహక్కుల ప్రచార అధ్యక్షుడు చాద్ గ్రిఫిన్ ఒక ప్రకటనలో చెప్పారు.