చివరి రోజుల్లో ఒబామా సంచలన నిర్ణయం
న్యూయార్క్: పదవి ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన విభాగం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఓ స్వలింగ సంర్కుడిని ఆర్మీ కార్యదర్శిగా నియమిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా పూర్తయ్యాయి. గత కొద్ది కాలంగా ఈ పోస్ట్ కోసం పెండింగ్ లో ఉంచిన ఎరిక్ ఫానింగ్ అనే స్వలింగ సంపర్క అధికారి నామినేషన్కు ఎట్టకేలకు మోక్షాన్ని ఇచ్చి తాము గేలకు వ్యతిరేకం కాదు అని గట్టి సంకేతాలు ఇచ్చింది.
ఒబామా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫానింగ్ అమెరికా సైనిక సేవల విభాగానికి తొలి గే నాయకుడిగా అవతరించినట్లయింది. గతంలో గేలకు, లెస్బియన్లకు ఈ పోస్ట్ ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం వ్యతిరేకించేది. 'అమెరికా ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫానింగ్ నియామకాన్ని ఖరారుచేయడం ద్వారా తమ దేశంలో ఎప్పుడూ సమానత్వపాలన ఉంటుందని అది ఆర్మీలోనైనా మరింకెక్కడైనా' అంటూ మానవహక్కుల ప్రచార అధ్యక్షుడు చాద్ గ్రిఫిన్ ఒక ప్రకటనలో చెప్పారు.