Eric Fanning
-
చివరి రోజుల్లో ఒబామా సంచలన నిర్ణయం
న్యూయార్క్: పదవి ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన విభాగం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఓ స్వలింగ సంర్కుడిని ఆర్మీ కార్యదర్శిగా నియమిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా పూర్తయ్యాయి. గత కొద్ది కాలంగా ఈ పోస్ట్ కోసం పెండింగ్ లో ఉంచిన ఎరిక్ ఫానింగ్ అనే స్వలింగ సంపర్క అధికారి నామినేషన్‌కు ఎట్టకేలకు మోక్షాన్ని ఇచ్చి తాము గేలకు వ్యతిరేకం కాదు అని గట్టి సంకేతాలు ఇచ్చింది. ఒబామా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫానింగ్ అమెరికా సైనిక సేవల విభాగానికి తొలి గే నాయకుడిగా అవతరించినట్లయింది. గతంలో గేలకు, లెస్బియన్లకు ఈ పోస్ట్ ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం వ్యతిరేకించేది. 'అమెరికా ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ ఫానింగ్ నియామకాన్ని ఖరారుచేయడం ద్వారా తమ దేశంలో ఎప్పుడూ సమానత్వపాలన ఉంటుందని అది ఆర్మీలోనైనా మరింకెక్కడైనా' అంటూ మానవహక్కుల ప్రచార అధ్యక్షుడు చాద్ గ్రిఫిన్ ఒక ప్రకటనలో చెప్పారు. -
'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీ పగ్గాలు ఓ 'గే'(స్వలింగ సంపర్కుడు) చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. యూఎస్ తదుపరి ఆర్మీ సెక్రటరీగా 'గే' అయిన ఎరిక్ ఫాన్నింగ్ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎరిక్ యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెనెట్ కూడా ఆమోదం తెలిపితే 'గే' గా బయటకు చెప్పుకొని యూఎస్ ఆర్మీకి సారధ్యం వహించిన మొదటి వ్యక్తి ఎరిక్ అవుతాడు. ఎరిక్‌కు యూఎస్ ఆర్మీలో ఉన్న అపారమైన అనుభవం, అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కొత్త బాధ్యతలు అప్పగించేలా చేశాయని ఒబామా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ ఆర్మీని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలపడానికి ఎరిక్‌తో కలిసి పని చేస్తామని ఒబామా తెలిపారు.