కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్(Pakistan) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో పాక్, ఆప్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆఫ్ఘనిస్థాన్‌లోని(Afghanistan) పక్టికా ప్రావిన్స్‌లో ఉన్న బర్మాల్ జిల్లాపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడినట్టు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్టు అక్కడి మీడియా ఖమా నివేదించింది. ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
మరోవైపు.. బర్మాల్, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి(Air Strike) ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్ వైమానిక దాడులను ఖండించింది. పాక్ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది.
Aftermath of precision airstrikes conducted by the Pakistan Air Force, eliminating over 40+ TTP terrorists and crippling militant infrastructure in Paktika province Afghanistan.
A significant step taken by Pakistan Armed forces in counter-terrorism efforts reaffirming their… pic.twitter.com/x6AZgOx5JB— Global Defense Agency (@Defense_GDA) December 24, 2024
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాకిస్తాన్ అధికారులు అధికారికంగా వైమానిక దాడిని ధృవీకరించ లేదు. సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి.
Comments
Please login to add a commentAdd a comment