
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్‌కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్‌ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.
🚨For those who were in celebration of #Trump statement ...!!
US likely to impose travel ban on Pakistan,
A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025
ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment