travel ban
-
ఇజ్రాయెల్‌పై మాల్దీవ్స్ బ్యాన్
మాలె: గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ.. నిరసగా ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనాకు సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రకటించారు.ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు ఇజ్రాయెల్‌కు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొయిజ్జు ప్రకటించారు. ఇక.. గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసిన విషయం తెలిసిందే.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవులు ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు మొయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయటం కష్టమవుతుంది. అందుకే ఇజ్రాయెల్‌లోనే ఉండాలని తెలిపారు. -
ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ
వాషింగ్టన్: అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. చైనాలో చిన్నపిల్లలో న్యుమోనియా కేసుల తరహాలోనే.. ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయట. ఈ నేపథ్యంలో అమెరికాలోని రిపబ్లికన్ సెనెటర్లు అమెరికా-చైనా మధ్య ప్రయాణ రాకపోకలను(ట్రావెల్ బ్యాన్‌ను) వెంటనే నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. రిపబ్లికన్ సెనెటర్ల తరఫున ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో, బైడెన్‌కు రాసిన లేఖలో.. ‘చైనాలో వేగంగా విస్తరిస్తున్న బ్యాక్టీరియల్ న్యుమోనియాను.. అమెరికాలో వ్యాపించకుండా అడ్డుకునేందుకు వెంటనే చైనాతో ప్రయాణ రాకపోకలను నిషేధించాలి. గతంలో పలు ప్రజారోగ్య సంక్షోభాలకు చైనా కారణమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో.. వైరస్ ఎలా పుట్టిందనేదానికి ఆ దేశం స్పష్టత ఇవ్వలేదు. ఇచ్చిన వివరణలోనూ పారదర్శకత లోపించింది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. .. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించేంత దాకా మేం చూస్తూ ఉండలేం. అమెరికన్ల ఆరోగ్యం, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అవసమైన చర్యలు తీసుకుంటాం. ప్రయాణ నిషేధంతో న్యూమోనియా కేసుల పెరుగుదల, మరణాలు, లాక్డౌన్ విధించడం వాటిని నిరోధించవచ్చు అని లేఖలో రూబియో అభిప్రాయపడ్డారు. ఈ లేఖపై వైట్‌హౌజ్ స్పందించాల్సి ఉంది. మరోవైపు పెరుగుతున్న న్యుమోనియా కేసులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
'ముస్లింలపై ప్రయాణ నిషేధం పునరుద్ధరిస్తా'
న్యూయార్క్: తాను అధ్యక్షునిగా ఎన్నికైతే ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. లాస్ వెగాస్‌లో నిర్వహించిన రిపబ్లికన్ జ్యూయిష్ కన్వెన్షన్‌లో ఈ మేరకు మాట్లాడారు. “మీకు ప్రయాణ నిషేధం గుర్తుందా? ఎన్నికైతే మొదటి రోజే నేను అప్పటి ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తాను. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను మా దేశానికి దూరంగా ఉంచుతాము" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తూ 2017లోనే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివక్షతో కూడుకుని ఉన్నదని ఈ నిషేధాన్ని న్యాయస్థానాల్లో కూడా సవాలు చేశారు. ఏది ఏమైనప్పటికీ తాజా ప్రకటన ట్రంప్‌కు మద్దతునిచ్చే ఓటర్లలో గణనీయమైన ఆకర్షణను కలిగి ఉంది. ఈ ప్రకటన ఆయన కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. జో బైడెన్ అధికారంలోకి రాగానే 2021 ప్రారంభంలోనే ట్రంప్ చేసిన ప్రయాణ నిషేధాన్ని రద్దు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తాజా ప్రకటనను శ్వేతసౌధం ఖండించింది. ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. జో బైడెన్ కీలక సూచన -
భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్
రియాద్: భారత్ సహా పదహారు దేశాలపై ట్యావెల్ బ్యాన్ విధించింది సౌదీ అరేబియా. మంకీపాక్స్ నేపథ్యంలోనే అని తొలుత కథనాలు వెలువడగా.. కారణం అది కాదని ఖండించింది సౌదీ అధికార యంత్రాంగం. కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ప్రయాణ నిషేధం ఎంతకాలం పాటు అనే విషయంపై ఎలాంటి స్పష్టం ఇవ్వలేదు అక్కడి ప్రభుత్వం. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఖండాల నుంచి మొత్తం పదహారు దేశాల నుంచి ప్రయాణికుల రాకలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. భారత్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్గనిస్థాన్, యెమెన్, సోమాలియా, కాంగో, లిబియా, అర్మేనియా, బెలారస్, వెనిజులా.. ఇలా మొత్తం 16 దేశాలు జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దేశంలో 414 కొత్త కరోనా కేసులు Corona Cases వెలుగు చూశాయని శనివారం సౌదీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ వారాంతపు కేసులతో పోలిస్తే.. ఇది ఐదు రెట్లు ఉండడంతో ఆందోళన చెందుతోంది ఆ దేశం. దాదాపు 81 కరోనా మరణాలు నమోదు కావడంతోనే ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఉన్న దేశాల నుంచి కాకుండా.. మిగతా దేశాల ప్రయాణికులపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొంది. అదే విధంగా ఒకవేళ దేశం నుంచి బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వాళ్లు మాత్రం.. మూడు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. పన్నెండు నుంచి పదహారేళ్ల లోపు వయసు వాళ్లకు రెండు డోసులు ఉంటే చాలని తెలిపింది. ఆరోగ్యపరమైన మినహాయింపులు ఉంటే తప్ప.. ఎవరినీ బయటకు పంపేది లేదని క్లారిటీ ఇచ్చింది. చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. 14 దేశాల్లో 100కిపైగా కేసులు -
మరో వుహాన్.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్’
Another Wuhan SA Gauteng province 90 Percent Cases Related to Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కన్నా ఇది చాలా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా వెలుగు చూసిన ప్రారంభంలో దీని మూల కేంద్రాన్ని చైనా వుహాన్‌గా గురించారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలానే ఒమిక్రాన్ వేరియంట్ మూల కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్ ప్రథమంగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలోని ష్వానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒమిక్రాన్ కేంద్రమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఇన్స్టిట్యూట్లోని చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేశారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు) 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్... జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవే అంటున్నారు నిపుణులు. ఇక్కడ కేసులు ఇంతలా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం... తక్కువ వ్యాక్సినేషన్ రేటు. దక్షిణాఫ్రికాలో 18-34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకాపై అపోహల కారణంగా కూడా చాలామంది వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారు.. తమ తోటివారిని టీకా వేసుకోమని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నుంచి కాపాడగలదని ప్రచారం చేస్తున్నారు. ప్రయాణాలపై నిషేధం.. డెల్టా వేరియంట్ కారణంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదయ్యింది. ప్రభుత్వాలు డెల్టా వేరియంట్‌ని ప్రారంభంలో నిర్లక్ష్యం చేశాయి. ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాయి. డెల్టా కన్నా ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలిసిన వెంటనే అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఈ నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. (చదవండి: ఒమిక్రాన్.. మహమ్మారి అంతానికే వేగం పెంచిందేమో...) అదే సమయంలో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆదివారం మాట్లాడుతూ.. ‘‘కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ, దేశంలో అత్యల్ప అంటే 'మొదటి స్థాయి' లాక్డౌన్ మాత్రమే అమలులో ఉంటుంది’’ అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు.. దక్షిణాఫ్రికా, దాని పొరుగు దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించాయి. దీని వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని.. తక్షణమే ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయాలని రమాఫోసా విజ్ఞప్తి చేశారు. చదవండి: ఒమిక్రాన్ గురించి తెలుసుకునే లోపే చాపకింద నీరులా..! -
గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
వాషింగ్టన్: భారత్ సహా వివిధ దేశాలపైనున్న ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి విదేశీ ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వారు విమానం ఎక్కడానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణ ఆంక్షల్ని ఎత్తివేసే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేసినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. ‘‘కోవిడ్ కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో వివిధ దేశాలపై విధించిన ఆంక్షల్ని అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తివేస్తున్నాం. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మా దేశంలోకి ఇక అనుమతి లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చర్యలు ఉంటాయ్’’అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. చదవండి: (చైనాలో డెల్టా వేరియెంట్ భయం) అయితే 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. 10 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన సుమారు 50 దేశాల ప్రయాణికులపై కూడా అమెరికా ఆంక్షల్ని సడలించింది.. ఆయా దేశాల నుంచి వచ్చేవారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్తో రావాల్సి ఉంటుంది. వారు అమెరికాలో 2 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంటే వ్యాక్సిన్ తప్పనిసరి. ‘‘కొత్త నిబంధనల ప్రకారం విదేశీ ప్రయాణికులు 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నెగెటివ్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి. ఇవన్నీ అమెరికన్లు, విదేశీ ప్రజల భద్రత కోసమే తీసుకువచ్చాం’’అని వైట్‌హౌస్ అధికారి చెప్పారు. యూకే, ఈయూ, ఐర్లాండ్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై 2020 లోనే అమెరికా ఆంక్షలు విధించింది. -
ఆంక్షలు ఎత్తివేత
-
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థతులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. అలాగే కొన్నికార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది. కాగా కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి 2020 మార్చి 23 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఏడాది మేనుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన జర్మనీ
బెర్లిన్: కోవిడ్-19 తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్ సహా ఐదు దేశాల ప్రయాణికులకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించింది. ఈ మేరకు.. ‘‘డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నాం’’ అని భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా తాజా సడలింపుల ప్రకారం ఇండియా, యూకే, పోర్చుగల్ దేశాల ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశారు. ఇక జర్మనీ నివాసులు, పౌరులేగాక ఇతర దేశాల ప్రయాణికులు కూడా దేశంలో ప్రవేశించవచ్చు. అయితే, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, క్వారంటైన్లో ఉండటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఇదిలా ఉండగా... కరోనా నేపథ్యంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) భారత్ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 21 వరకు ఈ నిబంధనుల అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. -
భారత్ సహా 14 దేశాల నుంచి నిషేధం!
అబుదాబి: కరోనా నేపథ్యంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. జులై 21 వరకు ట్రావెల్ బ్యాన్ నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు కొన్ని ఆఫ్రికన్ దేశాలు.. మొత్తం 14 దేశాల ప్యాసింజర్ విమానాలకు జులై 21 వరకు అనుమతి ఉండదని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అదే టైంలో కార్గో ఫ్లైట్లు, ఛార్టెర్ ఫ్లైట్స్‌కు మాత్రం మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు ఆతిథ్య దేశాల హెల్త్ ప్రొటోకాల్స్ పాటించాలని తమ దేశ పౌరులకు సూచించింది యూఏఈ. అదే టైంలో వేరే దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా తిరిగి స్వదేశాలకు రావడానికి వెసులుబాటు కల్పించింది కూడా. చదవండి: కేంద్ర క్యాబినేట్ విస్తరణ.. మాజీ సీఎంకు చోటు! -
DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత pic.twitter.com/IueesZFoiV — DGCA (@DGCAIndia) May 28, 2021 -
ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా చేరిన తొలి విమానం!
కాన్బెర్రా: దేశంలో కోవిడ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గత నెలలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన తొలి విమానం శనివారం డార్విన్ చేరుకుంది. కాంటాస్ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఆస్ట్రేలియా చేర్చారు. విమానంలో బోర్డ్ అవ్వడానికి ముందే వీరంతా రెండు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లు చూపించారు. ఇక వీరందరిని హోవార్డ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కోశాధికారి జోశ్ ఫ్రైడెన్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇక్కడి పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇండియా నుంచి మొదటి విమానం వచ్చిందని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే వారికి పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం. మేం ఇదే అనుసరిస్తున్నాం. ఈ నెలలో మరో రెండు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మా పౌరులను స్వదేశానికి తీసుకురానున్నాయి. జూన్ వరకు 1,000 మంది స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘మా ప్రభుత్వం డార్విన్ నగరానికి ఆగ్నేయంగా 25 కి.మీ (16 మైళ్ళు) దూరాన ఉన్న హోవార్డ్ స్ప్రింగ్స్‌లోని క్వారంటైన్ సెంటర్ సామార్థ్యాన్ని రెంటింపు చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా జూన్‌లో ప్రతి రెండు వారాలకు సుమారు 2,000 మందిని ఆస్ట్రేలియా చేర్చనున్నాం’’ అన్నారు. ఇక భారత్ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ -
భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ
సిడ్నీ: ఏడాదిన్నర కిందట భారతదేశానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ వ్యక్తి ఇప్పుడు కర్నాటకలోని బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా ఆస్ట్రేలియా కూడా ఇటీవల భారతదేశం నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. అసలు భారత్ నుంచి వచ్చేవారిని నిషేధించింది. ఈ నిషేధంపై ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో వివాదం కొనసాగింది. సిడ్నీలోని కోర్టులో భారతేదశం నుంచి మన పౌరులను అనుమతించాలని చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో భారత్‌లో చిక్కుకున్న 79 ఏళ్ల వ్యక్తి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. దేశ ఆరోగ్యం దృష్ట్యా.. వైద్యాధికారుల సిఫారసు మేరకు భారతీయుల రాకపై నిషేధం విధించినట్లు మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. కర్నాటకలోని బెంగళూరులో తమ దేశానికి చెందిన వ్యక్తి చిక్కుకునిపోయాడని.. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని సిడ్నీలోని కోర్టులో న్యాయవాది పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోకి ఎవరినీ రానివ్వం అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ వచ్చేందుకు ప్రయత్నిస్తే 66 వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ -
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు,వారికి మినహాయింపు
వాషింగ్టన్ : ఇండియాలో కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ నెల (మే) 4వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైట్ హౌస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా మేరకు భారత్ నుంచి నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్ సెక్రెటరీ జెన్‌సాకి పేర్కొన్నారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అయితే కొన్ని వర్గాల విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, ఇతరులకు మినహాయింపునిస్తూ విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ తాజా ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లతో వైరస్ వేగంగా విస్తరిస్తోందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ (సీడీసీ) నిర్ధారించింది. బీ.1.617 వైరస్ వేరియంట్ భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ భావిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు చురుకైన చర్యలు అవసరమని సీడీసీ తేల్చినట్లు ప్రెస్ సెక్రెటరీ పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎవరికి మినహాయింపు అధ్యయనవిద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, కరోనా ప్రభావిత దేశాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాలను అందించే వ్యక్తులను ఈ నిషేధం నుంచి మినహాయించింది. బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా ప్రయాణికులకు కూడా ఇదే మినహాయింపులను అమలు చేస్తోంది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం అందించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 4,01,993 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,523 మంది కరోనాతో మరణించారు. చదవండి: ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం -
కిమ్ ఆంక్షలు: ‘బతికిపోయాను ఉత్తర కొరియాలో పుట్టలేదు’
సియోల్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు ముందు జాగ్రత్తగా చర్యగా సరిహద్దులు మూసేశాయి. కొన్నాళ్ల తర్వాత రాకపోకలకు అనుమతించాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం నేటికి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో విదేశాల నుంచి నార్త్ కొరియా వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశనికి వెళ్లలేక.. అక్కడే ఉండలేక చాలా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశానకి వెళ్లేందుకు రష్యన్ దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని రష్యన్ విదేశాంగ శాఖ తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వివరాలు.. రష్యన్ దౌత్యవేత్త మూడవ కార్యదర్శి వ్లాడిస్లావ్ సోరోకిన్, మరికొందరు తమ కుటుంబ సభ్యులతో పాటు ఉత్తర కొరియాలో చిక్కుకుపోయారు. కోవిడ్ వ్యాప్తికి భయపడి ఆ దేశం గతేడాది జనవరి నుంచి తన సరిహద్దులను మూసి వేసింది. దాంతో ఈ రష్యన్ దౌత్యవేత్తలు ఇన్నాళ్లు కొరియాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందారు. దాంతో ఉత్తర కొరియా నుంచి రష్యాకు చేరుకోవడానికి వారు ఓ అద్భుతమైన మార్గం ఎన్నుకున్నారు. ఈ మేరకు ఓ రైల్ ట్రాలీని సిద్దం చేసుకున్నారు. తమ లగేజ్, చిన్న పిల్లలు, ఆడవారిని ట్రాలీలో కూర్చో పెట్టారు. ఆ తర్వాత మరి కొందరు ఆ ట్రాలీని రైలు పట్టాలపై తోయడం ప్రారంభించారు. అలా దాదాపు 32 గంటల పాటు ప్రయాణం చేసి రష్యా సరిహద్దుకు చేరుకున్నారు. వీరి రాక గురించి రష్యా విదేశాంగ శాఖ అధికారులకు ముందుగానే సమాచారం ఉండటంతో.. దౌత్యవేత్తల కోసం సరిహద్దులో వాహనాలు సిద్దంగా ఉంచారు. ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి వచ్చిన దౌత్యవేత్తల బృందానికి కోవిడ్ టెస్ట్ చేసి.. దేశంలోకి అనుమతించారు. కొద్ది రోజుల పాటు బయట తిరగవద్దని తెలిపారు. అలా మరో రెండు గంటల ప్రయాణం తర్వాత ఈ దౌత్యవేత్తలు తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత పుట్టిన గడ్డను చేరడంతో వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అంతసేపు పడిన శ్రమను మర్చిపోయి.. సంతోషంగా అరుస్తూ కేకలేశారు. ఈ సందర్భంగా వ్లాడిస్లావ్ సోరోకిన్ మాట్లాడుతూ.. ‘‘క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా ప్రయాణం కనిపించినంత సులువేం కాదు. చాలా ఇబ్బందిపడ్డాం. ముఖ్యంగా రష్యావైపు నడుచుకుంటూ రావడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఏదైతేనేం క్షేమంగా ఇంటికి వచ్చాం. అది చాలు’’ అన్నారు. వీరి ప్రయాణానికి సంబంధించిన వీడియోను రష్యన్ విదేశాంగ శాఖ సోషల మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు దేవుడికి ధన్యవాదాలు నేను ఉత్తర కొరియాలో జన్మించలదు అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి.. -
భారత్ సహా 4 దేశాలపై నిషేధం ఎత్తివేత
మాస్కో: మహమ్మారి కరోనా ప్రవేశంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడం.. వ్యాక్సిన్ కూడా రావడంతో క్రమేణా ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు రాకపోకలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశం షరతులతో రాకపోకలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా ఇప్పుడు పలు దేశాలకు విధించిన రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసింది. భారతదేశంతో పాటు ఫిన్‌ల్యాండ్, వియత్నాం, ఖతార్ దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా నిన్న ప్రకటించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మార్చి 16, 2020లో విధించిన నిషేధం దాదాపు పది నెలల తర్వాత జనవరి 25న ఎత్తివేశారు. దీంతో ఈ దేశాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యాలో 36, 79, 247 కరోనా కేసులు నమోదవగా, 68, 397 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో తాజాగా సోమవారం 19,290 కేసులు నమోదవగా.. 456 మృతులు నమోదయ్యాయి. -
మరోసారి అమెరికా ట్రావెల్ ఆంక్షలు ?
వాషింగ్టన్: కోవిడ్ కట్టడి చేసే విషయమై బైడెన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో మంగళవారం నుంచి ట్రావెల్ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అ«ధ్యక్షుడు బైడెన్, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు. -
డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్: పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్ జోన్ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు. వాటిలో యూకే, ఐర్లాండ్, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికా నుంచి ప్రయాణాలను నిషేధించారు. ఆ దేశాలకు జనవరి 26వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం 2,41,10,876 కేసులు నమోదవగా, మృతులు 3,98,915మంది ఉన్నారు. ఇంకా కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తోంది. అయితే కొత్త రకం వైరస్ బ్రిటన్, బ్రెజిల్లో వెలుగులోకి రావడంతో ఈ మేరకు ట్రంప్ ఆ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించారు. -
ఐదు రాష్ట్రాలపై నిషేధం; కర్ణాటక వివరణ
బెంగళూరు: కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించినట్టు వచ్చిన వార్తలపై కర్ణాటక వివరణ ఇచ్చింది. ఇందులో పూర్తిగా వాస్తవం లేదని గురువారం సాయంత్రం తెలిపింది. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే విమానాల సంఖ్యను తగ్గించాలని మాత్రమే పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించినట్టు వెల్లడించింది. తమ రాష్ట్రంలో క్వారెంటైన్ కేంద్రాలు తక్కువగా ఉన్నాయని, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు కర్ణాటక మంత్రి జే మధుస్వామి తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన వచ్చే వారికి తగిన నిర్బంధ సౌకర్యాలు ఉండేలా ఆంక్షలు విధించామని మంత్రి చెప్పారు. (ఆ 5 రాష్ట్రాల విమానాలు, రైళ్ల రాకపై నిషేధం!) కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 56,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు(18545), ఢిల్లీ(15,257), గుజరాత్(15,195), రాజస్థాన్ (7703), మధ్యప్రదేశ్(7261) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ప్రపంచంపై కరోనా పడగ
జెనీవా/టెహ్రాన్: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా.. ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, అమెరికా సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. గురువారానికి ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో ఈ వైరస్ బాధితుల సంఖ్య 1,25, 293గా, మరణాలు 4,600గా తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ గణించింది. వీటిలో చైనా వెలుపల నమోదైన కేసులు 44,500 కాగా, మరణాల సంఖ్య 1431. మొత్తం కేసులు, గణాంకాలను పరిశీలిస్తే ఆసియాలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. (కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!) ఆసియాలో 90,765 కేసులు నమోదు కాగా, 3,253 మరణాలు సంభవించాయి. యూరప్‌లో 22,969 కేసులు, 947 మరణాలు, మధ్యప్రాచ్యంలో 9,880 కేసులు, 364 మరణాలు, అమెరికా, కెనడాల్లో 1,194 కేసులు, 29 మరణాలు, ఆఫ్రికాలో 130 కేసులు, రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. చైనా తరువాత ఎక్కువగా ఇటలీలో 12,462 కేసులు, 827 మరణాలు, ఇరాన్లో 10,075 కేసులు, 429 మరణాలు సంభవించాయి. కోవిడ్ –19ను ‘అదుపు చేయదగ్గ విశ్వవ్యాప్త మహమ్మారి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (భారత్‌లో తొలి మరణం) 5 బిలియన్ డాలర్లివ్వండి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, చికిత్స అందించేందుకు 5 బిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయం అందించాలని ఇరాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్‌ను ఇరాన్ సాయం కోరడం 1962 తరువాత ఇదే ప్రథమం. కరోనా భయంతో పాఠశాలలకు శ్రీలంక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. యూరప్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కరోనా కల్లోలం నేపథ్యంలో యూకే మినహా ఇతర యూరప్ దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ అడుగుపెట్టవద్దని గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 30 రోజుల పాటు యూకేయేతర యూరప్ దేశాల వారిపై ఈ నిషేధం ఉంటుందన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో యూరోపియన్ యూనియన్ విఫలమైందని ఆయన విమర్శించారు. అమెరికా ట్రావెల్ బ్యాన్పై యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ భారత పర్యటన కూడా రద్దయింది. మార్చి 15, 16 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. (మహమ్మారి ముంచేసింది!) ట్రంప్‌ను కలిసిన వ్యక్తికి కోవిడ్–19 బ్రజీలియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. గతవారం ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఫేబియోకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ గత వారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఫేబియో, ఇతర అధికార బృందం కూడా ఆ భేటీలో పాల్గొన్నది. అనంతరం ఫేబియోకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే, దీనిపై ఆందోళన చెందడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. (కాన్స్ ఫెస్టివల్ క్యాన్సిల్ ?) యూఎస్ వర్సిటీలపై కరోనా ఎఫెక్ట్ వాషింగ్టన్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని 100కు పైగా విశ్వవిద్యాలయాల్లో తరగతులను రద్దు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్‌లకు ప్రత్యక్షంగా హాజరు కావడాన్ని నిలిపేస్తూ పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆన్లైన్ క్లాస్‌లను ప్రోత్సహిస్తున్నాయి. పలు విద్యాలయాలు తమ క్యాంపస్‌ల్లో క్రీడలు సహా బోధనేతర కార్యక్రమాలను రద్దు చేశాయి. (ఇంటి పట్టునే ఉండండి) -
ట్రంప్ నిర్ణయంతో ఆసియా మార్కెట్లు షేక్..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కలకలంతో యూరప్ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా నిర్ణయించడంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించడంతో పతనమైన ఆసియా మార్కెట్లు ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలాయి. ఈ రెండు నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై గణనీయ ప్రభావం పడుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఆసియా సూచీలు అట్టడుగుకు దిగజారాయి. టోక్యో బెంచ్‌మార్క్ నిక్కీ ఏకంగా 1051 పాయింట్లు పడిపోగా, టోపిక్స్ 5.06 శాతం మేర నష్టపోయింది. ఆస్ర్టేలియా ఏఎస్ఎక్స్ 5.4 శాతం, హాంకాంగ్ మార్కెట్ ఆరంభంలో 3 శాతం పతనమైంది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌తో ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తిందని ఏక్సికార్ప్ గ్లోబల్ మార్కెట్స్ చీఫ్ స్ర్ట్రేటజిస్ట్ స్టీఫెన్ ఇన్స్ పేర్కొన్నారు. కరోనా కలకలం, ట్రావెల్ బ్యాన్ నిర్ణయాలతో అమెరికా, యూరప్ మార్కెట్లు సైతం నష్టపోయాయి. చదవండి : ‘కోవిడ్’పై ట్రంప్ ట్వీట్.. కీలక నిర్ణయం! -
80కి చేరిన కరోనా మృతుల సంఖ్య
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా సర్కార్ పేర్కొంది. చైనాలోని వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకు శరవేగంగా వ్యాపిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. (కరోనా ప్రకంపనలు: హెల్ప్‌లైన్) మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000 పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. (కరోనా వైరస్‌తో 6.5 కోట్ల మందికి ముప్పు!) -
ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు ఆమోదం
వాషింగ్టన్: వివాదాస్పద ట్రావెల్ బ్యాన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. పలు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతేడాది తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఆ దేశ సుప్రీం కోర్టు సమర్థి స్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ముస్లింల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఉత్తర్వును రద్దు చేయాలన్న పిటిషన్‌ను 5–4 తేడాతో తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌తో సహా మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు ట్రంప్ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పునివ్వగా.. మరో నలుగురు వ్యతిరేకించారు. వలసల్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి తగిన అధికారముందని తీర్పులో జస్టిస్ రాబర్ట్స్ పేర్కొన్నారు. అయితే వలసలు, మరీ ముఖ్యంగా ముస్లింలపై ట్రంప్ వెలిబుచ్చిన అభిప్రాయాలపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జస్టిస్ సోనియా సోటోమేయర్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ట్రంప్ ప్రకటన ముస్లిం వ్యతిరేక ఉద్దేశంతోనే చేసిందని నిర్ధారణకు రావచ్చని చెప్పారు. న్యాయమూర్తులు స్టీఫెన్ బ్రేయర్, రూత్ గిన్స్బర్గ్, ఎలేనా కగన్లు కూడా ట్రంప్ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. గత సెప్టెంబర్‌లో చాడ్, ఇరాన్, ఇరాక్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమెన్ పౌరుల రాకపై అమెరికా నిషేధం విధించింది. అనంతరం జాబితా నుంచి చాడ్, ఇరాక్లను తొలగించింది. ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ దేశాల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు కింది కోర్టుల్ని ఆశ్రయించగా.. ట్రంప్ ఉత్తర్వులపై అవి స్టే విధించాయి. రాజ్యాంగం సాధించిన విజయం: ట్రంప్ తీర్పు అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. ‘ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది.. అద్భుతం. ఇది అమెరికా ప్రజలు, రాజ్యాంగం సాధించిన ఘన విజయం. నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం.. దేశ సమగ్రత, భద్రతను కాపాడుతాను’ అంటూ ట్వీట్ చేశారు. -
కొచర్‌కి షాకిచ్చిన ఇమ్మిగ్రేషన్
ముంబై : వీడియోకాన్ రుణాల కుంభకోణ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు ఇమ్మిగ్రేషన్ అథారిటీలు షాకిచ్చారు. దేశం విడిచి వెళ్లకుండా... ట్రావెల్ బ్యాన్ విధించారు. కొచర్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై కూడా ఈ ట్రావెల్ బ్యాన్ విధించినట్టు ఇమ్మిగ్రేషన్ అథారిటీలు పేర్కొన్నారు. వీరిద్దరిపై లుకౌట్ సర్క్యూలర్ జారీచేసినట్టు చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీచేసిన రూ.3250 కోట్ల రుణ వ్యవహారంలో వీరిద్దరిపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టిన సంగతి తెలిసిందే. సీబీఐ అభ్యర్థన మేరకు ధూత్, దీపక్ కొచర్లకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీచేశామని సంబంధిత ప్రభుత్వ అధికారులు చెప్పారు. అదేవిధంగా చందాకొచర్ ఒకవేళ భారత్ విడిచి ట్రావెల్ చేయాలనుకుంటే, తమకు సమాచారం అందించాలని ఇమ్మిగ్రేషన్ అథారిటీలను సీబీఐ ఆదేశించినట్టు తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించడానికి సీబీఐ అధికార ప్రతినిధి నిరాకరించారు. ‘నాపై వస్తున్న ఈ వార్తలన్నీ ఊహాగానాలే. నాకు వ్యతిరేకంగా ఎలాంటి లుక్అవుట్ నోటీసు జారీ కాలేదు. ఇవన్నీ రూమర్లే. నా పాస్‌పోర్టుకు రెండు నెలల క్రితమే గడువు తీరిపోయింది. గత ఐదేళ్లుగా నేను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. దేవుడు అంతా చూస్తాడు. నాపై రూమర్లు క్రియేట్ చేసే వారిని దేవుడు శిక్షిస్తాడు’ అని ధూత్ అన్నారు. కాగ, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్ దేశం విడిచి వెళ్లే సమయంలో ముంబైలో ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కొచర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పీఈ కానీ, లుకౌట్ నోటీసు కానీ సీబీఐ జారీచేయలేదు. -
పీఎన్బీ స్కాం: అంబానీ సహా నలుగురిపై ఆంక్షలు
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో దర్యాప్తు అధికారులు వేగంగా కదులుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన కీలక అధికారుల కదలికలపై తాజాగా ఆంక్షలు విధించారు. నీరవ్ మోదీ కంపెనీకి చెందిన నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై ట్రావెల్ ఆంక్షలు విధించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ బ్యాంకును రూ.11,400కోట్ల మేర మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వీరు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలనే యోచనతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. మోదీ కంపెనీకి చెందిన భాగస్వాములు, సీనియర్ అధికారులు తమ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ ఆదేశించింది. ముఖ్యంగా సోమవారం సాయంత్రం టాప్ ఎగ్జిక్యూటివ్‌లు విపుల్ అంబానీ, రవిగుప్త సహా నలుగురిని విచారించిన అనంతరం సీబీఐ ఈ ఆదేశాలిచ్చింది. ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక, కార్పొరేట్, అభివృద్ధి ప్రెసెడెంట్, విపుల్ అంబానీ, ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) రవి గుప్తా, అంతర్జాతీయ ఫైనాన్స్ డివిజన్ అధ్యక్షుడు సౌరబ్ శర్మ, మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరాబ్ లను దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అంతకుముందు దేశ, విదేశాలలో సంస్థ వ్యాపార లావాదేవీలు ఇతర వివరాల గురించి వీరిని ఆరా తీసింది. అలాగే కవితా మణిక్కర్ (అధీకృత సంతకం), ఎమిల్లా (వ్యక్తిగత సహాయకుడు), ప్రతీక్ మిశ్రాలతో సహా మరి కొంతమంది అధికారులకు కూడా సమన్లు జారీ చేసింది. మరోవైపు పీఎన్బీకి ముంబై బ్రాడి హౌస్ చెందిన మరో ముగ్గురు అధికారులు బీహూ తివారీ (చీఫ్ మేనేజర్, ఫారెక్స్ శాఖ), యశ్వంత్ జోషి (ఫారెక్స్ డివిజన్ స్కేల్ II మేనేజర్) ప్రఫుల్ సావంత్ (స్కేల్ I అధికారి, ఎక్స్పోర్ట్) లను సోమవారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసింది. -
ట్రంప్ 'ట్రావెల్ బ్యాన్’కు తొలగిన అడ్డంకి
-
ట్రావెల్ బ్యాన్’కు తొలగిన అడ్డంకి
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాలు లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు అవరోధం తొలగింది. ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతోపాటు అధ్యక్షుడి ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్‌లో ట్రావెల్ బ్యాన్‌కు సంబంధించి అధ్యక్షుడి ఉత్తర్వులపై పూర్తిస్థాయి విచారణ చేపడతామంది. ఈ ఆరు దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారి దగ్గరి సంబంధీకులమంటూ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, ఈ మినహాయింపుల అనంతరం దేశంలోకి ప్రవేశించిన ఈ దేశాల వారికి తాజా ఉత్తర్వులూ వర్తిస్తాయని అధికారులు తెలిపారు. -
అమెరికాకు విదేశీ పర్యాటకుల తగ్గుముఖం
వాషింగ్టన్: వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ ఏడాది జూన్ వరకు అమెరికాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్ అండ్ టూరిజం కార్యాలయం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. అందులోని వివరాలు... గతేడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య నాలుగు శాతం పడిపోయింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్ పర్యాటకుల సంఖ్యలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య 9 శాతం పడిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల ఫలితంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతం పడిపోయింది. ఆఫ్రికా పర్యాటకుల సంఖ్య 27 శాతం తగ్గింది. ఉత్తర అమెరికా, కరీబియన్, తూర్పు ఐరోపాల నుంచి తగ్గిన పర్యాటకుల శాతం రెండంకెలకు చేరడం గమనార్హం. భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాల పర్యాటకుల్లో 10 శాతానికి పైగా తగ్గిపోయారు. విచిత్రంగా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా నుంచి పర్యాటకులు 18 శాతం పెరిగారు. -
అమెరికాలో ట్రావెల్ బ్యాన్పై మళ్లీ స్టే
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాల ప్రజలతోపాటు ఉత్తర కొరియా పౌరులు, వెనుజులా అధికారులు అమెరికాకు రావడంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వులను రెండు అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. ట్రంప్ ఉత్తర్వులు మరికొన్ని గంటల్లో అమల్లోకి రావాల్సి ఉండగా, ఆ ఆదేశాలపై స్టే విధిస్తూ హవాయ్ ఫెడరల్ కోర్టు, మేరీలాండ్ ఫెడరల్ కోర్టులు తీర్పునిచ్చాయి. గత నిషేధ ఉత్తర్వుల మాదిరే తాజా బ్యాన్ కూడా అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందనీ, ముస్లిం మతస్తులను లక్ష్యంగా చేసుకుంటోందని మేరీలాండ్ కోర్టు జడ్జి థియోడర్ చువాంగ్ పేర్కొన్నారు. ట్రంప్ తన తాజా ఉత్తర్వుల్లో ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్‌తోపాటు ఉత్తరకొరియా పౌరులు, వెనిజులాకు చెందిన కొందరు అధికారులు అమెరికాలోకి రావడంపై ఆంక్షలు విధించారు. నిర్దిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని, జాతీయత ఆధారంగా వివక్ష చూపేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని హవాయ్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వైట్‌హౌస్ సంకేతాలు పంపింది. -
ట్రంప్ ఎఫెక్ట్ : అమెరికాపై తగ్గుతున్న మోజు
బెంగళూరు : ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లేందుకు భారత యువత ఆసక్తిని చూపడం లేదా? వెళ్లినా ఉపయోగం లేదనే భావనలో యువత ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాలో వలస చట్టాలను డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత కొద్దిగా జంకుతోంది. ప్రముఖ జాబ్ సైట్ ‘ఇండీడ్’ ప్రకటించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లేవారి శాతం 38-నుంచి 42 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది అంటే 2016 సెప్టెంబర్ నుంచి 2017 అక్టోబర్ వరకూ ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఇదే 2015-16 మధ్యలో ఆయా దేశాలకు వెళ్లేందుకు యువత ఆసక్తిని ప్రదర్శించింది. ఇదిలావుంటే గతంతో పోలిస్తే విదేశీ ఉద్యోగాలపై భారతీయుల్లో ఆసక్తి 5 శాతం మేర తగ్గిందని ఇండీడ్ తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశంలోనే ఉద్యోగాలు చేసుకునేందుకు భారతీయులు ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగావకాశాలు వెతికే వారు 25 శాతం మేర పెరిగాయి. ఇదిలా ఉండగా.. ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు 10 శాతం ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. ఐరోపా దేశాల్లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం వల్ల ఆయా దేశాలపై భారతీయులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతుండడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత ఆసక్తిని చూపడం లేదు. గతంతో పోలిస్తే ఇది 21 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. -
ట్రంప్‌పై కోర్టుకెక్కిన ముస్లింలు
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడు అయిన తరువాత ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్పై తొలిసారి ముస్లిం న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమంటూ.. ఇరానియన్, అమెరికన్ ముస్లింల సమాఖ్య, లీగల్ ఇనిస్టిట్యూట్లు మేరీల్యాండ్.. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించాక.. చట్ట పరమైన పోరాటం మొదలు కావడం ఇదే తొలిసారి. ట్రావెల్ బ్యాన్పై దాఖలైన దావాలపై.. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ట్రావెల్ బ్యాన్‌కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సవరణలు చేస్తూ.. రెండు రోజుల కిందట తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం చాద్, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సిరియా, యెమన్, వెనుజులాకు చెందిన కొందరు ప్రభుత్వాధికారులు, వారి కుటుంబ సభ్యులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తాయి. -
ఉ.కొరియాపైనా ట్రావెల్ బ్యాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రావెల్ బ్యాన్ జాబితాలోకి కొత్తగా ఉత్తర కొరియా సహా మూడు దేశాలను చేర్చారు. ఆరు ముస్లిం దేశాల (లిబియా, సూడాన్, ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా) ప్రజలకు అమెరికాలోకి ప్రవేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో నిషేధ ఉత్తర్వులు తీసుకురావడం తెలిసిందే. ఆ ఆజ్ఞల గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్తగా మరో మూడు దేశాలపై కూడా నిషేధం విధిస్తూ ఆదివారమే ఉత్తర్వులిచ్చారు. అయితే సూడాన్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. క్షిపణి, అణు పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాతోపాటు, వెనిజులా, చాద్ దేశాలపై కూడా ఆయన తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో ప్రస్తుతం అమెరికా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న మొత్తం దేశాల సంఖ్య 8కి చేరింది. హోంలాండ్ భద్రతా విభాగం జరిపిన సమీక్షల అనంతరం, అమెరికా ప్రజల రక్షణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన విఫల విధానాలను తాము కొనసాగించలేమనీ, అమెరికా ప్రజల భద్రతే తనకు అత్యంత ప్రాధాన్య అంశమని ట్రంప్ పేర్కొన్నారు. కొత్త ఉత్తర్వులు అక్టోబరు 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిషేధాజ్ఞలు షరతులతో కూడుకున్నవి. అమెరికా పౌరుల భద్రత కోసం ఆయా దేశాలు అమెరికాతో కలసి పనిచేస్తే నిషేధాన్ని ఎత్తివేస్తారు. కొత్త ఉత్తర్వుల్లో ఇరాక్ ప్రజలను పూర్తిగా నిషేధించకుండా, వారు అదనపు తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తాజా ఉత్తర్వులపై అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ), ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ (ఏఏఏజే), కౌన్సిల్ ఆన్ ఆమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, నేషనల్ ఇమిగ్రేషన్ లా సెంటర్ తదితర సంఘాలు నిషేధాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చే వలసదారులు, శరణార్థులు, పర్యాటకులపై వివక్షను కొనసాగించడమేనని ఏఏఏజే ప్రతినిధి విమర్శించారు. -
నార్త్ కొరియాపై ట్రావెల్ బ్యాన్
సాక్షి, వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించేసింది. ఆదివారం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉ.కొ. తోపాటు వెనిజులా, ఛాద్ దేశాలకు కూడా ప్రయాణ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమా లియా, సూడాన్, యెమెన్ పౌరులపై 90 రోజుల పాటు నిషేధం విధిస్తూ జనవరిలో ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తాజా ఉత్తర్వుల్లో సుడాన్ పై నిషేధాజ్ఞలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. ‘అమెరికా రక్షణే నా ప్రథమ కర్తవ్యం. ఆయా దేశాల నుంచి ముప్పు ఉంది కాబట్టే వారిని అమెరికాలోకి అనుమతించటం లేదు’ అని ఆదేశాలు వెలువడిన కాసేపటికే ట్రంప్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మార్చి నుంచి అమలులోకి వచ్చిన ట్రావెల్ బ్యాన్ పై గడువు ఆదివారంతో ముగియటంతో సంబంధిత దేశాల ప్రజల్ని అమెరికాకు అనుమతిస్తారా? లేదా? అన్న విషయంపై తొలుత సందిగ్ధత నెలకొంది. అయితే అమెరికా సుప్రీం కోర్టు ఈ నిషేధంపై విచారణ జరిపేవరకు ప్రయాణ నిషేధాన్ని పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. -
మరింత కఠినంగా, సరికొత్తగా!
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాలపై విధించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులు ఆదివారం ముగియనున్న నేపథ్యంలో మరో దఫా ‘ట్రావెల్ బ్యాన్’కు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని మార్పులతో కూడిన కఠిన నియంత్రణలకు ఈసారి చోటు కల్పించేలా అధ్యక్షుడు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. అమెరికాతో సరిపడినంత సమాచారం పంచుకోని, తగిన భద్రతా చర్యలు తీసుకోని దేశాలపై సరికొత్త ఆంక్షలు విధించాలని అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ ట్రంప్‌కు సిఫార్సు చేసింది. ఈ నిబంధనలు దేశాన్ని బట్టి మారతాయని అధికారులు చెప్పారు. కొన్ని దేశాల పౌరుల తనిఖీని మరింత కఠినతరం చేసేలా తాజాగా ప్రతిపాదించామని ఆ శాఖ మంత్రి ఇలేన్ డ్యూక్ సలహాదారు మైల్స్ టేలర్ వెల్లడించారు. కొత్త విధానం ద్వారా ప్రభావితమయ్యే దేశాలేవో ప్రకటించని అధికారులు...దీనిపై ఎలా ముందుకు సాగాలో ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వలసదారుల గుర్తింపునకు సంబంధించి ఆయా దేశాలు అమెరికాతో సమాచారం పంచుకుంటున్నాయా? వచ్చే వారితో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందా? దేశాలు తమ పౌరులకు బయోమెట్రిక్ సమాచారంతో కూడిన పాస్‌పోర్టులను జారీచేశాయా? లాంటి ప్రాతిపదికనే సిఫార్సులు చేసినట్లు టేలర్ చెప్పారు. తొలి ట్రావె ల్ బ్యాన్ కన్నా బాగా సమాలోచనలు జరిపి సిఫార్సులను రూపొందించామని తెలిపారు -
నెక్ట్స్ ఎవరు..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తదుపరి ట్రావెల్ బ్యాన్ ఏ దేశంపై ప్రయోగిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. పలు కొత్త, అదనపు దేశాలు ఈ జాబితాలో చోటుచేసుకోనున్నాయని ప్రచారం సాగుతోంది. అమెరికాతో సమాచారం పంచుకోని దేశాలపై ఈసారి వేటు పడవచ్చని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు పేర్కొన్నారు.నియంత్రణలు ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉండవచ్చని చెప్పారు. గతంలో ఆరు ముస్లిం ప్రాబల్య దేశాల విజిటర్లపై విధించిన 90 రోజుల నిషేధం ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో తాజా జాబితాపై పలు ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఈ జాబితాలో ఏయే దేశాలు, ఎన్ని దేశాలు ఉంటాయన్న సమాచారం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై అధ్యక్షుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు, అటార్నీ జనరల్, విదేశాంగ మంత్రి టిల్లర్సన్లతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై సంప్రదింపులు జరిపారని తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని వైట్‌హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు. -
‘ట్రావెల్ బ్యాన్’కు రేపటితో ముగింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై 90 రోజుల పాటు విధించిన ప్రయాణ నిషేధం రేపటితో ముగియనుంది. దీంతో సంబంధిత దేశాల ప్రజల్ని అమెరికాకు అనుమతిస్తారా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే మరో 90 రోజుల పాటు లేదా కనీసం అక్టోబర్‌లో అమెరికా సుప్రీం కోర్టు ఈ నిషేధంపై విచారణ జరిపేవరకు ఈ ఆరు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచా రం. సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమా లియా, సూడాన్, యెమెన్ పౌరులపై 90 రోజుల పాటు నిషేధం విధిస్తూ జనవరిలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. -
అమెరికా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టులో స్వల్ప ఎదురు దెబ్బ తగిలింది. వివాదాస్పద ప్రయాణ నిషేధ ఉత్తర్వులను అమెరికా పౌరుల తాత–బామ్మ–అమ్మమ్మ, మనవడు, మనవరాళ్లతో పాటు ఇతర సన్నిహిత సంబంధీకులకు ప్రస్తుతానికి వర్తింపచేయరాదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘సన్నిహిత సంబంధం’పై ట్రంప్ ప్రభుత్వ నిర్వచనం విస్తృతంగా లేదని గతంలో హవాయ్ ఫెడరల్ జడ్జి డెర్రిక్ వాట్సన్ జారీచేసిన రూలింగ్‌తో ఏకీభవించింది. బుధవారం తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు...వాట్సన్ రూలింగ్‌లోని కొంత భాగంపై స్టే విధించింది. దీంతో 120 రోజుల పాటు శరణార్థులందరికీ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల నుంచి మినహాయింపు లభిస్తుందేమోనన్న ట్రంప్ ప్రభుత్వ బెంగ తీరినట్లయింది. -
'ట్రావెల్ బ్యాన్ పవర్ విమాన సంస్థకు లేదు'
న్యూఢిల్లీ: విమానంలోగానీ, ఎయిర్‌పోర్ట్‌లోగానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం సదరు విమానాయాన సంస్థకు లేదని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ అన్నారు. చట్టప్రతినిధులు కూడా పౌరులతోనే సమానం అని వారేదైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. గురువారం రాజ్యసభలో ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్ ఇండియా వంటి పలు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని, అసలు ఆ సంస్థలు అలా చేయొచ్చా అని కురియన్ను వివరణ కోరారు. దీనికి స్పందించిన కురియన్.. అగర్వాల్ చాలా విలువైన పాయింట్ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్ ఇండియా కానీ, మరింకేదైనా విమానయాన సంస్థకు గానీ అలాంటి అధికారం లేదని అన్నారు. 'ఏ ఒక్కరిని శిక్షించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఏ ఎంపీ అయినా నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలిగానీ, విమానాయాన సంస్థకాదు' అని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ జోక్యం చేసుకోని నేరాలనే మాట ఉపయోగించకుండా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ ఉల్లంఘనలు అనే పదం ఉపయోగించాలని కోరారు. అయితే, ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొట్టినప్పుడు నేరం అవుతుంది కదా అని వివరణ ఇచ్చారు. ఇటీవల ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అంతకుముందు శివసేన పార్టీ నేతలపై ఎయిర్ ఇండియాతోపాటు పలు విమాన సంస్థలు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. -
అమల్లోకి ట్రావెల్ బ్యాన్
అమెరికా విమానాశ్రయాల వద్ద తనిఖీలు ముమ్మరం వాషింగ్టన్: అమెరికాలో ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఆరు ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధానికి కొన్ని షరతులతో అమెరికా సుప్రీంకోర్టు అనుమతించడంతో శుక్రవారం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని గంటల కొద్దీ ప్రశ్నించారు. వారిలో కొందర్ని వెనక్కి పంపారు. మరోవైపు ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే.. వారికి న్యాయసాయం కోసం విమానాశ్రయాల వద్ద న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. న్యూయార్క్, లాస్ ఎంజెలెస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, వాషింగ్టన్, ఇతర నగరాల్లోని విమానాశ్రయాల్లో ఈ కేంద్రాలు వెలిశాయి. కొన్ని చోట్ల అరబిక్‌లో బ్యానర్లు దర్శనమిచ్చాయి. కొందరు కుటుంబసభ్యులకే అనుమతి కింది కోర్టులు విధించిన స్టేలతో ఐదు నెలలుగా ట్రావెల్ బ్యాన్ అమల్లోకి రాలేదు. ఇటీవల సుప్రీం కోర్టు స్టే ఎత్తివేసింది. నాటి నిషేధ ఉత్తర్వుల ప్రకారం.. ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ నుంచి వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటారు. శరణార్థులపై 120 రోజుల పాటు నిషేధం ఉంటుంది. అమెరికాలో సన్నిహితులుంటే మాత్రం అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు ట్రంప్ సర్కారును ఆదేశించింది. కాగా అమెరికన్ హోంల్యాండ్ భద్రతా విభాగం సన్నిహితుల జాబితాను తయారుచేస్తూ.. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, కోడలు, అల్లుడు, సోదరి, సోదరులు ఇలా కొందరినే ప్రవేశానికి అనుమతిస్తామంది. -
‘ట్రావెల్ బ్యాన్’కు అనుమతి
► ట్రంప్ నిషేధ ఉత్తర్వులపై స్టే ఎత్తేసిన అమెరికా సుప్రీంకోర్టు ► ప్రవేశ అర్హత ఉంటే అనుమతించాలని షరతు వాషింగ్టన్: ప్రయాణ నిషేధ ఉత్తర్వుల(ట్రావెల్ బ్యాన్) అమలులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్షిక విజయం సాధించారు. ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై పాక్షిక నిషేధానికి అనుమతిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.. జనవరిలో ట్రంప్ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల్ని కింది కోర్టులు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ఉత్తర్వుల్ని అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరిగి పునరుద్ధరిస్తూ... అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరు అర్హులన్న విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశించింది. అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించేందుకు అర్హులని స్పష్టం చేసిం ది. అలాగే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని పేర్కొంది. అక్టోబర్‌లో కేసు పూర్తి స్థాయి విచారణ వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి. కోర్టు ఉత్తర్వులు వెలువడ్డ 72 గంటల అనంతరం(జూన్ 29 నుంచి) నిషేధ ఉత్తర్వుల్ని అమలు చేస్తామని ట్రంప్ ఇంతకముందే పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలో ప్రవేశించడానికి వీలుండదు. అలాగే సిరియన్ శరణార్థులపై నిరవధికంగా నిషేధం కొనసాగుతుంది. అయితే అమెరికాలోకి ప్రవేశంపై ఏవరైనా కోర్టులో దావా వేస్తే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఆదేశించింది. అమెరికా భద్రత కోణంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సంపూర్ణ విజయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
భారత్‌కు పెరిగిన యూఎస్ వీసాలు
పాక్‌కు భారీ కోత ఇస్లామాబాద్: ట్రంప్ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ పెరిగింది. తాజాగా విడుదల చేసిన అధికారిక సమాచారంలో.. భారత జాతీయులకు వీసాల్లో 28 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు అమెరికా విధించిన ట్రావెల్ బ్యాన్ దేశాల్లో పాకిస్తాన్ లేకపోయినా ఆ దేశీయులకు వీసాల్లో మాత్రం భారీ కోత పెట్టారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లతో పోలిస్తే ఈ ఏడాది అవే నెలల్లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో పాక్ జాతీయులకు 40 శాతం తగ్గించారు. ఈ వివరాలను పాక్ మీడియా సోమవారం వెల్లడించింది. గతేడాది ఒబామా పాలనలో పాక్ జాతీయులకు 78,637 వీసాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నెలకు సరాసరి 6,553 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో 3,973, ఏప్రిల్‌లో 3,925 వీసాలు జారీ చేశారు. ఇక భారతీయులకు ఒబామా సర్కార్ గతేడాది 8,64,987 వీసాలు జారీచేసింది. ఆ ఏడాదిలో సరాసరి నెలకు 72,082 వీసాలు. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత జాతీయులకు 87,049, ఏప్రిల్‌లో 97,925 వీసాలు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తంగా చూస్తే పాకిస్తానే కాకుండా ముస్లిం దేశాలకు వీసాల జారీల్లో అమెరికా భారీ కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో 20 శాతం వీసాలు తగ్గించారు. ఇక ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలకు జారీ చేసిన వీసాల్లో 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది. -
ట్రావెల్‌బ్యాన్: ట్రంప్‌కు మరోషాక్
-
ట్రావెల్‌బ్యాన్: ట్రంప్‌కు మరోషాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మరోసారి చుక్కెదురైంది. ఏది ఏమైనా తాను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతానంటూ ఇటీవల ముస్లిం దేశాలనుంచి వలసల నిషేధ ఆర్డర్‌పై సంతకం చేసిన ట్రంప్‌కు అక్కడి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సవరించిన ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తేల్చి చెప్పింది. పేరుకు జాతీయ భద్రత లక్ష్యంగా ఉన్నప్పటికీ, మతపరమైన అసహనం, వివక్ష, వ్యతిరేక ధోరణి కనిపిస్తోందని గురువారం కోర్టు వ్యాఖ్యానించింది. అమెరికా సర్క్యూట్ అప్పిలేట్ లోని 4వ సర్య్కూట్ కోర్టు ఈ తీర్పు చెప్పింది. ట్రంప్ ఆర్డర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘింస్తోందని పేర్కొంది. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ల నుంచి ప్రజలకు వీసాలను నిషేధించడం రిపబ్లికన్ పరిపాలనను అడ్డుకుంటుందని తెలిపింది. ఈమేరకు కిందికోర్టు తీర్పును బలపరుస్తూ ట్రంప్ ఆర్డర్‌ను నిలిపివేసింది. అయితే ఈ తీర్పుపై ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని సమాచారం. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరనుంది. కాగా ఈ ఏడాది జనవరి 27న ముందు ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధం విధించగా తీవ్ర వ్యతిరేక రావడంతో ఆ జాబితా నుంచి ఇరాక్‌ను మినహాయించింది ట్రంప్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాలపై బ్యాన్‌ను కంటిన్యూ చేస్తూ సవరించిన ఆర్డర్‌పై ట్ంప్ సంతకం చేశారు. మే 16 నుండి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. -
ప్రధాన న్యాయమూర్తి విమానం ఎక్కకూడదట!
కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సహా మొత్తం ఏడుగురు న్యాయమూర్తులు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లకుండా చూడాలంటూ న్యూఢిల్లీలోని ఎయిర్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు. వాళ్ల మీద ఉన్న కేసులు తేలేవరకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. కోల్‌కతా న్యూటౌన్‌లోని రోజ్డేల్ టవర్స్‌లో గల తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కోర్టు నుంచి ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేఖర్, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పినకి చంద్రఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేయాలంటూ ఏప్రిల్ 13న జస్టిస్ కర్నన్ ఆదేశాలు ఇచ్చారు. వాళ్లంతా ఏప్రిల్ 28న తన ఇంట్లోని కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు సైతం ఇచ్చారు. అంతకుముందు జస్టిస్ కర్నన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, ఆరుగురు ఇతర న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. మార్చి 31న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైర్ అయిన 20 మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్నన్.. వాటిని ప్రధానమంత్రికి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వాటిని ఉపసంహరించుకోవాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సూచించగా, తనకు అంతకుముందున్న అధికారాలను పునరుద్ధరిస్తేనే అలా చేస్తానని ఆయన చెప్పారు. దానికి ధర్మాసనం తిరస్కరించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, మే 1న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈలోపు జస్టిస్ కర్నన్.. తనదైన శైలిలో ఈ ఆదేశాలు ఇచ్చారు. -
డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్!
-
ట్రంప్ పై వెనక్కి తగ్గిన టెక్ దిగ్గజాలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్‌బ్యాన్‌పై పోరాటానికి టెక్ దిగ్గజాలు వెనక్కి తగ్గాయి. ఏడు ముస్లిందేశాల ప్రజలపై విధించిన వీసా బ్యాన్పై ఆపిల్, గూగుల్, ఫేస్బుక్ సహా ఆరంభంలో తీవ్రంగా స్పందించిన దాదాపు 60 సంస్థలు ఈ పోరాటంనుంచి పక్కకు తప్పుకున్నాయి. ట్రంప్ జారీ చేసిన సెకెండ్ వెర్షన్ ఆర్డర్‌పై పోరాడేందుకు ఈ సంస్థలు నిరాకరించినట్టు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున మంగళవారం హవాయి ఫెడెరల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మైక్రోసాఫ్ట్, ఈ బే ఇంటెల్ కార్ప్, నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు సంతకం చేయలేదని సమాచారం. అయితే ఇంతకుముందు ఈ పోరాటంలో ఉన్న ఎయిర్ బీఎన్బీ, డ్రాప్‌బాక్స్, కిక్‌స్టార్ లాంటి ఇతర కంపెనీలు కొన్ని తాజా పిటిషన్ పై కూడా సంతకం చేశాయి. ట్రంప్ రెండవ బ్యాన్ ఆర్డర్ లో ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన దావాను సమర్ధించకూడదని 58 టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించుకున్నాయిట. అయితే ఈ వార్తలపై ఆపిల్, గూగుల్, ఈబే, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెంటనే స్పందించేందుకు నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెల ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే అమెరికాలోని వివిధ కోర్టులు సహా, పలు టెక్ సంస్థల నిరసనల నేపథ్యంలో ఇరాక్‌ను మినహాయించి, ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్ బ్యాన్)ను ప్రకటించారు. మరోవైపు ఈ ఆదేశాలను సైతం హవాయ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు మరికొన్ని గంటల్లో ఈ నిషేధం అమల్లోకి రానుండగా.. అధ్యక్షుడి తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఒకవైపు అమెరికా కోర్టులు ట్రంప్ బ్యాన్పై స్థిరంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంటే.. మరోవైపు ముందు దూకుడును ప్రదర్శించిన టెక్ దిగ్గజాలు తాజాగా వెనక్కి తగ్గడం ఆసక్తికరంగా మారింది. -
డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్!
తాజా ట్రావెల్ బ్యాన్‌ను సైతం నిలిపేసిన హవాయ్ కోర్టు న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా ట్రంప్ తీసుకొచ్చిన సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్ బ్యాన్)ను సైతం హవాయ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఆ ఆరు దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించవచ్చునని స్పష్టం చేశారు. గత నెల ఏడు ముస్లిం దేశాలకు ప్రజలు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఉత్తర్వులను పలు ఫెడరల్ కోర్టులు నిర్ద్వంద్వంగా నిలిపివేశాయి. దీంతో ఆ ఉత్తర్వులను వెనుకకు తీసుకున్న ట్రంప్ తాజాగా సవరించిన నిబంధనలతో ప్రయాణ నిషేధాజ్ఞలను పునరుద్ధరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చారు. ఈ సారి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చి ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. మరికొన్ని గంటల్లో ఈ నిషేధం అమల్లోకి రానుండగా.. అధ్యక్షుడి తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ దీనిని నిలిపివేశారు. -
ట్రంప్ తీరుతో ముప్పేనని 8 రోజులకే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 8 రోజుల్లోనే తాను వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశానని మహిళా ఉద్యోగి రుమానా అహ్మద్ తెలిపారు. ఎన్నికల సమయంలోనే ట్రంప్ ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన అధికారంలోకి వస్తే అంతే సంగతులని తాను అనుకున్నట్లే జరిగిందని ఆమె చెప్పారు. అధికారం చేపట్టగానే ఒబామా కేర్ రద్దు చేసిన ట్రంప్, అమెరికన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్న హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతో పాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేశారు. దీంతో తాను ట్రంప్ ప్రభుత్వంలో పనిచేయడం కష్టమేనని, ఎందుకంటే వైట్ హౌస్ లో బురఖాలో కనిపించే ఏకైక ముస్లిం ఉద్యోగిని తానేనని.. అక్కడ సేఫ్ కాదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. 'మా పేరేంట్స్ 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాను. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన నేను 2011లో వైట్ హౌస్ లో జాబ్ సంపాదించాను. అదే విధంగా జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్సీ)లోనూ పని చేశాను. ఉద్యోగానికి ఎప్పుడూ నేను బురఖా ధరించే వెళ్లేదాన్ని. ఒబామా ప్రభుత్వంలో నాకెలాంటి ఇబ్బందులు లేదు. అయితే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ముస్లింలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగం వదులు కోవాల్సి వచ్చిందని' రుమానా అహ్మద్ చెప్పుకొచ్చారు. జాబ్ మానేస్తున్నానని ఉన్నతాధికారులకు చెబితే.. జాబ్ ఒక్కటే మానేస్తున్నావా.. దేశం నుంచే వెళ్లిపోతున్నావా అని అడిగారని వెల్లడించారు. గతేడాది ఎన్నికల సమయం నుంచి అమెరికాలోని ముస్లింలు తమ పరిస్థితి ఎలా ఉండబోతుందని ఎంతో ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు మా ఆందోళనే నిజమైందని ఆమె చెప్పారు. ముస్లింలను దేశంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. అధ్యక్ష అధికార భవనం శ్వేతసౌధంలో బురఖా ధరించి కనిపించే తనపై తప్పకుండా వేటు వేస్తారని భావించి స్వయంగా రాజీనామా చేశానని రుమానా అహ్మద్ వాపోయారు. -
ట్రావెల్ బ్యాన్‌కు కొత్త ఆర్డర్: ట్రంప్
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ కోసం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వచ్చే వారంలోగా ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మొదట ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై యూఎస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన స్టేపై మాట్లాడిన ఆయన అంతిమంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని అన్నారు. అదీ కాకపోతే చాలా రకాల ఆప్షన్లు తన చేతిలో ఉన్నాయని చెప్పారు. నిషేధానికి మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెడతానని చెప్పారు. ఫ్లోరిడాకు విమానంలో వెళ్తున్న ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. దేశానికి భద్రత చాలా అవసరమని చెప్పారు. తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆర్డర్ల వల్ల వచ్చే వారం వరకూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇవ్వలేమని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇమిగ్రేషన్ కు సంబంధించి కొత్త భద్రతా నిబంధనలు ఉండే అవకాశం ఉంది. గత నెలలో ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాస్ చేసిన విషయం తెలిసిందే. -
ట్రంప్‌కు మళ్లీ షాక్
కింది కోర్టు ఆదేశాల నిలిపివేతకు నిరాకరించిన అప్పీలు కోర్టు ► నిషేధ ఉత్తర్వులపై తగిన ఆధారాలు చూపలేదన్న త్రిసభ్య ధర్మాసనం ► ‘సుప్రీంకోర్టులో చూసుకుందాం’ అంటూ ట్రంప్ ట్వీట్ శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల పౌరులపై నిషేధ ఉత్తర్వుల్ని పునరుద్ధరించేందుకు శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీల్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. జాతీయ భద్రత కోసం కింది కోర్టు ఆదేశాల్ని కొట్టివేయాలంటూ ప్రభుత్వం చేసిన వాదనను అప్పీలు కోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. ‘ప్రభుత్వం తన అప్పీలు సరైందని నిరూపించుకునేందుకు తగిన కారణాలు చూపలేదని నమ్ముతున్నాం. కార్యనిర్వాహక ఉత్తర్వులపై స్టే విధించడం వల్ల అమెరికాకు కోలుకోలేనంతగా నష్టం కలుగుతుందన్న వాదనకు సాక్ష్యాలులేవు. అందుకే కింది కోర్టు ఉత్తర్వులపై స్టే కోసం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తున్నాం’ అని తీర్పులో స్పష్టం చేసింది. ఆధారాలు చూపకుండా ఇదేం పని: ‘కార్యనిర్వాహక ఉత్తర్వుల అవసరమేంటో చెప్పేలా ఆధారాలు సమర్పించకుండా... కోర్టులు తమ నిర్ణయాల్ని పరిశీలించకూడదంటూ ప్రభుత్వం వాదన వినిపించింది. ఆ వాదనతో మేం విభేదిస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికాలో ప్రవేశించకుండా నిరోధించేందుకు ఈ ఉత్తర్వు ఉపకరిస్తుందన్న సర్కారు వాదనల్ని కోర్టు పరిగణించలేదు. ప్రమాదంలో అమెరికా భద్రత: ట్రంప్ తీర్పు తర్వాత ట్రంప్ స్పందిస్తూ... జాతీయ భద్రత ప్రమాదంలో ఉందంటూ ట్వీట్‌చేశారు. ‘సుప్రీంకోర్టులో చూసుకుందాం. ’ అని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ‘ఇది రాజకీయ నిర్ణయం... ఈ విషయాన్నికోర్టులోనే తేల్చుకుంటాం. మేం కేసు గెలవబోతున్నాం’ అంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తీర్పుపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ మాట్లాడుతూ... ‘రాజ్యాంగం విజయం సాధించింది. ప్రజాస్వామ్యానికి, అమెరికన్లకే కాకుండా ప్రపంచానికి ఇది అద్భుతమైన గెలుపు’ అని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలతోనైనా ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ ట్రంప్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ట్రంప్ తన ఉత్తర్వుల్ని రద్దు చేసి, దేశ భద్రత కోసం అందరికీ ఆమోదయోగ్య పరిష్కారంతో ముందుకు రావాలని డెమొక్రటిక్ సెనెటర్ చారెస్ షూమెర్ అన్నారు. కోర్టు తీర్పు రాజ్యాంగ విజయమని డెమొక్రటిక్ నేత నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. ‘వలసల రద్దు’ జడ్జీలకు భద్రత పెంపు వలసల రద్దుపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులకు భద్రత పెంచారు. వీరికి ట్రంప్ మద్దతుదారులనుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలోనే శాశ్వతంగా భద్రత పెంచినట్లు తెలిసింది. ‘వన్ చైనా’ను గౌరవిస్తాం: ట్రంప్ తైవాన్ పై సార్వభౌమాధికారం చైనాదేనని అంగీకరించే ‘వన్ చైనా’ విధానాన్ని గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ విధానాన్ని పున:సమీక్షించాల్సిందే ప్రకటిస్తూ వస్తున్న తాజాగా మాట మార్చారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు తొలిసారి ఫోన్ చేసిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ట్రంప్, జిన్ పింగ్ మధ్య ఫోన్ సంభాషణ సుహృద్భావ వాతావరణంలో సాగిందని వైట్‌హౌస్ తెలిపింది. అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్, ఇరాక్ ప్రధాని అబదీతోనూట్రంప్ గురువారం ఫోన్ లో సంభాషించారు. -
ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై తాను జారి చేసిన ట్రావెల్ నిషేధ ఉత్తర్వులను పునరుద్ధరించేందుకు ఫెడరల్ అప్పీళ్ల కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ట్రంప్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, యెమెన్, లిబియా తదితర ఏడు దేశాలపై ట్రంప్ ట్రావెల్ నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో ట్రంప్ ప్రభుత్వం అప్పీళ్ల కోర్టుకు ఆశ్రయించింది. ఇప్పుడు అప్పీళ్ల కోర్టులో కూడా ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ పరిస్థితుల్లో తమ ప్రభుత్వానికి నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఆశ్రయించాలన్న అంశంపై కసరత్తు జరుగుతోందని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. 1. నేరుగా సుప్రీం కోర్టుకెళ్లడం ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. అది కొంత కష్టమైన మార్గం. ఎందుకంటే సుప్రీం కోర్టులో నలుగురు కన్జర్వేటివ్ జడ్జీలు, నలుగురు లిబరల్ జడ్జీలు ఉన్నారు. తొమ్మిదవ పదవి ఖాళీగా ఉంది. దానికి నీలి గార్సచ్ అనే జడ్జీని ట్రంప్ నామినేట్ చేశారు. అయితే పదవి ధ్రువీకరణ జరిగి బాధ్యతలు స్వీకరించేందుకు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. 2. అప్పీల్ చేసుకోవడం ప్రస్తుతం ఫెడరల్ అప్పీళ్లలో కోర్టులో త్రిసభ్య బెంచీలోనే ట్రంప్ ఉత్తర్వులపై విచారణ జరిగింది. ఈసారి ఫుల్ బెంచీ, అంటే 11 మంది జడ్జీలుండే బెంచీకి అప్పీల్ చేసుకోవచ్చు. వారు కేసును మొదటి నుంచి విచారించి కొత్త ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. 3. మళ్లీ సియాటెల్ కోర్టుకు వెళ్లే అవకాశం సియాటెల్‌లో వారం రోజుల క్రితం ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న ఫెడరల్ జడ్జీ వద్దకే మళ్లీ వెళ్లవచ్చు. అప్పుడాయన 14 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సిన ప్రాథమిక తీర్పు కిందనే ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేశారు. దానిపై ఇంజెక్షన్ తీసుకొని ఈసారి పూర్తి స్థాయిలో విచారణ కోరవచ్చు. అప్పుడు వెలువడే తీర్పుపై కూడా అప్పీళ్లకు సుప్రీం కోర్టు వరకు వెళ్లవచ్చు. 4. మళ్లీ అధికారిక ఉత్తర్వులు ఇవ్వొచ్చు ట్రంప్ జారీ చేసిన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులో ఉన్న లోపాలను సవరించి మళ్లీ కొత్త ఉత్తర్వులను ఇవ్వొచ్చు. ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న ఈ ఏడు దేశాల ప్రజలకు కూడా ప్రస్తుతం జారీ చేసిన ట్రావెల్ ఉత్తర్వులు వర్తించేలా ఉన్నాయి. అలా కాకుండా ఈ ఏడు దేశాల నుంచి అమెరికాకు వచ్చే కొత్త ప్రయాణీకులకు మాత్రమే ఉత్తర్వులు వర్తించేలా సవరిస్తే సరిపోతుంది. ఇంటా బయటా విమర్శలు వచ్చిన నేపథ్యంతో ఇదే సరైనా పరిష్కారమార్గమని న్యాయసలహాదారులు కూడా ట్రంప్‌కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘ట్రంప్.. మాపై నిషేధం ఎత్తివేయండి ప్లీజ్’
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. తమ దేశంపై విధించిన ట్రావెలింగ్ బ్యాన్ తొలగించాలని కోరారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా అమాయకులైన తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్‌కు చెప్పారు. ఈ మేరకు ఇరాక్ అధికార ప్రతినిధి వివరాలు తెలియజేశారు. మొత్తం ఏడు ముస్లిం దేశాలపై అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రావెలింగ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో ఇరాక్ కూడా ఉంది. దీంతో ఈ నిర్ణయం నాటికి అమెరికా నుంచి ఇరాక్ వచ్చిన వారు.. అమెరికా వెళ్లాల్సిన వారికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన ట్రావెలింగ్ బ్యాన్ చెల్లదంటూ కిందిస్థాయి కోర్టు తొలుత అనంతరం ఫెడరల్ కోర్టు స్పష్టం చేయడంతో కొంత ఊరట కలిగినట్లయింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి అమెరికాలో అడుగుపెడుతున్నారు. అయితే, ఇప్పటికి కూడా ఆ ఏడు ముస్లిం దేశాల్లో ఏ దేశంపై కూడా ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గకపోగా ఆ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై ట్రావెల్ బ్యాన్ తొలగించాలని అబాదీ కోరారు. వాస్తవానికి ఇరాక్‌కు ఆర్ధికంగా, రాజకీయంగా, సైనిక రక్షణపరంగా ప్రపంచంలోనే అత్యధిక సహాయం అందుతుంది ఒక్క అమెరికా నుంచే. ఈ విషయాలు కూడా ట్రంప్‌కు అబాదీ గుర్తు చేసినట్లు తెలిసింది. సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి (ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!) (‘నిషేధం’పై వెనక్కి!) (డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!) (ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!) -
ట్రంప్‌కు మరో కోర్టు షాక్!
న్యూయార్క్: అమెరికాలోకి ప్రవేశించే ఏడు ముస్లిం దేశాల పౌరులపై కఠిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ట్రావెల్ బ్యాన్ అమలు చేసేందుకు నిరాకరిస్తూ అప్పీల్ కోర్టు తీర్పు వెల్లడించింది. అప్పీల్ కోర్టు వెల్లడించిన ఈ తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం న్యాయస్థానాల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు దేశభద్రతను పణంగా పెట్టాయని ఆయన విమర్శలు చేస్తున్నారు. అప్పీల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ స్పష్టం చేశారు. -
ట్రంప్ జిత్తులంటే ఇవే మరి!
ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాను వదిలేసి, కొన్ని టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియా, టర్కీ దేశాలను కాదని సిరియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, సూడాన్, సోమాలియా, లిబియా లాంటి ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రయాణ ఆంక్షలు విధించారబ్బా! అన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆయన నక్క జిత్తులు ఏమిటో బయటపడ్డాయి. ట్రావెల్ ఆంక్షలు విధించిన ఈ ఏడు ముస్లిం దేశాలతో ట్రంప్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రెండు లగ్జరీ భవనాలకు తన పేరును ఉపయోగించుకునేందుకు ట్రంప్ లైసెన్స్ ఇచ్చారు. అందుకు ఆయనకు 2015లో 50 లక్షల డాలర్లు రాయల్టీ కింద దక్కాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ట్రంప్ బ్రాండ్‌తో రెండు రిసార్ట్లు నిర్మిస్తున్నారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పలు లగ్జరీ విల్లాస్, ఓ గోల్ఫ్ కోర్స్ నిర్మాణంలో డోనాల్డ్ ట్రంప్‌కు వ్యాపార భాగస్వామ్యం ఉందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఓ హోటల్ నిర్మించాలని ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ గతంలో ప్లాన్ తయారుచేసింది. అయితే దాన్ని ఇటీవల ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అయితే సౌదీ అరేబియా యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ అల్సౌద్తో గతంలో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టెర్రిరిస్టుల నుంచి ముప్పుందన్న కారణంగా ఈ ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు విధించడం, ఇప్పుడు అది అమెరికా కోర్టులో చిక్కుకోవడం తెలిసిందే. పైగా ఈ ఏడు దేశాల నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదు. గత 40 ఏళ్లలో టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనుమానం లేదా ఆరోపణలతో ఈ దేశాలకు చెందిన కేవలం 17 మందిని మాత్రమే అమెరికా అరెస్ట్ చేసింది. వారు పాల్గొన్న ఏ టెర్రరిస్టు ఘటనల్లో కూడా 40 ఏళ్లలో ఒక్కరూ చనిపోలేదు. మరెందుకు ఈ ఏడు దేశాలపైనే ఆయన ఆంక్షలు విధించారు? ఆయన అంతరంగం ఏమిటి? ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు ఆయన లోగుట్టు బయట పడుతుందేమో! -
‘కొత్త దేశాలను చేర్చే ఉద్దేశం ఇప్పటికైతే లేదు’
వాషింగ్టన్: మరిన్ని దేశాలపై అమెరికా ట్రావెలింగ్ బ్యాన్ విధించే ఉద్దేశం ఇప్పట్లో లేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న దేశాల జాబితాలో ఒక్క దేశాన్ని కూడా అదనం చేర్చడంగానీ, తీసివేయడం జరగదని బుధవారం శ్వేతసౌదం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇప్పటికిప్పుడు కొత్త దేశాలను ట్రావెలింగ్ నిషేధిత దేశాల జాబితాలో చేర్చే ఉద్దేశం, ఆలోచన లేదు’ అని శ్వేత సౌదం మీడియా ప్రతినిధి సియాన్ స్పైసర్ బుధవారం చెప్పారు. ప్రస్తుతం ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాల అంశాలపైనే కొత్త పరిపాలన వర్గం దృష్టిని సారించిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై తుది నిర్ణయానికి రాలేదని సమీక్ష పూర్తయ్యాక వివరాలు అందిస్తామని తెలిపారు. -
నిషేధంపై తగ్గేది లేదు
కోర్టులో మాదే విజయం: ట్రంప్ సర్కారు ట్రంప్ ఉత్తర్వులపై అప్పీల్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ బుధవారం ఉదయం తీర్పు వెలువడే అవకాశం(భారత కాలమానం) వాషింగ్టన్/లండన్: ట్రావెల్ బ్యాన్పై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కారు తేల్చి చెప్పింది. కోర్టులో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా ప్రయోజనాల కోసమే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించారంటూ వైట్‌హౌస్ మంగళవారం మరోసారి వివరణిచ్చింది. ‘న్యాయం అధ్యక్షుడి వైపే ఉంది. రాజ్యాంగం కూడా ట్రంప్‌కు అనుకూలంగా ఉంది. అమెరికా ప్రజల రక్షణ కోసం, దేశ ప్రయోజనాల్ని ఆశించి విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ విలేకరుల సమావేశంలో వెల్ల ్లడించారు. ప్రయాణపు నిషేధ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించగా... ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ‘అమెరికా ఈ తీరం నుంచి ఆ తీరం వరకూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ప్రజల నుంచి మద్దతుంది. మేం మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తాం. దేశ, ప్రజల భద్రతకు అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారు’ అని స్పైసర్ పేర్కొన్నారు. దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.. ట్రంప్: మరోవైపు ట్రంప్ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్ర ముప్పును మీడియా తక్కువ చేసి చూపుతోందని ఆయన ఆరోపించారు. ‘9/11 దాడులు, బోస్టన్, ఆర్లాండో, శాన్ బెర్నార్డినో, యూరప్‌లో దాడులకు పాల్పడిన రీతిలో అమెరికాపై మళ్లీ దాడులకు ఇస్లామిక్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు’ అని అన్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంటులో ట్రంప్ ప్రసంగం వద్దు’ బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించకూడదని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కౌవ్ సోమవారం అన్నారు. జాత్యహంకారం, స్త్రీలపై వివక్షకు తాము వ్యతిరేకమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వెంటనే దీనిపై అధికార పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకోవడమనేది దానంతట అదే వచ్చే హక్కు కాదనీ, సంపాదించుకోవాల్సిన గౌరవమని జాన్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగానికి తాను ముందు నుంచే వ్యతిరేకమనీ, ఏడు ముస్లిం దేశాల వలసదారులపై ట్రంప్ నిషేధం విధించిన తర్వాత ఆ వ్యతిరేకత మరింత పెరిగిందని జాన్ అన్నారు. జాన్ ఈ మాటలు చెబుతున్నప్పుడు సభలోని కొంత మంది సభ్యులు లేచి చప్పట్లు కొట్టారు. జాన్ వ్యాఖ్యలను అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తప్పుబట్టారు. తటస్థంగా ఉండాల్సిన స్పీకర్ ఆయన బాధ్యతలను మరిచారనీ, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని థెరిసా ట్రంప్‌ను బ్రిటన్ రావాల్సిందిగా ఇటీవలే ఆహ్వానించారు. అప్పీలు కోర్టు తీర్పుపై ఉత్కంఠ ట్రావెల్ బ్యాన్పై నేడు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) శాన్ఫ్రాన్సిస్కో తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టులో విచారణ కొనసాగనుంది. గత శుక్రవారం ట్రంప్ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి తాత్కాలిక నిషేధం విధించారు. ఆ తీర్పుపై ట్రంప్ సర్కారు శాన్ఫ్రాన్సిస్కోలోని అప్పీల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కింది కోర్టు స్టే ఆదేశాల్ని కొట్టివేయాలని, అధ్యక్షుడి ఉత్తర్వులు అమలయ్యేలా అనుమతివ్వాలంటూ చేసుకున్న అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. పూర్తి స్థాయి విచారణ లేకుండా కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయలేమంది. నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు ప్రభుత్వ అప్పీలుపై స్పందించాలని, అలాగే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పీల్ కోర్టులో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు డెమొక్రాట్ల హయాంలో, ఒకరు రిపబ్లికన్ హయాంలో నియమితులవడం తీర్పును ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికాలోకి ఏ దేశాలవారు ప్రవేశించాలన్న అంశంలో అధికారం అధ్యక్షుడికే ఉంటుందని ప్రభుత్వం వాదిస్తుండగా... రాష్ట్రాలు, ఫెడరల్ న్యాయవాదులు మాత్రం ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ వాదనలు వినిపిస్తున్నారు. న్యాయపోరాటంలో 127కు చేరిన కంపెనీలు వలస ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రముఖ దిగ్గజ కంపెనీల న్యాయ పోరాటంలో తాజాగా మరో 31 కంపెనీలు జత కలిశాయి. ఈ మేరకు టెల్సా, స్పేస్ఎక్స్ కంపెనీలతో పాటు కాస్పర్, స్లాక్ వంటి సంస్థలు సోమవారం తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న అమెరికన్ కంపెనీల సంఖ్య 127కు చేరింది. అమెరికా తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టుకు దాదాపు ఆదివారం 97 కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, తమ కంపెనీలకు నష్టం కలిగిస్తాయంటూ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్, ట్వీటర్, ఈబే, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు పిటిషన్లో పేర్కొన్నాయి. ‘నైపుణ్యం కలిగిన వలసదారులు విదేశాల్లో ఎంతో కష్టపడి పనిచేస్తారు. అలాంటి చోట వారు, వారి సహచరులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండాలి. అలాగే వలసదారుల హోదా అకస్మాత్తుగా తొలగించరనే హామీనివ్వాలి’ అని తమ విజ్ఞప్తిలో కంపెనీలు పేర్కొన్నాయి. టెక్ కంపెనీలతో పాటు జీన్స్ తయారీ సంస్థ లెవీ స్ట్రాస్, ఉబర్, మొజిల్లా, డ్రాప్‌బాక్స్ వంటి సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి. నిధుల సేకరణ సమన్వయంలో గూగుల్ ట్రంప్‌కు వ్యతిరేకంగా కంపెనీల న్యాయపోరాటానికి అవసరమైన నిధుల్ని సమకూర్చే పనిని గూగుల్ సమన్వయం చేస్తుంది.. గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది. -
ట్రంప్‌పై టెక్ వార్.. మాజీ కార్యదర్శుల మద్దతు
వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా టెక్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లకు అమెరికా మాజీ కార్యదర్శులు జాన్ కెర్రీ, మడెలైన్ అల్బర్ట్ లు మద్దతు తెలిపారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై అమెరికాకు చెందిన 100 టెక్నాలజీ కంపెనీలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ వల్ల అమెరికా వ్యాపారపరంగా, అభివృద్ధిపరంగా.. తీవ్రంగా నష్టపోతుందని తాము వేసిన జాయింట్ పిటిషన్లో పేర్కొన్నాయి. ప్రఖ్యాత కంపెనీలైన ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఈబే, ఉబెర్, ట్విట్టర్లు పిటిషన్ దాఖలు చేసిన కంపెనీల్లో ఉన్నాయి. (ట్రంప్‌పై టెక్ దిగ్గజాల లీగల్ వార్) ట్రంప్ నిర్ణయం వల్ల దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుందని, ప్రపంచదేశాల్లో ఉన్న అమెరికా బలగాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన ఎంతో మంది వారి పరిశోధనలతో అమెరికా అభివృద్ధి కారణమయ్యారని టెక్ కంపెనీలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి. కాగా, ట్రంప్ ట్రావెల్ నిషేధాన్ని సీటెల్ కోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్ దేశభద్రతకు ముప్పువాటిల్లితే ఆ బాధ్యత సదరు జడ్జి, న్యాయవ్యవస్ధ స్వీకరించాలని అన్నారు. ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ నిలుపుదల అంశం అమెరికా సుప్రీంకోర్టులో ఉంది. -
ట్రంప్‌పై టెక్ లీగల్ వార్ షురూ!
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై టెక్ దిగ్గజాల లీగల్ వార్ షురూ అయింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు అమెరికా కోర్టులో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని టెక్ దిగ్గజాలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి. అప్పీల్స్ కోర్టు తొమ్మిదవ సర్క్యూట్లో ఈ మోషన్‌ను టెక్ కంపెనీలు ఆదివారం దాఖలు చేశాయని సీఎన్ఎస్ మనీ రిపోర్టు చేసింది. ఇదే కోర్టులో ఆదివారం ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్మిగ్రేషన్, ఆర్థిక వృద్ధి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని లీగల్ బ్రీఫింగ్లో పేర్కొన్నాయి.. ట్రంప్ ఆదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తుందని టెక్ కంపెనీలు చెప్పాయి. అయితే ట్రంప్ బ్యాన్పై టెక్ కంపెనీలు ఫైల్ చేసిన లీగల్ పిటిషన్ ఇదే మొదటిది కాదు. అంతకముందే అమెజాన్, ఎక్స్పీడియాలు వాషింగ్టన్ అటార్నీ జనరల్స్ దావాలో తమ మోషన్స్ పిటిషన్లను ఫైల్ చేశాయి. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు తమ ఉద్యోగులు, బిజినెస్‌లపై ప్రభావం చూపుతాయని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. ట్రంప్ జారీచేసిన వివాదాస్పదమైన ఈ ఆర్డర్‌పై టెక్ కంపెనీలు చాలా గుర్రుగా ఉన్నాయి. ట్రంప్‌ను న్యాయపరంగా విచారణకు ఎదుర్కోవాలని టెక్ దిగ్గజాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తాత్కాలిక ఈ ట్రావెల్ బ్యాన్ ఏడు ముస్లిం దేశాలపై ప్రభావం చూపనుంది. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ దేశాల పౌరులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా ఈ ట్రావెల్ బ్యాన్‌ను ట్రంప్ జారీచేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన టెక్ దిగ్గజాలు.. AdRoll Aeris Communications Airbnb AltSchool, PBC Ancestry.com Appboy Apple AppNexus Asana Atlassian Corp Autodesk Automattic Box Brightcove Brit + Co CareZone Castlight Health Checkr Chobani Citrix Systems Cloudera Cloudflare Copia Institute DocuSign DoorDash Dropbox Dynatrace eBay Engine Advocacy Etsy Facebook Fastly Flipboard Foursquare Labs Fuze General Assembly GitHub Glassdoor Google GoPro Harmonic Hipmunk Indiegogo Intel Jand, Inc. doing business as Warby Parker Kargo Global Kickstarter, PBC Kind Knotel Levi Strauss & Co. LinkedIn Lithium Technologies Lyft Mapbox Maplebear Inc. d/b/a Instacart Marin Software Medallia A Medium Corporation Meetup Microsoft Motivate International Mozilla Netflix Netgear NewsCred Patreon PayPal Holdings Pinterest Quora Reddit Rocket Fuel SaaStr Salesforce.com Scopely Shutterstock Snap Spokeo Spotify USA Square Squarespace Strava Stripe SurveyMonkey TaskRabbit Tech:NYC Thumbtack Turn Twilio Twitter Turn Uber Technologies Via Wikimedia Foundation Workday Y Combinator Management Yelp Zynga -
అమెరికా ఎయిర్‌పోర్టుల్లో అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: సాధారణంగా పాశ్చాత్య దేశాలంటే బంధాలు, భావోద్వేగాలు చాలా తక్కువని అంటుంటారు. విడిపోవడం దూరంగా ఉండటం షరామాములే అని చెబుతుంటారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని ఎమోషన్స్‌లో కూడా వారు తక్కువేం కాదని తెలిసింది. ఓ సెంటిమెంట్ సీన్ సమయంలో నేపథ్య సంగీతం వస్తూ ప్రేక్షకులను సీట్లో ఎలా కట్టిపడేస్తుందో అలాంటి సంగీతం అక్కడ లేకపోయినా అదే అనుభూతినిచ్చేలా అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో అద్భుతమైన దృశ్యాలు గుండెను తట్టి లేపాయి. దాదాపు వారం రోజుల తర్వాత తమవారిని తిరిగి కలుసుకుంటున్న తరుణంగా ఏర్పడిన భావోద్వేగ సన్నివేశాలు కోకొల్లలుగా దర్శనం ఇచ్చాయి. భార్యకోసం భర్త, తల్లిదండ్రుల కోసం పిల్లలు, తమ బంధువుల కోసం అయినవారి ముఖాలు ఒక్కసారిగా విచ్చిన మొగ్గల్లా మారిపోయాయి. అమాంతం ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకుంటుండగా చూస్తున్నవారంతా వావ్ అంటూ కేకలు పెడుతూ చప్పట్లతో అభినందిస్తూ వారు కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. ఉదాహరణకు ‘డల్లాస్‌కు చెందిన అహ్మద్ అబ్దుల్లా సోమాలియా సంతతికి చెందిన అమెరికన్. ఆయన గత నాలుగు రోజులుగా తన భార్యకోసం ఎదురుచూస్తున్నాడు. ఏడు ముస్లిందేశాల ట్రావెలింగ్ వీసాలపై ట్రంప్ నిషేధం విధించిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయింది. తిరిగి ఇటు వచ్చే క్రమంలో అక్కడే గ్రీన్ కార్డు తీసుకోవడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో పిల్లలతో సహా నిలిచిపోయింది. దీంతో ఇక తాము కలవగలమా అని ఎదురుచూస్తున్న అతడికి ఇటీవల అమెరికా కోర్టు ట్రంప్ నిబంధనలు చెల్లవని చెప్పిన నేపథ్యంలో ఆశలు చిగురించాయి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికా నిరభ్యంతరంగా రావొచ్చని చెప్పిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్ నుంచి బయలు దేరి రావడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అలాగే, కావేహ్ యూసెఫీ అనే యువకుడి తల్లిదండ్రులు ఇరాన్ నుంచి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అతడు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. వీసా నిబంధనలు పక్కకుపోయిన నేపథ్యంలో వారు తిరిగి అమెరికా రావడంతో వీల్ చైర్లో ఉన్న తల్లిని చూసి ఆ కుమారుడు మురిసిపోయాడు. ఇలా ఒక్కటేమిటి దాదాపు అన్ని అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి. సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి (ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!) (‘నిషేధం’పై వెనక్కి!) (డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!) (ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!) -
డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!
వాషింగ్టన్: అమెరికాకు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. అధ్యక్షుడు ట్రంప్ విధించిననిషేధంపై ఇటీవల సియాటిల్ కోర్టు స్పందిస్తూ.. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి పూర్తిస్థాయిలో కోర్టు ఉత్తర్వులను పాటించనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. వీసా ఉన్న వారిని పూర్తి స్థాయిలో అమెరికాకు అనుమతిస్తున్నామని, వారిపై ఎలాంటి నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు. వీసా ఆంక్షలను ఎత్తివేయడంతో అమెరికా, ఇతర దేశాల దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ నిషేధిత దేశాల ప్రయాణికులను ఖతర్ ఎయిర్ వేస్ విమానాల్లోకి అనుమతిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ మాత్రం తనమీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమివేస్తున్నారని ఆరోపించిన ట్రంప్.. ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా మండిపడ్డారు. -
ట్రంప్ విధానాలపై లండన్ 'గరంగరం'
లండన్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ఆంక్షలు కఠినం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాతో పాటు బ్రిటన్‌లోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో శనివారం వేల సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులు.. నిషేధాన్ని ట్రంప్ వెనక్కితీసుకోవాలని నినాదాలు చేశారు. స్టాప్ ద వార్ కోలిషన్, స్టాండ్ అప్ టు రెసిజమ్, ముస్లిం అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్‌తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని థెరిసా మే.. డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వనించడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సెంట్రల్ లండన్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి డౌనింగ్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఈ మార్చ్‌లో.. ట్రంప్ తీసుకున్న బ్యాన్ నిర్ణయం ముమ్మాటికీ 'రేసిస్టు' విధానమే అని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్, థెరిసా మే లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించారు. ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న వెంటనే బ్రిటన్‌లో నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటిస్తే.. అది బ్రిటన్ రాణికి అవమానం అని, ఈ పర్యటనను ఆపాలని ప్రభుత్వాన్ని కోరిన పిటిషన్‌పై 1.8 మిలియన్ల మంది సంతకాలు చేయడం అక్కడ ట్రంప్ విధానాలపై ఉన్న వ్యతిరేకతను సూచిస్తోంది. -
అలా అయితే చాలా ట్రబులే: ట్రంప్
ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ స్పందించారు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మాత్రం తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందన్నారు. ఒక దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రావద్దో చెప్పలేనప్పుడు.. అందులోనూ అది భద్రతా కారణాలకు సంబంధించి అయినప్పుడు అది చాలా పెద్ద ట్రబుల్ అవుతుందని తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఇరాన్ అణుపరీక్షలు నిర్వహించడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆ దేశం మీద ఆంక్షలు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని సైతం ట్విట్టర్ ద్వారానే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు. ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా ఆయన మండిపడ్డారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమేయాలనుకుంటున్నారని, ఆయన నిర్ణయం పనికిమాలినదని, దాన్ని కొట్టిపారేస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు కూడా ట్రావెల్ బ్యాన్‌తో ఏకీభవించాయని, కొంతమందిని దేశంలోకి అనుమతిస్తే అది మరణం, విధ్వంసమే అవుతుందన్న విషయం వారికి తెలుసని చెప్పారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సరైన కవరేజి ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాత్రం ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోవట్లేదన్నారు. When a country is no longer able to say who can, and who cannot , come in & out, especially for reasons of safety &.security - big trouble! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 Interesting that certain Middle-Eastern countries agree with the ban. They know if certain people are allowed in it's death & destruction! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 The opinion of this so-called judge, which essentially takes law-enforcement away from our country, is ridiculous and will be overturned! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 After being forced to apologize for its bad and inaccurate coverage of me after winning the election, the FAKE NEWS @nytimes is still lost! — Donald J. Trump (@realDonaldTrump) 4 February 2017 -
ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎద్దురు దెబ్బతగిలింది. ఏడు దేశాల ముస్లిం ప్రజలపై అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. అమెరికా జిల్లాకోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ శుక్రవారం ఈ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై స్పందించిన అటర్నీ జనరల్ ఫెర్గూసన్ రాజ్యాంగం నేడు విజయం సాధించిందనీ, ప్రెసిడెంట్ తో సహా అందరూ చట్టానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు. ప్రజలపై మతపరమైన వివక్షను ప్రదర్శించడం, నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఫెర్గూసన్ తెలిపారు. ట్రంప్ నిషేధం పై దావా వాషింగ్టన్ రాష్ట్రం దాఖలు చేయగగా, ఆ తరువాత మిన్నెసోటా కూడా జత కలిసింది. కాగా ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికా రాకుండా ట్రంప్ విధంచిన ఆంక్షల ఆదేశాలపై అమెరికా పౌర హక్కుల నేతల పిటిషన్‌ను విచారించిన డిస్ట్రిక్ట్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అటు ట్రంప్ వివాదాస్పద నిర్ణయంపై వ్యతిరేకంగా అమెరికా టెక్ దిగ్గజాలుకూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రావెల్ బ్యాన్ ఆదేశాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. -
ప్లీజ్ వారిని మినహాయించండి: మైక్రోసాప్ట్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాత్కాలిక ట్రావెల్ బ్యాన్పై తీవ్ర విమర్శల గళం వినిపించిన సిలికాన్ దిగ్గజం మైక్రోసాప్ట్, విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఈ ఆర్డర్లను మార్చాలని అభ్యర్థిస్తోంది. వర్కర్లను, స్టూడెంట్లను ఈ నిషేధం నుంచి మినహాయించాలని కోరుతూ ట్రంప్ కార్యాలయానికి ఓ అధికారిక ఫిర్యాదును పంపించింది. తమను, ఇతర కంపెనీలను ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల నుంచి మినహాయించాలని దీనిలో పేర్కొంది. ట్రంప్ ఇటీవల జారీచేసిన కార్యానిర్వాహక ఆదేశాలతో ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను తాత్కాలికంగా అమెరికాలోకి ప్రవేశించడం నిషేధించారు. గత శుక్రవారం ఈ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. దీన్ని ఫలితంగా ఇరాన్, ఇరాక్, యెమెన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా ప్రజలు అమెరికాలోకి ప్రవేశించడం నిషేధం. బాధ్యత తెలిసిన ప్రయాణికులను దేశంలోకి పునఃప్రవేశించడాన్ని అనుమతించాలని కోరుతూ మైక్రోసాప్ట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ స్మిత్ ఓ అధికారిక అభ్యర్థనను ట్రంప్ కేబినెట్ ఆఫీసర్లకు పంపారు. అదేవిధంగా దేశీయ భద్రతను పరిరక్షించాలన్నారు. ఉద్యోగులకు స్పాన్సర్ చేసే వర్క్ వీసాలు లేదా స్టూడెంట్ల వీసాలను ఈ ఆర్డర్ల నుంచి మినహాయించాలని కోరారు. ఈ నిషేధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపిందని మైక్రోసాప్ట్ పేర్కొంది. ట్రంప్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ పలు విమానశ్రయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
అమెరికా తర్వాత కువైట్ కూడా...
ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా తీసుకున్న వివాదాస్పద నిర్ణయ బాటలోనే కువైట్ కూడా నడుస్తోంది. ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులకు వీసాలు జారీచేయడం నిలిపివేస్తున్నట్టు కువైట్ ప్రకటించింది. అమెరికా మాదిరి కువైట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంలో సిరియా, ఇరాక్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్‌తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఈ ఐదు దేశాలకు టూరిజం, ట్రేడ్, విజిటర్ వీసాలను కఠినతరం చేస్తున్నట్టు స్పుత్నిక్ న్యూస్ రిపోర్టు చేసింది. నిషేధం విధించిన ఈ ఐదు దేశాలకు చెందిన వలసవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ వీసాల కొరకు దరఖాస్తు చేసుకోవద్దని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. కువైట్ సిటీ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ముప్పుతో తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశాలపై నిషేధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. 2015లో మిలిటెంట్ల గ్రూప్ షియా మసీదుపై బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 27 మంది కువైట్ ప్రజలు చనిపోయారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు ఓ వైపు విమర్శల గళం వినిపిస్తుండగానే.. ఆయన కార్యనిర్వాహక ఆదేశాలకు ప్రాముఖ్యం కల్పిస్తూ సిరియన్ ప్రజలను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తూ కువైట్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. 2011లో కూడా కువైట్ నగరం సిరియన్లందరికీ వీసాలను ఇవ్వడం నిలిపివేసింది. -
వైట్‌హౌస్‌ను వీడాక తొలిసారి ట్రంప్‌పై ఒబామా..!
వైట్‌హౌస్‌ను వీడిన పదిరోజుల తర్వాత తొలిసారి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయ అంశంపై స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ట్రావెల్ నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు. 'దేశవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న ఉద్యమంతో ఒబామా కదిలిపోయారు' అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఒకచోట గుమిగూడి.. ఎన్నికైన నేతలకు తమ గళం వినిపించేందుకు పౌరులు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నారు. అమెరికా విలువలు ప్రమాదంలో పడినప్పుడు పౌరుల కర్తవ్యం ఇది' అని పేర్కొన్నారు. సిరియా, ఇరాక్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆదేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ఈ అంశంపై ఆయన స్పందించారు. మతం, విశ్వాసం ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని సైద్ధాంతికంగా ఒబామా ఏకీభవించడం లేదని, ఆయన విదేశాంగ విధాన నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని చాటుతాయని ఆయన కార్యాలయం పేర్కొంది. ముస్లింలపై నిషేధం విషయంలో తాను కూడా ఒబామా విధానాలనే అనుసరిస్తున్నా అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఆయన కార్యాలయం ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. '2011లో అధ్యక్షుడు ఒబామా అనుసరించిన విధానాలే నేను కూడా అనుసరిస్తున్నా. 2011లో ఇరాక్ నుంచి వచ్చే శరణార్థులపై ఒబామా నిషేధం విధించారు' అని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!
లాహోర్: అమెరికాలోకి ముస్లింల రాకపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశాల నేపథ్యంలో క్రికెటర్, పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు రాకుండా పాకిస్థానీయులపై కూడా ట్రంప్ నిషేధం విధిస్తారని ఆశిస్తున్నానని, దీనివల్ల పాకిస్థానీలు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'చాలామంది పాకిస్థానీలు కూడా అమెరికా వీసా ఆంక్షలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పాకిస్థానీలకు వీసాలు ఇవ్వొద్దని ట్రంప్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మాకు మేలు చేస్తుంది. మేం మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం' అని ఆయన అన్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్థాన్‌పై కూడా భవిష్యత్తులో నిషేధం విధించే అవకాశముందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తలనొప్పి వచ్చినా విదేశాలకు వెళుతున్నారని, అమెరికా పాకిస్థానీయులపై నిషేధం విధిస్తే ఈ పరిస్థితి మారి.. ఆయన దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశముందని పేర్కొన్నారు.