వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాలు లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు అవరోధం తొలగింది. ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతోపాటు అధ్యక్షుడి ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్‌లో ట్రావెల్ బ్యాన్‌కు సంబంధించి అధ్యక్షుడి ఉత్తర్వులపై పూర్తిస్థాయి విచారణ చేపడతామంది. ఈ ఆరు దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారి దగ్గరి సంబంధీకులమంటూ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, ఈ మినహాయింపుల అనంతరం దేశంలోకి ప్రవేశించిన ఈ దేశాల వారికి తాజా ఉత్తర్వులూ వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment