
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై 90 రోజుల పాటు విధించిన ప్రయాణ నిషేధం రేపటితో ముగియనుంది. దీంతో సంబంధిత దేశాల ప్రజల్ని అమెరికాకు అనుమతిస్తారా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే మరో 90 రోజుల పాటు లేదా కనీసం అక్టోబర్‌లో అమెరికా సుప్రీం కోర్టు ఈ నిషేధంపై విచారణ జరిపేవరకు ఈ ఆరు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచా రం. సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమా లియా, సూడాన్, యెమెన్ పౌరులపై 90 రోజుల పాటు నిషేధం విధిస్తూ జనవరిలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.