ట్రంప్‌ నిర్ణయంతో ఆసియా మార్కెట్లు షేక్‌.. | Asia Stocks Sink After US Bans Europe Travel | Sakshi
Sakshi News home page

ఆసియా మార్కెట్ల పతనం

Published Thu, Mar 12 2020 8:38 AM | Last Updated on Thu, Mar 12 2020 8:47 AM

Asia Stocks Sink After US Bans Europe Travel - Sakshi

ట్రంప్‌ నిర్ణయంతో ఆసియా మార్కెట్ల పతనం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కలకలంతో యూరప్‌ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తూ అమెరికా నిర్ణయించడంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించడంతో పతనమైన ఆసియా మార్కెట్లు ట్రంప్‌ నిర్ణయంతో కుప్పకూలాయి. ఈ రెండు నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై గణనీయ ప్రభావం పడుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఆసియా సూచీలు అట్టడుగుకు దిగజారాయి.

టోక్యో బెంచ్‌మార్క్‌ నిక్కీ ఏకంగా 1051 పాయింట్లు పడిపోగా, టోపిక్స్‌ 5.06 శాతం మేర నష్టపోయింది. ఆస్ర్టేలియా ఏఎస్‌ఎక్స్‌ 5.4 శాతం, హాంకాంగ్‌ మార్కెట్‌ ఆరంభంలో 3 శాతం పతనమైంది. ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌తో ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తిందని ఏక్సికార్ప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ చీఫ్‌ స్ర్ట్రేటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్స్‌ పేర్కొన్నారు. కరోనా కలకలం, ట్రావెల్‌ బ్యాన్‌ నిర్ణయాలతో అమెరికా, యూరప్‌ మార్కెట్లు సైతం నష్టపోయాయి.

చదవండి : ‘కోవిడ్‌’పై ట్రంప్‌ ట్వీట్‌.. కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement