సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభం నుంచీ నెగిటివ్‌గా ఉన్న సూచీలు ఆ తరువాత మరింత పతనాన్ని నమోదు చేశాయి. చివరి వరకూ అదే ధోరణి కొనసాగించాయి. అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ కీలకమైన 52 వేల స్థాయిని, నిఫ్టీ 15,500 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 710 పాయింట్లు కుప్పకూలి 51823 వద్ద, నిఫ్టీ 226 పాయింట్ల నష్టంతో 15413 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా రెండు రోజుల రిలీఫ్ ర్యాలీకి బ్రేక్‌పడింది.
హిందాల్కో, యూపీఎల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, విప్రో, రిలయన్స్, అదానీ, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్, హీరో మోటో కార్ప్, టీసీఎస్, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి స్వల్పంగా లాభపడ్డాయి.
అటుగ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర పుంజుకోవడం, భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం 27 పైసలు క్షీణించి 78.40 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం 78.13 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment