asia markets
-
లాభాలన్నీ పాయే: భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభం నుంచీ నెగిటివ్‌గా ఉన్న సూచీలు ఆ తరువాత మరింత పతనాన్ని నమోదు చేశాయి. చివరి వరకూ అదే ధోరణి కొనసాగించాయి. అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ కీలకమైన 52 వేల స్థాయిని, నిఫ్టీ 15,500 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 710 పాయింట్లు కుప్పకూలి 51823 వద్ద, నిఫ్టీ 226 పాయింట్ల నష్టంతో 15413 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా రెండు రోజుల రిలీఫ్ ర్యాలీకి బ్రేక్‌పడింది. హిందాల్కో, యూపీఎల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, విప్రో, రిలయన్స్, అదానీ, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్, హీరో మోటో కార్ప్, టీసీఎస్, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి స్వల్పంగా లాభపడ్డాయి. అటుగ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర పుంజుకోవడం, భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం 27 పైసలు క్షీణించి 78.40 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం 78.13 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. -
జపాన్ అప్ - హాంగ్‌కాంగ్ డౌన్..!
ఆసియా మార్కెట్లు సోమవారం ప్రారంభలాభాల్ని కోల్పోయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, థాయిలాండ్, కొరియా దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలుతున్నాయి. హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు అమెరికా, బ్రిటన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయవు. హాంకాంగ్ రాజకీయ అంశంలో అమెరికా జోక్యంతో మరోసారి చైనా-అమెరిక దేశాల వాణిజ్య సంబంధాలు ప్రశ్నార్థకమయ్యాయి. దీంతో చైనా ప్రధాన సూచీ షాంఘై కాంపోసైట్ అరశాతం క్షీణించింది. హాంగ్‌కాంగ్ నగరంలో అల్లర్లు తారాస్థాయికి చేరుకోవడంతో హాంగ్‌కాంగ్ మార్కెట్ 1శాతం వరకు క్షీణించింది. ఉద్దీపన ప్యాకేజీఆశలతో జపాన్ మార్కెట్ 1.50శాతం పెరిగింది. లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న జపాన్ తాజాగా 929 బిలియన్ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని దేశం పరిశీలిస్తోందని ఆ దేశపు మీడియా వర్గాలు వెల్లడించాయి. హాంగ్‌కాంగ్ విషయంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న రాజకీయ విబేధాలు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. కరోనా వైరస్‌తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఆయా దేశాలు పాలసీ ఉద్దీపనలు ప్రకటించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్ట స్థాయిల నుంచి ఏకంగా 30శాతం వరకు ర్యాలీ చేశాయి. -
ట్రంప్ నిర్ణయంతో ఆసియా మార్కెట్లు షేక్..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కలకలంతో యూరప్ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా నిర్ణయించడంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించడంతో పతనమైన ఆసియా మార్కెట్లు ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలాయి. ఈ రెండు నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై గణనీయ ప్రభావం పడుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఆసియా సూచీలు అట్టడుగుకు దిగజారాయి. టోక్యో బెంచ్‌మార్క్ నిక్కీ ఏకంగా 1051 పాయింట్లు పడిపోగా, టోపిక్స్ 5.06 శాతం మేర నష్టపోయింది. ఆస్ర్టేలియా ఏఎస్ఎక్స్ 5.4 శాతం, హాంకాంగ్ మార్కెట్ ఆరంభంలో 3 శాతం పతనమైంది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌తో ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తిందని ఏక్సికార్ప్ గ్లోబల్ మార్కెట్స్ చీఫ్ స్ర్ట్రేటజిస్ట్ స్టీఫెన్ ఇన్స్ పేర్కొన్నారు. కరోనా కలకలం, ట్రావెల్ బ్యాన్ నిర్ణయాలతో అమెరికా, యూరప్ మార్కెట్లు సైతం నష్టపోయాయి. చదవండి : ‘కోవిడ్’పై ట్రంప్ ట్వీట్.. కీలక నిర్ణయం! -
కోలుకొని మళ్లీ కూలిన మార్కెట్లు!
హాంకాంగ్: సోమవారం నాటి భారీ పతనం నుంచి మంగళవారం ప్రపంచ మార్కెట్లు కోలుకొని ఆ తర్వాత మళ్లీ కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోగా, అమెరికా స్టాక్ సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు పుంజుకోవడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. అయితే చైనాలో అదుపులోకి వచ్చినా, ఇతర దేశాల్లో కోవిడ్–19 (కరోనా)వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. . కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటం, ముడిచమురు ధరల పోరు మొదలుకావడంతో సోమవారం ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లన్నీ 2–8 శాతం రేంజ్లో పతనమయ్యాయి. నష్టాల్లోంచి లాభాల్లోకి..... మంగళవారం ముడిచమురు ధరలు 8% మేర ఎగియడంతో ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా సూచీలు పుంజుకున్నాయి. కరోనా వైరస్ మూల కేంద్రమైన వూహాన్ నగరాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించడం, గత వారమే రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి రేట్లను తగ్గిస్తుందన్న వార్తలు, వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు... సానుకూల ప్రభావం చూపించాయి. సోమవారం అమెరికా మార్కెట్లు 8 శాతం మేర నష్టపోయిన నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. అయితే మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం రేంజ్లో లాభాల్లో ముగిశాయి. లాభాల్లోంచి నష్టాల్లోకి... ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి రాగా, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమై 1–2.5% రేంజ్ లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇటలీలో కోవిడ్–19 వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడం, ఆ దేశంలో ప్రయాణాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి మరికొంత సమయం పడుతుందనే వార్తలతో యూరప్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. డ్యాక్స్ (జర్మనీ), క్యాక్(ఫ్రాన్స్) సూచీలు 0.7 శాతం నుంచి 1.5 శాతం రేంజ్లో నష్టాల్లో ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యలో నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మొత్తం మీద తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి గం.11.30ని.)కు 0.7–1.2% రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ప్రతిరూపం... ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 1% (115 పాయింట్లు)నష్టంతో ట్రేడవుతోంది. దీంతో నేడు(బుధవారం) మన మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే అవకాశాలే అధికం గా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. -
రెండో రోజూ లాభాల బాట
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 391 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ సగం వరకూ లాభాలను పోగొట్టుకొని చివరకు 157 పాయింట్ల లాభంతో 35,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,780 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించినా, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సందర్భంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముడి చమురు ధరలు మరింతగా దిగిరావడం కలసివచ్చింది. సగం తగ్గిన లాభాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు, అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. అమెరికా వినియోగదారుల వినియోగ గణాంకాలు అంచనాలను మించడంతో బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 391 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో లాభాలు సగానికి తగ్గాయి. టాటా గ్రూప్‌ను దాటేసిన హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా గ్రూప్‌ను హెచ్డీఎఫ్సీ గ్రూప్ దాటేసింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.40లక్షల కోట్లకు చేరింది. ఇది టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే రూ.1,000 కోట్లకుపైగా అదనం. దీంతో దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ గల గ్రూప్‌గా హెచ్డీఎఫ్సీ గ్రూప్ అవతరించింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో ఐదు కంపెనీలు ఉండగా, టాటా గ్రూప్‌లో 30 వరకూ కంపెనీలున్నాయి. ఒక ఎనిమిది కంపెనీల షేర్ల తప్ప మిగిలిన అన్ని టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఈ ఏడాది బాగా పతనమయ్యాయి. అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో మూడింట రెండు వంతులు ఉంటుంది. -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 85.07 పాయింట్ల లాభంలో 31,330 వద్ద, నిఫ్టీ 20.10 పాయింట్ల లాభంలో 9,657 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం పైకి ఎగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో లుపిన్, టాటా మోటార్స్, టాటాపవర్, అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మా, ఐటీసీ, ఎల్ అండ్ టీ, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు పండించగా.. బజాబ్ ఆటో, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు ఒత్తిడిలో కొనసాగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి, 64.75 వద్ద ప్రారంభమైంది. వాల్ స్ట్రీట్ బలపడినప్పటికీ, ఆసియన్ మార్కెట్లు మాత్రం బలహీనంగానే ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో బంగారం 28,106 రూపాయల వద్ద కొనసాగుతోంది. -
కదం తొక్కిన సెన్సెక్స్
రెండు రోజులపాటు ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. అమెరికా కేంద్ర బ్యాంకు నిర్వహించిన పాలసీ సమీక్షలో భాగంగా సహాయక ప్యాకేజీతోపాటు, వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో కొత్త జోష్ పుట్టుకొచ్చింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో షేర్లు, కరెన్సీలు, పసిడి కదం తొక్కాయి. దేశీయంగా సెన్సెక్స్ 684 పాయింట్లు దూసుకెళ్లి 20,647కు చేరింది. ఇది దాదాపు మూడేళ్ల గరిష్టంకాగా, రూపాయి 2.5% పుంజుకుని 62కు దిగువన 61.77 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధర ఔన్స్(31.1గ్రాములు)కు 59 డాలర్లు ఎగసి 1,366 డాలర్ల వద్ద నిలిచింది. నెలకు 8,500 కోట్ల డాలర్లను వ్యవస్థలోకి పంప్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీకి కారణంగా నిలుస్తున్న ఫెడరల్ రిజర్వ్ ఇకపై కూడా ఈ ప్యాకేజీని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునేటంత వరకూ నామమాత్ర వడ్డీ రేట్లను కూడా యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడుతున్నట్లు స్పష్టం చేసింది. వెరసి తక్కువ స్థాయి వడ్డీకే లభిస్తున్న డాలర్ల నిధులు మరికొంతకాలం ఈక్విటీలలోకి మళ్లుతాయన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంకే ముంది? దీనికోసమే ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ఒక్కుమ్మడిగా షేర్లలో కొనుగోళ్లకు దిగారు. ఫలితం... సెన్సెక్స్ 684 పాయింట్ల హైజంప్ చేసి 20,647ను చేరుకుంది. 2010 నవంబర్ 10 తరువాత ఇదే గరిష్ట స్థాయికాగా, నిఫ్టీ కూడా ఇదే స్థాయిలో 216 పాయింట్లు దూసుకెళ్లింది. 6,115 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 1.83 లక్షల కోట్లు జమయ్యింది. ఈ విలువ 66.53 లక్షల కోట్లకు చేరింది. కాగా, ఇటీవలే కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ శుక్రవారం తొలిసారి పాలసీ సమీక్షను చేపట్టనున్నారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ తన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌కు ఊపునివ్వగా, రాజన్ ఎలాంటి జోష్‌ను తీసుకువస్తారో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు. విశేషాలెన్నో.... ఆసియా: ఆసియా మార్కెట్లు దాదాపు 2-4.5% మధ్య పురోగమించాయి. అయితే చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు సెలవువల్ల ట్రేడ్కాలేదు. యూరప్: యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే సైతం 1%పైగా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఐఐలు: గత మూడు రోజుల్లో కేవలం రూ. 1,200 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు దూకుడు పెంచి రూ. 3,544 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 1,830 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బ్యాంకెక్స్: యస్ బ్యాంక్ 22% జంప్‌చేయగా, యూనియన్, పీఎన్బీ, బీవోబీ, బీవోఐ, కెనరా, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, ఫెడరల్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ ద్వయం 10-5% మధ్య దూసుకెళ్లడం విశేషం! దీంతో బ్యాంకెక్స్ ఏకంగా 7% ఎగసింది. రియల్టీ: ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్ఎఫ్, డీబీ, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా 9-3.5% మధ్య లాభపడటంతో రియల్టీ రంగం 5% పుంజుకుంది. క్యాపిటల్ గూడ్స్: పుంజ్‌లాయిడ్, ఎల్అండ్టీ, పిపావవ్, క్రాంప్టన్, జిందాల్ సా, హవేల్స్, భెల్, సీమెన్స్ 7-3% మధ్య పురోగమించడంతో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 5% లాభపడింది. మెటల్స్: జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, సెసా గోవా, సెయిల్, హిందాల్కో 8-4% మధ్య పెరగడంతో మెటల్ ఇండెక్స్ 4% బలపడింది. సెన్సెక్స్: మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, మారుతీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, భారతీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఆర్ఐఎల్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లాయంటే సెంటిమెంట్ తీరును అర్థం చేసుకోవచ్చు. ఒక్కటి మినహా: సెన్సెక్స్‌లో కేవలం విప్రో(2%) నష్టపోయింది. చిన్న షేర్లు: మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 2-1% మధ్య పురోగమించగా ట్రేడైన షేర్లలో 1,430 లాభపడ్డాయి. కేవలం 997 బలహీనపడ్డాయి. టర్నోవర్: ఎన్ఎస్ఈలో రూ. 18,130 కోట్లు, బీఎస్ఈలో రూ. 2,849 కోట్లు చొప్పున అధిక టర్నోవర్ నమోదైంది. ఏడాది గరిష్టం: బీఎస్ఈ-500లో ఆర్‌కామ్ 12% జంప్ చేసి రూ. 161కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా, ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ 11% ఎగసింది. డెల్టా కార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, మ్యాక్స్, హెచ్ఎంటీ, జేపీ అసోసియేట్స్, ఐడీఎఫ్సీ, శ్రీరాం ట్రాన్స్పోర్ట్, ఎల్ఐసీ హౌసింగ్, ఏషియన్ పెయింట్స్, దేనా బ్యాంక్ తదితరాలు 11-7% మధ్య దూసుకెళ్లాయి. రూపాయి 161 పైసలు జంప్ ముంబై: సహాయక ప్యాకేజీలను యథాతథంగా కొనసాగించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో దేశీయ కరెన్సీకి బలమొచ్చింది. డాలరుతో మారకంలో ఏకంగా 161 పైసలు(2.54%) పుంజుకుని 61.77వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టం కాగా, ఒక దశలో 61.64 వరకూ బలపడింది. నెలకు 85 బిలియన్ డాలర్లతో బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఫెడ్ భారీ నిధులను వ్యవస్థలోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొంత కాలం ఈ ప్యాకేజీలను కొనసాగించడంతోపాటు, వడ్డీ రేట్లను నామమాత్రస్థాయిలోనే ఉంచేందుకు నిర్ణయించడంతో వివిధ కరెన్సీలతో మారకంలో డాలర్ బలహీనపడింది. వారం రోజుల గరిష్టానికి పసిడి ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సానుకూల నిర్ణయాలతో పసిడి, వెండిలో సైతం కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో ఇక్కడి బులియన్ స్పాట్ మార్కె ట్లో పూర్తి స్వచ్చత(99.9) కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ. 270 పెరిగి రూ. 30,430కు చేరింది. ఇది వారం రోజుల గరిష్టస్థాయి. కాగా, 99.5% స్వచ్చత గల ప్రామాణిక పసిడి 10 గ్రాముల ధర కూడా రూ. 270 లాభపడి రూ. 30,280 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ. 945 ఎగసి రూ. 51,815కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ఔన్స్(31.1గ్రాములు) ధర 59 డాలర్లు ఎగసి 1,366 డాలర్లను తాకింది. ఈ బాటలో వెండి ధర ఔన్స్‌కు 23 డాలర్లకు చేరింది.