
ఆసియా మార్కెట్లు సోమవారం ప్రారంభలాభాల్ని కోల్పోయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, థాయిలాండ్, కొరియా దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలుతున్నాయి. హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు అమెరికా, బ్రిటన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
హాంకాంగ్ రాజకీయ అంశంలో అమెరికా జోక్యంతో మరోసారి చైనా-అమెరిక దేశాల వాణిజ్య సంబంధాలు ప్రశ్నార్థకమయ్యాయి. దీంతో చైనా ప్రధాన సూచీ షాంఘై కాంపోసైట్ అరశాతం క్షీణించింది. హాంగ్‌కాంగ్ నగరంలో అల్లర్లు తారాస్థాయికి చేరుకోవడంతో హాంగ్‌కాంగ్ మార్కెట్ 1శాతం వరకు క్షీణించింది.
ఉద్దీపన ప్యాకేజీఆశలతో జపాన్ మార్కెట్ 1.50శాతం పెరిగింది. లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న జపాన్ తాజాగా 929 బిలియన్ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని దేశం పరిశీలిస్తోందని ఆ దేశపు మీడియా వర్గాలు వెల్లడించాయి.
హాంగ్‌కాంగ్ విషయంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న రాజకీయ విబేధాలు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. కరోనా వైరస్‌తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఆయా దేశాలు పాలసీ ఉద్దీపనలు ప్రకటించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్ట స్థాయిల నుంచి ఏకంగా 30శాతం వరకు ర్యాలీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment