సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోట్రేడ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఫార్మా, ఆటో, ఐటీషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 61500 మార్క్‌ను, నిఫ్టీ 18300మార్క్‌ను కోల్పోయాయి.విండ్ ఫాల్ టాక్స్ కోతతో ఆయిల్‌రంగ షేర్లు భారీ లాభాలతో 5నెలల గరిష్టం వద్ద ఉన్నాయి.
ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడుతుండగా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డా. రెడ్డీస్, అపోలో హాస్సిటల్స్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ కారణంగా GMM Pfaudler షేర్లు 18 శాతం పడి పోయాయి. అంతేకాకుండా, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఐటీసీ షేర్లు 2 శాతం పడిపోయి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.331.90కి చేరాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 12 పైసలుక్షీణించి 82.84 వద్ద ఉంది.
3.30 PM
చివరికి సెన్సెక్స్ 461 పాయింట్లు కుప్పకూలి 61337 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల నష్టంతో వద్ద 18269 ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్‌లో నష్టపోయిన సూచీలు వారాంతంలో ఒక నెల కనిష్టాన్ని నమోదు చేశాయి. దేశీయ కరెన్సీ రూపాయి 82.87 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment