Oil and gas shares
-
రెండో రోజూ తప్పని నష్టాలు: విండ్‌ఫాల్ టాక్స్ కోత ఆయిల్ రంగ షేర్లు జూమ్
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోట్రేడ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఫార్మా, ఆటో, ఐటీషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 61500 మార్క్‌ను, నిఫ్టీ 18300మార్క్‌ను కోల్పోయాయి.విండ్ ఫాల్ టాక్స్ కోతతో ఆయిల్‌రంగ షేర్లు భారీ లాభాలతో 5నెలల గరిష్టం వద్ద ఉన్నాయి. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, లార్సెన్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడుతుండగా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డా. రెడ్డీస్, అపోలో హాస్సిటల్స్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ కారణంగా GMM Pfaudler షేర్లు 18 శాతం పడి పోయాయి. అంతేకాకుండా, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఐటీసీ షేర్లు 2 శాతం పడిపోయి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.331.90కి చేరాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 12 పైసలుక్షీణించి 82.84 వద్ద ఉంది. 3.30 PM చివరికి సెన్సెక్స్ 461 పాయింట్లు కుప్పకూలి 61337 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల నష్టంతో వద్ద 18269 ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లో నష్టపోయిన సూచీలు వారాంతంలో ఒక నెల కనిష్టాన్ని నమోదు చేశాయి. దేశీయ కరెన్సీ రూపాయి 82.87 వద్ద ముగిసింది. -
మూడు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీల మూడు రోజుల లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, ఆర్థిక, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్‌తో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు(గురువారం) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. డాలర్ మారకంలో రూపాయి 23 పైసలు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 60 వేల దిగువున 59,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17,749 వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ఆద్యంతం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1243 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 337 పాయింట్ల రేంజ్ కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1958 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.161 కోట్ల షేర్లను కొన్నారు. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 208 పాయింట్లు లాభంతో 60,286 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,906 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో ప్రతికూలతలతో పాటు గరిష్ట స్థాయి లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలవడంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,288) నుంచి 1243 పాయింట్లు నష్టపోయి 59,046 వద్ద, నిఫ్టీ డే హై(17,913) నుంచి 337 పాయింట్లు కోల్పోయి 17,912 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు పరిమితం మిడ్ సెషన్ చివర్లో సూచీలకు దిగువ స్థాయిల వద్ద మద్దతు లభించడంతో అమ్మకాలు తగ్గాయి. మరో గంటలో ట్రేడింగ్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకొని పరిమిత నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఎన్టీపీసీ షేరు నాలుగు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ►ఆర్బీఐ రెండు కోట్ల జరిమానా విధించడంతో ఆర్బీఎల్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.187 వద్ద ముగిసింది. ►గోవా షిప్‌యార్డ్ నుంచి కాంట్రాక్టు దక్కించుకోవడంతో భెల్ షేరు ఆరుశాతం ర్యాలీ చేసి రూ.60 వద్ద స్థిరపడింది. -
ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ర్యాలీ
2009-10 తర్వాత ఇదే పెద్ద అప్‌ట్రెండ్ ఫార్మా షేర్ల జోరు పెరిగిన వాహన, బ్యాంకింగ్ షేర్లు తగ్గిన మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఈ మార్చి31తో ముగిసిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ సెన్సెక్స్ 25 శాతం వృద్ధి సాధించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ వృద్ధి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ నిధులు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సర కాలానికి 5,571 పాయింట్లు పెరిగింది. గత ఏడాది మార్చి 31న 22,386గా ఉన్న సెన్సెక్స్ ఈ ఏడాది మార్చి 31 నాటికి 27,957 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 1,787 పాయింట్లు(27 శాతం) లాభపడింది. 2014-15లోనేసెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. మార్చి 4న సెన్సెక్స్ 30,025 పాయింట్లను, నిఫ్టీ 9,119 పాయింట్ల(ఇవి రెండూ ఆల్‌టైమ్ హై)ను తాకాయి. అన్ని రంగాల సూచీల్లో బీఎస్ఈ హెల్త్‌కేర్ సూచీ అత్యధికంగా లాభపడింది. ఈ సూచీ 70 శాతం ఎగసింది. 25 ఫార్మా షేర్లలో 12కు పైగా వంద శాతం పెరగడం విశేషం. వాహన, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 30-44 శాతం రేంజ్లో పెరిగాయి. మెటల్ అండ్ ఆయిల్, గ్యాస్ ఇండెక్స్‌లు 3-6 శాతం రేంజ్లో పడిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి 50 శాతానికి పైగా పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లు నుంచి భారత కంపెనీలు రూ.58,801 కోట్లు సమీకరించాయి. 2010-11లో ఇది రూ.72,143 కోట్లు. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే నిధుల సమీకరణకు 2014-15 ఉత్తమ సంవత్సరమని ప్రైమ్ డేటా సంస్థ తెలిపింది. అయితే 2015 మార్చి నెలలో సెన్సెక్స్ 4.8 శాతం తగ్గింది. 2013 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అధ్వాన క్షీణత. సెషన్‌కు రూ.11,000 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.27 లక్షల కోట్లు పెరిగింది. ఒక్కో ట్రేడింగ్ సెషన్ పరంగా చూస్తే రూ.11,000 కోట్లు వృద్ధి చెందింది. విదేశీ నిధులు వెల్లువెత్తడంతో షేర్ల ధరలు దూసుకుపోయాయి. దీంతో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్వెస్టర్ల సంపద పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 240 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.27.34 లక్షల కోట్లు పెరిగి గత నెల 31 నాటికి రూ.101.49 లక్షల కోట్లకు చేరింది. సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ భారీ వృద్ధి సాధించిందని నిపుణులంటున్నారు.