
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుస నష్టాల నుంచి షార్ట్ కవరింగ్ కారణంగా కాస్త రికవరీ సాధించాయి. ముఖ్యంగా అదానీ కంపెనికి చెందిన కొన్ని షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. అయితే ఐటీ షేర్లు లాభ పడుతున్నాయి. ప్రస్తుతం 46 పాయింట్ల నష్టంతో 17557 వద్ద నిఫ్టీ, 113 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 59193 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ హెచ్‌సీఎల్ టెక్, బజాజ్‌ఫిన్‌సర్వ్ లాభపడుతున్నాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్; జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ఆటో, హెచ్ యూఎల్ నష్టపోతున్నాయి.