సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థతులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. అలాగే కొన్నికార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది.
కాగా కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి 2020 మార్చి 23 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఏడాది మేనుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment