ప్లీజ్ వారిని మినహాయించండి: మైక్రోసాప్ట్
ప్లీజ్ వారిని మినహాయించండి: మైక్రోసాప్ట్
Published Fri, Feb 3 2017 1:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాత్కాలిక ట్రావెల్ బ్యాన్పై తీవ్ర విమర్శల గళం వినిపించిన సిలికాన్ దిగ్గజం మైక్రోసాప్ట్, విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఈ ఆర్డర్లను మార్చాలని అభ్యర్థిస్తోంది. వర్కర్లను, స్టూడెంట్లను ఈ నిషేధం నుంచి మినహాయించాలని కోరుతూ ట్రంప్ కార్యాలయానికి ఓ అధికారిక ఫిర్యాదును పంపించింది. తమను, ఇతర కంపెనీలను ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల నుంచి మినహాయించాలని దీనిలో పేర్కొంది. ట్రంప్ ఇటీవల జారీచేసిన కార్యానిర్వాహక ఆదేశాలతో ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను తాత్కాలికంగా అమెరికాలోకి ప్రవేశించడం నిషేధించారు. గత శుక్రవారం ఈ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.
దీన్ని ఫలితంగా ఇరాన్, ఇరాక్, యెమెన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా ప్రజలు అమెరికాలోకి ప్రవేశించడం నిషేధం. బాధ్యత తెలిసిన ప్రయాణికులను దేశంలోకి పునఃప్రవేశించడాన్ని అనుమతించాలని కోరుతూ మైక్రోసాప్ట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ స్మిత్ ఓ అధికారిక అభ్యర్థనను ట్రంప్ కేబినెట్ ఆఫీసర్లకు పంపారు. అదేవిధంగా దేశీయ భద్రతను పరిరక్షించాలన్నారు. ఉద్యోగులకు స్పాన్సర్ చేసే వర్క్ వీసాలు లేదా స్టూడెంట్ల వీసాలను ఈ ఆర్డర్ల నుంచి మినహాయించాలని కోరారు. ఈ నిషేధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపిందని మైక్రోసాప్ట్ పేర్కొంది. ట్రంప్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ పలు విమానశ్రయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Advertisement