
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్‌లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు.
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేత
— DGCA (@DGCAIndia) May 28, 2021
Comments
Please login to add a commentAdd a comment