International Flights
-
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్‌లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్‌లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్‌లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
మరో 25 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు. కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. -
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్‌కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
విమాన సంస్థల వేసవి షెడ్యూల్ విడుదల
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. మార్చి 31 నుంచి అక్టోబర్ 26 వరకు 2024 ఏడాదికిగాను సమ్మర్ షెడ్యూల్‌ను ప్రకటించాయి. దేశీయంగా ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, ఎయిరిండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో దేశీయ విమానయాన సంస్థలు అమెరికాతోపాటు బ్రిటన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, జార్జియా.. వంటి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపాయి. దేశంలోని 27 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. వారానికి 1,922 అంతర్జాతీయ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. అందులో భాగంగా ఈ నెల 28 నుంచే ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు ప్రారంభించనుంది. ఇండిగో ఈ సీజన్లో 13,050 విమాన సర్వీసులను నడపబోతున్నట్లు తెలిపింది. ఎయిరిండియా 2,278, విస్తారా 2,324, ఆకాశ ఎయిర్ 903 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అంతర్జాతీయ రూట్లో ఎయిరిండియా 455 విమానాలు నడపనుండగా, ఇండిగో 731, విస్తారా 184కి పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసులను 1,657కి కుదించింది. ఈ సీజన్ నుంచి కొత్తగా అజామ్‌గఢ్, అలిగఢ్, చిత్రకూట్, గోండియా, జలగాన్, మోరదాబాద్, పిథోర్‌గర్ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం.. -
ఆకాశ ఎయిర్.. ఇక అంతర్జాతీయ సర్వీసులు
న్యూఢిల్లీ: రియాద్, జెడ్డా, దోహా, కువైట్‌కు సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ట్రాఫిక్ అనుమతులు లభించినట్టు ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే దశగా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు తీసుకుని, త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆకాశ ఎయిర్ కార్యకలాపాలకు ఈ ఏడాది ఆగస్ట్‌తో ఏడాది ముగిసింది. సంస్థ నిర్వహణలోని బోయింగ్ 738 మ్యాక్స్ విమానాల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది చివరికి మరో రెండు విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. బలమైన ఆర్థిక మూలాలతో, వృద్ధి దశలో ఉన్నట్టు దూబే తెలిపారు. సంస్థ వద్ద నగదు నిల్వలు తగినన్ని ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మూడంకెల స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్ చేయనున్నట్టు చెప్పారు. తొలి అంతర్జాతీయ సర్వీసు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడే చెప్పడం కష్టమని దూబే పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకాశ ఎయిర్ వారానికి 700 సర్వీసులను, 16 పట్టణాలకు నిర్వహిస్తోంది. దేశీ మార్కెట్లో 4.2 శాతం వాటా కలిగి ఉంది. నిధుల సమస్య లేదు ఆకాశ ఎయిర్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న వార్తలను ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని వినయ్ దూబే బదులిచ్చారు. సానుకూల నగదు ప్రవాహాలు ఉన్నాయని, మా నిల్వలను పెంచుకుంటూనే ఉంటామన్నారు. కొత్త విమానాలు ఆర్డర్ చేసేందుకు తమకు నిధుల అవసరం లేదన్నారు. జున్‌జున్‌వాలా కుటుంబం సంస్థను వీడుతున్నట్టు వచ్చిన వార్తలు అసంబద్ధమని స్పష్టం చేశారు. తాము దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసినట్టు వారు స్పష్టం చేశారని తెలిపారు. పైలట్ల ఆకస్మిక రాజీనామా, వారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించగా, అది ముగిసిపోయిందంటూ.. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్నట్టు చెప్పారు. -
గుడ్‌న్యూస్.. త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది. ముందుగా తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్‌కు సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు విమానయాన సంస్థలతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్), స్థానిక ఎంపీ, ఎయిర్‌పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విమాన సర్వీసులు ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. ఈ పాలసీ కింద 400 సీట్లు కేటాయించాలని కోరగా కేంద్రం నుంచి సానుకూల స్పందన వచి్చనట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి కువైట్‌కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఇండిగో, ఎయిర్‌ఏíÙయా సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అంతర్జాతీయ సరీ్వసులు నడపడానికి వీలుగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్, ఇమిగ్రేషన్‌కు అవసరమైన సౌకర్యాలతో పాటు విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, కన్వేయర్ బెల్ట్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి సరీ్వసులు ప్రారంభిస్తే ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులను నియమించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తీరునున్న అవస్తలు రాయలసీమ ప్రాంత వాసులు విదేశాలకు వెళ్లేందుకు తిరుపతి విమానాశ్రయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ నుంచి ముఖ్యంగా చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వ్యయప్రయాసలకోర్చి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి సరీ్వసులు అందుబాటులోకి వస్తే ఈ అవస్థలు తప్పుతాయని, చాలా సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించడానికి ఎంపీ గురుమూర్తి కేంద్రస్థాయిలో సంప్రదింపులు నడుపుతున్నారని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని, త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సరీ్వసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు. -
ఈ ప్రయాణం నరకప్రాయం!
ప్రయాణమంటే... సుఖవంతంగా సాగాలని కోరుకుంటాం. సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయా? కొండవీటి చేంతాడంత క్యూలు... బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ... చీకాకుపరిచేటన్ని చెకింగ్లు... నిలిచే జాగా లేని రద్దీ... ఎటుచూసినా లగేజ్... ట్రాలీల కొరత... విమానాల జాప్యం... ఇదీ ఇప్పుడు పరిస్థితి. రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు. ఎయిర్పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచి స్తున్న పరిస్థితి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడు స్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్ర వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్‌కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు దృష్టి పెట్టాల్సింది శాశ్వత పరిష్కారాలపైన! ఒక్క ఢిల్లీలోనే కాదు... పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగినట్లు వార్త. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ సాగింది. తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రిక సామర్థ్యం 44 లక్షలే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం. అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా కసికొద్దీ ప్రయాణాలు చేయడం పెరిగింది. ఇబ్బడిముబ్బడైన ఈ జనంతో ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారనేది పరిస్థితికి చిరు సూచన. కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్‌లోని ప్రసిద్ధ హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళిక లకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రయాణికుల చెకింగ్ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్‌లైన్స్ చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణు లైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది కూడా తక్కువున్నారు. సీఐఎస్ఎఫ్ ఉద్యోగాలను 3 వేలకు పైగా రద్దు చేసి, వాటి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం లాంటి స్వీయ తప్పిదాలు సవాలక్ష. వీటిని తక్షణం సరిదిద్దాలి. బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నిటా 5జి సహా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతా మంటున్నా, డిజిటలీకరణ మంచి పరిష్కారం. సంవత్సరాంతపు సెలవులు, పండగలతో రానున్నది ప్రయాణాల కాలం. దాంతో, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు. కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌లు కావాలి. ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ఊరికో రకం కాక అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతే అదే బోర్డింగ్ పాస్‌గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే 3 ఎయిర్‌పోర్టుల్లో తెచ్చారు. మొక్కుబడిగా కాక దాన్ని అన్నిచోట్లా విస్తరించడం, అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ కీలకం. అలసత్వం వహిస్తే, పదేపదే ఢిల్లీ కథే! -
అక్టోబర్ 31 నుంచి షార్జా–విజయవాడ విమానం
గన్నవరం: సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ పస్ట్‌వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్ ఆల్ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు. అంతేగాకుండా గల్ఫ్‌లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్‌లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి (ఆదివారం) నుంచి పునఃప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు జరగనున్నాయి. ఈ మేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు రెడీ అయ్యాయి. మహమ్మారి ప్రభావంతో ఒడిదుడుకులు గురైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ ఆ రంగానికి మరింత ఊతమివ్వనుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు విమానలు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలు సైతం భారత్ నుంచి రాకపోకలకు ప్రణాళికలు రచించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20, 2020 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. కడప విమానాశ్రయం నుంచి పునః ప్రారంభమైన విమాన సర్వీసులు వైఎస్సార్ జిల్లా: కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో విమాన సేవలను ప్రారంభించారు. చెన్నై నుంచి తొలి విమానం కడప చేరుకుంది. అనంతరం కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసు బయల్దేరనుంది. కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ఇండిగో ఫ్లైట్ టికెట్లను అందజేశారు. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు నేటి నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది. -
ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 27 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తిని నివారించే లక్ష్యంతో 2020 మార్చి 23వ తేదీ నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సేవలను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక ఏర్పాట్ల కింద 37 దేశాలకు జూలై 2020 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను మాత్రం కొనసాగిస్తోంది. మార్చి 27వ తేదీ నుంచి షెడ్యూల్డ్ విమాన సర్వీసులు మొదలయ్యాక ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నడిచే విమాన సర్వీసులు రద్దవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను యథాప్రకారం అమలు చేస్తామన్నారు. (చదవండి: న్యాయ చరిత్రలోనే అరుదైన సందర్భం...కేరళ హైకోర్టులో మహిళా ధర్మాసనం) -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
అలెర్ట్! అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచి ఆంక్షలే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా 2020 మార్చి 29న భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఆ తర్వాత 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడిపించారు. ఆ తర్వాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. పునరుద్ధరిస్తాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ డీజీసీఏ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ వేరియంట్ గురించి సమాచారం దక్షిణాఫ్రికా బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ వెంటనే పరిమితంగా నడుస్తున్న విమాన సర్వీసులు, ప్రయాణికుల విషయంలో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు డిసెంబరు 1న డీజీసీఏ ప్రకటించింది. జనవరి 31 వరకు గత పది రోజుల వ్యవధిలో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2021 డిసెంబరు 9న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపింంచాలనే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/EXPkDc8Ejw — DGCA (@DGCAIndia) December 9, 2021 వీటికి గ్రీన్‌సిగ్నల్ ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 32 దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 32 దేశాల జాబితాలో యూకే, యూఎస్, కెన్యా, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయి. అదే విధంగా కార్గో విమాన సర్వీసులు కూడా యథావిధిగా ఉంటాయి. చదవండి: హైదరాబాద్ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్‌న్యూస్ ! -
కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్మెంట్పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్‌మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి. ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్‌సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. పేదలను ఆదుకోలేరా? కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్‌ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు. అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్‌పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు. -
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది. నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రాయాసెస్ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్‌లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్ వేరియెంట్‌గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్ వేరియెంట్ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. -
హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ నుంచి ఓ కుటుంబం డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా ఎక్కడికీ వెళ్లకుండా ఉండిపోయారు. కొద్ది రోజులుగా వివిధ దేశాల మధ్య ఆంక్షలను సడలించడంతో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఆ కుటుంబం కూడా నగరానికి వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌కు వెళ్లి, చివరి వారంలో తిరిగి న్యూజిలాండ్‌కు చేరుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగించడంతో సందిగ్ధంలో పడ్డారు. ఇండియాకు వెళ్లి తిరిగి న్యూజిలాండ్‌కు చేరుకోగలమా లేదా అనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఉన్నపళంగా ఒమిక్రాన్ విజృంభింవచ్చనే భయాందోళన పట్టుకుంది. దీంతో వారు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చదవండి: మళ్లీ ఆంక్షల చట్రంలోకి..మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి పారిస్‌లోని ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డీడీ కాలనీకి చెందిన అనుపమ కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకొనేందుకు కొద్ది రోజుల పాటు సెలవుపై వచ్చిన ఆమెకు ఇప్పుడు తిరుగు ప్రయాణంపై ఆందోళన నెలకొంది. తిరిగి పారిస్‌కు వెళ్లే సమయానికి విమానాల రాకపోకలు ఆగిపోవచ్చనే భయంతో పాటు ఏదో ఒక విధంగా వెళ్లినా మరోసారి ఇండియాకు రావడం కుదరకపోవచ్చనే సందేహం నెలకొంది. హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.... ఈ నెల మొదటి వారంలో అమెరికా కోవిడ్ ఆంక్షలను సడలించి ప్రపంచ దేశాలకు స్వాగతం పలికిన అనంతరం పెద్దఎత్తున ఊరట లభించింది. యూరప్ దేశాలు సైతం ఆంక్షలను సడలించాయి. వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి .సొంత కుటుంబాలకు, సొంత ఊళ్లకు దూరంగా ఉంటున్న ఎన్నారైలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో చాలా వరకు ఆంక్షలను తొలగించి పర్యాటకులను సైతం ఆహ్వానించేందుకు పలు దేశాలు చర్యలు చేపట్టాయి. రెండేళ్లుగా కుదేలైన పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ప్రయాణాలపైన కేంద్రం సైతం ఆంక్షలను సడలించేందుకు సన్నద్ధం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐఆర్సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ, పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు రకరకాల ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ పిడుగులా వచ్చి పడడంతో అంతటా సందిగ్ధం నెలకొంది. డిసెంబర్ ప్రయాణాలు కష్టమే... హైదరాబాద్ నుంచి ప్రస్తుతం బ్రిటన్‌తో పాటు దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పర్యాటక దేశమైన మాల్దీవులుకు ప్రతి రోజు ఒక ఫ్లైట్ అందుబాటులో ఉంది. సాధారణంగా డిసెంబర్ నెలలో పర్యాటక ప్రయాణాలు బాగా పెరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల కోసం నగరవాసులు తమకు నచ్చిన పర్యాటక ప్రాంతానికి వెళ్తారు. రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రయాణాలు వచ్చే డిసెంబర్ నెలలో ఊపందుకోవచ్చని భావించారు. కానీ డిసెంబర్ నాటికి ప్రయాణాలు బాగా తగ్గవచ్చని పలు పర్యాటక సంస్థలు అంచనా వేస్తున్నాయి. -
15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది. ‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
పాక్ నుంచి అఫ్గాన్‌కు విమానం
ఇస్లామాబాద్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాబూల్‌కు పాకిస్తాన్ సోమవారం తొలి కమర్షియల్ విమానాన్ని నడిపింది. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్ (పీఐఏ) విమానం –పీకే 6429 పలువురు జర్నలిస్టులతో కలసి కాబూల్ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన బృందంతో వచ్చిందని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలు కూడా త్వరలోనే తిరుగుతాయని భావిస్తున్నారు. -
విమానాల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్‌తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. -
కుదేలవుతున్న ఏవియేషన్, విమానాల రాకపోకలపై నిషేధం
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏవియేషన్ రంగానికి మరో ఎదురు దెబ్బతగిలింది. కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మనదేశంలో ఏవియేషన్ రంగాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలవుతోంది. భారతదేశంలోని విమానయాన సంస్థలు 2022 ఆర్థిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు ఏవియేషన్ కన్సల్టెన్సీ సిఏపీఏ అంచనా వేసింది. అందులో 1.1 బిలియన్ డాలర్లు ఐపివోలు, క్యూఐపిలు ఇతర పరికరాల రూపంలో అవసరం ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టాలు ఇప్పట్లో ఆగిపోయేలా లేవని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో..డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జులై 31వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తాజాగా,ఆ నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు 31వ తేదీ వరకు పొడిగించింది. వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదలతో విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో ఇండియన్ ఏవియేషన్ కు ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం ఆంక్షల్ని కొనసాగించడంతో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ జున్‌జున్‌వాలా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్న విషయం తెలిసిందే. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్‌జున్‌వాలా ప్రకటించారు. మరి ఆయన పెట్టుబడులతో ఏవియేషన్ రంగం ఎలాంటి వృద్ది సాధిస్తోంది చూడాల్సి ఉంది. -
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
-
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల వివనాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. అయితే, కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రద్దును జూలై 31వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) బుధవారం వెల్లడించారు. అయితే, ఎంపిక చేసిన వర్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాల రాకపోకలను అనుమతించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ కార్గో విమానాల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికుల వివన సేవలను ప్రభుత్వం 2020 మార్చి నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్ కింద 2020 మే నుంచి ప్రత్యేక అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను అనుమతిస్తోంది. చదవండి: పిల్లలపై కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నో -
DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత pic.twitter.com/IueesZFoiV — DGCA (@DGCAIndia) May 28, 2021