![Central Govt Rolled Back Excise Duty On Atf Used For International Operations - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/9/nirmala%20sitharaman.jpg.webp?itok=X_LRnmot)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది.
చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది.
వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment