excise duty cut
-
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
మళ్లీ చమురు సెగ- ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు?
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్డవున్లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై) పన్నుల వాటా అధికం ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్‌కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది. చమురు కంపెనీలూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్‌ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్‌యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) మళ్లీ ధరల సెగ విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్‌చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
కార్ల ధరలు దిగొచ్చాయ్..
న్యూఢిల్లీ: అమ్మకాల క్షీణతతో అతలాకుతలమవుతున్న వాహన రంగానికి ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఊపిరినిచ్చింది. వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీసుకున్న నిర్ణయం కారణంగా పలు వాహన కంపెనీలు ధరలను తగ్గించాయి. ఈ ధరల తగ్గింపు కారణంగా అమ్మకాలు పెరుగుతాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, ఫియట్, హోండా, నిస్సాన్‌లు బుధవారం రేట్ల కోతను ప్రకటించాయి. లగ్జరీ కార్ల దిగ్గజాలు ఆడి, మెర్సిడెస్‌లతో పాటు టూవీలర్ కంపెనీలు.. హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ కూడా ఇప్పటికే ధరలను తగ్గించాయి. సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనం కస్టమర్లకే... ఎక్సైజ్ సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందజేస్తామని, ఆ మేరకు ధరలను తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు తెలిపాయి. కార్ల ధరలను మారుతీ సుజుకీ రూ.8,501 నుంచి రూ.30,984 రేంజ్లో, హ్యుందాయ్ కంపెనీ రూ.10,000 నుంచి రూ.1,35,300 రేం జ్లో తగ్గించాయి. మహీంద్రా రూ.13,000 నుంచి రూ.49,000 వరకూ, ఫియట్ రూ.8,000-12,000 వరకూ ధరలను తగ్గిం చాయి. మహీంద్రా కంపెనీ ప్రీమియం ఎస్యూవీ రెక్స్టన్ ధరలను రూ.92,000 వరకూ తగ్గించింది. ఫోక్స్‌వ్యాగన్, హోండా కూడా... మారుతీ సుజుకి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో హ్యాచ్‌బాక్‌ను రూ.8,502 తగ్గించింది. ఇది కనిష్ట తగ్గింపు, ఇక గరిష్టంగా ఎస్ఎక్స్4 సెడాన్ ధరను రూ. 30,984కు తగ్గించింది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన సెలెరియో ధరను కూడా కంపెనీ రూ.13,615 వరకూ తగ్గించింది. స్విఫ్ట్ ధరలను రూ.15,874, ఎర్టిగ ధరను రూ.18,747 తగ్గించింది. హోండా కార్స్ ఇండియా కంపెనీ ధరలను రూ.44,741 వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోక్స్‌వ్యాగన్ వాహన ధరలు రూ.14,500 నుంచి రూ.51,000 వరకూ తగ్గాయి. నిస్సాన్ తగ్గింపు 6 శాతం...: నిస్సాన్ కంపెనీ కార్ల ధరలను 4-6 శాతం వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఇవిల, టెర్రానో, టియనా కార్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. దేశీయ వాహన పరిశ్రమకు పునరుత్తేజాన్నిచ్చే దిశగా ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఆహ్వానించదగ్గ చర్య అని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర చెప్పారు. ఈ కార్ల తగ్గింపు కారణంగా తమ అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కంపెనీ రూ.3.5 లక్షల నుంచి రూ.25.47 లక్షల రేంజ్లో ఉన్న కార్లను విక్రయిస్తోంది. కాగా, టూవీలర్ల దిగ్గజాలు హీరో మోటోకార్ప్5 శాతం(రూ.4,500 )వరకూ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ కంపెనీ రూ.1,600 నుంచి రూ.7,600 వరకూ ధరలను తగ్గించిన విషయం విదితమే. అధిక వడ్డీరేట్లు, అంతకంతకూ పెరుగుతున్న ఇంధనం ధరలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల గత ఏడాది కార్ల విక్రయాలు 11 ఏళ్ల కనిష్టానికి క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు మంచి ఉపశమన చర్య అని వాహన కంపెనీలు హర్షం ప్రకటించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ... చిన్న కార్లు, స్కూటర్లు, మోటార్ బైక్‌లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కి; ఎస్‌యూవీలపై 30% నుంచి 24%కి, మిడ్ సైజ్ కార్లపై 24 శాతం నుంచి 20%కి, పెద్ద కార్లపై 27 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం తెలిసిందే. ధరలు ఇలా తగ్గాయ్... కంపెనీ తగ్గింపు (రూ.లలో) మారుతీ సుజుకి 8,502-30,984 హ్యుందాయ్ 10,000-1,35,300 ఫోక్స్‌వ్యాగన్ 14,500-51,000 మహీంద్రా 13,000-49,000 ఫియట్ 8,000-12,000 హోండా కార్స్ 44,751 వరకూ నిస్సాన్ 4-6 శాతం ఆడి 3.82లక్షల వరకూ మెర్సిడెస్ బెంజ్ 2 లక్షల వరకూ హీరో మోటోకార్ప్ 4,500 వరకూ హోండా మోటార్‌సైకిల్ 1,600-7,600