fuel price
-
నష్టాల్లోకి ఇండిగో
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి. కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది. -
తగ్గిన ఇంధన ధరలు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం.. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇంధనంపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ధరలను తగ్గించే వ్యాల్యువ్ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని ప్రభుత్వం సవరించింది. లీటరు పెట్రోల్ ధరలను 65 పైసలు తగ్గించింది. డీజిల్ ధరలను రూ.2.60 పైసలు తగ్గిస్తూ ప్రకటించింది. ఈ ధరలు బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాల్లో ధర తగ్గింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.వ్యాట్ తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.200 కోట్ల భారం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ఇంధన ధరలను పెంచిన తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ ఇటీవలే కీలక ప్రకటన వెల్లడించింది. -
ప్రయాణికులకు అలెర్ట్, పెరిగిన ఇండిగో విమాన సీట్ల ధరలు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వినియోగదారులకు భారీ షాకిచ్చింది. విమానంలోని ఆయా సీట్ల ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఫ్రంట్ రో విండో సీటుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో సీట్ల ఎంపిక ఛార్జ్ ఇండిగో అదనపు స్థలాన్ని అందించే ‘ఎక్స్ఎల్’ సీట్లు లెగ్‌రూమ్ ఆధారంగా వివిధ సీట్ల కేటగిరీల కింద ప్రయాణికులకు సీట్లను అందిస్తుంది. దీంతో పెంచిన మొదటి వరుస ఎక్స్ఎల్ సీట్ల ఛార్జీలు ఇప్పుడు రూ .1400 నుండి రూ .2000 వరకు పెరిగాయి. మిడిల్ సీట్లకు రూ.150 నుంచి రూ.2000 వరకు ధరల్ని సవరించింది. కాగా, గతంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు కనిష్టంగా రూ.300 మేర తగ్గగా.. దూర ప్రాంతాల్ని బట్టి ధర రూ.1000కి పెరిగాయి. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గడంతో ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకుంది. -
వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే..
విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది. -
శ్రీలంక లాంటి దుస్థితి... బంగ్లాదేశ్‌లో పెరిగిన ఇంధన ధరలు
Russia-Ukraine war for the hike in fuel prices: బంగ్లాదేశ్ కూడా శ్రీలంకలా ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. మొన్నటివరకు శ్రీలంకలో తొలుత ఇంధన సంక్షోభంతో ప్రారంభమై చివరి రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికి పొయింది. తీవ్ర ప్రజా ఆగ్రహాన్ని చవిచూసింది శ్రీలంక. ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది లంక దేశం. తదనంతరం ఇప్పుడూ బంగ్లదేశ్ కూడా శ్రీంకలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ మేరకు బంగ్లదేశ్‌లోని ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఇంధన ధరలను 52% పెంచడంతో తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన కేంద్రాలను ముట్టడించి ఇంధన ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఐతే ఇంధన ధరల పెంపుకు కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధమేనని బంగ్లదేశ్ ప్రభుత్వం చెబుతోంది. పెరిగిన ఇంధన ధరలు దేశంలోని సబ్సిడి ధరల భారాన్ని తగ్గించగలవని ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఐతే ఇప్పటికే 7 శాతానికి పైగా నడుస్తున్న ద్రవ్యోల్బణం పై మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. ఇదిగా నేరు సామన్య ప్రజల పైనే ప్రభావం చూపిస్తోంది. అదీగాక బంగ్లదేశ్ కూడా దాదాపు 46 బిలియన్ల డాలర్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. పెరిగిన ఇంధనం, ఆహార ధరలు దిగుమతుల ఖర్చులను పెంచేశాయి. దీంతో ప్రపంచ ఏజెన్సీలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇంధన ధరల తోపాటు పెరుగుతున్న నిత్వావసర ధరలు కారణంగా సామాన్య ప్రజలపై రోజుల వారి ఖర్చలు భారం అధికమైంది. అదీగాక బంగ్లదేశ్ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకే విలాసవంతమైన వస్తువుల దిగుమతులు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్పీజీ)తో సహా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధించింది. అంతేకాదు డీజిల్‌తో నడిచే పవర్ప్లాంట్లను కూడా మూసివేయడం వంటి చర్యలు కూడా తీసుకుంది. కొత్తగా పెంచిన ధరలు అందరికి ఆమోదయోగ్యం కాదని తెలుసు కానీ మాకు వేరే గత్యంతరం లేదని, దయచేసి ప్రజలు ఓపిక పట్టాలని ఇంధన, ఖనిజ వనరుల శాఖమంత్రి నస్రుల్ హమీద్ అన్నారు. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
సాక్షి, అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్‌లపై డీజిల్ సెస్‌ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే. బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131 2019 డిసెంబర్లో డీజిల్ ధర మార్కెట్లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్ పార్ట్‌ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్ సెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస దూరానికి పెంపులేదు ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. సహృదయంతో సహకరించాలి డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. – ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్), సీహెచ్.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ) -
పెట్రోల్ ధరలు.. రూ. 18 పెంచి 8 తగ్గిస్తారా? కేంద్రపై ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు
ముంబై: పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ఏమాత్రం సరిపోదని, ఇంధన ధరలను అరికట్టేందుకు మరిన్న చర్యలు అవసరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. గత ఆరేడేళ్ల క్రితం పెట్రోల్, డీజీల్ ధరలు ఎంతెంతున్నాయో ఆమేరకు కేంద్రం తగ్గించాలని ఠాక్రే శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితం కేంద్రం పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.18.42 పెంచిందని, కానీ, ఈరోజు కేవలం రూ.8 తగ్గించిందని, అదేవిధంగా డీజీల్ ధర లీటర్‌కు రూ.18.24 పెంచింది, ఇప్పుడు కేవలం రూ.6లు తగ్గించిందని కాబట్టి ఇదేమంత భారీ తగ్గింపు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం పెట్రోలు, డీజీల్ ధరలు ఎంతెంత ఉన్నాయో ఆ మేరకు తగ్గిస్తేనే భారీ ఎత్తున తగ్గించినట్లని, వినియోగదారులకూ గొప్ప రిలీఫ్ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం.. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు పెద్ద రిలీఫ్ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని పోస్ట్ చేశారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై రూ.8లు, డీజీల్‌పై రూ.6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పెట్రోల్, డీజీల్ లపై వసూలు చేసే ఎక్సైజ్ సుంకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్రలోనే ఎక్కువని, కేంద్రం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎౖMð్సజ్‌సుంకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. పెట్రోల్, డీజీల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు. చదవండి: ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం.. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే
ఇస్లామాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. రష్యా నుంచి ఇంధనాన్ని రాయితీపై కొనుగోలు చేయాలనే భారత్ నిర్ణయాన్ని ఇమ్రాన్ కొనియాడారు. అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా చమురును రాయితీపై దిగుమతి చేసిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. క్వాడ్‌లో భారత్ సభ్య దేశం అయినప్పటికీ అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసింది. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో పనిచేస్తోంది’ అని ఇమ్రాన్ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గతంలో పాకిస్థాన్‌లో తమ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజల ప్రయోజనాల కోసమే కృషి చేసిందని ప్రస్తావించారు. చదవండి: ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్ పార్టీ ఇక పాకిస్థాన్ ప్రస్తుతం ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు. పాక్ ఆర్థిక వ్యవస్థ తలాతోక లేని కోడిలా నడుస్తోందని, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలోని మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు బాహ్య దేశాల బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు. కాగా అంతకముందు కూడా ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను పలుమార్లు ప్రశంసించారు. భారత్‌ను ఏ దేశం శాసించలేదని, అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదన్నారు. భారత్‌కు తమ దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. -
Sakshi Cartoon: ప్రస్తుతం పెట్రోల్ ధరలు తగ్గించే పథకం ఏదన్నా ఉంటే తప్ప ఏ పథకాల్ని..
ప్రస్తుతం పెట్రోల్ ధరలు తగ్గించే పథకం ఏదన్నా ఉంటే తప్ప ఏ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోలేం! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే!
ముంబై: భారత్ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ►కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి. ►2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం. ►ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్‌లతో పోల్చితే మూడవ వేవ్‌లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ►ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ పునరుద్ధరణను అడ్డుకుంటుంది. ►సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ►భారత్ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది. ►2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా మారనున్నాయి. ►ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి. వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు, తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది. -
Sakshi Cartoon: ..కాస్త ఓపిక పట్టు చాలు!
..కాస్త ఓపిక పట్టు చాలు! -
అంతా తల్లకిందులు.. అగ్గువ ఏడ దొరుకుతది?
సాక్షి, హన్మకొండ: డీజిల్ టోకు లెక్కన కొనే ఆర్టీసీకి కొత్త చిక్కొచ్చిపడ్డది. ఆయిల్ కంపెనీలు బల్క్ విక్రయాల రేట్లు పెంచాయి. దీంతో తక్కువ ధరకు డీజిల్ అందించే ప్రైవేట్ బంకుల కోసం ఆర్టీసీ వేట ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో డిపోలో వందకు పైగా బస్సులున్నాయి. టీఎస్ ఆర్టీసీ డిపోలోనే సొంతంగా డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసుకుంది. బయటి మార్కెట్లో బంకులకు సరఫరా చేసినట్లుగానే హోల్‌సేల్ ధరలకు ఆయిల్ కంపెనీలు ఆర్టీసీకి డీజిల్ అందించేవి. కానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బల్క్ డీజిల్ కొనుగోలు చేస్తున్న సంస్థలకు ఆయిల్ కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. బల్క్ ధర లీటర్‌కు రూ.96.50కి పెంచినట్లు సమాచారం. బయటి బంకుల్లో రిటైల్ ధర లీటర్‌కు రూ.94.14 ఉంది. మన దగ్గర ఇలా.. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ డిపోల ఆధ్వర్యంలో రిటైల్ డీజిల్ బంకులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డిపోల బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తున్న రిటైల్ డీజిల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. మిగతా వరంగల్–1, వరంగల్–2, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు డిపోల బస్సుల్లో ఇంధనాన్ని నింపేందుకు ఈ డిపోల పరిధిలో బంకులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలస్యమైతే ఆర్టీసీపై భారం పడనుండడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ బంకులను ఎంపిక చేసే పనిలో కమిటీ ముందుకు సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డివిజనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేటు బంకులను గుర్తించే పనిలో ఉంది. వరంగల్ రీజియన్‌లో 952 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో సంస్థ సొంత బస్సులు 584, అద్దె బస్సులు 368 ఉన్నాయి. (చదవండి: డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది) 952 బస్సులకు ఆయా డిపోల్లోని సంస్థ సొంత బంకుల్లోనే డీజిల్ నింపేవారు. వరంగల్ రీజియన్‌లో దాదాపు రోజుకు 67,500 లీటర్ల డీజిల్ అవసరం. లీటర్‌కు రూ.2.36 మిగిలితే. 67,500 లీటర్లకు రూ.1,59,300 సంస్థకు ఆదా కానుంది. బల్క్ కొనుగోలుదారులకు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో సంస్థ సొంత బస్సులతోపాటు అద్దె బస్సులకు కూడా ప్రైవేట్ బంకులే దిక్కయ్యాయి. గతంలోనూ ఇదే పద్ధతి.. 2011–12 ఆర్థిక సంవత్సరం చివర్లో ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరలు పెంచాయి. దీంతో ఆరు నెలలపాటు ప్రైవేటు డీజిల్ బంకుల్లో ఆర్టీసీ ఇంధనాన్ని నింపుకుంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బంకుల వైపు ఆర్టీసీ చూస్తోంది. రిటైల్ ధరలోనూ కాస్త తగ్గించి ఆర్టీసీకి డీజిల్ అందించే బంకుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు బంకుల యజమానులను కలిసి మాట్లాడుతున్నారు. డివిజనల్ మేనేజర్, రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఎస్ఎస్ఐ, సంబంధిత డిపో మేనేజర్‌తో కూడిన కమిటీ ప్రైవేట్ డీజిల్ బంకులను ఎంపిక చేయనుంది. ఈ కమిటీ ఆయా డిపోల పరిధిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుంది. వారం రోజుల్లోపు ప్రైవేట్ బంకులను ఖరారు చేసే పనిలో కమిటీ నిమగ్నమైంది. (చదవండి: ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి) -
బీఎస్– 6 కార్లకు ఇక సీఎన్జీ
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో సంతోషంగా కొనుగోలు చేసిన కొత్తకారు బయటకు తీసేందుకు వెనకడుగు వేస్తున్నారా? ఇంటిల్లిపాదీ కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇంధన భారం బెంబేలెత్తిస్తుందా? మరేం ఫర్వాలేదు. త్వరలోనే మీ వాహనంలో ఇంధన వినియోగానికి అనుగుణమైన మార్పులు చేసుకోవచ్చు. పెట్రోల్‌తో నడిచే భారత్ స్టేజ్– 6 వాహనాల్లో ఇక సీఎన్జీ కిట్లను అమర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలోనే అన్ని చోట్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలు సీఎన్జీ వినియోగంలో మారడం వల్ల వాహనదారులకు ఇంధనంపై ఖర్చు 40 నుంచి 50 శాతం వరకు ఆదా అవుతుంది. గ్రేటర్లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఊరట లభించనుందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. బీఎస్– 6 శ్రేణికి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన చాలా మంది సీఎన్జీకి మార్చుకోవాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ అవకాశం లేకపోవడంతో ఇంధనం కోసం భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది. పర్యావరణ పరిరక్షణ.. సహజ ఇంధన వాహనదారులకు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదం చేస్తుంది. ఈ మేరకు బీఎస్– 4 వాహనాల వరకు ప్రభుత్వం సీఎన్జీ కిట్లను ఏర్పాటు చేసుకొనేందుకు గతంలోనే అనుమతులను ఇచి్చంది. కానీ కొత్తగా వచ్చిన బీఎస్–6 వాహనాలకు మాత్రం ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. తాజాగా అన్ని రకాల కార్లకు సీఎన్జీ కిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఎస్యూవీ వాహనాలకు కూడా ఈ మార్పు వర్తించనుంది. 1.5 లక్షల వాహనాలకు ఊరట... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఈ మార్పు వల్ల ఊరట లభించనుంది. సీఎన్జీ కిట్లను అమర్చుకోవడం వల్ల వాహనదారులు ఆ ఇంధనం అందుబాటులో లేని సమయాల్లో సాధారణ పెట్రోల్ వాహనాలుగా కూడా వినియోగించుకోవచ్చు. వాహనాల భద్రత దృష్ట్యా ప్రతి మూడేళ్లకోసారి సీఎన్జీ కిట్లను రిట్రోఫిట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
తగ్గనున్న పెట్రోల్ ధరలు ? ఓపెక్ దేశాల కీలక నిర్ణయం
ఫ్రాంక్ఫర్ట్: ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోవిడ్–19 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్యదేశాల ఒపెక్, అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. ధరలు తగ్గేనా పెట్రోల్‌ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలైన అమెరికా, చైనా, భారత్, జపాన్లలో ధరల నియంత్రణ కోసం ముడి చమురు ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్ దేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాలేదు. దీంతో ఈ దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి పెట్రోలును రిలీజ్ చేశాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాలు, వినియోగదారులైన దేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: ముడి చమురు మహా యుద్ధం! -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
పెట్రో ధరలు తగ్గింపుపై రాని స్పష్టత, ఇంధనం ఆదా చేసే కార్లకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: పనితీరుపై రాజీపడకుండా ఇంధనాన్ని మరింత ఆదా చేసే వాహనాల తయారీపైనే ఇకపైనా దృష్టి పెడతామని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కొనుగోలుదారులు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. పర్యావరణ హితమైన, ఇంధనం ఆదా చేసే విధమైన కార్లకు మారుతీ కట్టుబడి ఉందని తెలియజేసే కమ్ సే కామ్ బనేగా (కాస్త ఇంధనం సరిపోతుంది) పేరిట కొత్త ప్రచార కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. ఇంధన ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలేమీ కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో కస్టమర్లు మెరుగైన మైలేజీనిచ్చే వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి మరింత కఠినతరమైన కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో అన్ని ఆటోమొబైల్ కంపెనీలూ ఇంధనం ఆదా చేసే వాహనాలను తప్పనిసరిగా తయారు చేయాల్సి రాగలదని శ్రీవాస్తవ చెప్పారు. స్మార్ట్ హైబ్రిడ్, ఎస్–సీఎన్జీ, కె–సిరీస్ ఇంజిన్లు మొదలైన వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ఊతంతో గడిచిన దశాబ్ద కాలంలో తమ వాహనాల సామర్థ్యాన్ని దాదాపు 30% దాకా మెరుగుపర్చామని ఆయన తెలిపారు. ‘ఇంధనం ఆదా చేసే కార్లకు సంబంధించి మేము వివిధ విభాగాల్లో లీడర్లుగా ఉన్నాం. ఆల్టో, వ్యాగన్ ఆర్, బాలెనో స్మార్ట్ హైబ్రిడ్, డిజైర్, సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఈకో తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి‘ అని శ్రీవాస్తవ చెప్పారు. అధిక మైలేజీ, మెరుగైన పనితీరుకు పేరొందిన కే–సిరీస్ ఇంజిన్లు అమర్చిన కార్లు 70 లక్షలకు పైగా విక్రయించామని చెప్పారు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
డీజిల్ రేట్లలో కోత.. 20 పైసల తగ్గింపు
హైదరాబాద్ : గత కొంత కాలంగా ధరలు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్న చమురు కంపెనీలు శాంతించాయి. నెల రోజులగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండటంతో కొంత తేరుకుంటున్న సామాన్యులకు మరో ఉపశమనం కలిగించాయి. లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అయితే పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.96లు ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.74లుగా ఉంది. అంతకు ముందు ఆగస్టు 8వ తేదిన సైతం డీజిల్ రేటు 14 పైసలు తగ్గింది. అంతకు ముందు ఈ నెలలో అత్యధిక ధరగా రూ.98.10 డిజిల్ ధర ఉంది. -
పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డుతో హెచ్‌పీసీఎల్ పెట్రోలియం ఔట్లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. -
ఇంధనానికి మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్డౌన్లను సడలించే కొద్దీ దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోంది. మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన వినియోగం .. ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు మెరుగుపడే కొద్దీ జూన్‌లో మళ్లీ పుంజుకుంది. గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెల ఇంధన వినియోగం 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. మే నెలతో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విభాగాలవారీగా చూస్తే పెట్రోల్ వినియోగం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. మే నెలలో నమోదైన 1.99 మిలియన్ టన్నులతో పోలిస్తే 21 శాతం పెరిగింది. అటు దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు మే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగి 6.2 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అయితే, గతేడాది జూన్‌తో పోలిస్తే మాత్రం 1.5 శాతం తగ్గాయి. ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే జూన్‌లో తొలిసారిగా ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రావడానికి ముందు మార్చిలో .. ఇంధనాలకు డిమాండ్ కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపుగా చేరింది. కానీ ఇంతలోనే సెకండ్‌వేవ్ రావడంతో వినియోగం క్షీణించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు విధించడంతో మేలో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు, తాజా జూన్‌లో వంట గ్యాస్ వినియోగం వార్షికంగా చూస్తే 9.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరింది. విమానయాన సంస్థలు ఇంకా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో.. విమా న ఇంధన (ఏటీఎఫ్) అమ్మకాలు వార్షికంగా చూస్తే 16.2 శాతం పెరిగినప్పటికీ కోవిడ్ పూర్వం నాటి 2019 జూన్‌తో పోలిస్తే 61.7 శాతం క్షీణించాయి. -
మార్కెట్లో భగ్గుమంటున్న ధరలు
ముంబై : భారత ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. మేలో రికార్డు స్థాయిలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 12.94 శాతాన్ని తాకింది. పెట్రోలు, డీజిల్‌తో పాటు వంట నూనెల ధరల పెరుగుదలతో ఒక్కసారిగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఫ్యూయల్ ధరలు పెరుగుతుండటంతో పెట్రోలుపై ఆధారపడిన ఉత్పత్తుల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా వరుసగా ఐదో నెల కూడా ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ కంటే ఎక్కువ గత ఏప్రిల్‌లో నెలలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒక్కసారిగా 10.49కి చేరుకుంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యధిక డబ్ల్యూపీఐగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ధరల తగ్గుముఖం పడతాయని ఆశించగా మే ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ను మించింది. ద్రవోల్బణం కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ధరలు తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే కోవిడ్ దెబ్బకు ఆదాయం గణనీయంగా పడిపోగా... తాజాగా ద్రవ్యోల్బణ దెబ్బ కూడా తగులుతోంది. -
ఇలా చేస్తే రూ. 311 లక్షల కోట్లు ఆదా, నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: సరుకు రవాణాకోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్.. 2020–2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్ ఇంధనంపరంగా రూ. 311 లక్షల కోట్లు ఆదా చేసుకోగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. అలాగే వచ్చే మూడు దశాబ్దాల్లో 10 గిగాటన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో సరుకు రవాణా వేగవంతం చేయడంలో పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం అంశంపై రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎంఐ)తో కలిసి నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. ఉత్పత్తులు, సర్వీస్ లను డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సరుకు రవాణాకు కూడా డిమాండ్ గణనీయంగా పెరగగలదని నివేదిక పేర్కొంది. రైల్వే నెట్‌వర్క్‌నుపెంచుకోవడం, వేర్‌హౌసింగ్‌ను మెరుగుపర్చుకోవడం, విధానపరమైన సంస్కరణలు తీసుకోవడం, పరిశుభ్రమైన టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం, ఇంధన ఆదా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వృద్ధి బాటలో ఉన్న భారత ఎకానమీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం సరుకు రవాణా కీలకంగా మారిందని, రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సలహాదారు (రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు జె సిన్హా తెలిపారు. కేంద్రం నిర్దేశించుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా తదితర లక్ష్యాల సాకారానికి కూడా సమర్ధమంతమైన రవాణా విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
బండి ఓకే.. ఆయిలే గుదిబండ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి. కొనేది కారైనా, బైకైనా మనోళ్లు చూసేది మాత్రం వాల్యూ ఫర్ మనీ! అందుకే కార్ల కోసం మారుతి సుజుకీ వైపు, బైకుల కోసం హీరో కంపెనీ వైపు చూస్తారు. హీరో ఇండియాలో అతి పెద్ద బైకుల తయారీ కంపెనీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బైకులు, కార్లు కొనే ముందు ఓ సారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు. గడచిన పదేళ్లలో వాహనాల ఇంధన రేట్లు పెరగడం ఒక ఎత్తైతే, ఈ పదిహేను రోజుల్లో పెరిగిన తీరు మరో ఎత్తు. పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం వినియోగదారుల్లో గుబులుపుట్టిస్తోంది. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలను తాకాయి. ఇలా వాహనదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం నిజంగా ఆయిల్ కంపెనీలకే వెళ్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. (అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు) ప్రతి లీటరుకు చెల్లిస్తున్న మొత్తంలో 60 శాతానికిపైగా పన్ను కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మే ఆరో తేదీన ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు 71.26 రూపాయలు కాగా, లీటరు డీజిల్ ధర 69.39. వీటి నుంచి పన్నుతీసేస్తే లీటరు పెట్రోల్ అసలు ధర 18.28 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 18.78 రూపాయలుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 32.98 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.83 రూపాయల ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 16.44 రూపాయల వ్యాట్ విధిస్తోండగా, లీటరు డీజిల్ పై 16.26 రూపాయల పన్ను వడ్డిస్తోంది. అతి కొద్ది మొత్తం డీలర్ మార్జిన్ కింద పోతోంది. వీటన్నింటినీ కలిపితే లీటరు ఆయిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా పన్ను వేస్తున్నాయి.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఆయిల్ పై పన్ను శాతం 75ని తాకింది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 55 శాతం పైగా సుంకాలను చమురుపై వడ్డిస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సెక్టార్ నుంచి భారత ప్రభుత్వానికి 2.14 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.50 లక్షల కోట్లను చమురు రంగం ఆర్జించిపెట్టింది. -
పేలనున్న పెట్రోలు బాంబు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రజానీకం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మునిగిపోవడంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అలీన దేశాలకు ఇచ్చిన అనుమతిని ఇప్పుడే రద్దు చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అప్పటివరకున్న బ్యారెల్ పెట్రోల్ ధర 75 డాలర్ల నుంచి 73 డాలర్లకు పడిపోయింది. ట్రంప్ ప్రకటన ప్రభావం స్పల్పంగానే పనిచేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగాయి. గత ఆరు వారాల్లోనే 12 శాతం పెరిగాయి. దానికి అనుగుణంగా దేశంలో పెట్రోలు ధరలు ఎక్కడా పెరగలేదు. గత ఆరు వారాల్లో లీటరు పెట్రోల్‌కు కేవలం 47 పైసలు మాత్రమే పెరిగింది. మరి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఎందుకు పెట్రోలు ధరలు పెరగలేదు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్నికలు. ఈ సమయంలో పెట్రోలు ధరలు పెంచినట్లయితే అది పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రతికూలాంశం అవుతుందని ఆందోళనతో ఆ అంశాన్ని పక్కన పెట్టి ఉంటారు. చమురు ధరలను ఇలా తొక్కిపెట్టడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి కాదు. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చమురు ధరలను తొక్కిపట్టి ఉంచారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఎన్నికల సమయంలో నష్టపోయినా సొమ్మునంతా తిరిగి రాబట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశం ఉందని అఖిల భారత పెట్రోలు డీలర్ల సంఘం కోశాధికారి నితిన్ ఘోయల్ తెలిపారు. నేడు దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడం లాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలు ధరల పెంపు శిరోభారమే. ఇక వినియోగదారులకు అది పేలనున్న బాంబే. -
త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు బుధవారం చమురు సంస్థలు ప్రకటించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ‘పైసా’చికంపై సోషల్ మీడియాలో జోకులు, వంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఫొటోలు, వీడియోలతో ప్రభుత్వ చమురు సంస్థల తీరును ఎండగట్టారు. ఒక్క పైసాను ఏం చేసుకోవాలబ్బా... ఆ...గుర్తొచ్చింది. జన్‌ధన్ యోజన అకౌంట్లలో జమచేసేస్తాను. అసలు దీనంతటికీ కారణం మన తొలి ప్రధాని నెహ్రూయే. ఆయన హయాంలోనే పైసాను చలామణిలోకి తెచ్చారు. అందుకే ఇప్పుడు పైసా తగ్గింది ఒక్క పైసా ఆదా అయింది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమేం కొనాలో ఒక జాబితా రూపొందించుకోవాలి. అబ్బా! ఎంత ఉపశమనమో. ఒక్క పైసా తగ్గిందోచ్.. నిజంగా ఇవాళ నేను కోటీశ్వరుడినన్న భావన కలుగుతోంది. సేల్ సేల్.. మెగా సేల్.. పెట్రోల్‌పై ఒక్క పైసా డిస్కౌంట్. త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి.. మంచి తరుణం మించినా దొరకదు. అబ్బో.. ఊహించలేకపోతున్నాం. ఏకంగా ఒక్క పైసా తగ్గించారు కదా.. ప్రజలపై మోదీకి ఉన్న సానుభూతిని వెలకట్టలేం... నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది. పట్టలేనంత సంతోషంగా ఉంది. నా అందమైన భవిష్యత్‌ని నిర్మించుకోవడానికి ఒక్క పైసా ఆదా చేసుకోగలిగాను. ఇంతకంటే జీవితానికి కావల్సినదేముంది. పెట్రోల్, డీజిల్‌పై ఆదా చేసిన ఒక్క పైసాతో ఇల్లు, కారు, హెలికాప్టర్ కొనాలనుకుంటున్నాను.