
మహారాష్ట్ర ప్రభుత్వం.. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇంధనంపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ధరలను తగ్గించే వ్యాల్యువ్ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని ప్రభుత్వం సవరించింది. లీటరు పెట్రోల్ ధరలను 65 పైసలు తగ్గించింది. డీజిల్ ధరలను రూ.2.60 పైసలు తగ్గిస్తూ ప్రకటించింది. ఈ ధరలు బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాల్లో ధర తగ్గింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
వ్యాట్ తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.200 కోట్ల భారం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ఇంధన ధరలను పెంచిన తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ ఇటీవలే కీలక ప్రకటన వెల్లడించింది.