ముంబై : భారత ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. మేలో రికార్డు స్థాయిలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 12.94 శాతాన్ని తాకింది. పెట్రోలు, డీజిల్‌తో పాటు వంట నూనెల ధరల పెరుగుదలతో ఒక్కసారిగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఫ్యూయల్ ధరలు పెరుగుతుండటంతో పెట్రోలుపై ఆధారపడిన ఉత్పత్తుల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా వరుసగా ఐదో నెల కూడా ధరలు పెరుగుతున్నాయి.
ఏప్రిల్ కంటే ఎక్కువ
గత ఏప్రిల్‌లో నెలలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒక్కసారిగా 10.49కి చేరుకుంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యధిక డబ్ల్యూపీఐగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ధరల తగ్గుముఖం పడతాయని ఆశించగా మే ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ను మించింది. ద్రవోల్బణం కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ధరలు తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే కోవిడ్ దెబ్బకు ఆదాయం గణనీయంగా పడిపోగా... తాజాగా ద్రవ్యోల్బణ దెబ్బ కూడా తగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment