ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వినియోగదారులకు భారీ షాకిచ్చింది. విమానంలోని ఆయా సీట్ల ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఫ్రంట్ రో విండో సీటుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.
ఇండిగో సీట్ల ఎంపిక ఛార్జ్
ఇండిగో అదనపు స్థలాన్ని అందించే ‘ఎక్స్ఎల్’ సీట్లు లెగ్రూమ్ ఆధారంగా వివిధ సీట్ల కేటగిరీల కింద ప్రయాణికులకు సీట్లను అందిస్తుంది. దీంతో పెంచిన మొదటి వరుస ఎక్స్ఎల్ సీట్ల ఛార్జీలు ఇప్పుడు రూ .1400 నుండి రూ .2000 వరకు పెరిగాయి. మిడిల్ సీట్లకు రూ.150 నుంచి రూ.2000 వరకు ధరల్ని సవరించింది.
కాగా, గతంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు కనిష్టంగా రూ.300 మేర తగ్గగా.. దూర ప్రాంతాల్ని బట్టి ధర రూ.1000కి పెరిగాయి. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గడంతో ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment