దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం రూ.70వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పసిడి ధరల మార్పులకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు నిపుణులు.
మార్చి నెల ప్రారంభం నుంచి గత గురువారం వరకు పసిడి ధర రూ. 2,700 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,298కి ఎగబాకింది. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు పెరగడానికి ఈ ఏడాది జూన్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మదుపుర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. లాభాల్ని గడిస్తున్నారు.
ఈ అంచనా ప్రకారం..జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచింది ఇది బంగారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది.
ఈ సందర్భంగా .. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక రంగంలో అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం బంగారం పెరుగుదల ధోరణి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా ఖరీదైనవిగా మారుతున్నందున పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లించవచ్చు అని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment