ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర‍్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదారబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది
వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
సాధారణంగా బంగారం, స్టాక్ మార్కెట్‌లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్‌లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి.
యుఎస్‌లో బంగారం ధరలు (ఏప్రిల్2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి.
ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన
Comments
Please login to add a commentAdd a comment