వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్‌లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.
ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.
ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు
నయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, కెసని ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్‌లోని వడినార్‌లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్‌లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment