digitalpayments
-
పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్‌లోని వడినార్‌లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్‌లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్‌లున్నాయి. -
డిజిటల్ చెల్లింపుల జోరు
చెన్నై: దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిల్చింది. 2022లో 65 బిలియన్ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం న్యూఢిల్లీ (1.96 కోట్ల లావాదేవీలు, 50 బిలియన్ డాలర్ల విలువ), ముంబై (1.87 కోట్ల లావాదేవీలు, 49.5 బిలియన్ డాలర్ల విలువ), చెన్నై (1.43 కోట్ల లావాదేవీలు, 35.5 బిలియన్ డాలర్ల విలువ), పుణే (1.5 కోట్ల లావాదేవీలు, 32.8 బిలియన్ డాలర్ల విలువ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అద్భుతమైన పురోగతి నమోదవుతోందని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు. దేశీయంగా నగదు చలామణీని తగ్గించే దిశగా చెల్లింపులకు సంబంధించి బహుళ సాధనాలు అందుబాటులోకి రావడం మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. -
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే:మోదీ
-
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే: మోదీ
పెద్ద నోట్లను రద్దు చేసిన అంనంతరం బయటికొచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ముగియడంతో దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన ఢిజీధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు భీమ్ పేరుతో ఓ కొత్త యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 50 రూపాయల నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి ఈ బహుమతులు అందజేయనున్నామని, అంబేద్కర్ జయంతి రోజును మొదటి డ్రా ప్రారంభమవుతుందని వెల్లడించారు. వందరోజుల పాటు లక్కీ డ్రాలో 15వేల మందికి, రూ.10వేలను బహుకరించనున్నారు. దేశంలోనే భీమ్ యాప్‌కు ప్రత్యేకత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.