పెద్ద నోట్లను రద్దు చేసిన అంనంతరం బయటికొచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ముగియడంతో దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన ఢిజీధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు భీమ్ పేరుతో ఓ కొత్త యాప్ను మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.