చెన్నై: దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిల్చింది. 2022లో 65 బిలియన్ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
నివేదిక ప్రకారం న్యూఢిల్లీ (1.96 కోట్ల లావాదేవీలు, 50 బిలియన్ డాలర్ల విలువ), ముంబై (1.87 కోట్ల లావాదేవీలు, 49.5 బిలియన్ డాలర్ల విలువ), చెన్నై (1.43 కోట్ల లావాదేవీలు, 35.5 బిలియన్ డాలర్ల విలువ), పుణే (1.5 కోట్ల లావాదేవీలు, 32.8 బిలియన్ డాలర్ల విలువ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అద్భుతమైన పురోగతి నమోదవుతోందని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు. దేశీయంగా నగదు చలామణీని తగ్గించే దిశగా చెల్లింపులకు సంబంధించి బహుళ సాధనాలు అందుబాటులోకి రావడం మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment