విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్‌లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది.
ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..
విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment