ATF
-
ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో!
జైసల్మేర్: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్‌ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్ చేసే పేమెంట్ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్‌టెక్ సరీ్వసెస్, పేమెంట్ గేట్‌వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. ఆరోగ్య బీమాపై.. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబదీ్ధకరణపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్ కోసం సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది. పాత ఈవీలపై పన్ను.. పాత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్/డీజిల్ కారును విక్రయిస్తే మార్జిన్ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోరి్టఫైడ్) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్‌కార్న్‌పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్ వివరణ ఇచి్చంది. 50 శాతం పైగా ఫ్లైయాష్ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏసీసీ) బ్లాక్స్‌పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్‌లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్‌లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్‌ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే..
విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది. -
ఏటీఎఫ్ ధర 5 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్‌ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది. అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్‌లైన్స్‌పై భారమూ తగ్గుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు. -
కొత్త ఎఫ్‌టీఏలతో ఎగుమతులకు ఊపు
న్యూఢిల్లీ: దేశాలతో కొత్త సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), వ్యయం తగ్గింపునకు చర్యలు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటు, లాజిస్టిక్స్ పురోగతి, భూ సంస్కరణలు వంటి చర్యలు 2030 నాటికి భారతదేశం వస్తువులు– సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి దోహదడతాయని పరిశ్రమ చాంబర్– పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) నివేదిక గురువారం తెలిపింది. ‘ఇండియాస్ ఎమర్జింగ్ ఎక్స్పోర్ట్ డైనమిక్స్: విజన్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు’’ అన్న శీర్షికతో ఆవిష్కృతమైన ఈ నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►సముద్ర ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, కొన్ని రసాయనాలు, ఫార్మా, పత్తి, అల్యూమినియం, ట్యాంకర్లతోసహా తొమ్మిది రంగాల్లోని 75 కీలక ఉత్పత్తుల ఎగుమతులకు స్కీమ్‌లు అవసరం. ఈ ఉత్పత్తులు వార్షికంగా చూస్తే మొత్తం ఎగుమతుల విలువలో 222 బిలియన్ల వాటా కలిగిఉన్నాయి. ►భారత్ మొత్తం ఎగుమతుల్లో ఈ విలువ 50 శాతం. ప్రపంచ స్థాయి వాణిజ్యంలో చూస్తే... ఈ 75 ఉత్పత్తులు ఎంతో కీలకంగా ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులలో భారతదేశం వాటా మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో 6 శాతం మాత్రమే. ►ఈ 75 ఉత్పత్తుల విషయంలో భారత్ తన అవకాశాలను పెంపొందించుకోడానికి అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారు–విక్రేత సమావేశాలలో పాల్గొనడం, ఈ వస్తువుల కోసం ఎగుమతి ప్రోత్సాహక పథకాలను పొడిగించడం వంటి చర్యలు అవసరం. ►భారతదేశం సేవా రంగం ఎగుమతులు సాంప్రదాయకంగా ఉత్తర అమెరికా, ఐరోపాలో కేంద్రీకృతమై ఉన్నాయి, అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ఖండాల్లో పురోగమిస్తున్న దేశాలుసైతం భారత్ ఎగుమతుల వృద్దికి అవకాశాలను పుష్కలంగా అందిస్తాయి.టోగో, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ ఎగుమతుల వృద్ధికి దోహదపడే గమ్యస్థానాల్లో కొన్ని . ►కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సమగ్రంగా ఉండాలి. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.భారత్ ఎగుమతుల రంగానికి ఈ విభాగం కీలకమైనది కావడమే దీనికి కారణం. ►రెపో రేటును తగ్గించడం (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6.5 శాతం) వల్ల బ్యాంకింగ్ రుణ రేట్లు తగ్గుతాయి. ఇది వ్యాపారాలకు మూలధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశీయంగా డిమాండ్ పెరగడానికీ ఈ చర్య దారితీస్తుంది. దేశీయ మార్కెట్లో ఉత్పత్తిదారులు– అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతిదారుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ►ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కొన్నేళ్లుగా విద్యుత్తు ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ, యూనిట్ విద్యుత్ ఛార్జీలు ఇప్పటికీ గణనీయంగా ఎక్కువగానే ఉన్నాయి. ►ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో భూమి ఒకటి. ప్రభుత్వం భూసంస్కరణలపై దృష్టి సారించాలి. ఇది భూమిని కొనుగోలు చేయడంలో సంక్లిష్టతలను తగ్గిస్తుంది. అలాగే వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. ►సామర్థ్యం, ఉత్పాదకతను పెంచే మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇది అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో కంపెనీల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడే అంశం. ►ఎగుమతులకు సంబంధించి మౌలిక వనరుల పురోగతి మరింత మెరుగుపడాలి. దేశంలో లాజిస్టిక్ వ్యయాలను తగ్గించడానికి రైలు, ఓడరేవులను మరింత అభివృద్ధి చేయాలి. భారతదేశంలోకి పేపర్ దిగుమతులు పరిమాణం పరంగా 2023–24 ప్రథమార్థంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 43 శాతం పెరిగాయి. ఆసియన్ దేశాల నుండి దిగుమతులు రెండు రెట్లు పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) డేటా ప్రకారం, కాగితం– పేపర్‌బోర్డ్ దిగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 672,000 టన్నులు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఈ పరిమాణం 959,000 టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో ఆసియన్ దేశాల నుంచి దిగుమతుల పరిమానం 81,000 టన్నుల నుంచి 2,88,000 టన్నులకు ఎగసింది. విలువ పరంగా చూస్తే, పేపర్ దిగుమతుల బిల్లు సమీక్షా కాలంలో రూ.5,897 కోట్ల నుంచి రూ.6,481 కోట్లకు ఎగసింది. ఆసియన్ దేశాలకు సంబంధించి విలువ రూ.715 కోట్ల నుంచి రెట్టింపై రూ.1,509 కోట్లకు చేరింది. పేపర్ దిగుమతుల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. కాగా, ముడిసరుకు, ఇన్పుట్ వ్యయాల్లో గణనీయమైన పెరుగుదల దృష్ట్యా కాగితం– పేపర్‌బోర్డ్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ)అధ్యక్షుడు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు. దిగుమతుల వల్ల మరింత పోటీ పూర్వక పరిస్థితిని దేశీయ పరిశ్రమ ఎదుర్కొంటోందని అన్నారు. కొనసాగుతున్న అనిశ్చితి... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో చరిత్రాత్మక రికార్డు స్థాయిలో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7 శాతం క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95 శాతం క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్ వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో 2023–24లో భారత్ వార్షిక వాణిజాభివృద్ధి అంచనాలపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు సేవల రంగం ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలంలో ఈ విలువ 181.37 బిలియన్ డాలర్ల నుంచి 192.65 బిలియన్ డాలర్లకు ఎగసింది. పురోగతి సాధ్యమే.. ఎగుమతుల పురోగతికి ప్రభుత్వం చక్కటి విధాన నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు ఎగుమతిదారులు కూడా తమ ఎగుమతులకు మంచి ధరను రాబట్టుకునే మార్గాలతో అనుసంధానమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగుమతుల రంగం క్రమంగా పురోగమిస్తోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ -
పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్‌కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
ఏటీఎఫ్ రేటు 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది. చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్‌కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్‌కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్‌కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
ఊపందుకున్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి. మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్‌కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి. -
డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. ఎంతంటే?
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటర్‌కు 50 పైసలు తగ్గించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు కంపెనీలకు లెవీ పన్నును మరో రూ.50 విధించింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ ధరలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. క్రూడ్ పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) టన్నుకు రూ.4350 నుండి రూ. 4400కు పెంచింది. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న డీజిల్‌పై పన్ను రూ.2.5 ఉండగా, దీనిని 50 పైసలు తగ్గించింది. అలాగే ఏటీఎఫ్‌పై విధిస్తున్న రూ.1.50 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భూమి నుండి, సముద్రపు అడుగుభాగం నుండి పంప్ చేయబడిన ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వంటి ఇంధనాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. -
విండ్‌ఫాల్ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా తగ్గించింది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్‌ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్‌కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది. సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి. (వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!) భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విండ్‌ఫాల్ టాక్స్ కోత వాటి లాభాల మార్జిన్లను పెంచుతుంది. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2022 నవంబరు నుంచి దాదాపు 15 శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది. -
డీజిల్, ఏటీఫ్ ఎగుమతులపై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్) ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్‌పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్‌పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
డీజిల్ ఎగుమతిదారులకు కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం గురువారం లీటరుకు రూ.5 నుంచి రూ. 7కు పెంచింది. అలాగే జెట్ ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై లీటరుకు రూ.2 పన్నును తిరిగి ప్రవేశపెట్టింది. కాగా, దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై పన్నును టన్నుకు రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ఏటీఎఫ్‌పై విడ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మార్జిన్లు పెరిగిన నేపథ్యంలో ఎగుమతులపై ప్రభుత్వం పన్ను పెంచింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయినందున దేశీయంగా ఉత్పత్తయిన చమురుపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. -
గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ వడ్డింపుపై కేంద్రం మరోసారి కిలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును సగానికి తగ్గించింది. అలాగే జెట్ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై టాక్స్‌ను రద్దు చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై పన్నును పెంచింది. (Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?) అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.11 నుంచి రూ.5కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది. దీంతో డీజిల్ లీటర్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.11 నుంచి రూ.6 కు దిగి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 17,000 నుండి రూ.17,750కి పెంచింది.పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరోగా కొనసాగుతుంది. క్రూడాయిల్‌పై పన్ను పెంపుద్వారా ఓఎన్జీసీ, వేదాంత లాంటి ఉత్పత్తి దారులకు కష్ట కాలమేనని, అలాగే డీజిల్, ఏటీఎఫ్‌లపై పన్నుల కోత రిలయన్స్ కు సానుకూలమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ చదవండి:నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించిన సంగతి తెలిసిందే. జూన్‌లో 26.18 బిలియన్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఎగుమతులు మందగించడంతో జూలై నెలలో 31 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం సవరించింది. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన కేంద్రం మరోసారి సారి కోత పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం నుండి జూలైలో రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో రెండోసారి విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. కమోడిటీ ధరలు పెరగడం, బలహీనమైన రూపాయి కారణంగా జూలైలో దిగుమతులు 43.59 శాతం పెరగగా, ఎగుమతులు 0.76 శాతం పడిపోయాయి. -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది. ఈ మేరకు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్‌కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరించబడతాయి. జూన్ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ కమిటీలో ఉన్నాయి. -
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ రేటు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి. ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి, కోల్‌కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్..డీజిల్ రేట్లను రోజువారీ సవరిస్తారు. -
భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..!
Aviation Turbine Fuel Price Hiked: కోవిడ్-19 రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యంది. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో ప్రకటించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో విమానయాన రంగం పుంజుకుంది. ఐతే తాజాగా మరో చమురు సంస్థలు విమానయాన సంస్థలకు భారీ షాక్ ఇస్తూ జెట్ ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్) ధరలను భారీగా పెంచాయి. ఏకంగా రూ. 17 వేలకు పైగా..! చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనంపై కిలోలీటర్‌కు రూ.17,136 చొప్పున పెంచాయి.దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ రూ.1.10 లక్షలకు చేరుకుంది. జెట్ ఇంధన ధరల పెరుగుదలతో విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలో ఇంధన నిర్వహన వ్యయమే దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు పెంచడం ఇది ఆరోసారి. మరింత ఖరీదు..! ఎటీఎఫ్ ధరలను పెరగడంతో విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచడం అనివార్యమైంది. గత రెండు, నాలుగు వారాల్లో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు పెంపులో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.36,644.25 చొప్పున పెరిగాయి. ఇక కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్ఞాలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గినట్లు తెలుస్తోంది. చదవండి: జెలన్ స్కీ కీలక ప్రకటన.. ఈ షేర్లపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులు! -
రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర.. కొత్తగా ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీలోకి ఏటీఎఫ్‌పై చర్చ.. కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్‌పరంగా సహకారం లభించేలా ఏవియేషన్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సీతారామన్ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. -
బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
చమురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్ లేకుండా పెట్రోలు ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.113కి చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని బన్స్వారాలో అయితే లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది. పెట్రోలు ధరలు వరుసగా మూడూరోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకి 37 పైసల వంతున ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113 కి చేరుకోగా డీజిల్ ధర రూ.106.22గా ఉంది. విమానమే నయం పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు సైతం ఈ వ్యంగాస్త్రాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. వాటికి పెట్రోల్ చీప్ బైకులు, కార్లు ఇలా సామాన్యులు ఉపయోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇదే వత్యాసం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. పన్నుల వల్లే మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కలుపుతారు. తర్వాత వచ్చిన ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. అనంతరం రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం 30 శాతం వ్యాట్ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది. పెరిగిన పన్నులు ఇక రెగ్యులర్ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపగా వచ్చిన ధరపై రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది. అంతర్జాతీయ ధరలంటూ పన్నుల విధానం కారణంగా సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే! -
ఇండిగో నష్టాలు తీవ్రతరం
న్యూఢిల్లీ: విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నష్టాలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మరింత పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.1,194 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. అవి మరింత అధికమై రూ.1,435 కోట్లకు చేరాయి. ఈ సంస్థ నిర్వహణలో 219 విమానాలు ఉన్నాయి. మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.5,798 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. వ్యయాలు 71 శాతం అధికమై రూ.7,234 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆదాయంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాలన్స్షీటును బలోపేతం చేసుకోవడంలో భాగంగా తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాం’’ అని కంపెనీ సీఈవో రోనోజోయ్దత్తా తెలిపారు. ఏవియేషన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీటి కారణంగా వ్యయాలు మరింత అధికమవుతాయన్నారు. -
భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది. -
పెట్రో డిమాండ్ ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పెట్రోలు వినియోగం భారీగా పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్థంభించిపోయాయి. దీంతో వంటగ్యాస్ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ భారీగా క్షీణించింది. ఏప్రిల్‌లో భారతదేశ ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో 50 శాతం పడిపోయింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఇంధన వినియోగానికి సంబంధించిన పెట్రోల్ అమ్మకాలు 64 శాతం తగ్గాయి, డీజిల్ అమ్మకాలు 61 శాతం కీణించాయి. అంతేకాదు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) వినియోగం 94 శాతం పడిపోయింది. అయితే వంటగ్యాస్ వినియోగం మాత్రం 21శాతం పుంజుకుంది. ప్రధానంగా ప్రభుత్వం పేదప్రజలకు ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన కారణంగా ఈ వృద్ది నమోదైంది. మొత్తం మీద పెట్రోలియం ఉత్పత్తి అమ్మకాలు 50 శాతం తగ్గాయి. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద క్షీణత అని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. కాగా 2019 ఏప్రిల్‌లో భారతదేశంలో 2.4 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయం నమోదైనాయి. డీజిల్ వినియోగం 7.3 మిలియన్ టన్నులు. 6,45,000 టన్నుల ఏటీఎఫ్ విక్రయాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. అనంతరం దీన్ని మే 3వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20వ తేదీనుంచి ఇ-కామర్స్ కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేయనుంది. అలాగే పోర్ట్, ఎయిర్ కార్గోలాంటి ఇతర కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. -
ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్ ధరలు 2019 జూన్ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవిచూస్తున్న ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల ప్రతికూలం కానుంది. రూ.714కు ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.695 నుంచి రూ.714కు ఆయిల్ సంస్థలు పెంచేశాయి. గత సెప్టెంబర్ నుంచి వరుసగా నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుతూనే ఉండడం గమనార్హం. గడిచిన ఐదు నెలల్లో సబ్సిడీ లేని ఒక్కో సిలిండర్ ధర నికరంగా రూ.139.50 పెరిగింది. ఒక ఏడాదిలో ఒక వినియోగదారుడు 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నెలలో అంతర్జాతీయ రేట్ల సగటు ఆధారంగా మరుసటి నెల మొదటి తారీఖున ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను పెంచడం జరుగుతోంది. ఇక ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే లీటర్ కిరోసిన్ ధర 26 పైసలు పెరిగి ముంబైలో రూ.35.58కు చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు ప్రతీ నెలా 26 పైసల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం గమనార్హం.