మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధర | Non-subsidised LPG price hiked by Rs 73.5 per cylinder, subsidised by Rs 7; ATF by 4% | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధర

Published Fri, Sep 1 2017 4:47 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

మళ్లీ  పెరిగిన సిలిండర్‌  ధర - Sakshi

మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధర

న్యూఢిల్లీ:  వంట గ్యాస్‌ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్‌ ‘బండ​​’  భారం పడింది. క్రమంగా వంట గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన   కంపెనీలు  మరోసారి  ధరలను సమీక్షించాయి.  ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా  ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను భారీగా పెంచేశాయి.  శుక్రవారం  ప్రకటించిన  తాజా నిర్ణయం ప్రకారం  నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.73.5  , సబ్సిడీ సిలిండర్‌ రూ. 7 ల మేర  పెరగనుంది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్)  ను 4శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది.

 దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2  కేజీల ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్‌ 487.18గా ఉండనుంది. నాన్‌- సబ్సిడీ సిలిండర్‌ ధర రూ. 597.50 గా ఉండనుంది.   అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ .2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్‌పీజీ రేట్లు సిలిండర్కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది.

ప్రతి నెల సిలిండర్‌పై  4 రూపాయల చొప్పున  పెంచుతూ  పూర్తిగా  సబ్సిడీనీ ఎత్తివేయాలని  ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement