Subsidised
-
టమాటాలపై సబ్సిడీ.. ఎన్సీసీఎఫ్ కీలక నిర్ణయం
పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 60 రూపాయల సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో టమాట ధరలు భారీగా పెరగడంతో ఎన్సీసీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో కేజీ టమాట ధర రూ.77 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు రూ. 80 దాటేసింది. ఈ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్సీసీఎఫ్ రేపటి నుంచి (జులై 29) మెగా సేల్ ప్రారంభించనుంది. ఇందులో టమాటాల మీద సబ్సిడీ కూడా లభిస్తుంది.కృషి భవన్, సీజీఓ కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, ఐఎన్ఏ మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో టమాటాలు సబ్సిడీ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎన్సీసీఎఫ్ వెల్లడించింది.పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్రం సబ్సిడీ ప్రవేశపెట్టింది. సబ్సిడీ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో టమాట ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు కూడా ఎన్సీసీఎఫ్ సబ్సిడీ అందించింది. NCCF has announced retailing tomatoes at Rs 60/kg. This will start from July 29 at various strategic locations across Delhi and NCR. Tomatoes will be retailed at Rs 60/kg at several locations, including Krishi Bhawan, CGO Complex, Lodhi Colony, Hauz Khas Head Office, Parliament… pic.twitter.com/rkDTnaAUoF— ANI (@ANI) July 27, 2024 -
ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!
గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. భారతీయ మార్కెట్లో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కేంద్రం నిన్న 40 శాతం టాక్స్ విధించింది. ఢిల్లీ ప్రజలకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి తక్కువ ధరకే విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) నిర్ణయించింది. కావున రేపటి నుంచి దేశ రాజధానిలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రారంభంలో ఢిల్లీలో బఫర్ ఉల్లిపాయలను రిటైల్ చేయడం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ తరువాత క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకే ఉల్లి విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్(ఎల్పీజీ)సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94లు మేర పెరిగింది. అలాగే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగింది. ఈ ఏడాది జూన్ నుంచి గ్యాస్ సిలిండర్ రేట్లు వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పెంపుతో సబ్సిడీ సిలిండర్ మొత్తం ఆరు నెలలో రూ.14.13 పెరిగింది. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 505.34కి చేరగా, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 880గా ఉంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతోపాటు విదేశీమారకం రేటులో ఒడిదుడుకుల వల్ల ధరలు పెరుగుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అధికారులు తెలిపారు. పెరిగిన ఇంధన ధరల ప్రకారం వినియోగదారులపై భారం పడకుండా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్నదని, అయితే జీఎస్టీ భారం మాత్రమే వినియోగదారులపై పడుతుందని పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో రాయితీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాలో రూ.376.60 జమకాగా, నవంబర్‌లో రాయితీ రూ.433.66కు పెరగనున్నదని అధికారులు తెలిపారు. -
సబ్సిడీ బర్రె రూ.80 వేలు
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలను రూ.80 వేల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధరను పశుసంవర్థక శాఖ ఖరారు చేసింది. సబ్సిడీ బర్రెల కొనుగోలు కోసం రూ. 971 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. రెండ్రోజుల్లో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచిగానీ, నాబార్డు నుంచిగానీ, ఏదో ఒక వాణిజ్య బ్యాంకు నుంచిగానీ రుణాల కోసం అధికారులు ప్రయత్నిస్తారు. వచ్చే నెల నుంచి బర్రెలను పంపిణీ చేస్తారు. 2.17 లక్షల మంది రైతులకు లబ్ధి విజయ డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఒక్కో బర్రెను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా సంఘాల పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీపై, బీసీలు, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తారు. ఒక్కో బర్రె 8–10 లీటర్లు ఇచ్చేలా ఉండాలని నిర్ణయించారు. ధర ఎక్కువైతే లబ్ధిదారులపైనే భారం బర్రె యూనిట్ ధర రూ. 80 వేలుండగా, అంతకంటే ఎక్కువ ధర పలికితే లబ్ధిదారుడే భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంటామని అధికారులు చెబుతున్నారు. యూనిట్ ధరలోనే రవాణా ఖర్చు సహా అన్నీ కలిపి ఉంటాయి. బర్రెలను హరియాణాలో కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కో బర్రె ఎన్ని పాలు ఇస్తుందో మూడు రోజులపాటు గమనించి 8–10 లీటర్లు ఇస్తుందని నిర్ధారించుకున్నాక కొనుగోలు చేస్తారు. -
మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్ ‘బండ’ భారం పడింది. క్రమంగా వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన కంపెనీలు మరోసారి ధరలను సమీక్షించాయి. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.73.5 , సబ్సిడీ సిలిండర్ రూ. 7 ల మేర పెరగనుంది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ను 4శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది. దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2 కేజీల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ 487.18గా ఉండనుంది. నాన్- సబ్సిడీ సిలిండర్ ధర రూ. 597.50 గా ఉండనుంది. అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ .2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్పీజీ రేట్లు సిలిండర్‌కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది. ప్రతి నెల సిలిండర్‌పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉల్లి పాట్లు
విశాఖపట్నం : రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు. దాంతో మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత కష్టపడి ఉల్లిపాయలు పొందాల్సి వస్తోందని పలువురు మహిళలు వాపోయారు. -
ఉల్లి లొల్లి
రైతుబజార్లలో క్యూ పల్లెవాసులకేదీ? ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మాత్రమే కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ గ్రామీణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్(ముకరంపుర): ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు.. కానీ సీన్ రివర్సయ్యింది. ప్రస్తుతం ఉల్లి అంతటా లొల్లి చేస్తోంది. వర్షాభావం.. దిగుబడి.. దిగుమతులు లేక ఉల్లి కొరత నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 పలుకుతున్న ఉల్లిని మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.20కే అందిస్తోంది. ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 6 రైతుబజార్లలో విక్రయిస్తోంది. కరీంనగర్‌లోని రెండు రైతుబజార్లు, సిరిసిల్ల, జగిత్యా ల, పెద్దపల్లి, మంథనిలోని ఒక్కో రైతుబజార్ కేంద్రంలో ప్రత్యేక విక్రయాలు చేస్తున్నారు. కుటుంబానికి 2 కిలోలే పంపిణీ చేస్తామని, ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరి అని నిబంధన విధించారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాల్లో ప్రజల తాకిడి ఒకేలా ఉంటోంది. అక్కడక్కడా క్యూలైన్లో గొడవలు కూడా ముదురుతున్నాయి. మరోవైపు ఏదేని గుర్తింపు కార్డు తేవాలని చెప్పడంతో ప్రజలంతా ఆధార్‌కార్డుతో కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. ఆహారభద్రత కార్డు కుటుంబానికి ఒక్కటే ఉంటుంది. కానీ, ఆధార్‌కార్డు కుటుంబంలో ముగ్గురి నుంచి ఐదుగురు సభ్యుల వరకు ఉండే అవకాశముంది. ఒకే కుటుం బసభ్యులంతా వేర్వేరుగా ఉల్లిగడ్డలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి ఎదురైంది. జిల్లాకు ఇప్పటికే 26 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు వచ్చాయి. మరో 26 మెట్రిక్ టన్నుల కోసం ప్రతిపాదనలు పంపారు. నిరుపేదలుండే పల్లెలను వదిలి పట్టణవాసులకు మాత్రమే సబ్సిడీపై ఉల్లిని అందుబాటులో ఉంచడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రజలు కిలో నాణ్యతను బట్టి కిలో రూ.50 నుంచి రూ.55కు కొనుగోలు చేస్తున్నారు. రెండు కిలోల ఉల్లిగడ్డల కిలోల కోసం తాము డివిజన్ కేంద్రాలకు వెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ కు కూడా పల్లెల్లో సబ్సిడీపై ఉల్లిగడ్డ అందించాలని కోరుతున్నారు. పాత సామగ్రికి ఉల్లిగడ్డలిచ్చే వ్యాపారులు సైతం ఇప్పుడు ఆలుగడ్డలు ఇస్తుండడం గమనార్హం. -
ఎలచ్చన్లొ స్తే అంతేనమ్మా
సాక్షి, ఏలూరు:‘ఉఫ్.. ఉఫ్.. ఈ కట్టెల పొయ్యితో చచ్చిపోతున్నాం. ఎంత ఊదినా మంట వచ్చి చావడం లేదు. అత్త య్యా.. నా వల్ల కావట్లేదు. మీరే వచ్చి వంట చేసుకోండి’ అంటూ ఆ ఇంటి కోడలు ఆపసోపాలు పడుతోంది.‘గ్యాస్ పొయిలు.. కరెంట్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిపై వంటచేసే అవస్థల నుంచి బయటపడ్డామనుకున్నాం. కానీ.. ఈ ప్రభుత్వం ఏంటో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తగ్గించేసింది. మళ్లీ మనల్ని పాతకాలానికి నెట్టేసిందే కోడలా..’ అత్తగారి నిట్టూర్పు. ‘అంతేనా.. గ్యాస్ ధరలను కూడా ఈ ప్రభుత్వం పెంచేసింది కదా అత్తయ్యూ!’ ‘అవునే అమ్మాయ్.. ఏం చేస్తాం. మనం ఎంతగా అడిగినా సర్కారోళ్లు పట్టించుకోవడం మానేశారు. ఇచ్చే తొమ్మిది సిలిండర్లయినా సరిగ్గా ఇస్తున్నారా అంటే అదీలేదు. ముందు అప్పుచేసి మనం సిలిండర్ కొనుక్కుంటే తర్వాత ఎప్పుడో సబ్సి డీ సొమ్మును బ్యాంకులో వేస్తామంటున్నారు. ఆ డబ్బు ఎప్పుడు వేస్తున్నారో.. ఎంత వేస్తున్నారో కూడా తెలీడం లేదు. ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూడాలంటే.. పట్నం వెళ్లి రావాలి. దీనికి ప్రయాణ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ బాధలు ఎలా తీరుతాయో తెలి యడం లేదు కోడలా..’ ‘అత్తయ్యా.. అర్జెంటుగా రండి. టీవీ చూడండి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నెలకు ఒకటి చొప్పున ఇచ్చేయూలని సోనియమ్మ కొడుకు రాహుల్‌గాంధీ అడిగారట. అందుకే ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారని టీవీలో చెప్పేస్తున్నారు’ ‘అవునా..! మనం ఏడాదిగా ఎన్నోసార్లు అడిగాం. మన జిల్లావాళ్లు ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా కరగని వాళ్లు రాహుల్‌గాంధీ అడగ్గానే ఒప్పేసుకున్నారా’ ‘అవునత్తయ్యా..!’ ‘ఏదైతేనేం మనకు మూడు సిలిండర్లు పెరుగుతాయన్నమాట..’ ‘ఏంటత్తయ్యా అలా అంటారు. పెట్రోల్ ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించమని ఆ రాహుల్‌గాంధీ ఈ పాలకులకు చెబి తే పోలా. మీ మనవడికి ఫీజు రీయిం బర్స్‌మెంటు.. మావయ్యకు వృద్ధా ప్య పింఛను.. మొన్న వానలకు పాడైపోరుున పంటలకు నష్టపరిహారం.. దాళ్వా పంటకోసం మీ అబ్బాయికి బ్యాంకు లోను ఇమ్మని సోనియూగాంధీ కొడుకు చెబితే జనాలకు ఇంకా మేలు కలుగుతుందిగా..’ అంటూ జనం ఇబ్బందులను ఏకరువు పెట్టింది ఆ ఇంటి కోడలు. ‘మనకున్నట్టే ఎంతో మందికి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నా యి. ఇవేమీ పట్టింకుకోకుండా రాహుల్ సిలిండర్లు పెంచేయమన్నా రు.. పెంచేస్తాం అంటే సరిపోతుం దా. అయినా గతంలో ఎన్ని సిలిం డర్లు కావాలంటే అన్ని తీసుకునేవాళ్లం.. ఇలా పరిమితి పెట్టింది వాళ్లే కదా. అంటే మన నోటికాడ కూడు లాగేసుకుని.. గంజినీళ్లు పోస్తున్నారన్నమాట. రేట్లు పెంచేసి.. సబ్సిడీలు తగ్గించేసి.. ఎక్కువ సిలిండర్లు ఇచ్చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వీళ్ల నాటకాలు అందరికీ తెలుసులే.. ఎలచ్చన్లు వచ్చేస్తున్నాయ్ కదా.. ఓట్ల కోసం ఇలాంటి మాటలు చెప్పేస్తున్నారు.. నా జీవితంలో ఇలాంటి నాటకాలు ఎన్ని చూళ్లేదంటావ్’ అత్తగారు రాజకీయ నేతల లోగుట్టు విప్పింది. విస్తుపోవడం కోడలి వంతైంది.