పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో 60 రూపాయల సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో టమాట ధరలు భారీగా పెరగడంతో ఎన్‌సీసీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో కేజీ టమాట ధర రూ.77 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు రూ. 80 దాటేసింది. ఈ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్‌సీసీఎఫ్ రేపటి నుంచి (జులై 29) మెగా సేల్ ప్రారంభించనుంది. ఇందులో టమాటాల మీద సబ్సిడీ కూడా లభిస్తుంది.
కృషి భవన్, సీజీఓ కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, ఐఎన్ఏ మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో టమాటాలు సబ్సిడీ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎన్‌సీసీఎఫ్ వెల్లడించింది.
పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్రం సబ్సిడీ ప్రవేశపెట్టింది. సబ్సిడీ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో టమాట ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు కూడా ఎన్‌సీసీఎఫ్ సబ్సిడీ అందించింది.
NCCF has announced retailing tomatoes at Rs 60/kg. This will start from July 29 at various strategic locations across Delhi and NCR. Tomatoes will be retailed at Rs 60/kg at several locations, including Krishi Bhawan, CGO Complex, Lodhi Colony, Hauz Khas Head Office, Parliament… pic.twitter.com/rkDTnaAUoF
— ANI (@ANI) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment