Tomatoes
-
ఢిల్లీలో సబ్సిడీ రేటుకే
సాక్షి, న్యూఢిల్లీ: టమాటాలను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్న దళారుల ధరల దోపిడీ నుంచి సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలి్పంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో సబ్సిడీ ధరకే కేజీ రూ.65కు టమాటాలు విక్రయిస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం ఢిల్లీలో మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని నిధి ఖరే చెప్పారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్) కు చెందిన వ్యాన్‌లో ఢిల్లీసహా శివారులోని 56 ప్రాంతాల్లో రూ.65కే టమాటాలు విక్రయిస్తున్నారు. టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల తుపాన్లు, వరదల కారణంగా టమాటా దిగుబడి బాగా తగ్గింది. దీంతో దళారులు ఒక్కసారిగా టమాటా రేటు పెంచేశారు. ప్రస్తుతం ఢిల్లీసహా రాజధాని శివారు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.120 పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నేరుగా హోల్‌సేల్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి టమాటా కిలో రూ.65కే అందించాలని కేంద్రం నిర్ణయించడం తెల్సిందే. -
ఈ టమాటాలతో సరదా యుద్ధం.. ఎలా మొదలైందో తెలుసా?
దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్ టమాటో వార్’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. -
టమాటాలపై సబ్సిడీ.. ఎన్సీసీఎఫ్ కీలక నిర్ణయం
పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 60 రూపాయల సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో టమాట ధరలు భారీగా పెరగడంతో ఎన్సీసీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో కేజీ టమాట ధర రూ.77 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు రూ. 80 దాటేసింది. ఈ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్సీసీఎఫ్ రేపటి నుంచి (జులై 29) మెగా సేల్ ప్రారంభించనుంది. ఇందులో టమాటాల మీద సబ్సిడీ కూడా లభిస్తుంది.కృషి భవన్, సీజీఓ కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, ఐఎన్ఏ మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో టమాటాలు సబ్సిడీ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎన్సీసీఎఫ్ వెల్లడించింది.పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్రం సబ్సిడీ ప్రవేశపెట్టింది. సబ్సిడీ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో టమాట ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు కూడా ఎన్సీసీఎఫ్ సబ్సిడీ అందించింది. NCCF has announced retailing tomatoes at Rs 60/kg. This will start from July 29 at various strategic locations across Delhi and NCR. Tomatoes will be retailed at Rs 60/kg at several locations, including Krishi Bhawan, CGO Complex, Lodhi Colony, Hauz Khas Head Office, Parliament… pic.twitter.com/rkDTnaAUoF— ANI (@ANI) July 27, 2024 -
టమాటా ట్రక్కు బోల్తా.. పండుగ చేసుకున్న జనం
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్‌కు సహకరించారు. -
టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్‌లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. ఎందుకు పెట్టకూడదంటే.. ఫ్రిజ్‌లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. ఒకటి రెండు రోజులు ఫ్రిజ్‌లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది. ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్‌లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఈ ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్‌లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్‌పెట్టేలా..) -
భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్బీఐ 2-6 శాతం పరిధితో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. -
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ!
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ! -
ఫోటోలు దిగితే టమాటలు ఫ్రీ..
-
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
టమాటాలు కేజీ రూ. 70 - ఆర్డర్ చేస్తే ఇంటికే!
How To Buy Tomatoes Rs.70 KG: భారతదేశంలో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. రైతులు మంచి లాభాలు పొందుతున్నప్పటికీ సామాన్యులకు ఇది పెనుభారంగా మారిపోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 200 దాటినట్లు సమాచారం. భారీ ధర వద్ద లభించే టమాటాలను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టమాటా ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్లైన్లో సరసమైన ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కేవలం వారం రోజుల్లో ఏకంగా 10,000 కేజీల టమాటాలు అమ్ముడు కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది. రూ. 70కే పేటీఎమ్ భాగస్వామ్యంతో ఓఎన్డీసీ విక్రయిస్తోంది. పేటీఎమ్, మ్యాజిక్ పిన్, మై స్టోర్ వంటి యాప్స్ ద్వారా కూడా టమాటాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒక కస్టమర్ వారానికి కేవలం 2 కేజీల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ పొందవచ్చు. దీనికి ఎటువండి అడిషినల్ ఛార్జెస్ ఉండవు. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. పేటీఎమ్‌లో ఆర్డర్ చేసే విధానం.. స్మార్ట్‌ఫోన్‌లో లోకేష్ ఆన్ చేసుకున్న తరువాత, యాప్‌లో ఓఎన్డీసీ ఫుడ్ అని సర్చ్ చేయాలి. ఓఎన్డీసీ ఓపెన్ అయిన తరువాత సమీపంలో ఉన్న స్టోర్స్ కనిపిస్తాయి, ఇందులో దాదాపు అన్నీ మీ లొకేషన్‌కు సమీపంలో ఉన్నవే ఉంటాయి. ఇందులో మీ దగ్గరగా ఉన్న ఒక స్టోర్ ఎంచుకోవాలి, ఆ తరువాత ఆర్డర్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత డెలివరీ పొందాల్సిన అడ్రస్ సెట్ చేసుకుని, ఆ తరువాత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాగే మీరు మ్యాజిక్‌పిన్ ద్వారా కూడా టమాటాలు ఆర్డర్ చేసుకోవచ్చు. -
క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే నల్ల టమాటాల గురించి ఈ విషయాలు తెలుసా?
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడికి భారంగా మారిపోయిన టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం. దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి నల్ల టమాటాల గురించి మీకు తెలుసా? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే ఈ బ్లాక్ టమాటాల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎగబాకాయి. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ ధరలను బ్రేక్ చేస్తూ టమాట కిలో ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టమాటాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో బ్లాక్ టమాటాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా టమాటా ఎర్రటి రంగులోమెరిసిపోతుంటుంది. కానీ ఈ బ్లాక్ టమాటాల గురించి మీకు తెలుసా? ఎరుపు, ఊదా రంగు విత్తనాలతో ఈ నల్ల టమాటాలను పండిస్తారట. వీటిని ఇండిగో రోజ్ అని కూడా పిలుస్తారు.హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో ప్రస్తుతం ఈ నల్ల టమాటాలను సాగు చేస్తున్నారు. ఈ బ్లాక్ టామాటాలు క్యాన్సర్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లాక్ టమాటాలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు కూడా చాలా తక్కువ. బ్లాక్ టొమాటోలో ప్రొటీన్, విటమిన్ ఎ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి పోరాడటానికి ఈ బ్లాక్ టమాటాలు దోహదం చేస్తాయి. అందుకే యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్‌ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ టమాటాలు ధరతో పోలిస్తే కాస్త ఎక్కునేనట. -
కిలో టమాట రూ.200.. ఈ ఆటోవాలా ఆఫర్ చూడండి.. ఫ్రీ ఇస్తాడట!
దేశంలో ఇటీవల టమాటా సృష్టిస్తున్న లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ చూసిన టమాటా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టమాటా ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర రూ.200కు పైగా అమ్ముడు పోయాయి. టమాటా ధరలు ఆకాశాన్నింటి.. కొందరు రైతులను కోటీశ్వరులను చేశాయి. టమాటా ఉచిత పథకాల ద్వారా మరికొందరు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని లాభాల బాట పట్టారు. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. వినియోగదారులు టమాటాలు కొనడానికి సంశయిస్తున్న సమయంలో చంఢీగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తానని ఉచిత పథకాన్ని పెట్టాడు. కానీ అందుకు సదరు ప్రయాణికుడు కనీసం ఐదు రైడ్లు చేయాలని కండీషన్ పెట్టాడు. ఇదీ కాకుండా ఆర్మీలో పనిచేసే సైనికులకు ఆయన గత 12 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తాడు. గర్భణీ మహిళలను కూడా ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తాడు. తన జీవనోపాధికి ఆటో మాత్రమే ఏకైక మార్గమని తెలిపిన ఆయన.. ఈ సేవల వల్ల తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్లు అందిస్తానని చెప్పాడు. ఉచిత ప్రకటనలు.. ఆటోవాలానే మొట్టమొదటి వ్యక్తి కాదు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆఫర్లతో పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూ.1000కి పైగా కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. తన దుకాణంలో మొబైల్ కొనుగోలు చేస్తే కేజీ టమాటాలు ఉచితం అంటూ మరోచోట ఓ యజమాని ఆఫర్ పెట్టాడు. తాజాగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఉచితం అంటూ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీ, పట్నా, లక్నో సహా పలు ముఖ్య నగరాల్లో రూ.80 కే కేజీ టమాటా లభ్యమయ్యేలా చర్యలు చేపట్టింది. ఇదీ చదవండి: సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో.. -
టమాటాలతో తులాభారం
-
టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే..
ప్రస్తుతం అత్యంత ఖరీదైన వస్తువుల్లో టమాటా కూడా చేరిపోయింది. కొనుగోలు చేయడానికి ఆలోచిస్తే పరవాలేదు, కొన్నది వండుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ కొనగలమో లేదో అని. టమాట రేటు ఆకాశానికి చేరిన వార్త తెలుసుకుందో ఏమో వంటింట్లో ఉంచిన టమాటాల వద్ద ప్రత్యక్షమైంది ఒక కోడె నాగు. అక్కడే ఉండి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాసింది. పాములు సాధారణంగా ఇళ్లల్లోకి వచ్చినా మనుషుల కంట పడకుండా ఎక్కడో మూల వెలుతురు పడని చోట నక్కి ఉంటాయి లేదా ఏదైనా కలుగులోకి దూరి దాక్కుంటాయి. కానీ ఒక తాచు పామును టమాటాలు ఆకర్షించాయో లేక వాటి ధర ఆకట్టుకుందో గాని ఇంట్లోకి చొరబడి అవి ఉన్న ప్లేటును చుట్టుకుని కాపలాగా కూర్చుంది. ఎవరైనా వాటి జోలికి వస్తే చాలు కాటేసేందుకు పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విశేష స్పందన వచ్చింది. View this post on Instagram A post shared by Mirza Md Arif (@mirzamdarif1) టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. రెండు నెలల క్రితం రూ.20 ఉండే కిలో టమాటా చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపుగా పరుగులు తీస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటి ధర ఇప్పటికే రూ.200 మార్కు అందుకుని రూ. 250 చేరుకునే క్రమంలో ఉంది. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
మూడు టన్నుల టమాటాలను నదిలో పడేసిన రైతు
అన్నానగర్: వేప్పనపల్లి సమీపంలో మంగళవారం ధర పడిపోవడంతో మూడు టన్నుల టమాటాలను ఓ రైతు నదిలో పడేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా వేపనపల్లి పరిసర ప్రాంతాలలో సుమారు రెండువేల ఎకరాలలో రైతులు టమాట సాగు చేశారు. ఇక్కడ పండే టమాటాలు చైన్నె, తిరుచ్చి, మదురై తదితర జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వేప్పనపల్లి ప్రాంతంలో టమాటాల రాక పెరిగింది. దీంతో ధర భారీగా పడిపోయింది. కిలో టమాటా 2 నుంచి 3 రూపాయలకు విక్రయిస్తున్నారు. 15 కిలోల బుట్టను రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. పెట్టుబడి సొమ్ము కూడా రాకపోవడంతో వేప్పనపల్లి సమీపంలోని పత్తిమడుగు గ్రామానికి చెందిన వెంకటేశం అనే రైతు మంగళవారం కృష్ణగిరి టమాటా మార్కెట్లో తన పంటను విక్రయించేందుకు వెళ్లాడు. అయితే ధరలు పడిపోవడంతో టమాటాలను అమ్ముకోలేక తీవ్ర మనోవేదనకు గురై ఇంటికి తిరిగొచ్చాడు. అనంతరం కార్గో వాహనంలో సుమారు మూడు టన్నుల టమాటాలను నాచికుప్పం సమీపంలోని మార్కండేయ నదిలో పడేశాడు. రైతు చేసిన ఈ చర్య ఆ ప్రాంతంలోని వాహనదారులు, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. -
Health Tips: టొమోటాలు, సోయా, బెర్రీలు.. ఇంకా.. ఇవి తినండి... వయసు తగ్గించుకోండి!
సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.. పాలు స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్‌ను కూడా తగ్గిస్తుంది. టొమోటాలు స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాల సోయా పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తింటే బలంగా ఉంటారు. క్యాన్సర్‌ను అడ్డుకునే బెర్రీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా! -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
ఒక చెట్టు.. 1,200 టమాటాలు
ఎక్కువలో ఎక్కువ ఒక టమాటా చెట్టుకు ఎన్ని పండ్లు కాస్తాయి? మహా అయితే ఓ 50. కానీ ఒకే చెట్టుకు 1,200కు పైనే పండ్లు కాశాయంటే నమ్ముతారా! నమ్మాల్సిందే. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ అసాధ్యాన్ని చేసి చూపించాడు మరి. పనిలోపనిగా గిన్నిస్ రికార్డును కూడా నెలకొల్పాడు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ ఉత్తమమైన గార్డెనర్ కావాలని.. బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన డౌగ్లాస్ స్మిత్ ఐటీ మేనేజర్. ఇతనికి మొక్కలను చూసుకోవడం, పెంచడం చాలా ఇష్టం. ప్రపంచంలో ఉత్తమమైన గార్డెనర్ కావాలని చాలా కష్టపడుతున్నాడు. అందుకే రోజుకు 4 గంటలు తన గార్డెన్లో మొక్కలు, చెట్లను చూసుకుంటున్నాడు. ఇలా పని చేస్తూనే అప్పట్లో ఓ రికార్డును సృష్టించాడు. గతంలో ఒక చెట్టుకు అత్యధికంగా కాసిన టమాటా పండ్ల సంఖ్య రికార్డు 488గా ఉండేది. ఈ రికార్డును గతేడాది ఎండాకాలంలో స్మిత్ బద్దలు కొట్టాడు. తన గ్రీన్హౌస్లోని ఒకే చెట్టుకు 839 టమాటా పండ్లు కాశాయి. ఈయన రికార్డును మళ్లీ ఈయనే ఇటీవల తిరగరాశాడు. ఇతను పెంచిన ఓ చెట్టుకు 1,269 టమాటాలు కాశాయి. రీసెర్చ్ పేపర్లు.. సాయిల్ పరీక్షలు తన రికార్డును తిరగరాసేందుకు స్మిత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలా రీసెర్చ్ పేపర్లను చదివాడు. గార్డెన్లో మొక్కలను పెంచే సాయి ల్ (మృత్తిక) శాంపిళ్లను కూడా పరీక్ష చేయించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. మరిన్ని రికార్డులు కూడా.. 1,269 టమాటాల రికార్డే కాదు.. ఇంకా చాలా రికార్డులు స్మిత్ సొంతం. 2020లో 20 అడుగుల సన్‌ఫ్లవర్ చెట్టును పెంచాడు. 3.106 కేజీల బరువైన టమాటాను పండించి జాతీయ రికార్డు నెలకొల్పాడు. మరిన్ని రకాల కూరగాయలను కూడా పెద్ద సైజులో పండించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రుని మీద ఉన్నట్టుంది ‘నాకు చంద్రుని మీద ఉన్నట్టుంది. ఏ టమాటా రకంతో ఎక్కువ పండ్లు కాస్తాయో కనుగొనేందుకు చాలానే ప్రయత్నించాను. ప్రయోగాలు చేశాను. చివరకు విజయవంతమయ్యాను’ – డౌగ్లాస్ స్మిత్ -
రికార్డుల పట్టుగొమ్మ.. అదిరిందమ్మా!
ఎన్ని చెర్రీ టమాటాలో.. లెక్కేస్తే.. 839 తేలాయి.. అయితే.. ఇక్కడ కళ్లు తేలేసే విషయమొకటి ఉంది.. ఇవన్నీ కేవలం ఒకే కొమ్మకు కాసినవి.. ఈ విషయం వినగానే.. గిన్నిస్ వాళ్లు కూడా మొదట కళ్లు తేలేసి.. తర్వాత తేరుకుని.. లెక్కలేయడానికి బయలుదేరి వస్తున్నారట. ఇంతకీ ఈ భారీ కాతకు కారణమైన వ్యక్తి పేరు చెప్పలేదు కదూ.. డగ్లస్ స్మిత్.. బ్రిటన్‌లోని స్టాన్స్టెడ్ అబట్స్ గ్రామంలో ఉంటాడు. వీటిని తెంపడానికి గంట సమయం పట్టిందట. గత రికార్డు 488 టమాటాలట. వలసదారులపై కొరడా మెక్సికో మీదుగా టెక్సాస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సుమారు 12వేల హైతీ వలసదారులను అమెరికా అధికారులు విమానాల ద్వారా వెనక్కి పంపించి వేస్తున్నారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెక్సికో–అమెరికా సరిహద్దుల్లోని రియో గ్రాండే నది వద్ద వలసదారులను అడ్డుకుంటున్న అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు. అందాల జాబిలి నీలి వర్ణం పూసుకున్న ఆకాశంలో స్పష్టమైన కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు. ఈ ఫొటోను జర్మనీలోని తౌనుస్ ప్రాంతంలో తీశారు. (చదవండి: రియల్ ‘బాహుబలి’.. కటౌట్ చూసి నమ్మేయాల్సిందే!) -
వంగటమాటా.. రైతింట పంట
రెండు రకాల మామిడి మొక్కల్ని అంటుకట్టడం(గ్రాఫ్టింగ్) చూసుంటాం. రంగు రంగుల గులాబీ మొక్కల్ని అంటుకట్టి కొత్త రంగును పుట్టించడం మనందరికీ తెలిసిందే.. అయితే వంగ మొక్కకు, టమాటా మొక్కను అంటుగడితే.. ఏ కాయలు కాస్తాయి. ఆ కాయలు ఏ రంగులో, ఆకారంలో ఉంటాయి? హార్టికల్చర్ రంగంలోని సరికొత్త సాంకేతికతతో మన రాష్ట్రంలో ఈ రకమైన ప్రయోగాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. వారి కృషి ఫలితంగా ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు వంగటమాటా పండిస్తూ లాభాలు సాగుచేస్తున్నారు. ఈ వంగటమాటా ప్రత్యేకత తెలుసుకోవాలంటే వెంటనే స్టోరీలోకి వెళ్లాల్సిందే.. – పలమనేరు(చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండే పంట టమాటా. ఇది తీవ్ర వర్షాభావాన్ని, ముంపును తట్టుకోలేదు. పైగా తెగుళ్ల తీవ్రత ఎక్కువ. పంట ఎక్కువ వచ్చినప్పుడు తొందరగా పాడై ఎగుమతికి పనికిరాకుండా పోతాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కుప్పంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) శాస్త్రవేత్తలు రూపొందించిందే ఈ వంగటమాటా. గ్రాఫ్టింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన ఈ రకం చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. వంగ నారుకు టమాటా నారును అంటుకట్టి ఈ వంగటమాటాలు పండిస్తున్నారు. రంగు, రుచి, వాసన, ఆకారంలో ఇవి మామూలు టమాటాల్లానే ఉంటాయి. ఎలా సాధ్యమైంది టమాటా, వంగ నారును ఒకేసారి సిద్ధం చేసుకుంటారు. అనంతరం వంగ నారు కాండం మొదట్లో కత్తిరించి దానికి టమాటా పైభాగంలోని మొలకను అంటుకడతారు. ఇలా పెరిగిన టమాటా మొక్కలను రైతులకు అందిస్తున్నారు. ఈ మొక్క వేరు భాగంలో వంగ లక్షణాలు, మిగతా మొక్క టమాటా లక్షణాలతో ఉంటుంది. అందువల్ల వంగతో అంటుకట్టినా టమాటాలే కాస్తాయి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏడీ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఇక్రిశాట్ సైంటిస్ట్ కిషోర్ ఈ ప్రక్రియకు ఆజ్యం పోశారు. ఆ కేంద్రంలోని ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. అందుకోసం సీఓఈ సెంటర్లో ఉండే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల సాయం తీసుకున్నారు. వంగ నారుకు టమాటా నారును అంటుకట్టిన దృశ్యం లాభాలివీ - మొక్క నీటి ఎద్దడిని, ముంపును తట్టుకుంటుంది. - టమాటాను ఆశించే వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లను నివారించవచ్చు. - భూమి ద్వారా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. - మొక్క బలంగా పెరిగి.. పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. - మామూలు టమాటా 25 కోతలు వస్తే ఇది 60 కోతల దిగుబడి ఇస్తుంది. - వంగ స్వభావం వల్ల టమాటా పైపొర మందంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు మార్కెటింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. -
అచ్చం టమాటల్లాగే ఉన్నాయే !
సాక్షి, నిజామాబాద్ : ఏంటీ అచ్చం టమాటల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా. అయితే మీరు పొరబడినట్లే ! ఎందుకుంటే పై చిత్రంలో కనిపిస్తున్నవి టమాటల రూపంలో ఉన్న స్వీట్ ఓమర్ పండ్లు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో తోపుడు బండ్లపై ఈ పండ్లను రూ.100కు నాలుగు చొప్పున విక్రయిస్తున్నారు. నిజామాబాద్ ఫ్రూట్మార్కెట్లోకి కాశ్మీర్ నుంచి వచ్చినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. టమాటల రూపంలో ఉండటంతో వీటిని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
టమాటాతో ఊజీ రోగాలు
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు టమాటాపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఊజి రోగాలు విజృంభిస్తున్నాయి. పడమటి మండలాల్లో సాగుచేసిన టమాటా పంటలు దెబ్బతింటున్నాయి. ఊజి ఈగల దెబ్బతో కాయలపై రంధ్రాలు పడుతుండడంతో ఇప్పటికే 35 శాతం పంటను రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న కాయల్ని పొలాల వద్ద పారబోస్తున్నారు. కొందరు రైతులు ఆశతో మార్కెట్‌కు తీసుకొస్తున్నా అక్కడ కొనేవారు లేక రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. గిట్టుబాటు ధరలున్నా ప్రస్తుతం పండించిన పంట పశుగ్రాసంగా మారుతోంది. దీంతో జిల్లాలో వారం రోజుల్లో రూ.12కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లింది. సాక్షి, గుర్రంకొండ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమాటా పంటను ఎక్కువగా ఊజి ఈగ నష్ట పరుస్తోంది. ఇప్పటికే మంచి అదనుమీదున్న పంట ఒక్కసారిగా దెబ్బతింది. ముఖ్యంగా టమాటాలపై ఈ ఈగ ఎక్కువగా కనిపిస్తోంది. కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజి ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారుతోంది. కాయల్ని తోటల్లో నుంచి కోసినా మార్కెట్‌కు తరలించలేకపోతున్నారు. 35 శాతం పంట నష్టం ఊజి ఈగతో ప్రస్తుతం 35 శాతం మేరకు పంటను రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు ప్రస్తుతం 100 నుంచి 120 క్రేట్లు (25కేజీలు) దిగుబడి వస్తోంది. ఊజి ప్రభావంతో దెబ్బతిన్న టమాటాలు 35 నుంచి 40 క్రేట్లు ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 45వేల క్వింటాళ్ల స్టాకు వస్తోంది. ఊజి ఈగతో 15 వేల క్వింటాళ్ల టమాటాలు దెబ్బతిన్నాయి. పలువురు రైతులు ఈ రకం టమాటాలను తోట ల వద్దనే కోత సమయాల్లో కోసి పారబోస్తున్నారు. పలువురు రైతులు మార్కెట్లకు వాటిని తీసుకొస్తున్నా వ్యాపారులు కొనుగోలు చేయ డం లేదు. దీంతో దెబ్బతిన్న టమాటాలను రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఆ టమాటాలు పశుగ్రాసంగా మారుతున్నాయి. ధరలున్నా నష్టపోతున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక క్రేట్ (25కేజీల) ధర రూ.700 నుంచి రూ.850 వరకు పలుకుతోంది. అయితే ఊజి ఈగ ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చాలా రోజుల తరువాత మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే టమాటా రైతులను దురదృష్టం ఊజి ఈగ రూపంలో మరోసారి వెంటాడింది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. -
టమాటా నిల్వ సామర్థ్యం రెట్టింపు!
పండు టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా (గది ఉష్ణోగ్రతలో) ఉంచితే సాధారణంగా వారం గడిచేటప్పటికి ముడతలు వచ్చి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే, విశాఖపట్నానికి చెందిన శ్రీమతి దూబ రాజు అనే గృహిణి తయారు చేసిన హెర్బల్ ద్రావణంలో ముంచి తీసి నిల్వ చేసిన టమాటోలు మాత్రం రెండు వారాలకు పైగానే తాజాగా ఉంటున్నాయి. టమాటోల సీజన్లో మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు 10–15 రోజులు రైతులు నిల్వ చేసుకోగలిగితే వారి నికరాదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఆకుకూరల రసాలను ఉపయోగించి శ్రీమతి రాజు తన సొంత ఆలోచనతో ఒక హెర్బల్ ద్రావణాన్ని రెండేళ్ల క్రితం తయారు చేశారు. లీటరు నీటికి 10 ఎం.ఎల్. ద్రావణం ఈ ద్రావణం 10 ఎం.ఎల్.ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిలో టమాటోలను 10 నిమిషాలు నానబెట్టి.. బయటకు తీసి ట్రేలలో నిల్వ చేసుకుంటే సాధారణం కన్నా రెట్టింపు రోజులు నిల్వ ఉంటున్నాయని ఆమె తెలిపారు. రాగి, వెండి, ఇత్తడి తదితర పాత్రలు, వస్తువులను సమర్థవంతంగా శుభ్రం చేయగల హెర్బల్ ద్రావణాన్ని శ్రీమతి రాజు గతంలో తయారు చేశారు. అనేక దేవాలయాల్లో వెండి, బంగారం, రాగి, ఇత్తడి పాత్రలను సురక్షితంగా శుభ్రం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టమాటో రైతులకు ఉపయోగపడేలా ఈ ద్రావణాన్ని తయారు చేశానని ఆమె తెలిపారు. రైతు బజారులో కొనుగోలు చేసి తెచ్చిన టమాటోలను.. ఈ ద్రావణంలో ముంచి తీసి.. వాటిని ప్లాస్టిక్ ట్రేలలో నింపి, వాటిపైన గోనె సంచి లేదా పాత నూలు చీరను పైన కప్పానని ఆమె తెలిపారు. నెల రోజుల వరకు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. నూటికి నూరు శాతం ఆకుకూరల రసాలతోనే దీన్ని తయారు చేశానని అంటూ.. ఈ ద్రావణంలో ముంచిన టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపవుతుందే తప్ప వాటిని తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆమె అంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో అధ్యయనం విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్టు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి టమాటోల నిల్వ సామర్థ్యంపై 2017 ఎండాకాలంలో అధ్యయనం జరిగింది. సెంచూరియన్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ ద్రావణాన్ని పరీక్షించి చూడగా.. పండు టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపైందని కేవీకే అధిపతి డాక్టర్ కుర్రా శైలజ తెలిపారు. పండిన, కరపచ్చిగా ఉన్న, పచ్చిగా ఉన్న టమాటాలను మూడేసి చొప్పున తీసుకొని నెల రోజులపాటు పరిశీలించారు. ద్రావణంలో ముంచి తీసిన టమాటోలతోపాటు సాధారణ టమాటోలను గది ఉష్ణోగ్రతలోను, వరండాలోను ట్రేలలో నిల్వ చేశారు. గదిలో ఉంచిన పండిన టమాటాలు మామూలువి 8–10 రోజులు మార్కెట్లో అమ్మదగినంత తాజాగా ఉండగా, ద్రావణంలో ముంచినవి 16–20 రోజులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉన్నాయని డాక్టర్ శైలజ తెలిపారు. దోరగా ఉన్న టమాటోలు మామూలువి 12–14 రోజులు అమ్మదగినంత బాగుంటే.. ద్రావణంలో ముంచినవి 22–24 రోజుల పాటు నిల్వ ఉన్నాయి. గది వెలువల వరండాలో నిల్వ చేసిన టమాటోలు 4 రోజుల ముందే వడలిపోయాయని ఆమె తెలిపారు. కొద్ది పరిమాణంలో టమాటోలనే నిల్వ చేసి చూశామని, భారీ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు ఫలితం ఎలా ఉండేదీ పరీక్షించాల్సి ఉందని డా. శైలజ వివరించారు. శ్రీమతి రాజు భర్త కనకారావు తోడ్పాటుతో ఈ ద్రావణాన్ని తయారు చేసి అర లీటరు రూ. వందకు విక్రయిస్తున్నారు. ఈ ద్రావణం టమాటో రైతులతోపాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చని శ్రీమతి రాజు(96421 13002, 95738 19031) అంటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, పల్లెసృజన సంస్థల ద్వారా శాస్త్రీయ పరీక్షలు జరిపించి, పేటెంట్‌కు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు. శ్రీమతి దూబ రాజు -
ఉల్లి, టమాటాలతో అలర్జీ తుమ్ములు దూరం!
మీకు దుమ్ము వల్ల అలర్జీయా? దుప్పట్లు దుపలగానే తుమ్ములు మొదలవుతాయా? మీరు ఓ చిన్న చిట్కా పాటించండి. ఇకపై గోధుమలు, అరటిపండ్లు, ఉల్లి, బార్లీ, చికోరీ, టమాటా, చిలగడదుంప వంటివి కాస్త ఎక్కువగా తినండి. అలర్జీలు దూరమవుతాయంటున్నారు జపాన్‌లోని పరిశోధకులు. కొన్ని ఎలుకలపై పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వారు తొలుత ఎలుకలకు డస్ట్‌మైట్స్‌తో అలర్జీ కలిగించారు. ఇక వాటికి ‘ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్’ ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తూ వచ్చారు. తీరా పరిశీలిస్తే... మామూలు ఆహారంపై ఉన్న ఎలుకలతో పోలిస్తే ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే ఆహారం తిన్నవి చాలా ఆరోగ్యంగా ఉండి, అలర్జీలను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అందుకే అలర్జీలను అరికట్టడానికి ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే గోధుమ, అరటి, ఉల్లి, వెల్లుల్లి వంటివి మంచివంటున్నారు పరిశోధకులు. మీరూ కాస్త ట్రై చేస్తారా? -
ఒక్క ఎకరం.. 100 టన్నుల టమాటా
సీతాఫలంతో ఐస్‌క్రీం.. ఒకే మొక్కకు టమాట, వంకాయలు.. ఏకంగా ఒక్కో ఎకరా భూమిలో 200 టన్నుల వంకాయ.. 40 టన్నుల మిర్చి.. 100 టన్నుల టమాటా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ సమీపంలోని గోముచి గ్రామంలో అనేక వ్యవసాయ ప్రయోగాలకు వేదికగా నిలిచిన ఓ రైతు వ్యవసాయ నర్సరీ ప్రత్యేకతలివి. నారాయణ చావ్డా అనే ఈ రైతు ఒకే మొక్కకు అంటుకట్టి వంకాయ, టమాటాలను పండిస్తున్నారు. మన రైతులు ఎకరా భూమిలో 20 టన్నులు కూడా వంకాయ పండించని స్థితిలో.. ఏకంగా 200 టన్నులు పండిస్తున్నారు. మిర్చి ఎకరానికి మన రైతులు 10 టన్నులు పండిస్తే.. తాను 40 టన్నులు, టమాటా మన వద్ద 20 టన్నులు కూడా పండించడం కష్టమైతే.. ఏకంగా 100 టన్నులు పండిస్తున్నారు. ఇక యాపిల్ బేర్‌ను సాధారణ మొక్కగా మనం పెంచితే.. ఆయన పందిరి సాగు పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించి వచ్చింది. సాగులో ఇంత వైవిధ్యమైన, ఉత్తమ పద్ధతులు ఎక్కడా చూడలేదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ రంగంపై జరుగుతున్న స్థాయిలో ఇక్కడా వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ వేల ఎకరాలలో.. గోముచి గ్రామంలో నారాయణచావ్డా తన కుమారుడు విమల్ చావ్డాతో కలసి వ్యవసాయం చేస్తున్నారు. నారాయణ 1964లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో వ్యవసాయంలో బీఎస్సీ చేశారు. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేశాక వ్యవసాయం మొదలుపెట్టారు. తొలుత 35 ఎకరాలతో ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఏకంగా.. ఐదు వేల ఎకరాల్లో భారీగా ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకోసం భూములను లీజుకు తీసుకున్నారు. వీఎన్ఆర్ పేరుతో పళ్లు, అన్ని రకాల కూరగాయలు, వరి విత్తనాలు, నర్సరీ మొక్కలు తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సీతాఫలం 300 ఎకరాల్లో, డ్రాగన్ ఫ్రూట్ 50 ఎకరాలు, యూపిల్ బేర్ 50 ఎకరాలు, జామ 200 ఎకరాలు, వరి విత్తన పంట 500 ఎకరాలు, నేరేడు చెట్లు 300 ఎకరాల్లో, వెయ్యి ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. సీతాఫలం సీజన్లో వచ్చే పళ్లను నేరుగా విక్రయించడంతోపాటు దాని గుజ్జును తీసి ఐస్‌క్రీం తయారుచేసి, విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఒక ఐస్‌క్రీం ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. ఇక నెట్హౌజ్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తున్నారు. అందులోనే క్యాబేజీ, కాలీఫ్లవర్లను అంతరపంటగా వేశారు. దీనివల్ల ఆయా పంటలకు తెగుళ్లు సోకవని చెబుతున్నారు. నారాయణ సోదరులు ప్రవీణ్చావ్డా, రాజేశ్‌భాయ్ చావ్డాలు కూడా కరేలీబాగ్ అనే గ్రామంలో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుని జామ, వంకాయ, ఖర్జూర తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు నెలకొల్పి నాణ్యమైన విత్తనాలు విక్రయిస్తున్నారు. వ్యవసాయ యంత్రాలు తెప్పించి.. దేశవిదేశాల్లో ఎక్కడ ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చినా.. వెంటనే వాటిని కొనుగోలు చేసి సాగుకు వినియోగిస్తున్నారు. అంటు కట్టేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన క్లిప్పులను ఇటలీ వెళ్లి కొనుగోలు చేశారు. వీఎన్ఆర్ క్షేత్రంలో రెండు వేల మంది వరకు పనిచేస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి పంటల సాగు పద్ధతులపై శిక్షణ పొందుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యానశాఖ కూడా సిబ్బందిని వారం రోజులపాటు శిక్షణకు పంపించాలని నిర్ణయించింది. ఈ శిక్షణకు ఒక్కొక్కరికి రూ.75 వేలు ఫీజుగా వసూలు చేస్తారు. వీఎన్ఆర్ క్షేత్రంలో పండిస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ వంకాయ, టమాటాలను అంటుకట్టి ఒకే మొక్కకు పండించేలా ఏర్పాట్లు చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం!
ఇండోర్: టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. కిలో టమాట వంద రూపాయలపైనే అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లో టమాటాలను దొంగల బారి నుంచి కాపాడుకోవడం వ్యాపారులకు సవాల్‌గా మారింది. ధర అమాంతంగా పెరగడంతో ఇక్కడ టమాట దొంగతనాలు మొదలయ్యాయి. టమాటాలు చోరీకి గురికాకుండా చూసేందుకు కూరగాయల వ్యాపారులు ప్రత్యేకంగా సెక్యురిటీ గార్డులను కాపాలా పెడుతున్నారు. సాయుధులైన భద్రతా సిబ్బందిని నియమించి టమాటాలు చోరుల బారిన పడకుండా చూసుకుంటున్నారు. ఈ నెల 20న ముంబైలోని దాహిసార్ కూరగాయాల మార్కెట్ 300 కిటోల టమాటాలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతమున్న ధర ప్రకారం చూస్తే వీటి విలువ అక్షరాలా 70 వేల రూపాయలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. పంట దెబ్బతినడంతో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.100 నుంచి రూ. 120 వరకు పలుకుతోంది. ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్ వరకు టమాట ధరలు దిగివచ్చే అవకాశం లేదన్న వార్తలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
పెద్ద నోట్ల రద్దుతో టమాటో విలాపం
న్యూఢిల్లీ: ఎర్రగా నిగనిగలాడే టమోటాకు కూరగాయల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఏ కూరగాయతో కలిపి వండినా ఇట్టే కలసిపోయి కమ్మని రుచిని ఇస్తుందికనుక. ప్రతి ఏటా చలికాలంలో టమాటో ధరలు రెట్టింపు అవుతాయి. అవి చలిని తట్టుకొని ఎక్కువ కాలం తాజాగా ఉండలేవుకనుక. ఈసారి టమాటో పరిస్థితి తలకిందులైంది. ధరలు దారుణంగా పడిపోయాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోను కిలోకి మూడు నుంచి ఐదు రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మార్కెటింగ్ కమిటీల నుంచి అందిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో నాలుగు, మహారాష్ర్టలో ఐదు రూపాయలు పలుకుతోంది. అస్సాం, జార్ఖండ్, నాగాలాండ్‌లలో మాత్రమే ధరలు తగ్గలేదు. మిగతా కూరయాల విషయంలో 20 రాష్ట్రా నుంచి అందిన సమాచారం మేరకు 8 రాష్ట్రాల్లో 50 నుంచి 62 శాతం వరకు ధరలు తగ్గాయి. ఈ సీజన్లో కాలిఫ్లవర్, క్యారెట్లు సహజంగానే తగ్గుతాయిగనుక అవి అలాగే ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్లనే ధరలు ఇలా పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, పింపిల్గావ్ దేశంలోకెల్లా అతిపెద్ద టమాటో మార్కెట్. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్ ఈసారి బోసి పోయింది. ఈ మార్కెట్ మొత్తంగా నగదు లావాదేవీల ద్వారానే నడుస్తుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో చెక్కులను ఆశ్రయించాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇక్కడి మార్కెట్ వ్యాపారులు చెక్‌ల తీసుకునేందుకు, ఇచ్చేందుకు సిద్ధంగా వున్న చెక్కులు తీసుకునేందుకు రైతులు సిద్ధంగా లేరని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దిలీప్ బాంకర్ మీడియాకు తెలిపారు. ఈ మార్కెట్‌కు బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వ్యాపారలు వచ్చి టమోటోను కొనుగోలు చేసేవారని, ఇప్పుడు వారి రాక పడిపోయిందని చెప్పారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో రవాణా చార్జీలు కూడా రావనే ఉద్దేశంతో రైతులెవరూ టమాటోలు విక్రయించేందుకు రావడం లేదని ఆయన వివరించారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున టమాటోను దిగుమతి చేసుకుపోయే దేశం పాకిస్తాన్. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జమ్మూ నుంచి ఆ దేశానికి టమాటో ఎగుమతులు నిలిచిపోయాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా స్థానికంగా కూడా విక్రయాలు బాగా తగ్గిపోయాయని, సరైన వ్యాపారం లేక తాము సతమతమవుతున్నామని జమ్మూ పళ్లు, కూరగాయదారుల సంఘం అధ్యక్షులు రొమేశ్ పరిహార్ వ్యాఖ్యానించారు. బంగాళ దుంపల ధరలు కూడా బాగా పడిపోయాయని మార్కెట్ వర్గాలు, ముఖ్యంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నో‘టమాట’ రావట్లే..
టమాటా విక్రయాలపై ‘పెద్ద’ప్రభావం ఇల్లెందు: రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం టమాటా రైతులపై పడుతోంది. కొనుగోళ్లులేక వారు ఇబ్బంది పడుతున్నారు. నోట్ల రద్దుకు ముందు టమాట కేజీ రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.3కు పడిపోరుుంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం గ్రామంలో రైతులు చిర్ర సురేష్, మచ్చే యాదగిరి తదితరులు మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి.. ధర లేకపోవడంతో అక్కడే కుప్పలుగా పోసి వదిలేశారు. ఎకరానికి రూ.20వేల నుంచి రూ.30వేలు పెట్టుబడి పెట్టామని..గతంలో బాక్స్ టమాటాలను రూ.1,000కు విక్రరుుంచామని, ఇప్పుడు రూ.100 నుంచి రూ.200 మాత్రమే ధర పలుకుతోందని రైతులు తెలిపారు. గతేడాది కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చిమరీ వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వ్యాపారులెవరూ ముందుకు రావట్లేదు. ఇల్లెందుకు తీసుకెళ్లి అమ్ముకుందామంటే..పెద్ద నోట్ల ప్రభావంతో..ఎవరూ కొనడం లేదు. కేజీ టమాట కొన్నా రూ.2వేల నోటు ఇస్తున్నారని, వ్యాపారులు కూడా చిల్లర కరెన్సీ లేదని కొనుగోలు చేయడం లేదని రైతులంటున్నారు. సరుకు రెండు రోజుల్లోనే దెబ్బతింటుండడంతో ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే చేసేది లేక ఇలా పారబోస్తున్నామని రైతులు చెప్పారు. -
చితికిన టమాటా
చేవెళ్ల: మార్కెట్లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోరుుంది. కిలో ధర రూ.2 కూడా పలకడం లేదు. దీంతో పంట కోసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను తెంపేందుకు కూలీలు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా చోట్ల అన్నదాతలు చేలల్లోనే పంటలను వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లో శనివారం 25 కిలోల టమాటా బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.40 నుంచి రూ.60 రూపాయలలోపే పలికింది. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. మండలంలోని గుండాల, చనువల్లి, పామెన, అల్లవాడ, ఇబ్రహీంపల్లి, దేవునిఎరవ్రల్లి, కమ్మెట, ఊరెళ్ల, తదితర గ్రామాల్లో టమాటా అధికంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌తో పాటుగా నగరంలోని గుడిమల్కాపూర్, సికింద్రాబాద్ సమీపంలోని బోరుున్ పల్లి కూరగాయల మార్కెట్లకు టమాటాను తరలిస్తారు. ధరలు బాగా ఉన్నప్పుడు గిట్టుబాటవుతున్నా.. పతనమైనప్పుడు మాత్రం అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. నెలరోజులుగా టమాటా బాక్సు ధర (25 కిలోలు) రూ.100 పలుకగా.. గడచిన 15 రోజులుగా రూ. 60కి పడిపోరుుంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పండ్లుగా మారి చితికిపోతుండడంతో వాటిని చేలవద్దే వదిలేస్తున్నారు. తక్కువ ధర ఉన్న టమాటాను మార్కెట్‌కు తరలించి రవాణా, కూలీల చార్జీలు జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని చేసేది లేక అక్కడే వదిలేయడమో, పశువులకు మేతగా వేయడమో చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో రూ. 5 నుంచి రూ.6 ధర పలుకుతుండడం గమనార్హం. రూ. 5కు కొనుగోలు ఏమైనట్లు.. ధర తక్కువగా ఉండడంతో టమాటా రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వమే కిలో రూ. 5 చొప్పున కొనుగోలు చేస్తుందని ఇటీవల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన సంగతి విదితమే. దీంతో రైతులు మార్కెట్ అధికారులను సంప్రదించగా తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు, సూచనలుగాని ప్రభుత్వం నుంచి రాలేదని చెబుతున్నారని ఇబ్రహీంపల్లికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభిస్తే తమకు కొంతమేరకై నా లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కిలో టమాటా కనీసం రూ. 10 చొప్పున చేను వద్దనే కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు మిగులుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు టమాటా కిలో రూ.5 కు కొనుగోలు చేసే విషయంలో తమకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వారు సూచించిన ధరకు కొనుగోలు చేస్తాం. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. - భగవంతు, ఇన్ చార్జి కార్యదర్శి,చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ -
ఫసల్ బీమా.. ఇచ్చేనా ధీమా!
పీఎం ఫసల్ బీమా యోజనలో టమాటాకు దక్కని చోటు వాతావరణ బీమాలో అవకాశమున్నా పెరిగిన ప్రీమియం వేరుశనగకు బీమాకు గడువు మరో నాలుగు రోజులే ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు రెండు శాతమే ఈదఫా కూడా రైతన్నలకు బీమా దక్కడం సందేహంగా మారింది. జిల్లాలోని పడమటి మండలాల్లో ఎక్కువగా సాగయ్యే టమాటాకు ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చోటు దక్కలేదు. పోనీ వాతావరణ ఆధారిత బీమాలో అయినా ఉపశమనం లభిస్తుందా అనుకుంటే ప్రీమియం రూ.2,500కు పెంచేశారు. కనీసం లోనీ ఫార్మర్స్కైనా బ్యాంకులో బీమా కవర్ అవుతుందనుకుంటే రుణమాఫీ ఎఫెక్ట్‌తో కొత్త రుణాలు అంతంత మాత్రమే. ఇక వేరుశనగ, వరి రైతులకన్నా బీమా దక్కుతుందనుకుంటే అది మూన్నాళ్లముచ్చటే. రెండ్రోజుల క్రితం బీమా గురించి ప్రకటన వచ్చింది. గడువు మరో నాలుగు రోజులే మిగిలింది. ఇన్ని సమస్యల మధ్య ఈ ఖరీఫ్‌లో బీమాతో రైతులకు ధీమా కనిపించడం లేదు. పలమనేరు: కేంద్ర ప్రభుత్వ సరికొత్త ఫసల్ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రెండుశాతం మాత్రమే. మిగిలిన వాటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. జిల్లాలో ఎక్కువగా వేరుశనగ ఆపై టమాటా సాగుచేస్తారు. మదనపల్లె డివిజన్లో ఏటా టమాటా సాగు 11వేల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్‌లో 6వేల హెక్టార్లుగా ఉంది. కానీ ఈ పథకంలో టమాటాను చేర్చలేదు. దీంతో రైతులు వ్యవసాయ ఆధారిత బీమానే నమ్ముకోవాల్సి వస్తోంది. ఇందులో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 50శాతం కాబట్టి రైతులు బీమాపై ఆసక్తి చూపడం లేదు. వేరుశనగకు సమీపిస్తున్న గడువు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 15న ఆఖరు తేదీగా గడువు నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం బీమాకు సంబంధించిన వివరాలను తెలిపి మరో నాలుగు రోజుల్లోనే ఆఖరు గడవు పెట్టడంతో రైతులు బీమా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈదఫా 1.40 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. పలమనేరు డివిజన్లో 15,800 హెక్టార్లలో వేరుశనగ సాగవుతుండగా ప్రీమియం చెల్లించిన రైతులు 120 మంది విస్తీర్ణం కేవలం వంద హెక్టార్లు మాత్రమే. వరి సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని అన్ని డివిజన్లలోనూ ఇలాగే ఉంది. ఇప్పటిదాకా జిల్లాలో బీమా చేసుకున్న నాన్లోనీలు (బ్యాంకులో రుణం పొందని రైతులు) వారు కేవలం 2శాతం మంది మాత్రమే. ఇక నాలుగు రోజుల్లో వ్యవసాయశాఖ ఎంత విస్తృతప్రచారం చేసినా బీమా చేసుకునే రైతులు పదిశాతం మంది కూడా జరిగేలా లేదు. ఎన్నో తిరకాసులు పీఎం ఫసల్ బీమాలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం రెండుశాతం మాత్రమే. అయితే ఇందులో టమాటాను చేర్చలేదు. వ్యవసాయాధారిత బీమాలో మాత్రం టమాటాకు అవకాశం కల్పించినా రైతు 50శాతం ప్రీమియం చెల్లించాలి. ఆలెక్కన హెక్టారుకు రూ,2.500 చెల్లించడం రైతులకు ఇబ్బందే. పోనీ బ్యాంకుల్లో రుణాలు పొందినవారికి బీమా కవర్ అవుతుంనుకుంటే అక్కడ రుణాలు మాఫీ కాకపోవడంతో సగం మందికి కొత్త రుణాలు రాలేదు. ఇక రైతులే సొంతంగా బీమా చేద్దామంటే ఇన్పుట్ సబ్సిడీ రాదేమోననే అనుమానం ఉంది. గతంలో బీమా ఉన్న రైతుల పేర్లను ఇన్పుట్ సబ్సిడీ జాబితానుంచి తొలగించారు. ఆఖరుకు బీమాను పొందలేని రైతులు ఇన్పుట్ సబ్సిడీగా ఎకరానికి రూ.100 నుంచి 500 లోపు పొందారు. అందిన నగదు అప్పట్లో బ్యాంకుల ఖాతాలు తెరవడానికి కూడా చాలకుండా పోయింది. ఈ అనుభవాల మధ్య వేరుశనగ, టమాటా రైతులు బీమా చెల్లించేందుకు ఆసక్తిని చూపడం లేదు. బ్యాంకుల్లో పుట్టని కొత్త రుణాలు రైతు రుణమాఫీ దెబ్బతో గతంలో రుణం ఉన్నవారికి కొత్త రుణాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత చూపడం లేదు. ఆ లెక్కన రెన్యూవల్ చేసుకోలేని వారికి కొత్త రుణాలు రానట్టే. రుణ మాఫీ జాబితాలో ఉన్నా.. పూర్తిగా రుణం చెల్లించనివారు బ్యాంకర్ల లెక్కలో బకాయిదారులే. ఇలా ఉండగా లోనీఫార్మర్స్(బ్యాంకులో రుణం కొత్తగా పొందేవారు)కు అటు టమాటాకు ఇటు వేరుశనగకు పంట బీమా పొందే అవకాశం ఉంది. కానీ రీషెడ్యూల్ చేసుకున్న వారు లేదా అప్పు చెల్లించిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు దక్కుతున్నాయి. దీంతో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకులో బీమా దక్కనట్టే. బీమా చేసుకుంటే చాలా మేలు పీఎం ఫసల్ బీమాలో టమాటాకు బీమాచేసుకునే అవకాశం లేనిమాట ని జమే. అయితే బజాజ్ అలయన్స్ వారి ద్వారా వాతావరణ ఆధారిత బీమాతో వచ్చేనెల 9దాకా ప్రీమియం చేసుకోవచ్చు. హెక్టారుకు రూ.2,500 కట్టాలి. ఈ ప్రాంత రైతులకు బీమా ఎంతో మేలుగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా 2శాతం కూడా లక్ష్యం ముందుకెళ్లలేదు. -సుబహానీ, ఏడీ హార్టికల్చర్, పలమనేరు డివిజన్ నాలుగురోజులే గడువు మాకు ఆదేశాలు వచ్చి రెండ్రోజులయింది. మరో నాలుగు రోజుల్లో వరి, వేరుశెనగ బీమా ఆఖరు గడవు. ఆలోపు రైతులు బీమా చేసుకోవాలి. గడవు పెంచే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఓ రెండు శాతం మంది రైతులు ప్రీమియం చెల్లించారు. మేం కూడా ప్రచారం చేస్తున్నాం. -విశ్వనాథరెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు -
టమాటా @100
మళ్లీ పెరిగిన ధరలు రైతుబజార్లలో రూ.52 ఠ అవీ నాసిరకమే బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు విజయవాడ : టమాటా ధర ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ప్రైవేటు మార్కెట్లో కేజీ రూ.100కు చేరాయి. రైతుబజార్లలో కేజీ రూ.52 పలుకుతున్నా టమాటాలు వినియోగదారులకు సరిపడా దొరకటం లేదు. ఉన్నవీ నాణ్యత లేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టమాటా తోటలు పంట అయి పోవటంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోనూ భారీ వర్షాలకు టమాటా దిగుబడి తగ్గిందని చెపుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి విజయవాడ మార్కెట్‌కు రోజుకు 10 లారీల టమాటాలు వచ్చేవి. విజయవాడతో పాటు, జిల్లాలోని 17 రైతుబజార్లలో 10 వేల టన్నుల విక్రయాలు సాగించేవారు. నాలుగు రోజుల నుంచి కేవలం రెండు లారీలు అంటే రెండు వేల కిలోల టమోటాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. దీంతో జిల్లాలోని 17 రైతుబజార్లకు టమాటా సరఫరా కావటం లేదు. రైతు బజార్లలో కేజీ రూ.52గా మార్కెటింగ్ అధికారులు నిర్ణయించారు. దీంతో వ్యాపారులు రైతుబజార్లకు టమాటా సరఫరా చేయకుండా ప్రైవేటు మార్కెట్లకు తరలించేస్తున్నారు. రైతుబజార్లలో అరకొరగా కూరగాయలు రైతుబజార్లకు కూరగాయలు అరకొరగానే వస్తున్నాయి. తోటల్లో పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గటంతో కూరగాయలు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. గోరుచిక్కుడు, బెండ, దొండ, దోస, పచ్చిమిర్చి, వంగ, ఆకు కూరలు కూడా సరిగా రావటం లేదు. వచ్చిన సరకూ నాసిరకంగా ఉంటోంది. వర్షాలు కురిసి కూరల తోటలు పెరిగే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు. -
ధర లేక ధరణికే..
♦ పూర్తిగా పడిపోయిన టమాటా ధర ♦ కొనేవారు లేక చేను వద్దే పడేస్తున్న వైనం మెదక్ రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన టమాటా అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. కనీసం పెట్టిన పెట్టుబడి కాదుకదా? రవాణా ఖర్చులు కూడా గిట్టుబా టు కాకపోవడంతో పొలం వద్దే పడేస్తున్నారు. దీంతో ఎకరం పొలంలో టమాటా పంట సాగుచేసిన రైతులకు అప్పులే మిగులుతున్నాయి. నాలుగు నెలల క్రితం కిలో టమాటా ధర రూ. 40 నుంచి 50ల వరకు పలికింది. దీంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మెదక్ మండలంలో సుమారు 100 ఎకరాల్లో పంట వేశారు. ఒక్కో ఎకరానికి రూ.10 నుంచి 15 వేల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట దిగుబడి చేతికొచ్చింది. అయితే మార్కెట్లో ధర అమాంతం పడిపోయింది. కిలో రూ. 3 నుంచి రూ. 5కు పడిపోయింది. దిగుబడిని మార్కెట్‌కు తరలించాలంటే గంపకు రూ. 20 నుంచి 30 ఖర్చు అవుతోంది. మార్కెట్లో విక్రయించగా వచ్చే డబ్బులు రూ. 50కి మించడం లేదు. దీంతో మార్కెట్లోకి తరలించి విక్రయిస్తే లాభం మాట దెవుడెరుగు, రవాణా ఖర్చులు రావడం లేదని పొలం వద్దనే పడేస్తున్నారు. మెదక్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు రాధాకిషన్ అనే తన ఎకరా పొలంలో రూ. 15 వేలు పెట్టుబడి పెట్టి టమాటా సాగుచేశారు. కాగా మార్కెట్లో ఒక్కసారిగా టమాట ధర భారీగా పడిపోవడంతో టమాటాలు తెంపి పొలం వద్దే పడేశాడు. తనకు అప్పులే మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మండల రైతులు టమాటా సాగు చేసి పెద్ద ఎత్తున నష్టపోయారు. -
టొమాటోలు విసిరి హీరో అయ్యారు!
వాషింగ్టన్: అమ్మాయిలంటే తనకు అస్సలు పడదంటూ, అలవోకగా బండబూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇంతకాలం హల్చల్ చేస్తూ వచ్చిన రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా దేశాధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ అదే మీడియా ముందు డంగయ్యారు. మొన్న ఐయోవాలో జరిగిన సభలో డొనాల్డ్‌పై రెండంటే రెండే టమోటాలు విసిరిన 28 ఏళ్ల అనామిక యువకుడు ఆండ్రీవ్ అలెమావో సోషల్ మీడియాలో హఠాత్తుగా హీరో అయ్యారు. ఎంతోమంది యూజర్లు ఆయన్ని పసందైన విందుతో సత్కరిస్తామంటూ ఆహ్వానాలు పంపించారు. ‘మీరు విసిరిందీ రెండే టొమాటోలైనా చికెన్ టిక్కా, చేపల వేపుడు, ఎగ్ రోల్స్, వెన్న ముద్దలతో పార్టీ ఇస్తాం.....మేమిచ్చే పార్టీలో అదనపు ఆకర్షణ అందమైన అమ్మాయి’ అంటూ మరికొందరు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించారు. మరికొందరు ఆండ్రీవ్‌ను అమెరికా హీరో అంటూ సూపర్ మేన్ గెటప్‌లో చిత్రీకరించారు. నచ్చనివారిపై టమోటాలు విసరే ఆనవాయతీ ఇప్పటికీ ఉందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘మంచికి చెడుకు మధ్యన సన్నటి తెర’ అనే వ్యాఖ్యానంతో మంచివైపు ఆండ్రీవ్, చెడువైపు డొనాల్డ్ సగం ముఖాలున్నట్టు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా మెచ్చి తమను మెడల్‌తో సత్కరించినా సత్కరించవచ్చంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల ప్రచార సభలో ఆయనపై టొమాటాలను విసిరిన ఆండ్రీవ్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేసి ‘దుష్ర్పవర్తన’ నేరం కింద కేసు బుక్‌చేసి వదిలేశారు. ఈ నేరం కింద అమెరికాలో స్పల్ప జరిమానా లేదా స్వల్ప జరిమానాతోపాటు స్పల్ప శిక్షను స్థానిక కోర్టు విధించే అవకాశం ఉంటుంది. -
వేగం తెచ్చిన అనర్థం
టమాటా వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు కురబలకోట : టమాటా లోడుతో వస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మండలంలో దాదంవారిపల్లె సమీపంలోని తూపల్లె క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ముదివేడు ఎస్ఐ వేంకటేశ్వర్లు కథనం మేరకు...తంబళ్లపల్లె మండలం పల్లెకుంటపల్లెకు చెందిన పి.అశోక్ మంగళవారం పరిసర ప్రాంతాల్లోని రైతుల టమాటాలతో మదనపల్లె మార్కెట్‌కు బొలెరో వ్యాన్‌లో బయలుదేరాడు. మండలంలోని తూపల్లె క్రాస్ వద్ద ఎదురుగా తంబళ్లపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో బొలెరో వ్యాన్ ముందరి భాగం ధ్వంసమైంది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టీరింగ్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన అశోక్ మృతదేహాన్ని వెలికి తీయడానికి అవస్థలు పడ్డారు. జేసీబీ సాయంతో ఎట్టకేలకు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ రైతులు కుమార్‌రెడ్డి, సుబ్బయ్య, మల్లికార్జునరెడ్డిని 108లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో బస్సు డ్రైవర్ బ్రేక్ వేసిన దాఖలాలు కూడా లేవని చెబుతున్నారు. మితిమీరిన వేగం, ఆపై నిర్లక్ష్యం అశోక్ ప్రాణాల్ని బలిగొనడంతోపాటు పాటు మరో ముగ్గురు రైతులను ఆస్పత్రి పాల్జేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మంత్రుల కార్లపై కోడిగుడ్లతో దాడి..
ఆహార భద్రత చట్టం అమలులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘం నిర్వహించిన ఆందోళన.. చివరికి మంత్రులపై కోడిగుడ్లు, టమాటల దాడికి దారితీసింది. ఒడిశాలోని దేవ్ గఢ్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి సబ్యసాచి నాయక్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కోడుగుడ్లు, టమాటలతో దాడిచేశారు. నిన్న (సోమవారం) కూడా సరిగ్గా ఇలాగే మరో మంత్రిపై దాడి జరిగింది. ఛత్రపూర్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి సంజయ్ దాస్ కారుపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విబాగం నాయకులు కోడిగుడ్లు విసిరారు. సోమవారం నాటి సంఘటనలో ముగ్గురు విద్యార్థులతోపాటు ఒక కాంట్రాక్టర్ ను పోలీసులు అరెస్టుచేశారు. విద్యార్థుల అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ ఖండన తెలిపింది. పేద రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాలో ఆహార భద్రత చట్టం అమలులో అధికార బీజేడీ అక్రమాలకు పాల్పడుతోందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ లోపభుయిష్టంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ మేరకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం మంత్రుల పర్యటనల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. -
2,250 కేజీల టమాటాలను ఉచితంగా పంచిన రైతు
అనంతపురం : అనంత రైతును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పంట చేతికొచ్చినా మార్కెట్ ధర నేలకు పడిపోవడంతో సరుకును ఉచితంగా పంచుతున్నారు. అనంతపురంలో ఆదివారం నాగరాజు అనే రైతు టమాటాలను ఉచితంగా పంచాడు. అనంతపురం జిల్లా నార్పల మండలం పప్పూరు బండ్లపల్లికి చెందిన రైతు అశ్వర్థ కుమారుడు నాగరాజు 150 బాక్స్ (2,250 కేజీలు) టమాటాని మార్కెట్‌కి తెచ్చాడు.అయితే కనీస ధర కూడా లేకపోవడంతో సరుకుని తీసుకువచ్చి ఎల్ఐజీ బస్టాండ్ సమీపంలోని లక్ష్మీనరసయ్య కాలనీలో ఉచితంగా అందరికీ పంచారు. ఈ సందర్భంగా రైతు నాగరాజు మాట్లాడుతూ మార్కెట్ ధర చూస్తే ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు కూడా వచ్చేలా కనిపించలేదు. అంత సరుకుని వెనక్కి తీసుకెళ్లలేక ఉచితంగా ఇచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
ఇంటి పంట సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - OrganicKitchen/Terrace Gardening గూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు. -
మదనపల్లె మార్కెట్లో ‘జాక్‌పాట్’ వేలం!
రూ. లక్షలు నష్టపోతున్న రైతులు ధరల కృత్రిమ పెంపు గొప్పల కోసం వ్యాపారులతో చేతులు కలుపుతున్న రైతులు పట్టించుకోని అధికారులు మదనపల్లె: రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మదనపల్లె టమాట మార్కెట్ ‘జాక్‌పాట్’ వేలం పాటల్లో కూడా ప్ర త్యేక గుర్తింపు పొందుతోంది. మార్కెట్లో ‘జాక్‌పాట్’ వేలం పాటలు ఊపందుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోం ది. మదనపల్లెలో రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయంటే కాయలకు వున్న డిమాండ్ ఒక కారణమైతే ‘జాక్‌పాట్’ వేలం ద్వారా కొంతమంది వ్యాపారులు ధరలను కృత్రిమంగా పెంచడం మరో కారణమవుతోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు మార్కెట్లతో పోల్చి తే మదనపల్లె మార్కెట్లో కిలో టమాటాకు రూ.10 వ్యత్యాసం ఉంది. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ ‘జాక్‌పాట్’ ఎంతమేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మార్కెట్‌కు 300 నుంచి 350 టన్నుల కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. 30 కేజీల క్రేట్ ధర రూ.1400 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ ఒక మెలిక లేకపోలేదు. వాస్తవానికి ఒక్క క్రేట్‌కు కాయలను తలసరిగా మాత్రమే వేసి బాక్సుపై బాక్సు వుంచి వేలం నిర్వహించాల్సి వుంది. జిల్లాలోని చా లా మార్కెట్లలో తలసరిగానే కాయల ను పోసి వేలం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. తలసరిగా కాయలు వేస్తే ఒక్క క్రేట్‌కు 28 నుంచి 30 కేజీల వరకు మాత్రమే పడతాయి. కానీ క్రేట్‌పైన రాశుల్లా పో సి వేలం నిర్వహిస్తున్నారు. తద్వారా ఒక్క క్రేట్‌కు దాదాపుగా 7 కేజీల కా యలు అదనంగా ఉంటున్నాయి. కొం త మంది వ్యాపారులు మాత్రం క్రేట్ ధరను 30 కేజీలకు మాత్రమే నిర్ణయిస్తారు. దీంతో రైతు ఒక్క క్రేట్‌కు సగటున 6 నుంచి 7 కేజీలు నష్టపోవాల్సి వస్తోంది. ‘జాక్‌పాట్’ ద్వారా వేలం పాటలు ఇక ‘జాక్‌పాట్’ ద్వారా వేలం పాటలు నిర్వహించడం వల్ల ధరలు కృత్రిమం గా పెరగడంతో పాటు కొంత మంది రైతులు వ్యాపారులతో చేయి కలుపుతుండటం గమనార్హం. మార్కెట్‌కు వచ్చిన కాయలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి నాణ్యమైన పెద్దకాయలు, రెండోది గోళీకాయలుగా వున్న చిన్నకాయలు. అయితే ఈ రెండింటినీ కలిపి 10 బాక్సులకు ఒకటి, లేక 20 బాక్సులకు రెండు, లేకుంటే 50 బాక్సులకు మూడు చొప్పున ‘జాక్‌పాట్’ ద్వారా పక్కన పెడతారు. రైతులతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పక్క మార్కెట్లో కంటే ఎక్కు వ ధర కల్పిస్తామని హామీ ఇస్తారు. రైతు కూడా తమ కాయలు అందరి కంటే ఎక్కువ ధర పలికితే గ్రామంలో కూడా గొప్పగా ఉంటుందని భావించి వారితో చేయి కలుపుతాడు. కానీ ‘జాక్‌పాట్’ ద్వారా తమకు నష్టం కలుగుతుందని తెలిసినా ధర ఎక్కువకు అమ్ముడు పోయాయనే గొప్పల కోసం అంగీకరిస్తున్నారు. దీంతో ధరలు కూడా కృత్రిమంగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ‘జాక్‌పాట్’ వేలంపై చర్యలు మదనపల్లె టమాట మార్కెట్లో జరుగుతున్న ‘జాక్‌పాట్’ వేలం పాటలపై సెక్రటరీ జగదీష్‌ను వివరణ కోరగా మార్కెట్లో ‘జాక్‌పాట్’ వేలం జరుగుతున్నట్టు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఒకవేళ అలా నిర్వహిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ యాక్టు ప్రకారం వ్యాపారులు ‘జాక్‌పాట్’గా వేలం నిర్వహిస్తే వారి లెసైన్సులను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయ న స్పష్టం చేశారు. -
టమా‘ఠా’
భగ్గుమంటున్న ధరలు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70 నగరానికి దిగుమతులు తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు టమాటా బాంబులా కన్పిస్తోంది. స్థానికంగా దిగుబడులు లేకపోవడం.. అనుకున్న స్థాయిలో దిగుమతి కాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజురోజుకూ వీటి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు మాత్రం వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరల కారణంగా టమాటా కాస్త టమోతగా మారింది. నగర మార్కెట్లో టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే శనివారం టమాటా కిలో ధర రూ.52, రైతు బజార్లలో రూ.55 పలికింది. రిటైల్ మార్కెట్లో దాని ధర మరింత ఎక్కువగా ఉంది. గిరాకీని బట్టి కేజీ టమాటాను రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లవద్దకు వచ్చే తోపుడుబండ్ల వ్యాపారులు కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. సరుకు నాణ్యత, గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరలు పెరగడంతో వంటింట్లో టమాటాకు స్థానం లేకుండా పోయింది. దీని ధర ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. ముఖ్యంగా పచ్చి మిర్చి ధర ఎగబాకుతోంది. మిగతా కూరగాయల్లోనూ శనివారం కిలోకు రూ.2-3 పెరుగుదల కన్పించింది. ఫ్రెంచి బీన్స్, క్యారెట్, చిక్కుడు, బీర, బెండ, కాప్సికమ్ కిలో ధర రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ, దొండ, దోస, సొర, కాకర, క్యాబేజీ, గోరుచిక్కుడు, బీట్రూట్, పొట్ల, కంద వంటివన్నీ కేజీ రూ.20-36 మధ్యలో లభిస్తున్నాయి. తగ్గిన సరఫరా.. శివార్లలో పండిన మిర్చి, టమాటా దిగుబడులు పూర్తికావడంతో దిగుమతులపైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా, అనంతపూర్, బెల్గామ్ల నుంచి పచ్చి మిర్చి నగరానికి సరఫరా అవుతోంది. ఇప్పుడు అక్కడే మంచి ధరలు లభిస్తుండటంతో హైదరాబాద్‌కు తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి అవుతోంది. నగర డిమాండ్‌కు తగినంతగా సరుకు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగర అవసరాలకు నిత్యం 350-400 టన్నుల టమాటా దిగుమతయ్యేది. శనివారం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు మదనపల్లి నుంచి కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. రోజుకు 80-100 టన్నులు దిగుమతి అయ్యే పచ్చిమిర్చి శనివారం కేవలం 230 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు గణనీయంగా పడిపోవడంతో ప్రధానంగా మిర్చి, టమాటాకు నగరంలో కొరత ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొరతే ధరలు పెరగడానికి దారితీసినట్టు వారు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించి ఉత్పత్తి పుష్కలంగా ఉన్న కూరగాయల ధరలను కూడా పెంచేసి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి.. కూరగాయల ధరలు పెరిగినప్పుడు గృహిణులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. టమాటా, పచ్చిమిర్చిల స్థానే చింతపండు, ఇమ్లీ పౌడర్, ఎండు మిర్చి, కారం పౌడర్‌ను వినియోగించడం శ్రేయస్కరం. స్థానికంగా సాగవుతున్న కొత్తపంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు కూరగాయల ధరలు అస్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం టమాటా, మిర్చి అధికంగా ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల నుంచి నగరానికి దిగుమతి చేసుకునేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపడుతోంది. ఉన్నంతలో ధరల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నాం. - వై.జె.పద్మహర్ష, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ -
ఘాటెక్కిన మిర్చి..
రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 విలవిల్లాడుతున్న వినియోగదారులు సరఫరా తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధరల ఘాటు నషాలానికి ఎక్కింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.60కి చేరింది. టోకు మార్కెట్లో కేజీ రూ.38 ఉండగా, రైతుబజార్లో రూ.41 పలుకుతోంది. ఇదే సరుకు తోపుడుబండ్లపై పావు కిలో రూ.20 చొప్పున కేజీకి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. గత నెల వరకు కేజీ రూ.25-30కి లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం రోజుల్లోనే రెండు రెట్లు ధర పెరగడం ఇందుకు నిదర్శనం. మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది. మొన్నటివరకు కేజీ రూ.20-25 ధర పలికిన టమోట ఇప్పుడు రూ.40కి చేరింది. దోస, వంకాయ, క్యాబేజీ ధరలు మిగతా అన్నిరకాల కూరగాయలు రూ.30-60 మధ్య పలుకుతున్నాయి. మిచ్చితో పాటు బెండ, బీర, కాకర, చిక్కుడు, గోకర, క్యారెట్, బీన్స్, బీట్ రూట్లదీ అదే దారి. వంటింట్లో ప్రధాన నిత్యావసర వస్తువైన మిర్చి ధర పెరగడం గృహిణుల్లో కలవరం మొదలైంది. వర్షాలు మొదలైతే మిర్చి సరఫరా తగ్గి ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంటున్నారు. తగ్గిన సరఫరా నగర అవసరాలకు నిత్యం 90-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడు 30-40 టన్నులకు మించట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా మిర్చి సాగు లేకోవడంతో కర్నూలు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడా మిర్చికి డిమాండ్ ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. -
కండల కోసం టమాటా
వాషింగ్టన్: మాంచి వస్తాదులా కండలు పెంచాలని ఉందా? అయితే, జస్ట్ రోజూ ఆకుపచ్చని టమాటాలను తినండి చాలు. అమెరికాలోని ఇయోవా యూని వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు. ఆకుపచ్చని టమాటాల్లో ఉండే ‘టమాటిడైన్’ అనే రసాయనం కండరాల పెరుగుదలకు, బలానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్త క్రిస్టోఫర్ ఆడమ్ చెప్పారు. -
టమటాష్!
కొత్తూరు, న్యూస్‌లైన్: చిల్లర కాసులకు ఎప్పుడో కాలం చెల్లింది. రూపాయి, 2 రూపాయల నాణా లు ఉన్నా.. వాటికి టీ నీళ్లు కూడా లభించని రోజులు దాపురించాయి. ఇక కూరగాయల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మార్కెట్‌కు వెళితే పర్సు ఖాళీ కావడమే తప్ప.. బ్యాగు నిండని పరిస్థితి. రూ.5 ఇస్తే గానీ చివరికి కరివేపాకు, కొత్తమీర కట్ట కూడా లభించని పరిస్థితుల్లో ఏ కాయగూరైనా కిలో రూ.1.50కే లభిస్తుందంటే నమ్మగలమా!.. కానీ ఇది పచ్చి నిజం.. కొత్తూరు మార్కెట్లో టమాటా ధర అంతలా పడిపోయింది. నిల్వ ఉంచుదామంటే కుళ్లి పోతుంది. అం దుకే రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇంకా మిగిలిన సరుకును రోడ్డు పక్కన పారబోస్తున్నారు. కొద్ది రోజు ల క్రితం వరకు రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముడుపోయిన టమాటా రెండు రోజు ల్లోనే అమాంతం పడిపోయి, రైతును బొక్కబోర్లాపడేసింది. జిల్లాలోని శ్రీకాకుళం వంటి పట్టణ ప్రాంతాల్లో దీని రేటు రూ.10 వరకు ఉండగా.. ఇక్కడ మాత్రమే పడిపోవడానికి నిల్వ సౌకర్యం లేకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్‌కు కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల నుంచి సీజనులో రోజుకు సుమారు పది టన్నుల టమాటాలను రైతులు విక్రయానికి తీసుకొస్తారు. ఇది కాకుండా పొలాల నుంచే నేరుగా మరో 5 టన్నుల సరుకు బరంపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. స్థానిక మార్కెట్‌కు రైతులు తెచ్చే సరుకును ఏరోజు కారోజు అమ్ముకోవలసిందే. కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం వల్ల ఒక్క రోజు దాటితే చాలు టమాటాలు కుళ్లిపోతాయి. నిల్వ సౌకర్యం లేక.. చాలా సందర్భాల్లో తెచ్చిన సరుకును కొనేవారు లేక ఎంతో కొంత ధరకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. దళారులు దీన్ని అవకాశంగా తీసుకొని సరుకును అతి తక్కువ ధరకు గంపగుత్తగా కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీలో టమాటా మార్కెట్‌కు కేంద్రంగా ఉన్న కొత్తూరులో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు శనివారం మిగిలిన టమాటాలను పశువులకు, చెత్త బళ్లకు ధారాదత్తం చేశారు.