దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడికి భారంగా మారిపోయిన టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం.
దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి నల్ల టమాటాల గురించి మీకు తెలుసా? క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో వాడే ఈ బ్లాక్ టమాటాల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎగబాకాయి. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ ధరలను బ్రేక్ చేస్తూ టమాట కిలో ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టమాటాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.
ఈ క్రమంలో బ్లాక్ టమాటాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా టమాటా ఎర్రటి రంగులోమెరిసిపోతుంటుంది. కానీ ఈ బ్లాక్ టమాటాల గురించి మీకు తెలుసా? ఎరుపు, ఊదా రంగు విత్తనాలతో ఈ నల్ల టమాటాలను పండిస్తారట. వీటిని ఇండిగో రోజ్ అని కూడా పిలుస్తారు.హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో ప్రస్తుతం ఈ నల్ల టమాటాలను సాగు చేస్తున్నారు. ఈ బ్లాక్ టామాటాలు క్యాన్సర్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లాక్ టమాటాలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు కూడా చాలా తక్కువ. బ్లాక్ టొమాటోలో ప్రొటీన్, విటమిన్ ఎ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి పోరాడటానికి ఈ బ్లాక్ టమాటాలు దోహదం చేస్తాయి. అందుకే యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్‌ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ టమాటాలు ధరతో పోలిస్తే కాస్త ఎక్కునేనట.
Comments
Please login to add a commentAdd a comment