ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగయ్యే వరి పొలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాలు/ పొటాష్ లోపాలతో పాటు రసంపీల్చే పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని రైతులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దారులు జిల్లేడు ద్రావణాన్ని విస్తృతంగా వాడుతూ ప్రయోజనం పొందుతున్నారు.
జిల్లేడు ద్రావణం తయారీకి కావాల్సిన పదార్ధాలు:
200 లీటర్ల నీరు, 20 కేజీల జిల్లేడు ఆకులు, 10 లీటర్ల నాటు ఆవు మూత్రం.
తయారీ విధానం:
200 లీటర్ల నీటిలో 20 కేజీల జిల్లేడు ఆకులు వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కల΄ాలి. 3 రోజుల తరువాత వాడకానికి సిద్ధమవుతుంది.
మోతాదు: 100 లీటర్ల నీటిలో 10 లీటర్ల జిల్లేడు ద్రావణం కలిపి పిచికారీ చెయ్యాలి.
నిల్వ : 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది.
వివరాలకు: రైతు సాధికార సంస్థ ఉత్తరాంధ్ర
సాంకేతిక అధికారి హేమసుందర్:80743 20481
Comments
Please login to add a commentAdd a comment