
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్‌కి వేలాది మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇటీవల విడుదలైన 'ఛావా'మూవీతో తనలో ఉన్న అసాధారణమైన నటుడిని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఈ మూవీ బాక్స్‌ఫిస్ వద్ద కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతోంది. ఆ మూవీలో చత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు.
అచ్చం మహారాజు మాదిరి అతడి ఆహార్యం అందర్నీ కట్టిపడేసింది. మరాఠా రాజుల కాలంలోకి వెళ్లిపోయేలా అతడి ఆహార్యం నటన ఉన్నాయి. ఇందుకోసం 80 కిలోల మేర బరువున్న అతడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకున్నాడని తెలుస్తోంది. విక్కీ ఇలా యోధుడిలా శరీరాన్ని మార్చుకునేందుకు ఎలాంటి ఫిట్‌నెస్ ట్రైనింగ్, డైట్ ప్లాన్‌లు అనుసరించాడంటే..
హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల ఫిట్‌నెస్ గురువు క్రిస్ గెథిన్.. విక్కీ కౌశల్‌కి తన శరీరాన్ని మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చాడు. మహారాజు మాదిరిగా ఎగువ శరీరం బలోపేతంగా ఉండేలా కండలు తిరిగిన దేహం కోసం విక్కీ చేత కార్డియో వంటి వ్యాయామాలు చేయించాడు. భారీ బరువులు ఎత్తించి మంచి విశాలమైన ఛాతీతో రాజు మాదిరి ధీరుడిలా కనిపించేలా చేశాడు.
ఆయను విక్కీకి ఇచ్చిన ఫిట్‌నెస్ శిక్షణలేంటంటే..
ఫంక్షనల్ వ్యాయామాలు: యుద్ధ తాళ్లు, స్లెడ్ పుష్‌లు, టైర్ ఫ్లిప్‌లు.
కార్డియో: స్టామినా కోసం హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT).
ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ: గాయాలను నివారించడానికి స్ట్రెచింగ్ మొబిలిటీ డ్రిల్స్.
ఈ ఫిట్‌నెస్ శిక్షణలన్నీ బాడీ నిర్మాణానికి సరిపోతుంది అంతే.. మంచి అందమైన లుక్ కోసం కీలంగా ఉండేది డైట్ ప్లాన్ మాత్రమే.
అవేంటంటే..
ప్రోటీన్ పవర్: సోయా ముక్కలు, పనీర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులు.
శక్తిని పెంచేవి: బీట్‌రూట్ టిక్కీలు, చిలగడదుంపలు.
క్లీన్ ఈటింగ్: కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సమతుల్య మాక్రోలు. చీట్ మీల్స్ వంటివి దరిచేరనీయలేదు.
ఇలాంటి కఠినతరమైన ఫిటెనెస్ శిక్షణతో మహారాజు మాదిరి లుక్‌తో ఆకట్టుకున్నాడు విక్కీ.
ఇక ఒక ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ..అవిశ్రాంత శిక్షణ, క్రమ శిక్షణతో కూడిన ఆహారం తదితరాలే శంభాజీ మహారాజ్ మాదిరి బలాన్ని ప్రతిబింబించడానికి సహాయపడిందని చెప్పారు. ఇంతలా కష్టపడటం వల్లే చక్కటి శరీరాకృతితో తెరపై కనిపించే శంభాజీ మాహారాజు పాత్రకు ప్రాణం పోశాడు విక్కీ.
గమనిక: ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం, స్లిమ్‌గా అవ్వడం వంటివి సెలబ్రిటీలు చేస్తుంటారు. వాటిని వాళ్లు ప్రత్యేక నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుని ప్రయ్నత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి దుష్ఫ్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల అనుకరించే మందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులు సలహాలు సూచనలతో అనుసరించడం ఉత్తమం.
(చదవండి: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ Vs ఎలోన్ మస్క్: ఒకరిది పోరాటం మరొకరిది..!)
Comments
Please login to add a commentAdd a comment